CHRYSOLYTE MINISTRIES

Sign Up

BIBLE CLASSES - SCRIPT

🟢📚 Foundational Bible Journey 📖❤

బైబిల్ పరిచయ పయనం

(దైవ సత్యాలపై ఒక ఆత్మీయ యాత్ర)

4 వ పాఠం

మనము ఈ రోజు Foundational Bible Journey లో Level – 1: మౌలిక సత్యాలు లో మొదటి అంశం

ఆయిన

1. దేవుడు ఎవరు? ఆయన స్వభావం ఏమిటి?"

అన్న అంశములో దేవుని గుణాలను దేవుని స్వభావం గురించి మనం తెలుసు కుంటు వున్నాము!

ఆత్మ అనే దేవుని గుణమును దేవుని స్వభావాన్ని మనము తెలుసుకోవటము గ్రహించడమే కాదు, ఆ స్వభావాన్ని మన జీవితంలో అనుభవించడమే నిజమైన ఆత్మీయ మైన మన ప్రయాణానికి ప్రారంభం అని చెప్పాలి

“గత పాఠంలో దేవుని ఆత్మ అనే పరిశుద్ధ గుణాన్ని చూశాం. ఇప్పుడు ఆ గుణం ఆ స్వభావము మన జీవితం లో ఎలా ప్రవేశించాలి? అది ఎలా మనకు పరిశుద్ధతను కలిగిస్తుంది? అనే దానిని మనం ఇప్పుడు ధ్యానిద్దాం

దేవుని ఆత్మ పరిశుద్ధమైనది ఈ పరిశుద్ధమైన ఆత్మ స్వభావమును మనము ఎలా పొందగలం

యేసు రక్తం మన ఆత్మను ఎలా పరిశుద్ధపరుస్తుంది?

పరిశుద్ధాత్మ మన ఆత్మను ఎల వెలిగిస్తుంది, ఎల బ్రతికిస్తుంది.?

పరిశుద్ధాత్మ మనలను ఎల ముద్రిస్తుంది ?

అన్నటువంటి విషయాలలో యేసు రక్తం మన ఆత్మను ఎలా పరిశుద్ధ పరుస్తుంది అన్న అంశమును వాక్య ఆధారాలతో కూడిన ఆత్మీయ విశ్లేషణను ఈ పాఠంలో మనము చుద్ధాము

సృష్టి ఆరంభంలో మానవుని ఆత్మలో దేవుని స్వరూపం, ఆత్మ స్వభావం నిండుగా సమృద్ధిగా ఉంది

ఆదికాండము 1:26- 27

దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.

కానీ పాపం ద్వారా మానవుని ఆత్మ చచ్చిన స్థితికి దిగజారి పోయింది ఇది ఇప్పుడు దేవుని నుండి వేరుపడిన జీవితం.పరిశుద్ధుడైన దేవుడు పాపంతో ఎంత మాత్రం సర్దుబాటు చేసుకోడు అందుకే దేవుడు ఆదామును ఏదేని తోటలో నుండి వెళ్లగొట్టాడు

పరిశుద్ధమైన దేవుని స్వభావమును దేవుని ఆత్మ యొక్క పరిశుద్ధ గుణాన్ని మానవుడు ఆదాములోనే కోల్పోయాడు

మన ఆత్మకు రక్షణ కావాలంటే ఆదాములో పోయిన దేవుని స్వభావమును దేవుని గుణమును మనము మరల పొందాలి అని అంటే మనకు అవసరమైనది

1. పరిశుద్ధమైన యేసు రక్తం

2. వాక్యమై యున్న దేవుని వెలుగు,

3. అన్నిటిని జయించిన పరిశుద్ధాత్మ ముద్ర

ఇవి యేసు చెందించిన రక్తం ద్వార, జీవం కలిగిన జీవింపజేసే దేవుని వాక్యం ద్వార, విజయాన్ని ఇచ్చే దేవుని ఆత్మ అయిన పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతాయి.

1️⃣ ముందుగా దేవుని రక్తం మన ఆత్మను ఎలా పరిశుద్ధపరుస్తుంది? అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం

హెబ్రీయులకు 9:14

నిత్యుడగు ఆత్మ ద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ(మన, అని పాఠాంతరము) మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.

హెబ్రీయులకు 9:14 వాక్యం లోని "మనస్సాక్షి" అనే మాట

ఇక్కడ “మనస్సాక్షి” అంటే ఏమిటి?

యిది గ్రీకు మూల పదం: "మనస్సాక్షి"

మనం తప్పు చేసినప్పుడు మనలోనుంచి 'ఇది తప్పే' అనే బోధ స్పష్టంగా వినిపిస్తుంది. అదే – మనస్సాక్షి. ఇది మనలో ఉండే అంతర్గత ధ్వని. ఇది మంచి ఎమిటో, చెడు ఎమిటో అనే విషయాన్ని మనకే స్పష్టంగా చెప్పే మన లోపలి ధ్వని.మనకు అర్థం చేయించే బోధించే శక్తి, తీర్పునిచ్చే శక్తి."

ఉదాహరణకు:

మనం తప్పు చేసినప్పుడు మనలోంచి “ఇది తప్పే” అనే ధ్వని వినిపిస్తుంది కదా – అదే లోపలి బోధ తప్పు ఒప్పును గుర్తించ గలిగేటట్లు బోధించే అంతర్గత గుణం.

"ఇది మన మనస్సాక్షిలో ఉండే ఒక పనితీరు

ఇది మనస్సాక్షి యొక్క సహజ ధ్వని, అది లోపాన్ని గుర్తించే బోధ.”

మనస్సాక్షి అనేది మన ఆత్మలో ఉండి మనకు బోధించే ఒక శక్తి. మనం చేసే పనులకు అర్థం చెప్పే శక్తి. మనం మంచి చేసినా, చెడు చేసినా – ఇది మనకు తెలియజేస్తుంది. అంటే – ఇది మనకు మనము చేసే ఆచరణల అర్థాన్ని బోధించే మనలో వున్న అంతర్గత గుణం.ఇది మన తప్పును బయట వ్యక్తి కాకుండా మనల్ని మనం గుర్తించేందుకు దేవుడు ఇచ్చిన గొప్ప బోధక శక్తి.

పాపం చేయగానే మన ఆత్మలో ఉండే పరిశుద్ధత అలజడి చెందుతుంది — మనస్సాక్షి ద్వారా దేవుడు మనల్ని తిరిగి తనవైపు తిప్పుతాడు.

దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే, ఈ అంతర్గత ధ్వని – మనస్సాక్షి – పరిశుద్ధంగా ఉండాలి.

మనం పాపం చేసినప్పుడు లేదా దేవుని ఇష్టానికి విరుద్ధంగా చేసిన ప్రతి విషయాన్ని మనస్సాక్షి గుర్తిస్తుంది.మనం తిరుగుబాటు చేసిన ప్రతి చోటా అది మన మనను “అంతర్గతంగా విచారింపజేస్తుంది”

అది మంచిదైతే మనల్ని ధైర్యపరుస్తుంది, చెడిదైతే లోపాన్ని చూపిస్తుంది.ఈ విషయం అంతా మన అంతరంగంలోనే బాహ్య ప్రపంచానికి ఎవ్వరికీ తెలియకుండా జరుగుతుంది

అంటే దేవుడు మన అంతరంగములోనే ఒక న్యాయవ్యవస్థను ఏర్పాటు చేశారు

ఈ మనస్సాక్షిని దేవుడే మనలో ఉంచాడు

మంచి చెడు తీర్పు ఇచ్చేది కూడా మన మనస్సాక్షి

ఈ మనస్సాక్షి అనేది మనలో ఉండి మనకు తీర్పును ఇచ్చే అంతర్గత తీర్పుదారుడు.

మనస్సాక్షి = మనలోని తీర్పుదారుడు

క్రీస్తుయొక్క రక్తం = మన పాపములను కడుగుతూ, మనస్సాక్షిని పరిశుద్ధపరచే శక్తి

యేసు రక్తము ద్వారా కడగ బడని మనము చేసిన ఏ చిన్న తప్పిదమైన అవి మనస్సాక్షి మీద మచ్చలా మిగతాయి అందుకే మనం చేసేది తప్పు అని మనస్సాక్షి మనలను గద్దించినప్పుడు మనం వెంటనే దేవుని రక్తాన్ని ఆశ్రయించాలి

ఈ మనస్సాక్షిని మనం ఎలా శుద్ధి చేస్తాం

మనలను శుద్ధి చేసేది పరిశుద్ధుడైన యేసు రక్తం

1యోహాను 1:7 ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.

మనము ఇలా దేవుని విశ్వసించి అడిగినప్పుడు దాని వల్ల మన మనస్సాక్షి పరిశుద్ధంగా మారిపోతుంది

ఆత్మ – మనస్సు – మనస్సాక్షి” మధ్య సంబంధం

ఎమిటి?

మనస్సాక్షి అంటే ఏమిటి? ఇది ఆత్మలో భాగమా?

మనస్సాక్షి అనేది: మన ఆత్మ లోపలి ఒక భాగం

ఇది ఆత్మ మరియు మనస్సు మధ్య అనుసంధాన ప్రాంతం లాంటి స్వభావం కలిగినది

ఇది మనకు “తప్పు చేశావు” అని తెలిపే లోపలి ధ్వని

దీని బట్టి మనకు ఏమి అర్థం అవుతుంది అని అంటే

క్రీస్తుయొక్క రక్తం మన పాపాన్ని కడగడమే కాదు

మనలో ఉన్న తప్పు భావనను, అపవిత్రమైన మనస్సాక్షి ను కూడా శుద్ధి చేస్తుంది.

మనస్సాక్షి శుద్ధి అనేది ఆత్మ పరిశుద్ధతలో భాగం మనస్సాక్షి అనేది ఆత్మలో భాగమై పని చేస్తుంది

మనస్సాక్షి అనేది ఆత్మలో ఉన్న ముఖ్యమైన అవగాహన శక్తి కాబట్టి, క్రీస్తుయొక్క రక్తం ఆత్మను శుద్ధి చేస్తుంది అనే దానికి ఇది బలమైన ఆధారమే.

క్రీస్తుయొక్క రక్తం మన పాపమును కడగటమే కాదు, మనలోని అపవిత్రమైన మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తుంది. ఇది మన ఆత్మ పరిశుద్ధతకు ఆధారమై, దేవున్ని సేవించటానికి మనలను సిద్ధపరచే బలమైన కార్యం.

మనస్సాక్షి అనేది మన ఆత్మలో ఉన్న ఒక భాగం లాంటిదే. మనం పాపం చేసినప్పుడు అది కలుషితమవుతుంది — మనల్ని దేవునికి దగ్గరకి రానివ్వదు. కానీ క్రీస్తుయొక్క రక్తం మన పాపాలనే కాదు, మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తుంది. ఇది మన ఆత్మ పరిశుద్ధతకు సాక్ష్యం. మనస్సాక్షి శుద్ధి అయితేనే మనం ధైర్యంగా దేవున్ని సేవించగలము

అందుకే దేవుని వాక్యము మనకు ఇలాగ సెలవు ఇస్తుంది

2కోరింథీయులకు 7:1

ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.

మన మనస్సాక్షి యేసు రక్తముతో పరిశుద్ధ పరచబడకపోతే– అది దేవుని సమీపంలో నిలబడదు.దేవునితో కనెక్ట్ కాలేదు మన మనస్సాక్షి దేవుని సన్నిధిలో దేవునితో ఎంత పరిశుద్ధంగా కనెక్ట్ అవుతుందో అంతే బలంగా దేవుని నుండి మనకు జవాబులు వస్తాయి

మనస్సాక్షి దేవుడు మనకు ఇచ్చిన తీర్పుదారుడు. అది కలుషితమైతే మనం దేవునికి దగ్గరకురాలేం. అందుకే ప్రతి విషయంలో – ఎక్కడ తప్పు జరిగిందో మనం ఆ విషయాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడిగినప్పుడే మన మనస్సాక్షి పరిశుద్ధమవుతుంది. 1యోహాను 1:9

మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

దీనికి అర్థం ఏమిటంటే: క్రీస్తు యొక్క రక్తం మన ఆత్మ ను శుద్ధి చేస్తుంది. అది మన పాపాన్ని కడగటమే కాదు, దేవున్ని సేవించటానికి మనలను సిద్ధం చేస్తుంది.

ఇది ఆత్మ పరిశుద్ధతను నిర్ధారించే బలమైన ఆధారం 1యోహాను 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.

" పరిశుద్ధమైన యేసు రక్తం ద్వారా మనస్సాక్షి పరిశుద్ధత " అనే ముఖ్యమైన సత్యమును మన ఆత్మీయ పయనంలో మనకు మార్గదర్శకమైన ఒక పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం

మనస్సాక్షి దేవుడు మనలో ఉంచిన ఒక అద్భుతమైన పరికరంలా ఉంటుంది. అది మనం చేసిన మంచిని, చేడును అర్థం చేసుకునే అంతరంగిక గళం. ఈ పాఠంలో మనస్సాక్షి యొక్క పాత్రను, అది ఎలా పని చేస్తుందో, యేసు రక్తము ద్వారా మన మనస్సాక్షిని ఎలా పదేపదే పరిశుద్ధీకరించుకోవాలో పరిశీలించుదాం.

Written By: Sis.Esther Chrysolyte

Written On: 10-6-2025

Written By: Sis.Esther Chrysolyte

Written On: 10-6-2025