CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Biblical Analysis

మార్గాలు రెండు - నీతీ మార్గమా లేక నాశన మార్గమా

కీర్తన 1& 2 ఆధ్యయాల విశ్లేషణ

కీర్తన 1 ఆధ్యాయం

కీర్తనలు 1:1

దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కుర్చుండక

కీర్తనలు 1:1 ఆత్మీయ పాఠం:

దేవుని దారిలో నడవటమే నిజమైన ఆశీర్వాదము. దుష్టుల సలహాలను నిరాకరించమని పాపుల మార్గములో ప్రయానించవద్దని అపహాసకులతో కలిసి కూర్చోకూడదు అని దేవుడు మనలను పిలుస్తున్నాడు. ఎవ్వరూ లేని ఒక్కరిగా జీవితం అయినా, అది పరిశుద్ధమైనదైతే, ఆది దేవునికి ప్రియమైనదే అని ఈ వచనం మనకు తెలియజేస్తుంది

కీర్తనలు 1:2

యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.

కీర్తనలు 1:2 ఆత్మీయ పాఠం:

యెహోవా ధర్మశాస్త్రములో మనకు ఆనందము కలిగితే మన మనస్సు మన హృదయము ప్రతి రోజు ఆనందముతో సంతోషంతో ఆయన వాక్యముతో నిండిపోతుంది. వాక్య ధ్యానమే మనకు బలం. దేవుని వాక్యం మన హృదయానికి ఆహారం, ఆత్మకు జీవమిచ్చేజలము.

కీర్తనలు 1:3

అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును.

కీర్తనలు 1:3 ఆత్మీయ పాఠం:

దేవుని వాక్యంలో స్థిరంగా ఉండే మనిషి, జల ప్రవాహల వద్ద నాటిన చెట్టు వలె ఫలించును. దాని కాలప్రకారము ఫలమిస్తాడు. దాని ఆకులు ఎండిపోవు. ఈ వరమును ఆశీర్వాదమును పొందటానికి, వాక్యంలో మూలం ఎదో దానిని మన హృదయంలో పాతాలి. మిగతా అవసరాలు దేవుడే తీరుస్తాడు.

కీర్తనలు 1:4

దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు.

కీర్తనలు 1:4 ఆత్మీయ పాఠం:

దుష్టులు మాత్రం ఆలా వుండరు. వారు గాలికి ఊడిపోయే చెత్త వలె ఉంటారు. స్థిరతలేని జీవితం, శాశ్వతత్వం కలిగిలేని స్థితి వారి ఆత్మకు వుంటుంది— ఇది దేవుని వాక్యానికి విరుద్ధముగా నడిచే జీవితం ద్వార కలిగే ఫలితం.మన జీవితాలలో దేవుడు లేని దారి ప్రయాణం ఎటువంటిదో మనము గుర్తించాలి.

కీర్తనలు 1:5

కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును నిలువరు.

కీర్తనలు 1:5 ఆత్మీయ పాఠం:

దేవుని తీర్పు సమయమున దుష్టులు నిలువలేరు. నీతిమంతుల సభలో పాపులకు స్థానం లేదు. ఇది భయపెట్టే వాక్యం కాదు — జాగ్రత్తచెప్పే వాక్యం. మనము ఎవరితో కలిసి నడుస్తున్నామో పరిశీలించుకుందాం.

కీర్తనలు 1:6

నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును దుష్టుల మార్గము నాశనమునకు నడుపును.

కీర్తనలు 1:6 ఆత్మీయ పాఠం:

యెహోవా నీతిమంతుల మార్గమును కనుగొంటాడు — దీవి అర్థం నీతిమంతులు దేవుని పర్యవేక్షణలో నడుస్తారు. కానీ దుష్టుల మార్గము నశించును. దేవుడు నడిపించే మార్గంలోనే దారిలోనే మనము ఉన్నామా లేక దేవునికి విరోధమైన మార్గంలో నడుస్తున్నామా అనే విషయాన్ని ప్రతి రోజు మనము పరిశీలించుకోవాలి.

కీర్తనలు రెండవ అధ్యాయము

కీర్తనలు 2:1

అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?

కీర్తనలు 2:1 ఆత్మీయ పాఠం:

దేవునికి విరోధంగా ఏర్పడే జనముల ఆలోచనలు వ్యర్థమైనవే. దేవుని ఆచనల ముందు లోకపు పథకాలు ఆలోచనలు నిలవవు. మనం దేవుని ఆచనలతో కలిసి ఉండాలని నడవాలని అవే మనకు క్షేమమని మన మనసులో హృదయములో తలంచుదాం.విశ్వసించుదాం !

కీర్తనలు 2:2

మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మనయొద్దనుండి పార వేయుదము రండి అని చెప్పుకొనుచు

కీర్తనలు 2:2 ఆత్మీయ పాఠం:

లోక పాలకులు ఈ లోకమును ఏలే అధికారులు క్రీస్తునే ఎదిరిస్తారు,క్రీస్తు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటారు కానీ క్రీస్తు తండ్రిచే దేవునిచే అభిషిక్తుడై యున్నాడు. ఈ వాక్యం మనకు ఏమని గుర్తు చేస్తుంది అని అంటే— మన రాజు క్రీస్తు ప్రభువు సర్వం మీద అధికారమును కలిగి ఉన్నవాడు! అని కొలస్సీయులకు 1:20

ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను.

కీర్తనలు 2:3

భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.

కీర్తనలు 2:3 ఆత్మీయ పాఠం:

మానవుని హృదయం దేవుని నియమాల నుండి విముక్తి కోరే హృదయం తిరుగుబాటు చేసే హృదయం. కానీ నిజమైన స్వేచ్ఛ ఆయన చిత్తానికి లోబడే లోపలనే ఉంటుంది.

కీర్తనలు 2:4

ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు.

కీర్తనలు 2:4 ఆత్మీయ పాఠం:

పరలోక మందున్న దేవుడు హాస్యం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనను ఎదిరించే శక్తి ఎవరికీ లేదు. మనం భయపడవలసినది మన శత్రువుల కున్న బలమును భట్టి కాదు — దేవుని న్యాయమును భట్టి దేవుని తీర్పును బట్టి మనకున్న భక్తిహీనతను బట్టి.

కీర్తనలు 2:5

ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును.

కీర్తనలు 2:5 ఆత్మీయ పాఠం:

దేవుడు తాను కోపించినప్పుడు మాట్లాడుతాడు. ఆయన ధైర్యంగా తన తీర్పును ప్రకటిస్తాడు. ఆయన మాటలలో శక్తి ఉంది — ప్రేమతో కూడిన న్యాయం వుంటుంది.

కీర్తనలు 2:6

నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను.

కీర్తనలు 2:6 ఆత్మీయ పాఠం:

దేవుడు తాను నియమించిన రాజుని చేర్చాడు — సీయోనులో నియమించాడు. మనకోసం నియమించబడిన రాజు రాజుల రాజు ఈ రాజు యేసయ్యే. ఆయన పట్ల మనకున్న విశ్వాసమే మనలను కాపాడే బలమైన అడ్డుగోడ.

కీర్తనలు 2:7

కట్టడను నేను వివరించెదను యెహోవా నాకీలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను.

కీర్తనలు 2:7 ఆత్మీయ పాఠం:

నీవు నా కుమారుడవు — ఈ మాట యేసుకు మాత్రమే కాక, మనకూ కూడా వర్తిస్తూ ఉంది క్రీస్తు ప్రభువు ద్వారా. దేవుని కుమారులమయ్యే వరం మనది అయింది. ఈ హోదాను మనమందరము కోరుకోవాలి ప్రేమించాలి.

కీర్తనలు 2:8

నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.

కీర్తనలు 2:8 ఆత్మీయ పాఠం:

దేవుడు తన కుమారునికి జనములను స్వాస్థ్యంగా ఇస్తాడు. క్రీస్తు ప్రభువు రాజ్యం విస్తారముగా వ్యాపిస్తుంది. మనం ఈ రాజ్య నిర్మాణంలో భాగస్వాములం కావాలి అని దేవుని కోరిక అయి ఉంది.

కీర్తనలు 2:9

ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు.

కీర్తనలు 2:9 ఆత్మీయ పాఠం:

యేసుప్రభువు అనే ఈ రాజు ప్రేమతో పాలించగలడు, అవసరమైతే న్యాయపు తీర్పుతోనూ చీల్చగలడు. ఆయనకు భయపడి, ఆయన ప్రేమను ఎంచుకోవడం మనకు విజయము మాత్రమే కాక నీతిమంతుల లక్షణము కూడా అయి ఉన్నది.

కీర్తనలు 2:10

కాబట్టి రాజులారా, వివేకులై యుండుడి భూపతులారా, బోధనొందుడి.

కీర్తనలు 2:10 ఆత్మీయ పాఠం:

ప్రజలలో ముఖ్యులు అధికారులు అయిన వారు దేవుని జ్ఞానంతో నడవాలి. దేవుని మాట వినే వారు నిజమైన నాయకులు అవుతారు. వారు ఏ స్థాయిలో ఉన్నా —దేవుని బోధ దేవుని ఉపదేశం వారికి పరిణతి కలిగిస్తుంది.

కీర్తనలు 2:11

భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి గడగడ వణకుచు సంతోషించుడి.

కీర్తనలు 2:11 ఆత్మీయ పాఠం:

భయంతో యెహోవా సేవ చేయండి, యెహోవాయందు భక్తి అనేది భయంతో కూడిన ఒక ఆనందం. అది గౌరవంతో కూడిన ప్రేమ.

కీర్తనలు 2:12

ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.

కీర్తనలు 2:12 ఆత్మీయ పాఠం:

దేవుని కుమారుని స్మరించని వారు నశిస్తారు. కానీ ఆయనపై ఆశ పెట్టుకొన్నా వారందరు ధన్యులు! మన దాగుచోటు దేవుడే ! దేవునిలోనే మనము ఉండాలి — అక్కడే మనకు క్షేమం.

ఎస్తేర్ క్రైసోలైట్

22-4-2025

Written By: Sis.Esther Chrysolyte

Written On: 2-6-25