CHRYSOLYTE MINISTRIES

Sign Up

BIBLE CLASSES - SCRIPT

🟢📚 Foundational Bible Journey 📖❤

బైబిల్ పరిచయ పయనం

(దైవ సత్యాలపై ఒక ఆత్మీయ యాత్ర)

5 వ పాఠం

మనము ఈ రోజు Foundational Bible Journey లో Level – 1: మౌలిక సత్యాలు లో మొదటి అంశం

ఆయిన

1. దేవుడు ఎవరు? ఆయన స్వభావం ఏమిటి?

అనే అంశంలో, దేవుని గుణాలను — ఆయన పరిశుద్ధ స్వభావాన్ని గురించి మనం ఇప్పటికే తెలుసుకుంటున్నాం.

ఆత్మ అనే దేవుని గుణమును దేవుని స్వభావాన్ని మనము తెలుసుకోవటము గ్రహించడమే కాదు, ఆ స్వభావాన్ని మన జీవితంలో అనుభవించడమే నిజమైన ఆత్మీయ మైన మన ప్రయాణానికి ప్రారంభం అని చెప్పాలి

దేవుని ఆత్మ పరిశుద్ధమైనది ఈ పరిశుద్ధమైన దేవుని స్వభావమును దేవుని ఆత్మ యొక్క పరిశుద్ధ గుణాన్ని మనము పొందాలి అని అంటే మనలో ఉన్న ఆత్మ వాక్యమై ఉన్న దేవుని చేత పరిశుద్ధ పరచబడాలి

ఈ రోజు మనం ‘దైవ సత్యాలపై ఒక ఆత్మీయ యాత్ర’ అనే శీర్షికలో, 'వాక్యమైయున్న దేవుని వెలుగు' అనే ముఖ్య అంశాన్ని పరిశీలించబోతున్నాము.”

మునుపటి పాఠంలో పరిశుద్ధమైన యేసు రక్తం గురించి ధ్యానం చేసాము. ఈ రోజు, రెండవ అంశమైన వాక్యమైయున్న దేవుని వెలుగు మన ఆత్మను ఎలా పరిశుద్ధపరుస్తుందో తెలుసుకుందాం."

2. వాక్యమై యున్న దేవుని వెలుగు,

పరిశుద్ధమైన లక్షణము స్వభావము కలిగిన

పరిశుద్ధాత్మ చచ్చిన స్థితిలో ఉన్న మన ఆత్మను ఎలా వెలిగిస్తుంది?

ఎఫెసీయులకు 5:14

అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు.

వాక్యమై యున్న దేవుని వెలుగు, వాక్యము అను నామము కలిగిన క్రీస్తు ప్రభువారు ఎవరి హృదయాలలో ఆత్మలో వెలుగు కలిగేటట్లు వెల్లడి అవుతారో ప్రత్యక్ష పరచబడతారో వారి ఆత్మ ఇంకా పరిశుద్ధతను కోల్పోయిన మృతమైన స్థితిలో ఇక ఉండదు ( కీర్తనలు 119:130 నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును )

ఎఫెసీయులకు 5:14 లో వ్రాయబడినట్లు" నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము" ఈ వాక్య

ప్రకారము మానవుని ఆత్మ మృతమైన స్థితిలో ఉన్నదా ! అయితే ఎందులో మృతమైన స్థితిలో ఉన్నది ఈ విషయాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాం!

ఆదికాండము 2:17

అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.

అంటే ఆదాము ఆజ్ఞను ఉల్లఘించిన రోజు మరణిస్తాడు అని దేవుడు చెప్పారు. కానీ నిజంగా చూస్తే, అతను ఆ రోజు శరీరరీతిలో చనిపోలేదు. అయితే దేవుడు అబద్ధం మాట్లాడినట్టా? అలా కాదు. అయితే దీని అర్థం ఏమిటి?

ఆదాము చేసిన పాపానికి శిక్షగా వచ్చిన మరణం ఏ రకమైనదీ?" అంటే, శరీరమా? ఆత్మనా? లేక ఇంకేమైనా ఉందా?

దీని వెనుక ఉన్న సత్యం ఏమిటి?

పరిశుద్ధ గ్రంథము మూడు రకాల "మరణాల" గురించి మాట్లాడుతుంది:

1️⃣ ఆధ్యాత్మిక మరణం (Spiritual Death)

2️⃣ శరీర మరణం (Physical Death)

3️⃣ నిత్యమరణం (Eternal Death)

1️⃣ ఆధ్యాత్మిక మరణం (Spiritual Death) ఇప్పుడు మనము మొదటగా దీని గురించి తెలుసుకుందాం !

1️⃣ ఆధ్యాత్మిక మరణం (Spiritual Death)

దేవుని ఆజ్ఞను అతిక్రమించిన అదే రోజు ఆదాము దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయాడు. ఆదాము దేవుని సన్నిధికి దూరమయ్యాడు. ఏదేను తోట నుండి వెళ్ళ గొట్ట బడినాడు, ఇక్కడ మనము గుర్తించ వలసిన విషయం వుంది. ఆదాము

శరీరరీతిలో జీవించి ఉన్నా, దేవునితో ఉన్న అనుబంధాన్ని అన్యోన్య సహవాసమును కోల్పోయింది మొదట ఆత్మనే, అందుకే ఇది ఆదాము ఆత్మ సంబంధ మైన అత్మ కు కలిగిన మరణముగా చెప్పబడుతుంది, యిది ఆదాము ఆత్మకు వెంటనే కలిగిన ప్రత్యక్ష ప్రభావం.

అందుకనే యెషయా 59:2 లో దేవుని వాక్యం మనకు ఇలా సెలవిస్తోంది "మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు." దేవుడు మన ప్రార్థనలను ఆలకించాలన్నా దేవుని ముఖ దర్శనమును మనము చూడాలి అని అన్న పాపమును గురించి నీతిని గురించి వాక్యము ద్వారా మనలను ఓప్పింప జేసే పశ్చాత్తాపము లోనికి తీసుకొని వెళ్లగలిగే, మన ఆత్మ పరిశుద్ధమైన స్వభావాన్ని కలిగి ఉండగలటానికి అవసరమైన పరిశుద్ధాత్మ ఈ దేవుని ఆత్మ సహాయము మనకు కావాలి

* దేవునితో మనకు ఉన్న అనుబంధం సహవాసము పాపం వల్ల తెగిపోవడం – అంటే మన ఆత్మ "మరణం"నకు లోనైనట్టే.*

ఆదాము విషయంలోనూ ఇదే జరిగింది.

ఆ దినము నుండి ఆదాము సంతానమైన ప్రతి ఒక్కరు పాపులుగా, ఆత్మీయ మృతులుగానే పిలవబడుతున్నారు. దీనిని బలపరిచే వాక్యం

ఎఫెసీయులకు 2:1

మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.

మృతమైన జీవం లేని స్థితిలో ఉన్న మానవుల ఆత్మలను వెలిగించటానికి జీవింప చేయడానికి పరిశుద్ధమైన స్వభావమును ధరింప చేయటానికి ఆది నుండి ఉంటు దేవుని వద్ద నుండి ఈ లోకమునకు పంపబడిన వాక్యము అను నామము కలిగిన క్రీస్తు యేసు ప్రభువు వారి శరీరమును గురించి వివేచన అన్నది మానవునికి లేకపోతే కలిగే పరిణామము ఏమిటో 1కోరింథీయులకు 11:29,30 లో మనకు స్పష్టంగా కనపడుతుంది

ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.

ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునైయున్నారు; చాలమంది నిద్రించుచున్నారు.

దేవుని వాక్యం — దేవుని శరీరముగా మనకు జీవాన్ని కలిగించేదిగా ఉంది.

దానిని తగిన రీతిలో మనలను మనము సిద్ధపరచుకోకుండా ప్రత్యేకపరుచుకోకుండా మనము తీసుకోకపోయినా గ్రహించక పోయిన ఆత్మీయ మరణం అనేది తక్షణమే మన మీద ప్రభావం చూపుతుంది

మనలను పరిశుద్ధపరిచే వాక్యమనే ఈ శరీరములో మనము భాగస్వామ్యం కావడం ద్వారా పరిశుద్ధ స్వభావం మనలో పనిచేయడం ప్రారంభమవుతుంది. దీనిని గౌరవించకుండ, పరిశుద్ధతను విస్మరించి, వ్యంగ్యంగా తీసుకుంటే, అది శిక్షకు దారితీస్తుంది.

వాక్యమైయున్న దేవుడు — ఆయన శరీరములో మనం పాలు పంచుకొనడం ద్వారా పరిశుద్ధమైన స్వభావాన్ని మనలో పొందవచ్చు.

ఈ పరిశుద్ధతను గుర్తించకుండా, వివేచించకుండా దానిలో పాలు పంచుకునేవారు — ఆత్మీయంగా ఎందుకు మరణానికి గురవుతారు అని అంటే ఆదాములోనే ఆత్మసంబంధంగా మృతమైన స్థితిని కలిగి ఈ లోకంలో శరీర రీతిగా జన్మిస్తున్న ప్రతి ఒక్కరిని మృతమైన వారి ఆత్మలను వెలిగించటానికి జీవింప చేయటానికి పరిశుద్ధమైన ఆత్మ గుణమును పరిశుద్ధమైన ఆత్మ స్వభావమును నిత్యజీవాన్ని మానవుల ఆత్మలకు ప్రసాదించటానికి వాక్యము అను నామము కలిగిన యేసుక్రీస్తు ప్రభువు వారు మానవుల కొరకు పరలోకము నుండి ఈ లోకమునకు వాక్యము అను వెలుగుగా దిగివచ్చారు కాబట్టి,

ఈరోజు ఈ పాఠంలో వాక్యమై ఉన్న వెలుగు అనే అంశం మనకు ఏమీ తెలియచేస్తుంది అని అంటే

వాక్యమైయున్న దేవుని వెలుగు మృతమైన మన ఆత్మను మేల్కొలుపుతుంది.

దాని పరిశుద్ధతను గ్రహించి, గౌరవించి, దానిలో భాగస్వామ్యం కలిగి మనము జీవించేటప్పుడు — మన ఆత్మలో జీవం వస్తుంది.

ఇదే మన నిజమైన ఆధ్యాత్మిక పునరుత్థానం.

వాక్యమైయున్న దేవుని వెలుగు” అనే ఈ పాఠంలో, మన ఆత్మియ ప్రయాణం పరిశుద్ధత వైపు ఎలా జరగాలి అనే అంశాన్ని లోతుగా పరిశీలించాము. ఆదాములో మనకు ఆత్మియ మరణం ఎలా సంభవించిందో, ఆ మృత స్థితిలో నుండి మనలను వెలిగించేందుకు దేవుని వాక్యం మన హృదయాల్లో ఎలా ప్రకాశించాలో వివరించబడింది. వాక్యము ద్వారా వెలుగు కలుగుతుందని కీర్తనలు 119:130 ప్రకారం, క్రీస్తు ద్వారా మాత్రమే మన ఆత్మ పరిశుద్ధత పొందగలదని ఈ పాఠం స్పష్టపరుస్తుంది. దేవుని శరీరములో పాలు పంచుకునేటప్పుడు విశ్వాసులు పరిశుద్ధతతో, వివేచనతో చేయవలసిన దానిని కూడ ఈ పాఠం మేల్కొల్పుతుంది.

ఈ పాఠం ద్వారా మనం గ్రహించాల్సిన ముఖ్య విషయము: వాక్యమైయున్న క్రీస్తు వెలుగే మన ఆత్మకు జీవము.

Written By: Sis.Esther Chrysolyte

Written On: 11-6-2025