CHRYSOLYTE MINISTRIES

Sign Up

BIBLE CLASSES - SCRIPT

🟢📚 Foundational Bible Journey 📖❤

బైబిల్ పరిచయ పయనం

(దైవ సత్యాలపై ఒక ఆత్మీయ యాత్ర)

6 వ పాఠం

ఈ రోజు మనము Foundational Bible Journey లో పరిశుద్ధ గ్రంథమును మనము ధ్యానం చేయడానికి అందులోని సత్యాలను మనం తెలుసుకోవటానికి పరిశుద్ధ గ్రంథమును 20 అంశాలుగా విభజించి ఈ 20 అంశాలను లెవెల్ వన్ లెవల్ టు లెవల్ త్రీ గా మనము ఇందులో ఉన్న సత్యాలను మనము పరిశీలిస్తూ వస్తున్నాము

Level – 1: మౌలిక సత్యాలు లో మొదటి అంశం

ఆయిన

1. దేవుడు ఎవరు? ఆయన స్వభావం ఏమిటి?"

అన్న అంశములో 14 రకాలైన దేవుని గుణాలు దేవుని స్వభావాలలో మొదటి దేవుని గుణము దేవుని స్వభావం అయిన ఆత్మను గురించి మనం తెలుసు కుంటు పరిశుద్ధ గ్రంథమును మనము ధ్యానిస్తూ వున్నాము!

దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మన ఆత్మను మూడు రకలుగా పరిశుద్ధపరుస్తుంది

1. పరిశుద్ధమైన యేసు రక్తం

2. వాక్యమై యున్న దేవుని వెలుగు,

3. అన్నిటిని జయించిన పరిశుద్ధాత్మ ముద్ర ద్వార

ఆత్మ అనే దేవుని గుణమును దేవుని స్వభావాన్ని మనము తెలుసుకోవటము గ్రహించడమే కాదు, ఆ స్వభావాన్ని మన జీవితంలో అనుభవించడము దాని ప్రకారము నడవటమే నిజమైన క్రైస్తవ జీవితములో ఆత్మసంబంధంమైన ప్రయాణానికి ప్రారంభం అని చెప్పాలి

దేవుని ఆత్మ పరిశుద్ధమైనది ఈ పరిశుద్ధమైన దేవుని స్వభావమును దేవుని ఆత్మ యొక్క పరిశుద్ధ గుణాన్ని మనము పొందాలి అని అంటే మనలో ఉన్న మృతమైన ఆత్మ అన్నిటిని జయించిన పరిశుద్ధాత్మ ద్వార ముద్రింప బడాలి జీవాన్ని పొందాలి

ఈ రోజు మనం ‘దైవ సత్యాలపై ఒక ఆత్మీయ యాత్ర’ అనే శీర్షికలో, అన్నిటిని జయించిన పరిశుద్ధాత్మ ముద్ర" అనే ముఖ్య అంశాన్ని పరిశీలించ బోతున్నాము.” మునుపటి పాఠలలో పరిశుద్ధమైన యేసు రక్తం గురించి,వాక్యమై యున్న దేవుని వెలుగు గురించి, ధ్యానం చేసాము. ఈ రోజు, మూడవ అంశమైన

"అన్నిటిని జయించిన పరిశుద్ధాత్మ ముద్ర" ను గురించి ఈ పరిశుద్ధాత్మ మన ఆత్మను ఎలా పరిశుద్ధపరుస్తుందో తెలుసుకుందాం."

మూడవ భాగమైన "పరిశుద్ధాత్మ ముద్ర" ఇది లేకుండా క్రైస్తవ జీవితం అసంపూర్ణం అనే సత్యమును ఇప్పుడు మనము పరిశీలిద్దాం

ఈ లోకంలో మనము ఏదైనా ఒక వస్తువును కొన్నప్పుడు ఆ వస్తువును ఎవరు తయారు చేశారు అన్న వివరాలను మనం చూస్తాం దానిమీద తయారు చేసిన వాళ్ల ముద్ర ఉన్నదా లేదా! అని మనము చూస్తాం అలానే మానవుడు ఈ లోకంలో నిర్మించబడ్డాడు అని అంటే కారణం దేవుడు, కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆదాము శరీరం ఆత్మ మరణించబడ్డది అందుకే పరిశుద్ధ గ్రంథం మూడు మరణాలను గురించి మనకు తెలియజేస్తూ ఉంది

ఆదాములో జన్మించిన ప్రతి మానవుడు కూడా ఈ మూడు మరణాలను ఎదుర్కోవాలి

మానవ జీవితానికి సంబంధించిన మూడు మరణాలు:

1. శరీర మరణం (Physical Death):

ఇది మన శరీరం ఈ లోక సంబంధమైన జీవితం నుండి విడిపోయే ప్రక్రియ (ఆదాముని పాపం ద్వారా వచ్చిన శాపం). హెబ్రీయులకు 9:27

మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.

ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి మరణించబడాలి. ఎందుకు అంటే ఆదాము చేసిన పాపం వలన శాపంగా మరణం అన్నది మానవుని శరీరంలో ఈ లోకంలో ప్రవేశించింది

1యోహాను 2:16

లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.

ఆదికాండము 3:5 - 6

ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచి దియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమై నదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలము లలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను;

ఈ లోకములో ఉన్న శరీరాస, నేత్రాస, జీవపుడంబము అనే మనుషులలో వున్న ఈ మూడు గుణాలు సృష్టి ఆరంభము నుండే అప్పటినుండే ప్రారంభమయ్యాయి . ఇవి దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ఆది మానవులు అయిన ఆదాము – హవ్వలలోనే మొదలయ్యాయి. వారు చేసిన పనివల్ల పాపం అనేది మానవ స్వభావంలోకి ప్రవేశించింది. అందుచేత, ఈ మూడు ఆశలు ఆదాములో జన్మించిన ప్రతి ఒక్కరిలో స్వభావంగా ఒక గుణముగా మారిపోయాయి.

నేత్రాశ

మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, ఇక్కడ వారు ఆ ఫలాలను తిన్న వెంటనే "నేత్రాశను కలిగించే టట్లు వారి కన్నులు తెరవబడ్డాయి"

శరీరాశ

"మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై"

మంచి – చెడు" అనే జ్ఞానం ఎలా వచ్చింది అని అంటే

ఆదాము హవ్వలు ఆఫలాలను తినటం వలన ఆ జ్ఞానం కలిగింది కాబట్టి అది శరీర సంబంధమైన జ్ఞానం వలన శరిరాస అనేది ఇక్కడ నుండి మొదలైంది ఇది శరీర సంబంధమైన (భౌతిక) విజ్ఞానానికి, తప్పు ఒప్పు ఏమిటో నిర్ణయించుకునే గ్రహించే దానికి సంబంధించిన జ్ఞానం,కాని ఇది పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చే ఆత్మ సంబంధమైన జ్ఞానం కాదు.ఇది ఈ లోక సంబంధమైనదే

"జీవపుడంబము"

దేవతలవలె ఉందురనియు•••• వారు ఉన్నదానికంటే గొప్ప స్థాయిని ఆశించడం ఇది జీవపు డంభము అనేది ఇక్కడి నుండే ప్రారంభమైంది

ఈ మూడు కూడా ఈ లోకంలోనివే సాతాను నుంచి కలిగినవి ఇవి ఏదేను వనములోనే ఆది మానవులలోనే ప్రారంభమైనవి వారి నుంచి వారి శరీరం నుండి జన్మించిన ప్రతి ఒక్కరిలో ఈ మూడు గుణాలు ఈ మూడు స్వభావాలు ఉన్నవి

ఆదాము హవ్వలను దేవుడు సృజించినప్పుడు "సిగ్గు భయము దిగంబరత్వము అంటే ఏమిటో తెలియని పసిపిల్లలకు వుండే లక్షణాలను కలిగిన పరిశుద్ధమైన స్వభావము పరిశుద్ధమైన గుణాలు వారిలో ఒక పరిశుద్ధాత్మ పరిశుద్ధమైన సన్నిధి అన్నీ ఉన్నాయి కానీ పరిశుద్ధమైన ఆ ముద్రను సాతాను ద్వార వారు కోల్పోయారు "అంటే వారి శరీరము పరిశుద్ధత విషయంలో మరణానికి లోనైంది ఇదే శరీర మరణం" అందుకే పుట్టిన ప్రతి వ్యక్తి మరణించబడాలి

ఆదికాండము 3:19

నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.

అందుకే ఆదాములో ఆదాము నుండి జన్మించిన ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో ఉన్న శరీరాస,నేత్రాశ జీవపుడంబము,జయించలేక మరణానికి లోనవుతూ వచ్చారు

మానవుని కొరకు ఈ లోకము ఈ లోకంలో ఉన్న సమస్తము సృష్టించిన దేవుడు మానవుడు దేనినైతే జయించలేకపోతు వచ్చాడో దానిని పరిశుద్ధాత్మ ద్వారా మానవుడు జయించాలని పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భంలో నిర్మించబడి పరిశుద్ధాత్మ ద్వారా మానవుడు జయించలేని శరీరాస,నేత్రాశ జీవపుడంబమును దాని ద్వారా కలిగే మరణమును కూడా జయించి తనయందు విశ్వాసముంచిన ఉంచుతున్న ఉంచ బోతున్నా ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యంలో తనలో పాటు కూర్చుండబెట్టి నారు

ఎఫెసీయులకు 2:7

క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోకమందు ఆయనతో కూడ కూర్చుండబెట్టెను.

ప్రస్తుతం మనము ఈ లోకంలో ఉన్నమన కొరకు సమస్తాన్ని జయించిన క్రీస్తునందు మనము విశ్వాసముంచినప్పుడు ఆ క్షణంలోనే పరలోక రాజ్యంలో క్రీస్తులో మనము కూర్చుండ బెట్టబడిన వారమయ్యాము అందుకే యేసు క్రీస్తు ప్రభువు వారి

యందు ఎవరు విశ్వాసముంచుతారో వారి మీద దేవుడు పరిశుద్ధాత్మ అనే ముద్రను కచ్చితంగా వేస్తాడు

పరిశుద్ధాత్మ ముద్ర అన్న సందేశము మనకు ఏమి తెలియజేస్తుంది అని అంటే

ఆజ్ఞాతి క్రమం ద్వారా మృతమైన మానవుని ఆత్మ క్రీస్తు యేసు లో మరల వెలిగించబడ్డది

అపరాధముల చేతను పాపముల చేతను శరీర మరణంను కలిగిన మానవుని శరీరము దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ముద్ర ద్వారా శరీర సంబంధమైన ప్రతి దానిని జయించింది జీవించే జీవముగల మహిమ శరీరమును ధరించింది

నిత్య మరణం (Eternal Death):

ఇది దేవుని నుండి మనము శాశ్వతంగా విడిపోవటాన్ని ఇది సూచిస్తుంది జీవితాంతం మారుమనస్సు లేకుండా, క్రీస్తును తిరస్కరించినవారికి ఇది ఎదురవుతుంది.

ప్రకటన గ్రంథం 20:14

మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.

ఈ రెండవ మరణము మానవులకు రాకుండా పరిశుద్ధాత్మ పాపమును గురించి నీతిని గురించి మానవులను ఒప్పింపజేస్తూ క్రీస్తు యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన వారిని పరిశుద్ధాత్మ అనే ముద్రను వేసిఅగ్నిగుండము నుండి నిత్య నరకము నుండి రక్షిస్తూ దేవుడు ఇచ్చే రక్షణకు నిత్య జీవానికి గుర్తుగా క్రీస్తు యేసు ప్రభువు వారిని విశ్వసించిన ప్రతి ఒక్కరి మీద ఈ పరిశుద్ధాత్మ ముద్రగా ఉంచబడుతుంది

మృతమైన జయించలేని మానవుని ఆత్మ మీద దేవుని ఆత్మ అన్నిటిని జయించిన పరిశుద్ధాత్మ ముద్ర అన్నది ఉన్నప్పుడే క్రైస్తవ జీవితానికి సంపూర్ణత కలుగుతుంది లోకమును లోకంలో ఉన్న శరీరాశ నేత్రాశ జీవపు డంబము, సాతానును మరణమును జయించి మహిమ శరీరము ధరించి యుగయుగాలు పరిశుద్ధుడైన దేవునితో ఉండే భాగ్యాన్ని కలిగి ఉండటానికి అవసరమైన పరిశుద్ధాత్మ అనే ముద్రను మీరు కలిగి ఉన్నారా ! లేకపోతే ఈ రోజే ఈ పరిశుద్ధాత్మ అనే ముద్ర మీ మీద వేయా భడటానికి దేవుని ప్రార్థించండి