BIBLE CLASSES - SCRIPT
🟢📚 Foundational Bible Journey 📖❤
బైబిల్ పరిచయ పయనం
(దైవ సత్యాలపై ఒక ఆత్మీయ యాత్ర)
7 వ పాఠం
ఈ రోజు మనము Foundational Bible Journey లో పరిశుద్ధ గ్రంథమును మనము ధ్యానం చేయడానికి అందులోని సత్యాలను మనం తెలుసుకోవటానికి పరిశుద్ధ గ్రంథమును 20 అంశాలుగా విభజించి ఈ 20 అంశాలను లెవెల్ వన్ లెవల్ టు లెవల్ త్రీ గా మనము ఇందులో ఉన్న సత్యాలను మనము పరిశీలిస్తూ వస్తున్నాము
Level – 1 లో 8 అంశాలను
Level – 2 లో 8 అంశాలను
Level – 3 లో4 అంశాలను మొత్తం 20 అంశాలుగా విభజించి పరిశుద్ధ గ్రంథమును మనము ధ్యానం చేస్తూ ఉన్నాం
Level – 1: మౌలిక సత్యాలు లో మొదటి అంశం
ఆయిన
1. దేవుడు ఎవరు? ఆయన స్వభావం ఏమిటి?"
అన్న అంశములో 14 రకాలైన దేవుని గుణాలు దేవుని స్వభావాలలో మొదటి దేవుని గుణము దేవుని స్వభావం అయిన ఆత్మను గురించి మనం తెలుసు కుంటు పరిశుద్ధ గ్రంథమును మనము పరిశీలిస్తూ వున్నాము!
పరిశుద్ధమైన దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మన ఆత్మను
పరిశుద్ధ పరచాలి, ఎందుకు యిల అంటే ఆదాములో మన ఆత్మ దేవుని పరిశుద్ధతను కోల్పోయింది, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నది, కనుక క్రీస్తు యేసు ప్రభువు వారు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చారు. పాపమునకు లోబడే ఆదాము శరీర స్వభావం కాక పరిశుద్ధాత్మ చేత పాపమును జయించే పరిశుద్ధమైన శరీరాన్ని తాను పొంది పరిశుద్ధమైన తన ఆత్మ చేత మానవుని ఆత్మను వెలిగించారు, మానవుని ఆత్మను పరిశుద్ధపరిచారు, ఆపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న మానవుని ఆత్మకు విజయాన్ని ఇచ్చారు, క్రీస్తు యేసు ప్రభువు వారు మానవుని ఆత్మను పరిశుద్ధపరిచే ఈ క్రియను ముఖ్యముగా మూడు రీతులుగా చేశారు
1. పరిశుద్ధమైన యేసు రక్తం చేత
2. వాక్యమై యున్న దేవుని వెలుగు, చేత
3. అన్నిటిని జయించిన పరిశుద్ధాత్మ ముద్ర అనే పరిశుద్ధాత్మ పరిశుద్ధమైన తన ఆత్మ చేత ఇలా మూడు రకలుగా మనలను పరిశుద్ధపరచారు అని ఇప్పుటి వరకు మునము తెలుసు కున్నాము
ఆత్మ అనే దేవుని గుణమును దేవుని స్వభావాన్ని మన అత్మ తెలుసుకోన్న తరువాత, గ్రహించిన తరువాత, ఆ స్వభావాన్ని ఆ గుణమును ఆధారం చేసుకోని జీవించటం మొదలు పెడితే అదే ఆత్మ సంబంధమైన జీవితం, ఆత్మలో ఆత్మసంబంధంగా నడవడం అని దానిని అంటారు, ఇదే నిజమైన క్రైస్తవ జీవితములో ఆత్మసంబంధంమైన ప్రయాణానికి ప్రారంభం అని చెప్పాలి.
దేవుడు మానవుని సృష్టించిన ఉద్దేశం దీని కొరకే, పరిశుద్ధముగా దేవునితో సహవాసం చేస్తూ,
ఈ శరీర సంభందమైన జీవితంలోనే, పరిశుద్ధమైన మన అత్మ సంభందమైన జీవితమును, ఎల నడిపించుకోవాలో, మన ఘాటమును ఎల పరిశుద్ధముగా ఉంచుకోవాలో, నడిపించుకోవాలో, కాపాడు కోవాలో, తెలిసి వుండటమే అత్మకు లోభడిన జీవితం అది అత్మాను సారముగా నడవటం నడిచే విషయం !
ఈ రోజు మనం ‘దైవ సత్యాలపై ఒక ఆత్మీయ యాత్ర’ అనే శీర్షికలో, పరిశుద్ధాత్మలో ఎలా నడవాలి, దేవుని ఆత్మ ద్వారా మనము ఎలా నడిపించబడాలి, అనే ముఖ్యమైన అంశాన్ని మనము పరిశీలించ బోతున్నాము.
దేవుని ఆత్మతో మనము నడిపించబడాలి, అని అంటే ఈ ఆత్మ మనకు ఎలా సహాయం చేస్తుంది, అసలు ఈ ఆత్మ అనేది మనకు ఏ రూపంలో దొరుకుతుంది, అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం !
"దేవుని మాటలు ఆత్మయు జీవమునై యున్నవి"
యోహాను 6:63
ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి గాని ఈ దేవుని మాటలు ఆత్మ మరియు జీవాన్ని కలిగి ఉన్నవి అని స్పష్టంగా ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది
"వాక్యములో దేవుని ఆత్మ ఉంది",
దేవుని వాక్యాన్ని చదవడం అనేది ఒక సమాచారమును తెలుసుకునే పని కాదు – అది దేవుని ఆత్మతో అనుసంధానమైన, దేవుని ఆత్మతో కలిసే అనుభవం, మనము దేవుని వాక్యము చదువుతూ ఉన్నప్పుడు వాక్యంతో పాటు పరిశుద్ధాత్మ మనలో నివసించ గలుగుతుంది.
మనం వాక్యాన్ని చదివినంత మాత్రాన మనకు జీవం రాదు.ఆత్మతో కలిసి ఉన్న వాక్యాన్ని తీసుకున్నప్పుడే అది జీవాన్ని ఇస్తుంది
దేవుని వాక్యాములో వున్న మీలితమై వున్న ఆత్మతో దానిని ఆ వాక్యమును గ్రహించటము వలన ఆది మనకు జీవమనే స్పందనను తెస్తుంది — మనలోను, మన ద్వారా ఇతరులలోను కూడ.
దేవుని వాక్యం ఆత్మకు జీవమునకు ఈ రెండింటికి మధ్య బ్రిడ్జ్ కాదు. అది స్వయంగా జీవం కలిగిన దేవుని స్పర్శ. దేవుని వాక్యము దేవుని ఆత్మతో కలసి ఉన్నదిగా మనం గ్రహించాలి.
ఆత్మ + జీవం = వాక్యము
దేవుని వాక్యము ఇది మానవ జ్ఞానం గల పదజాలం కాదు. ఇది జీవాన్ని యిచ్చే దేవుని స్వరము.
దేవుని వాక్యం మాటల శబ్దం కాదు. దేవుని వాక్యం జీవం కలిగినది. ఆ జీవాన్ని మనలో తీసుకుని వచ్చేది, ఆ జీవంతో నడిపించేది, దేవుని పరిశుద్ధాత్మ లేకుండా ఆత్మ లేని వాక్యం పుస్తకం మాత్రమే అవుతుంది. ఆత్మతో కలిసి చదివితే అది మార్పు కలిగించే జీవ వాక్యమవుతుంది. ఆత్మయు జీవమునై యున్న దేవుని వాక్యమును మనం చదువుతూ ఉన్నప్పుడు అది మనలో జీవంగా మారుతుంది. అజీవము మనలను నడిపిస్తుంది
ఈ వాక్యాన్ని నిజంగా ఎవరు హృదయపూర్వకంగా గ్రహిస్తారో వారు దీనిని అర్థం చేసుకుంటారు,ఇది గ్రహించినవారు ఇక "చదివే" వారు కాదు – వారు"నడిచే" వారే అవుతారు! ఇదే ఆత్మలో నడవడం ఆత్మ నడిపింపు అని అంటే
యోహాను 14:23
యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు
నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానియొద్ద నివాసము చేతుము.
ఈ మాటలకు అర్థం ఇదే ఆత్మతో కూడిన దేవుని వాక్యమును మనము ధ్యానిస్తు ఉన్నప్పుడు ఆత్మ స్వభావము కలిగిన ఆత్మ గుణం కలిగిన దేవుడు మనలో ఉండి మనలను నడిపిస్తాడు దీనిని దేవుని ఆత్మ నడుపుదల అని అంటారు
మత్తయి 7:24
కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.
ఈ వాక్యంలో యేసు ప్రభువు తన మాటలను వినడం మాత్రమే కాక, వాటినిబట్టి నడచుటయే వివేక వంతుడైన మనిషి లక్షణంగా చెప్పారు.
దేవుని వాక్యమును ఆత్మీయ జీవమునై యున్న దేవుని మాటలను మనము విని గైకొన్నప్పుడు వాటి ప్రకారము చేసినప్పుడు బుద్ధి వివేకములను ఇచ్చు దేవుని ఆత్మ మనలో ఉండి మనలను నడిపిస్తుంది
ఎప్పటికీ చెదరని బండ మీద ఉన్న ఇల్లులాగా మన ఆత్మీయ జీవితమును స్థిరపరుస్తుంది
పాత నిబంధనలో దేవుని ఆజ్ఞలు కలిగిన మందసమును మొసిన యాజకుల పాదాలను దేవుడు ఘనపరిచాడు మందసం ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు మందసం ఉన్నచోట దేవుడు విజయాన్ని ఇచ్చాడు ఎందుకు అంటే ఈ మందసంలో దేవుని మాటలు దేవుని వాక్కులు ఆజ్ఞలుగా ఉన్నవి కాబట్టి
అందుకే పాత నిబంధనలోనైన క్రొత్త నిబంధనలో అయినా దేవుడు తాను చెప్పిన ఆజ్ఞలకు వాక్కులకు అత్యధికమైన ప్రాముఖ్యతను ఇచ్చిన కొన్ని వాక్కులు
ద్వితియోప 6:6-9
నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.నీవు నీ కుమా రులకు వాటిని అభ్యసింప జేసి, నీ యింట కూర్చుండునప్పు డును త్రోవను నడుచునప్పుడును పండుకొను నప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచ నగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను. నీ యింటి ద్వార బంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను.
నిర్గమకాండము 13:9
యెహోవా ధర్మ శాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులోనుండి నిన్ను బయటికి రప్పించెనను టకు, ఈ ఆచారము నీ చేతిమీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును.
నిర్గమకాండము 13:16
బాహు బలముచేత యెహోవా మనలను ఐగుప్తులోనుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతిమీద సూచన గాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పెను.
పాత నిబంధనలో దేవుని మాటలను దేవుని వాక్కులను దేవుని ఆజ్ఞలను బాహ్య సంబంధమైన వాటి మీద వాటిని వ్రాసి ఉంచేవారు
క్రొత్త నిబంధనలో ఈ దేవుని మాటలు ఈ దేవుని ఆజ్ఞలు ఈ దేవుని వాక్యము ఆత్మతో కూడా మిళితమై ఉన్నాయి అందుకే దేవుని ఆత్మతో మనము నడిపించబడటానికి ఈ దేవుని వాక్యము మనలో ఉండాలి మన హృదయములో స్థిరమై నిలవాలి అప్పుడే
యోహాను 15:7 వ వచనములో ఉన్న ఈ వాక్కులు
నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచి యుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును ఆని వున్న ఈ వాక్కులు మన జీవితంలో నెరవేరుతాయి
దేవుని స్వరూపం అయినా ఆత్మ స్వభావములో దేవుని వాక్యము దేవుని మాటలు దేవుని ఆత్మతో మిళితమై ఉన్నవి అన్న ఈ 6 వ పాఠం మనకు ఏమి తెలియజేస్తుంది అని అంటే
దేవుని చేతివ్రాతతో వ్రాసిన ఆజ్ఞలను మోషే కొండమీద నుంచి క్రిందకి విసిరి వేయాల్సి వచ్చిన సందర్భం దేవుని ఆత్మ స్వాధీనంలో లేని స్థితిని,ఆత్మ ఫలాలలో స్థిరపడని స్థితిని, దేవుని శిక్ష ద్వారా దేవుని శాపం ద్వారా శరీరానికి కలిగిన కోపమనే శరీరసంబంధమైన ఫలము ద్వార నడిపించ బడిన మోషే స్థితిని చూపెడుతూ ఉన్నదేవుడు మానవుని విడిచిపెట్టలేదు తన కరణతో ఆ ఆజ్ఞలు మరళ దేవుని వాక్యంగా దేవుని ఉనికిగా దేవుని సన్నిధిగా, మందసములో ఉంచబడినవి.
ఆదాము ఆజ్ఞాతిక్రమం ద్వార దేవుని ఆత్మ, జీవాన్నిచ్చే పరిశుద్ధ మైన ఆత్మ, ఆదాము నుంచి జన్మించబడిన ప్రతి మానవుని ఆత్మ సంబంధమైన జీవితములో నుంచి తొలగించబడింది
కానీ పరిశుద్ధాత్మతో నిర్మించబడిన యేసుక్రీస్తు ప్రభువు వారు – ప్రతి పాపాన్ని జయించి, పరిశుద్ధతతో జీవించి, తన పునరుత్థాన శక్తితో, పరిశుద్ధాత్మను మనకొరకు పంపారు తనను విశ్వసించే ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రజలనుగా ముద్రించు కున్నారు.
ఈ పరిశుద్ధాత్మ ఇప్పుడు దేవుని వాక్యాన్ని జీవంగా మార్చి, మన హృదయాల్లో స్థిరపడి, మనలను నడిపించడానికి దేవుని చేత పరలోకము నుండి ఈ భూమి మీదఉన్న మన యొద్దకు పంపబడింది.
ఆదాములో కోల్పోయిన ఆత్మ నడిపింపును, క్రీస్తులో మనము తిరిగి పొందుతున్నాము.
అందుకే – వాక్యములో ఉన్న ఆత్మను, ఆ ఆత్మలో ఉన్న జీవాన్ని, ఆ జీవం ద్వారా వచ్చే నడిపింపును మనము గ్రహించాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం. అదే ఆత్మసంబంధమైన ప్రయాణం. అదే దేవుని వాక్యాన్ని ఆత్మతో కలిపి, జీవంగా స్వీకరించే జీవన పద్ధతి.

Written By: Sis.Esther Chrysolyte
Written On: 14-6-2025
Written By: Sis.Esther Chrysolyte
Written On: 14-6-2025