CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🙏 మన పిలుపుకు ముందే దేవుని సమాధానం🙏

యెషయా 65:24

వారికీలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను వారు మనవి చేయుచుండగా నేను ఆలంకిచెదను.

"వారు పిలవకముందే నేను జవాబిచ్చెదను; వారు ఇంకా మాట్లాడుచుండగానే నేను వినెదను."

ఈ వాక్యము దేవుడు మనకు ఎంత సమీపంగా ఉంటాడో దేవుని ప్రేమ పూర్వక మైన స్వభావాన్ని ఇది మనకు తెలియజేస్తుంది మన అవసరాలకు, మన ప్రార్థనలకు దేవుడు ముందుగానే స్పందిస్తాడు.

ఇక్కడ మన పట్ల మన ప్రార్థన పట్ల దేవునికి ఎటువంటి శ్రద్ధ ఉన్నదో ఇక్కడ మనకు కనబడుతుంది మనము అడగకముందే, మనమేమి కోరుతామో సర్వజ్ఞానం కలిగిన దేవుని జ్ఞానము గురించి ఈ వాక్యము మనకు తెలియ జేస్తుంది మన ప్రయత్నాలు మాటలు తలంపులు పూర్తి కాకముందే, దేవుడు తన దైవ అనుగ్రహమును మన మీద ఉంచి మన పనులను సిద్ధం చేస్తాడు.

దేవున్ని ప్రార్థించడం వల్ల మనకు కలిగే ఉపయోగం :

మన ప్రార్థనలు దేవుడు విన్నడని వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని విశ్వాసం పెరుగుతుంది. దీని మూలంగా దేవున్ని ప్రార్థించడంలో మనకు ధైర్యం అనేది కలుగుతుంది మనం అనుకున్న దానికంటే ముందే దేవుడు తన దయను మనకు అందిస్తాడు.ఇది మనలను దేవుని ఆశీర్వాదం కొరకు నిరీక్షించేటట్లు చేస్తుంది ప్రార్థన ద్వారా దేవునితో ఒక సన్నిహిత సంబంధము అనేది మనకు కలుగుతుంది దేవునితో మనము కలిగి ఉన్నా ఆత్మ సంబంధమైన అనుబంధము అన్నది మన కష్టసమయంలో దేవున్ని ఆశ్రయించేటట్లు దేవునిపై ఆధారపడేటట్లు చేస్తుంది.

ఈ వాక్యము మనకు ఏమి తెలియజేస్తుంది అని అంటే దేవుని నమ్మకమైన ప్రేమను మనకు గుర్తుచేస్తూంది విశ్వాసంలో ప్రార్థనలో దేవునితో సన్నిహిత సహవాసం చేయుటలో స్థిరపడమని మనలను ప్రోత్సహిస్తుంది.

ఎస్తేర్ క్రైసోలైట్

4-1-2025

Written By: Sis.Esther Chrysolyte

Written On: 4-1-25