CHRYSOLYTE MINISTRIES

Sign Up

BIBLE CLASSES - SCRIPT

🟢📚 Foundational Bible Journey 📖❤

(2 వ పాఠం)

మనము ఈ రోజు Foundational Bible Journey లో Level – 1: మౌలిక సత్యాలు లో మొదటి అంశం

1. దేవుడు ఎవరు? ఆయన స్వభావం ఏమిటి?"

అన్న విషయమును గురించి మనం తెలుసు కుందాం !

దేవుడు అనగా ఊహ కాదు, ఊహా జనిత శక్తి అసలే కాదు. దేవుడు సజీవంగా ఉన్న, శాశ్వతమైన, సర్వ సామర్ధ్యత గల గుణములు కలిగిన,పరిశుద్ధమైన, ప్రేమతో నిండి ఉన్న వ్యక్తిత్వం గల సత్యమైన దేవుడు,ఆయన మనల్ని ప్రేమిస్తూ, మనతో మాట్లాడే దేవుడు.

దేవుడు మాట్లాడతాడా ! అలా అయితే మనతో ఎలా మాట్లాడుతాడు

దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు?

తన వాక్యము ద్వారా (బైబిల్ ద్వారా)

పరిశుద్ధాత్మ ద్వారా

పరిస్ధితుల ద్వారా

మన హృదయాన్ని స్పర్శిస్తూ మనతో మాట్లాడతాడు

ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం:

దేవుడు మనం ఊహించేదానికంటే గొప్పవాడు.

మనకు పూర్తిగా అర్థం కాలేనంత మహిమగలవాడు అయినా, మనకు తాను కనిపించేంతగా తన్ను తాను ప్రత్యక్ష పరుచుకున్నాడు ప్రకటించుకున్నాడు.

ఇక్కడ మనము ఆలోచించాల్సింది:

నేను దేవునితో ఒక ఆత్మీయమైన బంధాన్ని అనుభవిస్తున్నానా? ఆయన స్వభావాన్ని నేను ఎంతవరకు తెలుసుకున్నాను? ఆయన పరిశుద్ధతను, ప్రేమను, న్యాయాన్ని నేను ప్రత్యక్ష పరచగలుగుతున్నానా?

దేవుడు తన గుణగణాలను స్వయంగా ప్రకటించుకున్న వాక్యం ఒకటి నిర్గమ 34:6 లో మనకు కనపడుతుంది

"యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా." అని

బైబిల్ ఇలా చెబుతోంది:

యోహాను 4:24

దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.

దేవుని స్వభావం అనగా ఆయన లక్షణాలు.

ఆయన మార్పుచేందే వాడు కాదు, తప్పు చేసేవాడు కాదు, అందరినీ ప్రేమించేవాడు దుష్టత్వం అనేది ఆసలు ఆయనలో లేనేలేదు.

దేవుడు కలిగి వున్న కొన్ని ముఖ్యమైన స్వభావ లక్షణాలు:

మొదటిది

1. పరిశుద్ధుడు – ఆయనలో పాపం ఉండదు

లేవీయకాండము 11:44

నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ద పరచుకొనవలెను.

రెండవది

2. ప్రేమగల దేవుడు – ఆయన ప్రేమయే ఆయన స్వరూపం

1యోహాను 4:8

దేవుడు ప్రేమాస్వరూపి(దేవుడు ప్రేమయైయున్నాడు),

ప్రేమను చూసినవారు దేవుని స్వరూపమును చూసినట్లే

బైబిల్ మనకు దేవుని గురించి చెప్పేటప్పుడు, ఆయన శక్తిమంతుడు, పరిశుద్ధుడు, న్యాయస్థాపకుడు అని వివిధ లక్షణాలు చెబుతుంది. కానీ ప్రత్యక్షంగా "దేవుడు ప్రేమే" అని చెప్పబడింది 1యోహాను 4:8 ఇ వచనంలో నే.

ఈ ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే, అపొస్తలుడు పౌలు వ్రాసిన "లవ్ చాప్టర్", అంటే 1 కోరింథీయులకు 13వ అధ్యాయం 4 - 8 లో వున్న వచనాలు మనకు చాల స్పష్టంగా దీనిని తెలియజేస్తున్నాయి

ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్ని టికి తాళుకొనును (లేక,అన్నిటిని కప్ఫును) , అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండును.

ఇవన్నీ దేవుని స్వభావమే. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి అన్న వాక్యం కేవలం మన భావము కాదు ఈ ప్రతి గుణంలో దేవుడు కనిపిస్తాడు. ఈ ప్రతి గుణమూ మన దేవునిలో ఉంది. కాబట్టి, ఆయనను ప్రేమగా అర్థం చేసుకోవాలంటే ఈ గుణాలను మనం పరిశీలించాలి. మరింతగా, మన జీవితం ద్వారా కూడా ఈ ప్రేమను వ్యక్తం చేయాలి, ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి — మరియు మనం ఆయన సంతానము.

ఈ దేవుని ప్రేమ కేవలం మన భావాలను బట్టి మన ఉద్రేకాలను బట్టి వచ్చేది కాదు; అది ఒక ఆత్మ సంబంధమైన ఆత్మకు కలిగిన లక్షణం. అపొస్తలుడు పౌలు వ్రాసిన Love Chapter" 1 కోరింథీయులకు 13వ అధ్యాయంలో ప్రేమను బలమైన విశ్వాసం కన్నా, అద్భుతాల కన్నా గొప్పదిగా పౌలు ప్రకటిస్తాడు."

1కోరింథీయులకు 13:1-3

మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునైయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.

బీదలపోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు(అనేక ప్రాచీన ప్రతులలో-అతిశయించు నమిత్తము అని పాఠాంతరము) నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.

మూడవది

3. న్యాయమైనవాడు – ఆయన తీర్పు న్యాయమైనది

కీర్తనలు 145:17

యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగల వాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు

నాల్లవది

4. దేవుడు అనుగ్రహముతో నిండినవాడు – దయ మరియు క్షమా కలిగిన వాడు

యోవేలు 2:13

మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును,శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై యుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును

ఐదవది

5. అజ్ఞాత వాసి కాదు — తనని తాను వెల్లడించుకొనేవాడు తనని తాను ప్రత్యక్ష పరచుకునేవాడు

రోమీయులకు 1:19 - 20

ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు.

Written By: Sis.Esther Chrysolyte

Written On: 8-6-2025

Written By: Sis.Esther Chrysolyte

Written On: 8-6-2025