CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🦅అంతరిక్షమున పక్షిరాజు జాడ,🦅

సామెతలు 30:18 --19

నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ,

బండమీద సర్పము జాడ, నడిసముద్రమున ఓడ నడచుజాడ, కన్యకతో పురుషుని జాడ.

1.అంతరిక్షమున పక్షిరాజు జాడ,🦅

పక్షిరాజు గ్రద్ధ ఉన్నతమైన ఆకాశంలో ఎగురుతుంది అది ఎత్తైన కొండలపై నివసిస్తుంది, అలసిపోదు, – కాని అది వెళ్లిన దాని మార్గం ఆ జాడ మనకు కనిపించదు. దాని కళ్ళల్లో దూరాన్ని చేదించే శక్తి ఉంటుంది కొండలు దాటి మైలు దూరంలో ఉన్న తన ఆకలిని ఆహారమును అది ముందుగానే గుర్తించగలదు

దాని కళ్లల్లో ఒక అద్భుతమైన శక్తి ఉంది – అది మైళ్ళ దూరంలో ఉన్న తన ఆహారాన్ని, తన అవసరాన్ని ముందుగానే గమనించగలదు. అది దానికవసరమైన దానిని గుర్తించగలదు – ఎక్కడ ఉందో చూడగలదు – ఒక దాని మీద దృష్టి పెట్టి ఎగిరిపోతుంది.

గ్రద్ద పక్షిరాజు ఆకాశం పైకి ఎగురుతుంది పైనున్న వాటి కొరకు ఉన్నతమైన వాటి కోసం ఉన్నతమైన అంతరిక్షంలో తాను ఎగురుతు ఉంటుంది తాను తన గమ్య స్థానాన్ని చాలా దూరం నుంచే కనిపెడుతుంది అంటే తన లక్ష్యం ఏమిటి అన్న విషయమును తాను తన లక్ష్యాన్ని దూరం నుంచే గుర్తిస్తుంది

సామెతలు 30:18–19 ప్రకారం మన బుద్ధికి మించిన జాడలలో ఒకటి – పక్షిరాజు అంతరిక్షమున ప్రయాణించిన దారిని మనం కనుగొనలేము.

అంతరిక్షమున పక్షిరాజు జాడ,ఎక్కడుందో మనకు కనపడదు కానీ దీని జాడను పరిశుద్ధ గ్రంధం మనకు తెలియజేస్తుంది.

యెషయా 40:31

" యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు."

పక్షిరాజు యొక్క ప్రవర్తన

గ్రద్దలు సాధారణ పరిస్థితుల్లో అంత ఎత్తుకు ఎగరవు; కానీ తుఫానుల సమయంలో గాలి దూకుడు వస్తే, దానిని వాడుకొని అవి ఎంతో ఎత్తుకు వెళ్తాయి. యివి తుఫానును ఎదుర్కొంటాయి, దానిని తప్పించుకోకుండానే. తుఫాను గాలుల వల్ల ఏర్పడే ఎత్తు గల గాలి ప్రవాహాన్ని వాడుకుంటూ, అవి అత్యున్నత ఆకాశానికి పైకి ఎగిరిపోతాయి.

ఇది ఇతర పక్షులకంటే విభిన్నంగా ఉంటుంది. చాలా పక్షులు తుఫాను నుంచి దాక్కుంటాయి, కానీ గ్రద్దలు దానిని అవకాశంగా మలచుకుంటాయి.

పక్షిరాజుకి ప్రకృతి వలన ఆపద అనేది కలిగినప్పుడు,

తనకు కలిగిన ఆపద వలన తనను తాను రక్షించుకోలేని, కాపాడుకోలేని, బలము సామర్థ్యం శక్తి, తనలో లేని కారణంగా, అది తనను రక్షించుకోవడం కొరకు, ఆకాశం పైకి ఎగురుతుంది.

ఈ పక్షిరాజు జాడ మనకు ఏమి తెలియజేస్తుంది, అని అంటే, మనకు సమస్యలు వచ్చినప్పుడు, వాటిని జయించలేని, శక్తి సామర్థ్యము బలము మన దగ్గర లేనప్పుడు, ఆకాశమందు ఆసీనుడైన యెహోవా దేవుని వైపు మన చేతులు చాచి ప్రార్థించాలి.

"యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు".

ఈ వాక్యమే మనకు పక్షిరాజు జాడను తెలియ జేస్తుంది, మనము క్రింద ఉన్నాము, ఆకాశము మన కంటే ఎత్తుగా పైన ఉంది.

మానవులందరూ భూసంబంధ మైన వారే, ప్రతి మానవుని భూ సంబంధమైన శరీరంలో ఉన్న లక్షణాలు, గలతియులకు 5:19-- 22

శరీర కార్యములు స్పష్టమైయున్నవి;.

అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి.

వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు, దేవుని రాజ్యమును స్వతంత్రించు కొనరని, మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

దేవుని రాజ్యము పరిశుద్ధమైనది, ఇది అన్నిటిని జయించే రాజ్యం, జయ జీవితమును ఇచ్చే రాజ్యం, ఇది ఇటువంటి పరిశుద్ధమైన దేవుని రాజ్యమును, మానవులు స్వతంత్రించుకోవాలి, అని అంటే, వారు ఈ శరీర కార్యాలకు, వీటికి సంబంధమైన లక్షణాలు కలిగిన శరీరాన్ని ధరించి ఉండకూడదు.

దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేని ఈ శరీరము దేనిని కూడా ఎటువంటి సమస్యను కూడా ఆఖరికి మరణాన్ని కూడా ఇది జయించలేదు.

అందుకనే మానవునికి జయించే బలాన్ని ఇవ్వటానికి క్రీస్తు యేసు ప్రభువు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించి పరిశుద్ధాత్మ ద్వారా మనకు పునరుత్థాన విజయమును ఇచ్చారు,

ఈ పునరుత్థాన బలమును ఎవరైతే పొందుతారో వారే పక్షిరాజు వలె రెక్కలు చాచి విజయం కొరకు పైకి ఎగురుతారు.

అంతరిక్షంలో ఉన్న పక్షిరాజు మనకు ఏమి తెలియజేస్తుంది అని అంటే, యిది దేవుని పునరుత్థాన బలమును గూర్చిన జాడను ఇది మనకు తెలియజేస్తుంది,

జయించలేని శరీర స్థితిని శరీర లక్షణాన్ని కలిగిన మానవులు పునరుత్ధాన ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా సమస్తాన్ని జయించగలుగుతారు,

అందుకే క్రీస్తు యేసు ప్రభు వారు తన శిష్యులకు ఇలా చెప్పారు,

అపో.కార్యములు 1:8

అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.

" యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజువలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు."

యెహోవా కొరకు మనము ఎదురు చూచినప్పుడు మన సమస్యల పైన మనకు జయాన్ని ఇచ్చే నూతన బలము నూతన శక్తిని మనము పొందుతాము.

ఇది ఎలా అంటే పరిశుద్ధాత్మ ద్వారా దీనిని మనము పొందుకోవాలంటే మనము దేవుని ప్రార్థించాలి, ఆకాశమందు సింహాసనాసీనుడైయున్న దేవుని వైపు మన చేతులు చాపాలి.

లూకా 11:13

పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను.

ఈ పరిశుద్ధాత్మ వాక్యమై యున్న దేవుని ద్వారా కూడా మనకు లభిస్తుంది యోహాను 6:63

ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి.

యోహాను 6:63 ప్రకారం దేవుని వాక్యమే జీవం. మన సమస్యలలో దేవుని వాక్యం మనకు నూతన బలం ఇస్తుంది – ఇది జీవవాక్యమే కాదు, శక్తివంతమైన పరిష్కార మార్గం.

మన సమస్యలలో మన కష్టాలలో పక్షిరాజుకు కలిగిన పకృతి వైపరీత్యాలలో మనము దేవుని వాక్యాన్ని వాగ్దానముగా తీసుకున్నప్పుడు ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆత్మయు జీవమునై యున్న ఆ వాక్యము మనలను మన సమస్యల నుండి విడుదల పొందే విజయాన్ని పొందే శక్తిని నూతన బలాన్ని మనకు ఇస్తుంది.

అంతరిక్షంలో ఉన్న పక్షిరాజు జాడ మనకు యెహోవా దేవుని జాడను తెలియజేస్తే మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనమీద ముద్రించబడిన ఈ దేవుని ఆత్మ ఎంత బలమైనదో దీని జాడను మన ద్వారా ఇతరులకు తెలియజేస్తుంది.

తుఫాను వచ్చినప్పుడు అన్ని పక్షులు దాక్కుంటాయి

కానీ ఈ పక్షి రాజు వీటన్నిటికీ కంటే విభిన్నంగా ఉంటుంది. ఏ తుఫాను గాలులైతే తన మీదికి వచ్చాయో ఆ గాలులను ఆసరాగా తీసుకొని అది ఆకాశం పైకి ఎగురుతుంది ఇది మనకు ఏమి తెలియజేస్తుంది అని అంటే,

రోమీయులకు 8:28

దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.

దేవుని ప్రజలమైన మనకు కలిగే శ్రమ సమస్య కష్టము ఇవన్నీ కూడా మనకు దేవుని ఆశీర్వాదాలను తీసుకురావటాని కొరకే అని మనము నమ్మాలి,

వీటి ద్వారానే మనము ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి ఉన్నతమైన ఆత్మీయ అనుభవంలోనికి మనము చేరగలుగుతాము.

🦅 పక్షిరాజు రెక్కలు చాలా బలము కలిగి ఉంటాయి

పక్షిరాజు తాను ఆకాశంలోనికి ఎగిరేటప్పుడు తన వైపు వస్తున్న ఉదృతమైన గాలిని బలమైన తన రెక్కల ద్వారా చేదించి ముందుకు వెళుతుంది.

ఈ పక్షిరాజు గాలికి కొట్టుకొని పోయే పక్షి కాదు ఆ గాలిని తన బలమైన రెక్కల ద్వారా కత్తిరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టే పక్షులన్నిటిలో ఇది రాజు అయింది.

"ఈ పక్షిరాజు బలము తన రెక్కలు చాపటం వలన కలిగితే మన బలము ఆకాశమందు ఆసీనుడైయున్న వాని వైపు మన చేతులు చాపటం వలన కలుగుతుంది" ఇదే యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే,

ఆకాశమందు ఆసీనుడై యున్న వానివైపు ఎవరైతే చేతులు చాపరో ప్రార్థించారో వారు పక్షిరాజు వలె తమ రెక్కల చేత గాలిని ఛేదించేవారు కాకుండా

గాలికి ఎగిరే పొట్టు లాంటి వారు ఎటు గాలి వస్తే ఆ గాలి ప్రభావం వలన వీరు ఆ గాలి వీచిన వైపు వెళ్ళిపోతారు అంటే వీళ్లలో బలము లేదు పరిశుద్ధాత్మ శక్తిని బలాన్ని కలిగి లేని భక్తి హీనులు అని వీరిని గురించి మనం చెప్పవచ్చు.

కీర్తనలు 1:4

దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు.

పక్షిరాజు తన కళ్ళల్లో ఉన్న ఒక శక్తి ద్వారా తన లక్ష్యాన్ని ముందుగానే చాలా దూరం నుంచే గుర్తుపడుతుంది ఇది దూర దృష్టి కలిగిన పక్షి,

ఈ భూమి మీద నివసించే ప్రజలముగా మనము పక్షిరాజు వలె ఎప్పటికీ నశించని లయము కానీ ఆత్మ సంబంధమైన పర సంబంధమైన మన గమ్యాన్ని మన లక్ష్యాన్ని గుర్తించాల్సిన అవసరత ముఖ్యముగా దేవుని ప్రజలమైన మన మీద ఉంది.

ఎవరైతే క్రీస్తుతో కూడ లేపబడతారో గ్రద్ద పక్షిరాజు వలే అంతరిక్షమున విహరించే అనుభవాన్ని కలిగి పైనున్న వాటి మీదనే తమ లక్ష్యాన్ని తమ గురిని ఉంచుతారు ఎందుకంటే వారి జీవము క్రీస్తుతో కూడా దాచబడియున్నది కాబట్టి అంతరిక్షంలో పక్షిరాజు జాడ కొంత మందికే తెలుస్తుంది.

కొంతమందికి మాత్రమే దీనిని గ్రహించే జ్ఞానాన్ని కలిగి ఉంటారు.క్రీస్తుతో కూడా లేపబడకుండా భూ సంబంధమైన వాటి మీద మనసుపెట్టే వారికి అంతరిక్షంలో విహరించే పక్షిరాజు జాడను కనిపెట్టలేరు.

కొలస్సీయులకు 3:1-- 3

మీరు క్రీస్తుతో కూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి;

ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడ దేవునియందు దాచబడియున్నది.

ఈ భూసంబంధమైన జీవితం గాలికి ఎగిరే పొట్టులా స్థిరతలేని జీవితాన్ని చూపిస్తుంది. కానీ పక్షిరాజు వలే పైనున్న వాటిని వెదకువారికి, క్రీస్తుతో కూడ లేపబడినవారికి, దేవుని జ్ఞానంతో నిండి ఉన్నవారికి పక్షిరాజు వలె పైకి ఎగిరే బలం కలుగుతుంది.

వారు ఈ భూమిమీద తమ ఇష్టాన్ని పెట్టరు, వారి దృష్టి క్రీస్తుమీదే ఉంటుంది. వారు సమాధానమును కలిగించే ఆత్మఫలములతో నిండిన జీవితమును గడుపుతారు.

ఈ రోజు మనం ఏ దిశగా ప్రయానించాలి? భూసంబంధమైన కార్యాలలోనా? లేక ఆత్మ సంబంధమైన జీవితములోనా?

నీవు క్రీస్తుతో లేపబడినవాడివి కాబట్టి పైనున్న వాటినే వెదుకు!

గాలికి ఎగిరే పొట్టులా కాక, గాలిని చీల్చుకొని పైకి ఎగిరే పక్షిరాజువలె ఎగురు!

యెహోవా కొరకు ఎదురు చూచే జీవితం గడుపు — ఎందుకంటే ఆయన నీకు నూతన బలమును కలుగజేయును.

ఎస్తేరు క్రైసోలైట్

2-6-2025

Written By: Sis.Esther Chrysolyte

Written On: 2-6-25