BIBLE CLASSES - SCRIPT
📚 Foundational Bible Journey 📖❤
బైబిల్ పరిచయ పయనం
(దైవ సత్యాలపై ఒక ఆత్మీయ యాత్ర)
3 వ పాఠం
మనము ఈ రోజు Foundational Bible Journey లో Level – 1: మౌలిక సత్యాలు లో మొదటి అంశం
ఆయిన
1. దేవుడు ఎవరు? ఆయన స్వభావం ఏమిటి?"
అన్న అంశములో దేవుని గుణాలను దేవుని స్వభావం గురించి మనం తెలుసు కుందాం !
దేవుని గుణాలు (దేవుని స్వభావం)
1. ఆత్మ (Spirit) – యోహాను 4:24
2. సత్యము (Truth) – తితుకు 1:2
3. ప్రేమ (Love) – 1 యోహాను 4:8
4. పరిశుద్ధత (Holiness) – లేవీయ 11:44
5. కరుణ (Mercy) – కీర్తనలు 103:8
6. దయ (Grace) – ఎఫెసీయులు 2:8
7. న్యాయం (Justice) –ద్వితీయోప 32:4
8. శాంతి దేవుడు (God of Peace) రోమీ15:33
9. నమ్మదగినవాడు (Faithful) –1 కొరింథీ 1:9
10. నిత్యుడు (Eternal) – యిర్మియా 10:10
11.మార్పు లేని దేవుడు (Unchanging)మలాకీ 3:6
12.సర్వజ్ఞుడు(All-Knowing)– కీర్తనలు139:1–4
13.సర్వశక్తిమంతుడు (All-Powerful)–ఆది 17:1
14.సర్వస్థితుడైనవాడు(Omnipresent)– కీర్తనలు 139:7–10
దేవుని గుణాలలో మొదటిగా, ఆయన 'ఆత్మ'గల స్వభావం గురించి తెలుసుకుందాం.
1. ఆత్మ (Spirit) – యోహాను 4:24
దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.
దేవుని స్వభావాన్ని అర్థం చేసుకోవడం అనేది ఆత్మీయ జీవితం యొక్క బలమైన ఆరంభం అని చెప్పాలి
"దేవుని స్వభావాన్ని అర్థం చేసుకోవడం అనేది ఆత్మీయ జీవితం యొక్క బలమైన ఆరంభం" అనే ఈ వాక్యం ద్వారా మనం దేవుణ్ణి ఎవరుగా అర్థం చేసుకుంటామో, ఆయన స్వభావాన్ని ఎలా గ్రహిస్తామో, అదే మన విశ్వాసానికి, ప్రార్థనకు, భయభక్తికి, దేవుని పట్ల మనము కలిగి ఉన్న మక్కువకు బలమైన ఆధారంగా మారుతుంది.
దీనిని బైబిల్ ఆధారంగా చూస్తే:
యోహాను 17:3 ప్రకారం
అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము
ఈ వాక్యము స్పష్టంగా చెప్తుంది —
దేవుని పరిచయం (ఆయనను ఎరిగిన జ్ఞానం) అనేది నిత్యజీవానికి మూలం. ఇది కేవలం మానసిక జ్ఞానం కాదు, ఆత్మీయ సంబంధం. ఆయన స్వభావాన్ని, ఆయన పంపిన యేసుక్రీస్తుని మనం లోతుగా, నిజంగా, అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే నిత్యజీవంలోకి ప్రవేశించే మార్గం.
2. యిర్మియా 9:23- 24
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుజ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింప కూడదు.
అతిశ యించువాడు దేనినిబట్టి అతిశయింప వలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసి కొనుటను బట్టియే అతి శయింపవలెను; అట్టి వాటిలో నేనానందించు వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
దేవునిని అర్థం చేసుకోవడమే నిజమైన అతిశయానికి గల కారణం; ఇది భూమిలో మనం పొందగలిగిన అత్యుత్తమ ఘానత.
మన ఆత్మీయ ప్రయాణం దేవుని స్వభావాన్ని తెలుసుకునే ప్రయత్నంతో మొదలవుతుంది.
దేవున్ని ఎవరో కాదు, ఎవరు ఎలా చెప్పారు అనేది కాదు — ఈ పరిశుద్ధ గ్రంధము ద్వారా దేవుడు తనను ఎలా వెల్లడి పరచుకున్నాడో తెలుసు కోవడమే అసలైన ఆరంభం.
దేవుడు ఆత్మ గనుక అన్న అంశమును బట్టి ఆత్మయైన దేవుని స్వభావమును మనము విశ్లేషిద్దాం
దేవుడు శరీరములో శరీర సంబంధ మైన విషయాలలో కట్టుబడి ఉండడు:
"ఈ వాక్యం ద్వారా మనకు స్పష్టమవుతుంది దేవుడు శరీరరూపములో లేరు; ఆయన ఆత్మయే. కనుక, మనం దేవునిని భౌతిక ప్రదేశాలలో అంటే ఇక్కడ మాత్రమే ఉన్నాడు అనే కచ్చితమైన చోట్లలో మాత్రమే ఉండే వాడిగా ఊహించి వెతకలేము. ఆయన సమస్త కాలములు, సమస్త స్థలములలో ఉండగలిగే పరమ స్వాతంత్ర్యము గల ఆత్మ."
ఆత్మతో ఆరాధన అవసరం:
దేవుడు ఆత్మ అయినందున, మన ఆరాధన కూడా ఆత్మ తత్వం కలిగినదిగా ఉండాలి. మన హృదయపు లోతు నుండి, ఏకాగ్రతతో, పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఆరాధించాలి.
సత్యంతో కూడిన ఆరాధన:
సత్యమును ఆధారంగా చేసుకుని – దేవుని వాక్యంపై నిలబడే ఆరాధన మాత్రమే దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది.
ఆత్మయైన దేవుడి గుణాలు మనకు ఏమి నేర్పుతాయి?
దేవునితో మన సంబంధం శారీరక ఆచారాల ద్వారా మాత్రమే కాకుండా, హృదయ సంబంధంగా ఉండాలి.
నిజమైన ఆరాధనలో మన ఆత్మ భాగస్వామిగా ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే దేవుని స్వభావాన్ని మనం సంపూర్ణంగా గ్రహించగలం.
“దేవుడు ఆత్మ” – యోహాను 4:24 లో వున్న ఈ గుణాన్ని చూస్తే, మనకు కొన్ని సందేహలు వస్తాయి
దేవుడు ఆత్మ “దేవుడు ఆత్మగలవాడు” అంటే ఏమిటి? ఆయనకు శరీరం లేదా? ఆని
అవును. దేవుడు శారీర సంభంది కాదు. ఆయన మనకు కనపడేటట్లు దృశ్యరూపంలో ఉండడు. దేవుడు సర్వ స్థలములలో ఉండగలిగే, శాశ్వతమైన, అదృశ్యమైన ఆత్మ.
దేవుడు ఆత్మ అయితే, యేసు మానవ రూపంలో ఎందుకు వచ్చాడు?
యేసు క్రీస్తు అనేది దేవుని కుమారుడిగా భౌతిక ప్రపంచానికి ప్రత్యక్ష రూపం. దేవుని ఆత్మ మానవ శరీరాన్ని ధరించి మానవులకు రక్షణ కలిగించడానికే ఆయన భూమిపై వచ్చాడు.
“ఆత్మతో ఆరాధించాలి”
అయితే శబ్దంగా ప్రార్థించడం అవసరమేనా? లేదా అంతరంగికంగా ఉండాలా?
ప్రార్థన శబ్దంతోనైనా, నిశ్శబ్దంగానైనా చేయవచ్చు. కానీ ముఖ్యమైనది – అది మన ఆత్మ నుండి రావాలి. హృదయ సంబంధంగా ఉండాలి.
శబ్దం వచ్చేటట్లు ఆరాధించడంలో తప్పేమీ లేదు. కానీ ఆరాధనలో మన హృదయం కూడా పూర్తిగా దేవుని వైపు తిరిగి ఉండాలి. అంటే మన ఆత్మ నుంచి రావాలి — ఇది కేవలం పలకడం కాదు, భక్తితో, విశ్వాసంతో చేయబడిన ఆరాధన.
సత్యం అంటే ఇక్కడ ఏ సత్యం?
ఇక్కడ “సత్యం” అంటే దేవుని వాక్యం
(యోహాను 17:17 – “నీ వాక్యమే సత్యము”)
మరియు నిజమైన హృదయములో నుండి వచ్చే మక్కువతో ఆరాధించడం. కేవలం ఒక్క మాటలు కాదు, మనసులో నిజమైన విశ్వాసంతో కూడిన ఆరాధన.
ఆత్మతో ఆరాధించాలంటే పరిశుద్ధాత్మ అవసరమా?
అవును. పరిశుద్ధాత్మ మనం దేవుని స్వరూపాన్ని అర్థం చేసుకోవటానికి, సరైన ఆరాధన చేయటానికి సహాయపడతాడు. ఆయన మార్గదర్శకుడిగా మనకు ఉంటాడు.
మనం ఆలోచించ వలసిన ప్రశ్న:
నేను దేవునిని నిజంగా నా ఆత్మతో, సత్యంతో ఆరాధిస్తున్నానా? లేక మాటలతోనా !

Written By: Sis.Esther Chrysolyte
Written On: 9-6-2025
Written By: Sis.Esther Chrysolyte
Written On: 9-6-2025