Biblical Analysis
కీర్తనలు 5 వ అధ్యాయము ఆత్మీయ విశ్లేషణ
కీర్తనలు 5:1
యెహోవా, నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానముమీద లక్ష్యముంచుము.
దావీదు పరిస్థితి:
దావీదు తన జీవితంలో శత్రువులతో పొత్తులు, కుట్రలు, అబద్ధ ఆరోపణల మధ్యలో ఉన్నాడు. బాహ్యంగా తాను చెప్పే మాటలకు మాత్రమే కాక, అంతరంగంలో తనకు ఉన్న బాధను కూడా దేవుడు గమనించాలని కోరుతున్నాడు. ఇది దావీదు ప్రార్థనలోని లోతైన యథార్థతను చూపిస్తుంది.
ఆత్మీయ పాఠము:
మన వ్యక్తిత్వం మనం బయట పలికే మాటలకంటే ఎక్కువ. దేవుడు మన హృదయాన్ని చూచేవాడు. మనం ఆలోచించే విధానం కూడా ఆయన దృష్టిలో ఉంది. కాబట్టి, ఆయన ముందు మనం అబద్ధం చెప్పలేము దావీదు తన మనోభావాలను యెహోవా సన్నిధిలో వ్యక్తపరచడానికి నిశ్చయించుకున్నాడు. కేవలం మన మాటలు మాత్రమే కాదు, మన మనస్సులో ఉన్న ఆత్మీయ గాఢతను మన ఆత్మతో దేవుణ్ణి దేవుని కృపను దేవుని నీతి న్యాయ విధానములను దేవుని వాక్యమును మనము ధ్యానము చేయటాన్ని కూడా దేవుడు గమనించగలడు లక్ష్య పెట్టగలడు. మనము మన మాటలతో నమ్మకంగా ప్రార్థించడమే కాదు, మన హృదయాన్ని పూర్తిగా స్వచ్చంగా దేవుని ఎదుట నీళ్ల వలే గుమ్మరించే ఆత్మదృష్టిని ఆత్మీయ అనుభవమును మనము కలిగి ఉండాలి. దేవుడు మన మనస్సులోని అంతరంగ భావాలను బట్టి కూడా మనలను పరిశీలిస్తాడు.
ప్రశ్న:
నేను దేవునితో మాట్లాడుతున్నప్పుడు — ఆయన నా మాటలకంటే నా మనసుని నా ఆత్మలో ఉన్న వేదనను బాధను చూస్తున్నాడని తెలుసుకొని మాట్లాడుతున్నానా?
నా మనసులో నాకూ తెలియని బాధలు ఉన్నపుడు కూడా, నేను వాటిని దేవునితో పంచుకుంటున్నానా?
కీర్తనలు 5:2
నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను.
దావీదు పరిస్థితి:
దావీదు భూమి మీద రాజుగా ఉన్నా, తనపై ఉన్న పర సంభంధమైన ఆధికారాన్ని పూర్తిగా దేవునికే అప్పగించాడు. దావీదు దేవునిని తన రాజుగా, దేవుడిగా మాత్రమే కాక, తన వ్యక్తిగత ప్రార్థనలను వినే దేవుడుగా భావించాడు. ఇది తనకు దేవునితో ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని సూచిస్తుంది.
ఆత్మీయ పాఠము:
దేవునితో ఉన్న సంబంధాన్ని మనము ఏ స్థాయిలో చూస్తున్నామో అన్న విషయము అది మన ప్రార్థన యొక్క విలువను నాణ్యతను నిర్ణయిస్తుంది. దేవుడు కేవలం దూరముగా వున్నవాడు కాదు — నా రాజా, ఆయన మనతో వ్యక్తిగత సంబంధాన్ని కోరుకుంటున్నాడు.
ఇక్కడ దావీదు దేవుణ్ణి తన రాజుగా, తన దేవునిగా పిలుస్తూ వ్యక్తిగతమైన సంబంధాన్ని ప్రకటిస్తున్నాడు. మనము దేవునిని పిలుచుకునేటప్పుడు దేవుని నామమును స్మరించేటప్పుడు, దేవునితో
ఉన్న మన సంబంధం ఓక భక్తితో కూడిన దేవుని రాజ్య సంబంధంగా — ఆయన నా అధికారి, నా పాలకుడు, నా పాలనకర్త అనే రీతిలో ఉండాలి. మనము చేసే ప్రార్థన కేవలం మన అవసరాల కొరకైన జాబితా మాత్రమే కాదు, అది మన రాజుతో జరిగే అత్మియ సమవేశము. ప్రార్థన అంటే నేను నా రాజుతో మాట్లాడుతున్నట్టు, విశ్వాసంతో, గౌరవంతో దేవునితో మనకు ఉండే వ్యక్తిగత మైన సంబంధాన్ని మనము గుర్తించాలి.
ప్రశ్న:
దేవుడు నా దేవుడిగా మాత్రమేనా, లేక నా జీవితాన్ని నడిపించే రాజుగా నా మీద అధికారాన్ని కలిగినవాడిగా నేను ఆయనను గౌరవిస్తున్నానా?
దేవుడు నా జీవితం మీద పరిపాలన కలిగిన రాజుగా ఉండేలా నేను అంగీకరిస్తున్ననా?
కీర్తనలు 5:3
యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందును.
దావీదు పరిస్థితి:
దావీదు ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో ప్రార్థనతో మొదలుపెడతాడు. తన దినాన్ని దేవునితో ప్రారంభించి, శత్రువుల హింస మధ్యలోనూ, అతడు దేవుని సమాధానము కొరకు ఎదురుచూస్తున్నాడు.
ఆత్మీయ పాఠము:
ప్రతి రోజు మన దినచర్య ప్రార్థనతో వాక్యముతో దేవునితో ప్రారంభమైతే, మన ఆశలు మన కోరికలు మన మనవులు అన్నీ కూడా దేవునిపై స్థిరంగా ఉంటాయి. మన ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోయినా, దేవుని యొద్ద నుండి సమాధానం మనకు తప్పక వస్తుంది. ప్రతిరోజూ దేవునితో మన దినచర్యను మొదలుపెట్టడంలో మనకు క్షేమము ఉంది. మనము ప్రార్ధించిన తరువాత దేవునిపై నిరీక్షణ అన్నది కూడా మనము ఉంచాలి— దేవుడిచ్చే సమాధానము కొరకు మనము సిద్ధంగా ఉండాలి.
ప్రశ్న:
నాకు ఏ సమాధానం లేని పరిస్థితుల మధ్యలోను — నేను దేవుని కొరకు ఆశతో ఎదురుచూస్తున్నానా?
కీర్తనలు 5:4
నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీయొద్ద చోటులేదు
దావీదు పరిస్థితి:
దావీదు, దేవుడు పరిశుద్ధతను ప్రేమించేవాడని, దుష్టులను దుష్టత్వమును సహించని వాడని తెలుసుకున్నాడు. అందుకే తన శత్రువుల పాపాన్ని దేవుని తీర్పుకి అప్పగిస్తున్నాడు.
ఆత్మీయ పాఠము:
దేవుడు పవిత్రతను పరిశుద్ధతను కోరుకుంటాడు. ఆయనకు సమీపంలో మనము ఉండాలంటే, మన జీవితం అంతా కూడా పరిశుద్ధముగా ఉండాలి.
దేవునికీ సమీపముగా బ్రతకాలని కోరుకునే వ్యక్తి, పరిశుద్ధతను పవిత్రతను ప్రేమిస్తాడు. దేవుని దృష్టిలో పాపం ఎంత ప్రమాదకరమో మనం గ్రహించాలి.
ప్రశ్న:
నీవు దేవుని పరిశుద్ధతను ఎలా ! చూస్తున్నావు ?
కీర్తనలు 5:5
డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయువారందరు నీకసహ్యులు
దావీదు పరిస్థితి:
దావీదు దేవుని పట్ల నమ్మకంగా యదార్ధముగా ఉండాలని అలానే తాను జీవించాలనే తపనతో ఉన్నాడు. నా మీదా అబద్ధ ఆరోపణలతో ముట్టడించిన వారు అందరు దేవుని చేత శిక్షించబడతారు అన్న ప్రగాఢమైన ఒక విశ్వాసమును దావీదు నమ్ముతున్నాడు.గర్విష్టులు దేవుని దృష్టికి అంగీకారము కాదు దేవుడు కీడుచేసే వారిని ద్వేషిస్తాడు.
ఆత్మీయ పాఠము:
గర్వం దేవునికి అసహ్యం. వినయం దేవునికి యిష్టమైన లక్షణం గర్వాన్ని వదిలి మనమందరము వినయాన్ని అలవర్చుకోవాలి.
దేవుడు అహంకారాన్ని, అబద్ధాన్ని ద్వేషిస్తాడు. మన నోటి మాటలూ, మన హృదయ స్థితులూ దేవునికి అసహ్యంగా కాకుండా పరిశుద్ధంగా దేవునికి ఇష్టముగా ఉండాలి అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది.
ప్రశ్న:
నా మాటలు దేవుని హృదయాన్ని గెలిచేలా ఉన్నాయా లేక బాధపెట్టేలా ఉన్నాయా?
నా మాటల్లో, పనుల్లో గర్వం లేకుండా వినయంగా ఉన్నానా?
కీర్తనలు 5:6
అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు.
దావీదు పరిస్థితి:
దావీదు తనకు ద్రోహం చేసే ద్రోహులతో, తన ప్రాణమునకే హనీ తలపెట్టే శత్రువులతో చుట్టబడి ఉన్నాడు. అయినప్పటికీని దేవుని పట్ల నమ్మకంగా దేవుడిచ్చే న్యాయం కోసం వేచిచూస్తున్నాడు.
ఆత్మీయ పాఠము:
కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు.సామెతలు 6:16 - 19
యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా, అహంకార దృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.
ఇటువంటి దేవునికి అసహ్యమైన కార్యాన్ని చేసే వారికి కచ్చితంగా దేవుని శిక్ష వస్తుంది దేవుడు ఆలస్యం చేస్తున్నట్లు మనకు అనిపిస్తున్న దేవుని తీర్పు కచ్చితంగా వచ్చి తీరుతుంది
దేవుడు సత్యమును ప్రేమిస్తాడు. మోసం, హింస నరహత్య చేసేటటు వంటి వారి ప్రవర్తనల పట్ల దేవుడు కోపంగా ఉంటాడు. మన జీవితం కూడ సత్యమైన దేవునితో ఆ దేవుని వాక్య సత్యలతో మన హృదయం నిండి వుండాలి.
ప్రశ్న:
నా నమ్మకాన్ని నేను దేవునిపట్ల నిలుపుతున్నానా లేక సందర్భానుసారముగా మరళి పోతున్నానా?
నా మాటలు, నా నడవడిక దేవుని దృష్టిలో నిజాయితీగానే ఉన్నాయా?
కీర్తనలు 5:7
నేనైతే నీ కృపాతిశయమునుబట్టి నీ మందిరములో ప్రవేశించెదను నీయెడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను.
దావీదు పరిస్థితి:
దావీదులో ఏ పరిశుద్ధతా లేకపోయినా, దేవుని కృపను ఆధారంగా చేసుకొని దేవుని సన్నిధికి వస్తున్నాడు. అది గర్వంతో కాదు — గంభీరముతో కూడిన భయంతో.
ఆత్మీయ పాఠము:
మన గొప్పతనం వల్ల కాదు — దేవుని దయ కృప వల్లనే మనము దేవునికి సమీపంలో నిలబడ గలుగు తున్నాము. ఈ విషయమును మనము గ్రహించినప్పుడు మనలో వినయం పెరుగుతుంది.
మన నిజాయితీ వల్ల కాదు, ఆయన కృప వల్లే మనం ఆయన సన్నిధిలో నిలవగలుగుతాం. దేవుని ముందు భయభక్తితో మనము ఉండటం అనేది మనకు ఎంతైనా అవసరం.
ప్రశ్న:
దేవునికి సమీపంలో ఉన్నప్పుడు — నేను గర్వంగా ఉన్నానా, లేక గంభీరమైన భయంతో దేవుని కృపను పట్టుకున్నానా?
దేవుని సన్నిధిని తక్కువ అంచనా వేస్తున్నానా, లేక గౌరవంగా ఎదుర్కొంటున్నానా?
కీర్తనలు 5:8
యెహోవా, నాకొఱకు పొంచియున్న వారినిబట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము.
దావీదు పరిస్థితి:
శత్రువులు సత్యాన్ని తిరగ రాస్తున్నారు.సత్యమును అసత్యముగా సత్యమును దానిని తల క్రిందలు చేసి దావీదును దోషిగా నిలబెట్టడానికి దావీదు శత్రువులు ప్రయత్నం చేస్తున్నారు దావీదు దేవుని సత్య మార్గంలో నడవాలని, తప్పుడు మార్గాలకు లొంగకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాడు.
ఆత్మీయ పాఠము:
ఒత్తిడి కలిగే సమయాలలో మనం ఉన్నప్పుడు దేవుని మార్గమే దేవుని వాక్యమే మనకు రక్షణ మార్గం. మన ప్రత్యర్థులు మనలను దారి తప్పించొచ్చు కానీ దేవుని వాక్య సత్యమే మనకు సరియైన క్షేమ కరమైన మార్గమును చూపగలిగేది.
పరులు ఇతరులు మనకు తప్పు దారి చూపినప్పుడు కూడా, దేవుడు తన నీతినిబట్టి మనకు సరైన మార్గాన్ని చూపుతాడు. దేవుని మార్గం మన ముందు స్పష్టంగా ఉండాలంటే కనపడాలి అని అంటే మనకు ప్రార్థన అవసరం.
ప్రశ్న:
ఒత్తిడిలో ఉన్నప్పుడు నేను నా మార్గాములోనే నడుస్తున్నానా, లేక దేవుని మార్గాములో నడుస్తున్నా నా ?
నేను నా దారిని దేవునికి అప్పగించి, ఆయన చూపే మార్గంలో నడుస్తున్నానా?
కీర్తనలు 5:9
వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చకములాడుదురు.
దావీదు పరిస్థితి:
దావీదు తన శత్రువుల చాతుర్యాన్ని, వారి ద్వేషపూరిత హృదయాన్ని, వారి మాటల వెనక దాగిన కుతంత్రాలను పూర్తిగా తెలుసుకొని, వాటిని దేవుని ముందు వెల్లడి పరుస్తున్నాడు. వారు లోపల నాశనకరమైన గుంట, బయటకు మాత్రం మాటలతో మోసం చేసేవారు.
ఆత్మీయ విశ్లేషణ:
మాటలతో మోసం చేయడం, స్వార్థం కోసం సత్యాన్ని వంచించడం మన హృదయస్థితికి సంకేతం. మన నోరు పతన మార్గంగా మారకూడదనే హెచ్చరిక ఇది. దేవుని ముందు నిజాయితీగల హృదయంతో ఉండకపోతే, మన మాటలకూ విలువ ఉండదు.పాపములో మునిగిన వారి మాటలు మధురంగా కనిపించినా, వాటి వెనుక నాశనమే దాగి ఉంటుంది. మనం ఎవరి మాటలు వింటున్నామో జాగ్రత్తగా గమనించాలి.
ప్రశ్న:
ఎవరి మాటలకు నేను ప్రాధాన్యం ఇస్తున్నాను — దేవుని మాటకా? లేక మోసపు మాటలకా?
కీర్తనలు 5:10
దేవా, వారు నీమీద తిరుగబడియున్నారు వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములనుబట్టి వారిని వెలి వేయుము.
దావీదు పరిస్థితి:
దావీదు దేవుని దండన కోసం ప్రార్థిస్తున్నాడు. అతన్ని వేధించే శత్రువులు ఎంతో అసత్యంగా ప్రవర్తిస్తున్నారని, తన పట్ల తన శత్రువులు చేసే దురాలోచనలు అంతయు కూడా సఫలం కాకూడదని వాటి ద్వారా తనకు ఎటువంటి నష్టం రాకూడదని అవి వృద్ధి చెందకూడదని దావీదు దేవుణ్ణి వేడుకుంటున్నాడు
ఆత్మీయ విశ్లేషణ:
దేవుని ప్రజలు, తమ శత్రువుల విషయమై ప్రతీకారం తీర్చుకోదలచు కోకపోయినా – దేవుని న్యాయంపై ఆధారపడతారు. శత్రువు మీద తుది తీర్పు దేవునిదే అనే విశ్వాసం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.
దావీదు న్యాయమైన తీర్పును కోరుతున్నాడు. దేవుని వ్యతిరేకించేవారికి తగిన శిక్ష తప్పదు. దేవుని న్యాయపాలన మీద మనము ఎల్లప్పుడు విశ్వాసం ఉంచాలి.
ప్రశ్న: పాపంపై దేవుని తీర్పును నేను గౌరవంగా తీసుకుంటున్నానా?
కీర్తనలు 5:11
నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు.
దావీదు పరిస్థితి:
దావీదు ఇప్పుడు ధైర్యంగా దేవున్ని ఆశ్రయించిన వారికి వచ్చే విజయాన్ని గూర్చి ప్రకటిస్తున్నాడు. తన శత్రువుల పతనం తర్వాత తన సంతోషాన్ని పరిపూర్ణముగా వ్యక్తపరుస్తున్నాడు.
ఆత్మీయ విశ్లేషణ:
దేవుని మీద ఆశ పెట్టికొన్నవారికి ఏ శత్రువూ కూడా వారి మీద తలెత్తలేడు. వారు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంటారు ఎందుకంటే వారి రక్షణ బాధ్యతను దేవుడే స్వయంగా చూస్తు ఉంటాడు కాబట్టి.దేవున్ని ఆశ్రయించేవారు మాత్రమే నిజమైన ఆనందాన్ని పొందగలరు. ఈ ఆనందం పిరికితనంలో కాదు, పరిపూర్ణ విశ్వాసంలో ఉంటుంది.
ప్రశ్న:
నీ సంతోషం పరిస్థితులపై ఆధారపడి ఉందా? లేక దేవుని రక్షణపై ఆధారపడి ఉందా?
కీర్తనలు 5:12
యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్నుగూర్చి ఉల్లసింతురు.
దావీదు పరిస్థితి:
దావీదు తన ప్రార్థనలను ఆశీర్వాదంతో ముగించుతున్నాడు. దేవుడు నీతిమంతులకు కవచంలా ఉంటాడని, వారికి పరిపూర్ణ రక్షణ కలుగజేస్తాడని ఘనంగా ప్రకటిస్తున్నాడు.
ఆత్మీయ విశ్లేషణ:
నీతి బాటలో నడిచేవారికి దేవుడు ఒక అద్భుతమైన రక్షణ కవచంగా ఉంటాడు. ఈ కవచం శత్రువుల మాటలకీ, కుట్రలకీ మనలను దాటి పోయేది కాదు.
నీతిమంతునికి దేవుని ఆశీర్వాదం కేవలం భౌతిక ఉపయోగము మాత్రమే కాదు, అది దేవుని రక్షణ కవచంలాగా కూడా ఉపయోగపడుతుంది. దేవుని కృపే మన రక్షణ కవచం.
ప్రశ్న:
నేను నీతిగా నడవడం కోసం దేవుని కవచాన్ని ఆశిస్తున్నానా? దేవుని ఆశీర్వాదం నా జీవితం మీద ఉంది అనే నమ్మకంతో నేను జీవిస్తున్నానా?
ఎస్తేర్ క్రైసోలైట్
26-4-2025