Biblical Analysis
కీర్తనలు 3 & 4 అధ్యాయాల
ఆత్మీయ విశ్లేషణ
కీర్తనలు 3:1
యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి యున్నారు నామీదికి లేచువారు అనేకులు.
ఆత్మీయ పాఠం:
మన జీవితంలో ఎదురు దాడి చేసె వారు మనలను బాధించేవారు అన్యాయంగా మనమీదికి లేచేవారు ఉన్నప్పుడు, వాటి యొక్క తీవ్రత వైపు మనం చూడకుండా, మన పక్షాన ఉన్న యుద్ధ శూరుడైన యెహోవా దేవుని ఆ దేవుని మహిమను ఆ దేవుడు చేసే గొప్ప కార్యాలను అద్భుతాలను మనము చూడాలి. దేవుని అపారమైన శ్రద్ధ తనను విశ్వసించిన మనపై ఉంది,
మనకు ఎంత మంది విరోధులున్నా, మన పక్షాన దేవుడు ఉన్నప్పుడు ఆయన ఒక్కరే చాలిన దేవుడు మన దేవుడు అన్ని సమస్యలను పరిష్కరించే సమర్థుడు, పరిపూర్ణుడు, శక్తివంతుడు. మన శత్రువుల సంఖ్యకన్నా, వారి బలానికన్నా దేవుని సమర్థత ఎంతో ఎక్కువ. దేవుడు ఉన్నచోట మనకు భయం లేదు.దేవుడు మనవైపు ఉన్నప్పుడు, మనకు ఎదురైనవారు ఎవరైన సరే మనలను ఓడించలేరు.
రోమీయులకు 8:31
ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?
కీర్తనలు 3:2
దేవుని వలన అతనికి రక్షణ యేమియు దొరకదని నన్నుగూర్చి చెప్పువారు అనేకులు (సెలా.)
ఆత్మీయ పాఠం:
ప్రపంచం అంత మన విశ్వాసాన్ని తక్కువచేసినా, దేవుడు తనను విశ్వసించే తనను ఆశ్రయించే తన ప్రజల రక్షణ కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు అన్న విషయమును మనం ఎప్పుడు జ్ఞాపకము లో ఉంచుకోవాలి ఇతరులు చెప్పే మాటలు కాకుండా దేవుని వాగ్దానాలపై మన హృదయాన్ని విశ్వాసంతో స్థిరపరచుకోవాలి.
కీర్తనలు 3:3
యెహోవా, నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు.
ఆత్మీయ పాఠం:
మన తల దించుకునే పరిస్థితి మనకు వచ్చినప్పుడు దేవుడు తన మహిమతో తలను పైకెత్తేవాడు గా ఉంటాడు దేవుడే మన భద్రత మన రక్షణ, దేవుడే మన గౌరవం ఈ లోకంలో ప్రజలు రథములను బట్టి రౌతులను బట్టి ఆస్తులను బట్టి ఈ లోక సంబంధమైన గొప్ప గొప్ప వాటిని బట్టి వాళ్ళ అతిశయం ఉంటుంది కానీ దేవుని ప్రజలమైన మన అతిశయం మన గౌరవం దేవుడే అన్నట్లు ఉండాలి అన్న భావమును ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది.
కీర్తనలు 3:4
ఎలుగెత్తి నేను యెహోవాకు మొఱ్ఱ పెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతమునుండి నాకుత్తర మిచ్చును.
ఆత్మీయ పాఠం:
మన ప్రార్థనకు మనము చేసే విన్నపములకు విజ్ఞాపన ప్రార్థనలకు దేవుడు దూరంగా ఉన్నట్లే దేవుడు మనమడికే వాటిని ఆలకించటం లేదేమో అన్నట్లు మనకు అనిపించినా అనిపిస్తూ ఉన్న, మన ప్రార్థనకు దేవుడు స్పందిస్తాడు. ఆలస్యం అయినా కచ్చితంగా మన ప్రార్థనకు దేవుడిచ్చే సమాధానమును జవాబును మనము చూడగలుగుతాము తన పరిశుద్ధ స్థలములో నుండి దేవుడిచ్చే జవాబు అది బహు కొంచెమే అయినప్పటికీ దాని ద్వారా మనకు కలిగే సమాధానము శాంతి అన్నది అది ఎంతో విస్తారమైనది
కీర్తనలు 3:5
యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును.
ఆత్మీయ పాఠం:
ఉదయ సాయంత్రములు అన్నవి దేవుడే సృష్టించాడు కాబట్టి ఉదయములో మనం చేసే పని అంతటిలో మనకు దేవుడే ఆధారము సాయంత్రము నిద్ర ద్వారా మనము విశ్రాంతిని తీసుకోవాలి మరల మేలుకొనేది కూడా దేవుడు ఏర్పర్చిన పద్ధతిని బట్టే కాబట్టి ప్రతి ఉదయాన మనకు లేచే శక్తిని దేవుని కృపద్వారా లభిస్తుంది. ప్రతి ఉదయాన మనము లేపబడేది దేవుని కృపను బట్టే అని మన రక్షణ,మన శక్తి దేవుని పైనే ఆధారపడి ఉంటుంది ఆని మనము గ్రహించాలి
కీర్తనలు 3:6
పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను.
ఆత్మీయ పాఠం:
సంఖ్యలు అనేవి మనలను భయపడేలా చేస్తాయేమో కానీ, దేవుని సన్నిధి అనేది మాత్రం ఆ ఒక్కటి మనలో భయాన్ని తొలగిస్తుంది. దేవునితో దేవుని సన్నిధితో దేవుడిచ్చిన వాగ్దానముతో ఉన్నవాళ్లకి ఎప్పటికీ భయం అనేది ఉండదు అన్న ఒక సత్యమును ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది.
కీర్తనలు 3:7
యెహోవా, లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టు వాడవు నీవే, దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవు నీవే.
ఆత్మీయ పాఠం:
దేవుడు తనను విశ్వసించిన తన ప్రజలమైన మన కోసం యుద్ధములు చేసేవాడు. మనం నిశ్శబ్దంగా ఉన్న దేవుడు మన నిమిత్తం మన కొరకు మన సమస్యలనే శత్రువులను సంహరిస్తాడు నశింప చేస్తాడు దేవుని న్యాయం నిశ్చల మైనది అది ఎప్పటికీ మారనిది.
కీర్తనలు 3:8
రక్షణ యెహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. (సెలా.)
ఆత్మీయ పాఠం:
మన రక్షణ, మన శ్రేయస్సు మన క్షేమం మన భద్రత మన ఆశీర్వాదాలు ఇవి అన్నీ కూడ దేవుని చేతిలోనే ఉన్నాయి. దేవుని చేతులలో మనం సురక్షితంగా ఉన్నాం ఉంటున్నాము ఉండబోతాము కూడా. దేవుని ఆశీర్వాదమే మనకు బలము.
కీర్తన 4 నాల్గవ అధ్యాయము
కీర్తనలు 4:1
నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టు నప్పుడు నాకుత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము.
ఆత్మీయ పాఠం:
మనము కష్టములో శ్రమలలో ఉన్నప్పుడు అందులో మనము నలుగుతున్న సమయంలో అప్పుడు . మన పరిస్థితి బిగుసుకుపోయినట్టు అనిపించినా, దేవుడు మన కోసం ఓ విశాలమైన మార్గాన్ని తెరిస్తాడు మన హృదయానికి నెమ్మదిని ఇస్తాడు. దేవుని చిత్తం ప్రకారం మనము నడిచినప్పుడు, మనము కలిగి ఉన్న మనలను బంధించి ఉన్న ఆ బంధకాలే ఆ సమస్యలే మనకు ఒక ఆశీర్వాదలను తీసుకువచ్చే ఒక మార్గంగా మారుతాయి.
ఇది ఎలా జరుగుతుందో మనకు అర్థం కాకపోయినా, మన కష్టాల్లోనూ దేవుడు మన హృదయాన్ని సమాధాన పరుస్తాడు మనకు విశ్రాంతిని ఇస్తాడు. మనకి దారి ఏదో కనపడకపోయినా, దేవుడు ఒక విశాలమైన దారిని మన కోసం తెరచి ఉంచుతాడు.
కీర్తనలు 4:2
నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైనదానిని ప్రేమించెదరు? ఎంత కాలము అబద్ధమైనవాటిని వెదకెదరు?
ఆత్మీయ పాఠం:
ప్రపంచం అంతా ప్రపంచంలో ఉన్న చాలావరకు ప్రజలందరూ నిజమైన నీతిని నీతిగా చేయబడిన నీతిమంతుడైన క్రీస్తు యేసు ప్రభువుని వాళ్ళ హృదయాలలో నుంచి తొలగించి, మాయకు మాయా స్వరూపులైన వ్యర్ధమైన ప్రతిమలకు ఆకర్షితులవు తున్నారు.
కీర్తనలు 31:6
నేను యెహోవాను నమ్ముకొని యున్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అస హ్యులు అని చెప్పేవారు కొద్దిమంది మాత్రమే కానీ దేవుని ప్రజలు తన గమనాన్ని తమ ఆత్మసంబంధమైన జీవితములో ప్రయాణించే మార్గమును సత్యంపై సత్యమై యున్న క్రీస్తుపై నిలబెట్టాలి దేవుని మహిమలో స్థిరపడాలి, నశించిపోయే మాయను తిరస్కరించాలి అన్న విషయంలో ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది.
కీర్తనలు 4:3
యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసికొనుడి. నేను యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించును.
ఆత్మీయ పాఠం:దేవుడు తన భక్తులను తమలోంచి వేరు చేసుకొని, తనకోసం ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచుకుంటాడు. ప్రపంచం వారు ఎవరో అని పట్టించుకోకపోయినా, దేవుడు వారికి ప్రత్యేకమైన విలువను ఇస్తాడు. మనం దేవునిని శుద్ధ హృదయంతో, విశ్వాసంతో మొరపెట్టినప్పుడు, ఆయన ఆలకిస్తాడు. ఆయన సమాధానం ఆలస్యం కావచ్చు కానీ, ఖచ్చితంగా వస్తుంది అని ఈ వాక్యం మనకు గుర్తుచేస్తుంది –
మన ప్రార్థన వృథా కాదు, మన స్థితి దేవునికి కనిపించకుండా లేదు, మన స్థానం దేవుని దృష్టిలో ప్రత్యేకం.
ఆలోచించదగ్గ ప్రశ్న:
ప్రపంచం నిర్లక్ష్యం చేసినా, దేవుడు మీను ఎలా విలువగా చూస్తున్నాడో తెలుసుకునేందుకు మీ హృదయం సిద్ధంగా ఉందా?
కీర్తనలు 4:4
భయమునొంది పాపము చేయకుడి మీరు పడకలమీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసికొని ఊరకుండుడి (సెలా.)
ఆత్మీయ పాఠం:
మనలో ఉప్పొంగే కోపాన్ని గమనించి, దేవుని ఎదుట మౌనంగా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరి మీద ఎంత పగ ద్వేషము అసూయ లాంటివి దేవునికి అయిష్టమైన కార్యాలు మనలో ఏమున్నా సరే దేవునికి భయపడి వాటిని క్రియల రూపంలో పెట్టకుండా మన పడకల మీద ఉండగానే వాటిని గురించి మన హృదయంలో ధ్యానం చేసి ఊరుకోవాలి అని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది మౌనంగా మనము మాట్లాడకుండా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అందులో కూడ దేవుని స్వరం మనకు వినిపడగలదు.
కీర్తనలు 4:5
నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి.
ఆత్మీయ పాఠం:
మనము బాహ్య మైన ఆచారాలను పాటించటం కాదు గాని— మనలో వున్న మంచి హృదయముతో కూడిన విశ్వాసమే దేవునికి ప్రియమైన ఇష్టమైన బలి. వాక్యమిచ్చేనీతిని నీతిమంతుడైన క్రీస్తును అనుసరించడమే నిజమైన ఆరాధన అయి ఉంది.
కీర్తనలు 4:6
మాకు మేలు చూపువాడెవడని పలుకు వారనేకులు. యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము.
ఆత్మీయ పాఠం:
ప్రపంచం ప్రపంచంలో చాలా శాతం మంది ప్రజలు ఆత్మను నడిపించే వెలుగును నిజమైన వెలుగును బయట వెదుకుతుంది వెతుకుతున్నారు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచే దేవుని ప్రజలు దేవుని సన్నిధిలోనే వెల్లడి అగుట తోడనే వెలుగునిచ్చే దేవుని వాక్యంలోనే నిజమైన వెలుగును చూస్తాడు. ఆ వెలుగు అనేకులకు మోక్ష మార్గమునకు శాంతికి దారి చూపిస్తుంది.
కీర్తనలు 4:7
వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిననాటి సంతోషముకంటె అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి.
ఆత్మీయ పాఠం:
మానవుల బంధుత్వాన్ని బట్టి కలిగే సంతోషం ఈ లోకంలో ఉన్న వాటి ద్వారా కలిగే సంతోషం వస్తువులలోని ఆనందం ఇవి మనకు తాత్కాలికం. దేవునిలోని సంతోషం మాత్రం లోతైనది దానిని ఎవ్వరూ కూడా మన నుంచి దూరం చేయలేనిది, దేవునిలో మనకు దొరికే ఆనందం సంతోషం అనేది మనకు ఎప్పటికీ నిలిచిపోయే ఆనందం. ఈ ఆనందం కలిగితే ఇటువంటి అనందము దొరికిన ప్రజలు, ఎన్ని లోపాలు ఉన్నప్పటికీని ఎన్ని కొరతలు ఉన్నప్పటికీని సంతోషముగా ఆనందంగా జీవించగలరు.
కీర్తనలు 4:8
యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.
ఆత్మీయ పాఠం:
దేవుని శ్రద్ధ మనపై ఉన్నప్పుడు,దేవుడు మనలను శ్రద్ధగా చూస్తున్నాడు మనలను గమనిస్తున్నాడు అన్న క్లారిటీ మనకు కలిగినప్పుడు మన హృదయం భయము లేకుండా ఉంటుంది. ఆ నిశ్చయతే మనకు ఒక చక్కని నిద్రను యిస్తుంది. మన జీవితంలో మనము నెమ్మదిగా జీవించటానికి సమాధానమునకు శాంతికి కర్త అయినటువంటి దేవుడు క్రీస్తు యేసు ప్రభువు మన కందరికీ కావాలి.
ఎస్తేర్ క్రైసోలైట్
23-4-2025

Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25