BIBLE CLASSES - SCRIPT
🟢📚 Foundational Bible Journey 📖🩷
📚 ఈ రోజు బైబిల్ సందేశం 📖🩷
యేసుక్రీస్తును దేవుడిగా, రక్షకుడిగా విశ్వసించిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పట్ల ఆసక్తి కలుగుతుంది.
దీనిలో ఏముందో తెలుసుకోవాలి…
దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు?"
అనే కోరిక మనలో ఏర్పడుతుంది.
కానీ ఈ గ్రంథం పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో వ్రాయబడినదని బైబిల్ చెబుతోంది.
అందువల్ల దీన్ని చదివి అర్థం చేసుకోవాలంటే, పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఎంతో అవసరం.
బైబిల్ అంటే ఏమిటి?
బైబిల్ అనేది దేవుని వాక్యము. ఇది మనకు ఆయన స్వభావాన్ని, ఆయన సంకల్పాన్ని తెలియజేస్తుంది. ఇది 66 పుస్తకాల సమాహారం – పాత నిబంధన (Old Testament) మరియు క్రొత్త నిబంధన (New Testament).
పాత నిబంధనలో దేవుని ప్రజల చరిత్ర, ధర్మశాస్త్రం, ప్రవక్తల సందేశాలు ఉన్నాయి.
క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు జీవితం, శిష్యుల బోధనలు, సంఘాల స్థాపన గురించి ఉంది.
బైబిల్ ఎలా మనతో మాట్లాడుతుంది?
బైబిల్ మన హృదయాన్ని మార్చగలిగే శక్తివంతమైన వాక్యం. ఇది ఒక దిశ చూపే దీపం లాంటిది.
కీర్తనలు 119:105
(నూన్) నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.
అంటే మన జీవిత మార్గాన్ని సరిచూసే దేవుని దీపం అదే బైబిల్.
ఈ సందేశాల ద్వారా బైబిల్‌ను 20 ముఖ్యమైన అంశాలుగా మనము విభజించి తెలుసుకుంటాం.
ఇలా పరిశీలిస్తేనే, ఈ గ్రంథం మనకు త్వరగా, లోతుగా, స్పష్టంగా అర్థమవుతుంది.
ఈ 20 ముఖ్యమైన అంశలను
Level – 1,
Level – 2,
Level – 3,
గా మనము విభజించి వీటిని నేర్చుకుందాం
Level –1 – మౌలిక సత్యాలు
1. దేవుడు ఎవరు? ఆయన స్వభావం
2. మనిషి ఎవరు? ఎందుకు సృష్టించబడ్డాడు?
3. పాపం అంటే ఏమిటి?
4. రక్షణ అంటే ఏమిటి? ఎలా పొందాలి?
5. క్రీస్తు ఎవరు? ఎందుకు చనిపోయాడు?
6. విశ్వాసం అంటే ఏమిటి? నిజమైన విశ్వాసం యొక్క లక్షణాలు
7. పరిశుద్ధాత్మ దేవుని పని & మార్గదర్శకత్వం
8. బైబిల్ శ్రద్ధగా చదవడం ఎలా?
Level 2 – లో మనము విశ్వాసంలో నడకను గురించి తెలుసుకుంటాము
9. ప్రార్థన జీవితం – ఎలా మెరుగుపరచుకోవాలి?
10. శోధనలు – వాటిలో దేవుని ఉద్దేశం
11. క్షమించడం, ప్రేమించడం – బైబిల్ యొక్క దృక్కోణం
12. పరిశుద్ధత – శుద్ధమైన జీవితం
13. సంఘ జీవితం & భాగస్వామ్యం
14. దేవుని చిత్తం తెలుసుకోవడం
15. కృతజ్ఞత & ఆత్మ ఫలితాలు (గలతీయులకు 5)
16. దేవునితో జీవించిన వ్యక్తుల జీవితాలు (దావీదు, దానియేలు…)
Level 3 – లో మనము ప్రభువు కోసం జీవించడం అనేదాని గురించి తెలుసుకుంటాము
17. పిలుపు & సేవ – ఎవరి కోసం? ఎందుకు?
18. ఆత్మ పూర్ణత – ప్రతిదినం మన జీవనంలో ఆత్మ యొక్క ఆధిపత్యం
19. యేసు తిరిగిరావడం – సిద్ధపాటు అవసరం
20. ఆశీర్వాదం అంటే ఏమిటి? దేవుని దృష్టిలో విజయం
మౌలిక సత్యాలు అంటే ఏమిటి? (Based on Hebrews 6:1–2)
“మౌలిక సత్యాలు” అంటే క్రైస్తవ విశ్వాసానికి పునాది పరసంబంధమైన సత్యాలు నిజాలు. ఇవి మన ఆత్మీయ జీవితం యొక్క బేసిక్ సూత్రాలు.
1. పశ్చాత్తాపము – దేవుని వైపు మనసు మళ్లించడం
2. విశ్వాసము – దేవుని పట్ల నమ్మకం
3. బాప్తిస్మము – నీటి బాప్తిస్మం & పరిశుద్ధాత్మ బాప్తిస్మం
4. హస్తనిక్షేణము – చేతులు పెట్టి ప్రార్థించడం
5. మృతుల పునరుత్థానము – చనిపోయినవారు లేచే నమ్మకం
6. నిత్యమైన తీర్పు – న్యాయదినం, పరలోకము / నరకం
ఇవే ఈ ఆరు విషయాలు మన ఆత్మ సంబంధమైన జీవితానికి పునాది లాంటివి
ఈ సత్యాలపై మన జీవితం పునాది పడిన తరువాతే
ఆత్మీయంగా మన ఎదుగుదల సాధ్యమవుతుంది.
ఇవి మనం ప్రభువుతో నడక ప్రారంభించేందుకు బలమైన స్థిరస్థంభాల్లా ఉంటాయి.
ఇది ఈ రోజు బైబిల్ సందేశం
BIBLE CLASSES - SCRIPT
🟢📚 Foundational Bible Journey 📖🩷
📚 ఈ రోజు బైబిల్ సందేశం 📖🩷
యేసుక్రీస్తును దేవుడిగా, రక్షకుడిగా విశ్వసించిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పట్ల ఆసక్తి కలుగుతుంది.
దీనిలో ఏముందో తెలుసుకోవాలి…
దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు?"
అనే కోరిక మనలో ఏర్పడుతుంది.
కానీ ఈ గ్రంథం పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో వ్రాయబడినదని బైబిల్ చెబుతోంది.
అందువల్ల దీన్ని చదివి అర్థం చేసుకోవాలంటే, పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఎంతో అవసరం.
బైబిల్ అంటే ఏమిటి?
బైబిల్ అనేది దేవుని వాక్యము. ఇది మనకు ఆయన స్వభావాన్ని, ఆయన సంకల్పాన్ని తెలియజేస్తుంది.
ఇది 66 పుస్తకాల సమాహారం – పాత నిబంధన (Old Testament) మరియు క్రొత్త నిబంధన (New Testament).
పాత నిబంధనలో దేవుని ప్రజల చరిత్ర, ధర్మశాస్త్రం, ప్రవక్తల సందేశాలు ఉన్నాయి.
క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు జీవితం, శిష్యుల బోధనలు, సంఘాల స్థాపన గురించి ఉంది.
బైబిల్ ఎలా మనతో మాట్లాడుతుంది?
బైబిల్ మన హృదయాన్ని మార్చగలిగే శక్తివంతమైన వాక్యం. ఇది ఒక దిశ చూపే దీపం లాంటిది.
కీర్తనలు 119:105
(నూన్) నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.
అంటే మన జీవిత మార్గాన్ని సరిచూసే దేవుని దీపం అదే బైబిల్.
ఈ సందేశాల ద్వారా
బైబిల్‌ను 20 ముఖ్యమైన అంశాలుగా మనము విభజించి తెలుసుకుంటాం.
ఇలా పరిశీలిస్తేనే, ఈ గ్రంథం మనకు త్వరగా, లోతుగా, స్పష్టంగా అర్థమవుతుంది.
ఈ 20 ముఖ్యమైన అంశలను
Level – 1,
Level – 2,
Level – 3,
గా మనము విభజించి వీటిని నేర్చుకుందాం
Level –1 – మౌలిక సత్యాలు
1. దేవుడు ఎవరు? ఆయన స్వభావం
2. మనిషి ఎవరు? ఎందుకు సృష్టించబడ్డాడు?
3. పాపం అంటే ఏమిటి?
4. రక్షణ అంటే ఏమిటి? ఎలా పొందాలి?
5. క్రీస్తు ఎవరు? ఎందుకు చనిపోయాడు?
6. విశ్వాసం అంటే ఏమిటి? నిజమైన విశ్వాసం యొక్క లక్షణాలు
7. పరిశుద్ధాత్మ దేవుని పని & మార్గదర్శకత్వం
8. బైబిల్ శ్రద్ధగా చదవడం ఎలా?
Level 2 – లో మనము విశ్వాసంలో నడకను గురించి తెలుసుకుంటాము
9. ప్రార్థన జీవితం – ఎలా మెరుగుపరచుకోవాలి?
10. శోధనలు – వాటిలో దేవుని ఉద్దేశం
11. క్షమించడం, ప్రేమించడం – బైబిల్ యొక్క దృక్కోణం
12. పరిశుద్ధత – శుద్ధమైన జీవితం
13. సంఘ జీవితం & భాగస్వామ్యం
14. దేవుని చిత్తం తెలుసుకోవడం
15. కృతజ్ఞత & ఆత్మ ఫలితాలు (గలతీయులకు 5)
16. దేవునితో జీవించిన వ్యక్తుల జీవితాలు (దావీదు, దానియేలు…)
Level 3 – లో మనము ప్రభువు కోసం జీవించడం అనేదాని గురించి తెలుసుకుంటాము
17. పిలుపు & సేవ – ఎవరి కోసం? ఎందుకు?
18. ఆత్మ పూర్ణత – ప్రతిదినం మన జీవనంలో ఆత్మ యొక్క ఆధిపత్యం
19. యేసు తిరిగిరావడం – సిద్ధపాటు అవసరం
20. ఆశీర్వాదం అంటే ఏమిటి? దేవుని దృష్టిలో విజయం
మౌలిక సత్యాలు అంటే ఏమిటి? (Based on Hebrews 6:1–2)
“మౌలిక సత్యాలు” అంటే క్రైస్తవ విశ్వాసానికి పునాది పరసంబంధమైన సత్యాలు నిజాలు. ఇవి మన ఆత్మీయ జీవితం యొక్క బేసిక్ సూత్రాలు.
1. పశ్చాత్తాపము – దేవుని వైపు మనసు మళ్లించడం
2. విశ్వాసము – దేవుని పట్ల నమ్మకం
3. బాప్తిస్మము – నీటి బాప్తిస్మం & పరిశుద్ధాత్మ బాప్తిస్మం
4. హస్తనిక్షేణము – చేతులు పెట్టి ప్రార్థించడం
5. మృతుల పునరుత్థానము – చనిపోయినవారు లేచే నమ్మకం
6. నిత్యమైన తీర్పు – న్యాయదినం, పరలోకము / నరకం
ఇవే ఈ ఆరు విషయాలు మన ఆత్మ సంబంధమైన జీవితానికి పునాది లాంటివి
ఈ సత్యాలపై మన జీవితం పునాది పడిన తరువాతే
ఆత్మీయంగా మన ఎదుగుదల సాధ్యమవుతుంది.
ఇవి మనం ప్రభువుతో నడక ప్రారంభించేందుకు బలమైన స్థిరస్థంభాల్లా ఉంటాయి.
ఇది ఈ రోజు బైబిల్ సందేశం
Written By: Sis.Esther Chrysolyte
Written On: 6-6- 2025