CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃

"అంబుగా సిద్ధపడిన సేవ

దేవుని చేతిలో ఒక సాధనము"

🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃

యెషయా 49:2

నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు.

ఈ వచనం దేవుడు తన సేవకులను ఎలా సిద్ధం చేస్తాడో, ఎప్పుడు వాడుకుంటాడో అన్న దానిని గూడార్ధముగా యిది వివరిస్తుంది. ఈ వాక్యంలో ఆత్మ సంబంధమైన ఒక సత్యము అన్నది దాగి ఉండటమును మనము గమనిస్తాము.

దేవుడు మెరుగు పెట్టిన అంబుగా చేసి మూసి ఉంచడము వెనుక ఉద్దేశం:

1. అంబును సిద్ధం చేయడం:

అంబు ఉపయోగానికి ముందు చాలా జాగ్రత్తగా తయారుచేయబడుతుంది. దానికి సరైన ఆకారం ఇవ్వడం, పదును పెట్టడం, వాడుకునే స్థితికి తగినట్లు దానిని సిద్ధము చేయడం చాల అవసరం. ఇలచేసె ప్రక్రియలో ఎక్కువ సమయము కూడా పట్టవచ్చు.

ఆత్మసంబంధముగా :

దేవుడు తన ప్రజలను ఉపయోగించుకునే ముందు,వాడుకునే ముందు వారిని శారీరకంగా, ఆత్మసంబంధముగా, మానసికముగా, భావాలు అనుభూతులు ప్రభావితమయ్యే భావోద్వేకముగా దేవుడు వారిని సిద్ధం చేస్తాడు. దేవుడు చేసే ప్రక్రియ ఎప్పుడూ త్వరగా జరుగదు, కానీ పరిపూర్ణముగా ఆది జరుగుతుంది జరిగి తీరుతుంది.

మోషేకు దేవుడు ఇచ్చిన శిక్షణ :

మోషే 40 ఏళ్లు మైదానంలో గొర్రెల కాపరిగా ఉన్నాడు, నిర్గమకాండము 3:1

మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను.

నిర్గమకాండము 2:16

మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా,

ఇంగ్లీష్ బైబిల్లో నిర్గమకాండము 3:1 లో ప్రత్యేకంగా "గొర్రెలు" లేదా "మేకలు" అని ఉంచిన అనువాదం ఉంటుంది:ఇక్కడ "flock" అని ఉపయోగించ బడింది, ఇది గొర్రెలు (sheep) లేదా మేకలు (goats) రెండింటికీ సాధారణంగా సూచిస్తుంది.

అందుకే, "మందలు" అని వాడినప్పుడు, గొర్రెలు కూడా దానికి భాగమే అని భావించాలి. మిద్యానీయులు ప్రధానంగా వారు గొర్రెలు మరియు మేకలు రెండింటినీ పెంచారు: గొర్రెలు: బట్టల కోసం ఉన్నచర్మం, మాంసం, మరియు పాలు.

మేకలు: పాల కోసం, మరియు ఎడారి ప్రదేశాలలో జీవించగలగడం.

గొర్రెలను కాయడం:

మోషే తన మామ మందలను కాయటము ద్వారా

దేవుని ప్రజలను నడిపే మార్గానికి ఆది ఒక శిక్షణల ఉపయోగపడింది, మేకలకు ఉండే జీవనశైలి వేరు

గొర్రెలకుండె జీవనశైలి వేరు ఈ రెండిటిని, ఒకే మందగా కాయటం అని అంటే చాలా కష్టతరం, వీటిని కాయడం ద్వారా ఇక్కడ గొర్రెలకు సూచనగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను మేకలకు సూచనగా ఉన్నటువంటి ఐగుప్తునుండి వచ్చిన, మిశ్రీత జనమును ఒకే మందలాగా అరణ్యంలో ఎడారిలో నడిపించడానికి, మోషేకు దేవుడు 40 సంవత్సరాలు తన మామ మందను కాయటము ద్వార, ఎన్నో అనుభవాలతో కూడిన శిక్షణను దేవుడు మోషేకు ఇచ్చాడు.

ఎడారి అనుభవం:

మోషే ఈ సమయంలో ఎడారి జీవితం ఎలా ఉంటుందో పూర్తిగా అర్థం చేసుకున్నాడు.

ఇది అతనికి దేవుని ప్రజలను ఎడారి ద్వారా నడిపించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చింది.

అతను నీటి కోసం ఎడారి బావులను ఎలా వెతకాలో, ఆహార వనరులను ఎలా పొందాలో, ఎడారిలో జీవనోపాధిని ఎలా పొందాలో, నేర్చుకున్నాడు.

మోషే ఎడారిలో మిద్యానీయులలో ఉన్నప్పుడు, సాధారణంగా గొర్రెలను మేకలను కాచేవాడని గ్రహించవచ్చు. మోషే తన మామ మందలను కాచిన 40 సంవత్సరాల కాలం యిది, పరిశుద్ధ గ్రంథంలో చాలా కొద్దిగా చిన్న ప్రస్తావనగా చెప్పబడినది, కాని ఈ 40 సంవత్సరాలు మోషే జీవితంలో మోషేకు దేవుడు ఇచ్చిన శిక్షణ కాలమని మోషే దేవుని చేతిలో ఒక అంబుగా మెరుగు పెట్టబడటానికి ఈ 40 సంవత్సరాల సమయమును దేవుడు వాడుకున్నాడని, మోషే జీవితమును ధ్యానం చేసినప్పుడు మనకు ఇది అర్థం అవుతుంది.

మోషేను దేవుడు మండు చున్న పొద దగ్గర పిలిచే వరకు తన మామ మందలను కాచిన ఈ 40 సంవత్సరాల కాలము శాంతి, వినయం దేవుని క్రమం ఒక క్రమశిక్షణ అనేది నేర్చుకోవాటానికి మోషేకు ఈ సమయం ఉపయోగపడినది,

మోషే, ఈజిప్టులో అధికారం గల రాజకుమారుడు గా

ఉన్నప్పుడు కోపంతో గర్వంతో ఒక ఈజిప్టు మనిషిని చంపాడు. ఇక్కడ మోషేను మనము మోషే దేవుని మీద దేవుని శక్తి మీద ఆధార పడకుండా, తన సొంత బలం మీద ఆధారపడటం ఇక్కడ మనము చూస్తాము.

40 సంవత్సరములు తన మామ మందను కాయటం అనే దేవుడు ఇచ్చిన ఈ శిక్షణ కాలంలో మోషే తన గర్వమును విడిచిపెట్టి ఒక సాధారణ గొర్రెల కాపరిగా మారాడు. ఆత్మసంబంధము గా శరీర సంబంధముగా మోషే ప్రజలతో ఉండడానికి దేవుని కోసం పనిచేయ డానికి, తగిన మెరుగు పెట్టబడిన, అంబుగా తయారు అయ్యాడు. అప్పుడే అతను ఇశ్రాయేలు ప్రజలను విమోచించడానికి సిద్ధమయ్యాడు.

2. అంబును మూసి ఉంచడం:

అంబు సిద్ధం అయిన తర్వాత కూడా, దానిని వెంటనే వాడరు. అది అవసరమైన సమయంలో మాత్రమే వాడతారు. అప్పటివరకు దానిని అంబుల పొదిలో భద్రంగా ఉంచుతారు.

ఆత్మసంబంధముగా :

దేవుడు తన సేవకులను తయారు చేసిన వెంటనే వారు వాడబడరు. వారికి సిద్ధపాటు కావాలి, దేవుని పరిచర్యను చేసే సమయం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు వారిని తన పని కోసం ఉపయోగిస్తాడు వాడుకుంటాడు. ఇది దేవుని సమయం (God's timing) అనే పరమ సత్యాన్ని యిది మనకు సూచిస్తుంది.

3. నమ్మకం పరీక్షించబడుతుంది:

అంబు పొదిలో ఉంచబడినప్పుడు, అది నిశ్శబ్దంగా ఉంటుంది ఆనేది ఓక ఉపమానం. ఆ సమయంలో సేవకులు దేవుని పిలుపు కోసం ఎదురుచూడాలి, ఎలాంటి ఆతురత లేకుండా ఎటువంటి భావోద్వేకములు వచ్చిన దేవుని సమయాము వరకు వేచి వుండాలి.

ఉదాహరణలు:

దావీదు: చిన్నతనములోనే దావీదును దేవుడు ఇశ్రాయేలు రాజుగా అభిషేకించినప్పటికీ, రాజ్యము పొందడానికి ఇశ్రాయేలీయులకు రాజుగా అవ్వటానికి దావీదుకు చాలా సంవత్సరాలు పట్టింది. దావీదు సౌలు వేధింపులను సహిస్తూ ఎదురు చూడాల్సి వచ్చింది.

యోసేపు: యోసేపు చిన్న వయసులోనే ఆశీర్వాదపు స్వప్నాలను దేవుని చేత పొందాడు. కానీ ఆ కలలు నిజము ఆవడానికి అనేక కష్టాలు తాను పొందాడు తన సహోదరుల నుంచి వెన్నుపోటు,శరీరానికి సాతానుకు లొంగని కారణం వలన చెరసాల అనే దానిని తాను ఎదుర్కోవాల్సి వచ్చింది.

4. అంబు సరిగ్గా ఉపయోగించబడుతుంది:

దేవుడు తన సేవకులను సరి అయిన సమయంలో వాడుకుంటాడు. అప్పుడు మాత్రమే ఆ సేవకులు శక్తివంతమైన దేవుని సాధనాలుగా ఉపయోగ పడతారు, ఎందుకంటే వారు దేవుని చేతుల్లో ఉన్నారు కాబట్టి, బబులోను దేశములో దానియేలుకు వ్యతిరేఖముగా ఎన్ని వచ్చిన దేవుని దూతగా నాయకుడిగా మెరుగుపెట్టిన అంబుగా తయారయ్యాడు. తన కష్టాలన్నింటిని తట్టుకుని దేవుని ప్రజలకు దేవునిపై ఎలా విశ్వాసం ఉంచాలో అన్న దానిని చూపించాడు.

మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మూసిపెట్టి యున్నాడు అన్న ఈ వాక్యములో దాగి ఉన్న సత్యము ఏమిటంటే, !

అంబు మెరుగుపెట్టబడినది అంటే దేవుడు మనలను శుభ్రపరచడం, ఆత్మసంబంధము గా మనలను బలపరచడము, అనుభవాల ద్వారా మనలో ఉన్న మష్టును తీయడం.

అంబు పొదిలో ఉంచబడినది అంటే దేవుని సమయానికి మనం ఎదురుచూడడం. మన పని మన పరిచర్య మన సేవ అనే దాని గురించి మన గమ్యము గురించి మనకు అప్పగింపబడిన దేవుడు తన వాక్యము ద్వారా మనకు ప్రత్యక్ష పరచిన బాధ్యత గురించి తొందరపడకుండా దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశము ప్రణాళికను మనము నమ్మటము విశ్వసించటము,

మెరుగు పెట్టబడటం వలన కలిగే ప్రయోజనం:

దేవుడు సేవకులను మెరుగుపెట్టిన అంబులుగా తయారుచేసి, సరైన సమయంలో సరైన విధంగా వాడుతాడు. అది దేవుని మహిమకోసం, అలాగే మనము ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండటానికి. నీవు తయారవుతున్న అంబుగా ఉన్నావా? లేక ఇంకా పొదిలో దాగి ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నా, దేవుని పిలుపు మరియు సమయంపై నమ్మకం ఉంచి సిద్ధంగా ఉండండి.

ఎస్తేర్ క్రైసోలైట్

16-1-2025

🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃

🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃

"అంబుగా సిద్ధపడిన సేవ

దేవుని చేతిలో ఒక సాధనము"

🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃

యెషయా 49:2

నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబులపొదిలో మూసిపెట్టియున్నాడు.

ఈ వచనం దేవుడు తన సేవకులను ఎలా సిద్ధం చేస్తాడో, ఎప్పుడు వాడుకుంటాడో అన్న దానిని గూడార్ధముగా యిది వివరిస్తుంది. ఈ వాక్యంలో ఆత్మ సంబంధమైన ఒక సత్యము అన్నది దాగి ఉండటమును మనము గమనిస్తాము.

దేవుడు మెరుగు పెట్టిన అంబుగా చేసి మూసి ఉంచడము వెనుక ఉద్దేశం:

1. అంబును సిద్ధం చేయడం:

అంబు ఉపయోగానికి ముందు చాలా జాగ్రత్తగా తయారుచేయబడుతుంది. దానికి సరైన ఆకారం ఇవ్వడం, పదును పెట్టడం, వాడుకునే స్థితికి తగినట్లు దానిని సిద్ధము చేయడం చాల అవసరం. ఇలచేసె ప్రక్రియలో ఎక్కువ సమయము కూడా పట్టవచ్చు.

ఆత్మసంబంధముగా :

దేవుడు తన ప్రజలను ఉపయోగించుకునే ముందు,వాడుకునే ముందు వారిని శారీరకంగా, ఆత్మసంబంధముగా, మానసికముగా, భావాలు అనుభూతులు ప్రభావితమయ్యే భావోద్వేకముగా దేవుడు వారిని సిద్ధం చేస్తాడు. దేవుడు చేసే ప్రక్రియ ఎప్పుడూ త్వరగా జరుగదు, కానీ పరిపూర్ణముగా ఆది జరుగుతుంది జరిగి తీరుతుంది.

మోషేకు దేవుడు ఇచ్చిన శిక్షణ :

మోషే 40 ఏళ్లు మైదానంలో గొర్రెల కాపరిగా ఉన్నాడు, నిర్గమకాండము 3:1

మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను.

నిర్గమకాండము 2:16

మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా,

ఇంగ్లీష్ బైబిల్లో నిర్గమకాండము 3:1 లో ప్రత్యేకంగా "గొర్రెలు" లేదా "మేకలు" అని ఉంచిన అనువాదం ఉంటుంది:ఇక్కడ "flock" అని ఉపయోగించ బడింది, ఇది గొర్రెలు (sheep) లేదా మేకలు (goats) రెండింటికీ సాధారణంగా సూచిస్తుంది.

అందుకే, "మందలు" అని వాడినప్పుడు, గొర్రెలు కూడా దానికి భాగమే అని భావించాలి. మిద్యానీయులు ప్రధానంగా వారు గొర్రెలు మరియు మేకలు రెండింటినీ పెంచారు: గొర్రెలు: బట్టల కోసం ఉన్నచర్మం, మాంసం, మరియు పాలు.

మేకలు: పాల కోసం, మరియు ఎడారి ప్రదేశాలలో జీవించగలగడం.

గొర్రెలను కాయడం:

మోషే తన మామ మందలను కాయటము ద్వారా

దేవుని ప్రజలను నడిపే మార్గానికి ఆది ఒక శిక్షణల ఉపయోగపడింది, మేకలకు ఉండే జీవనశైలి వేరు గొర్రెలకుండె జీవనశైలి వేరు ఈ రెండిటిని, ఒకే మందగా కాయటం అని అంటే చాలా కష్టతరం, వీటిని కాయడం ద్వారా ఇక్కడ గొర్రెలకు సూచనగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను మేకలకు సూచనగా ఉన్నటువంటి ఐగుప్తునుండి వచ్చిన, మిశ్రీత జనమును ఒకే మందలాగా అరణ్యంలో ఎడారిలో నడిపించడానికి, మోషేకు దేవుడు 40 సంవత్సరాలు తన మామ మందను కాయటము ద్వార, ఎన్నో అనుభవాలతో కూడిన శిక్షణను దేవుడు మోషేకు ఇచ్చాడు.

ఎడారి అనుభవం:

మోషే ఈ సమయంలో ఎడారి జీవితం ఎలా ఉంటుందో పూర్తిగా అర్థం చేసుకున్నాడు.

ఇది అతనికి దేవుని ప్రజలను ఎడారి ద్వారా నడిపించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చింది.

అతను నీటి కోసం ఎడారి బావులను ఎలా వెతకాలో, ఆహార వనరులను ఎలా పొందాలో, ఎడారిలో జీవనోపాధిని ఎలా పొందాలో, నేర్చుకున్నాడు.

మోషే ఎడారిలో మిద్యానీయులలో ఉన్నప్పుడు, సాధారణంగా గొర్రెలను మేకలను కాచేవాడని గ్రహించవచ్చు. మోషే తన మామ మందలను కాచిన 40 సంవత్సరాల కాలం యిది, పరిశుద్ధ గ్రంథంలో చాలా కొద్దిగా చిన్న ప్రస్తావనగా చెప్పబడినది, కాని ఈ 40 సంవత్సరాలు మోషే జీవితంలో మోషేకు దేవుడు ఇచ్చిన శిక్షణ కాలమని మోషే దేవుని చేతిలో ఒక అంబుగా మెరుగు పెట్టబడటానికి ఈ 40 సంవత్సరాల సమయమును దేవుడు వాడుకున్నాడని, మోషే జీవితమును ధ్యానం చేసినప్పుడు మనకు ఇది అర్థం అవుతుంది.

మోషేను దేవుడు మండు చున్న పొద దగ్గర పిలిచే వరకు తన మామ మందలను కాచిన ఈ 40 సంవత్సరాల కాలము శాంతి, వినయం దేవుని క్రమం ఒక క్రమశిక్షణ అనేది నేర్చుకోవాటానికి మోషేకు ఈ సమయం ఉపయోగపడినది, మోషే, ఈజిప్టులో అధికారం గల రాజకుమారుడు గా ఉన్నప్పుడు కోపంతో గర్వంతో ఒక ఈజిప్టు మనిషిని చంపాడు. ఇక్కడ మోషేను మనము మోషే దేవుని మీద దేవుని శక్తి మీద ఆధార పడకుండా, తన సొంత బలం మీద ఆధారపడటం ఇక్కడ మనము చూస్తాము.