2025 Messages
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
"దేవుని వాక్యములోనే మనకు స్థిరత,
వాక్యమే మనలను స్థిరపరుస్తుంది"
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
అబ్రహాము సంతానము కనాను దేశమును, స్వాస్థ్యముగా పొందటానికి గల కారణం, దేవుని వాక్యము, వాగ్దానం, ఇశ్రాయేలీయుల ప్రజలకు,స్థిరమైన నివాసము ఎక్కడ దొరికింది అని అంటే, దేవుని వాక్యంలోనే ఆ వాక్యమే వాళ్లకి స్థిరత్వాన్ని ఇచ్చింది, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనానువెళ్లే వారి ప్రయాణంలో, ఎన్నో పరిస్థితులు తిరస్కారాలు అవమానాలు ఆకలి లేమి లు ఇలా అనేక రకాలైన పోరాటాలను, వారు ఎదుర్కొంటూ వచ్చారు.
ఈ ప్రజలను నడిపించే మోషే యెహోషువాలు వారి ప్రయాణంలో సంభవించిన వాళ్లకు
ఎదురైన వాటిలో స్థిరత్వాన్ని వాళ్ళు చూడలేదు,దేవుడు ఏదైతే వారి పితరుడైన అబ్రహాముకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు వారితో ఏదైతే దేవుడు మాట్లాడుతూ వచ్చాడో, ఆ వాక్యములోనే ఆ వాగ్ధానములోనే, ఆ దేవుని స్వరములోనే, స్థిరత్వం ఉంది,అని వారు నమ్మారు కాబట్టి,ఆ ప్రయాణంలో వారికి సంభవించినది, ఏది కూడా వారి ప్రయాణాన్ని ఆపలేకపోయింది,కనాను వరకు ఆ ప్రజలను నడిపించారు.
మానవ స్వభావము ఏమని అనుకుంటుంది అని అంటే,ఒక ఉద్యోగము వస్తే,అదే స్థిరత్వమని, వివాహమైతే అదే స్థిరత్వం అని,ఒక ఇల్లు కట్టుకుంటే అదే స్థిరత్వం అని,ఈ లోకంలో మన జీవనానికి అవసరమైన అన్ని సంపదలు సమకూర్చుకుంటే అదే స్థిరత్వం అని,సహజంగా మనము అనుకుంటూ ఉంటాము, కానీ దేవుడు,తన ప్రజలమైన మనలను పరీక్షించాలి, మనలను విశ్వాసంలో బలపరచాలి అని అనుకుంటే, మనము భావించే వీటి అన్నిటిలో ఎందులో కూడా మనకు స్థిరత్వం అన్నది ఇవ్వకుండా, ఈ ప్రయాణంలో దేవుని మీద మాత్రమే,మనము ఆధారపడేటట్లు, ఈ క్రైస్తవ జీవిత ప్రయాణములో దిన దినము దేవుని మీద మాత్రమే,మనము ఆధారపడేటట్లు మనం విశ్వాసం ఉంచేటట్లు మనలను నడిపిస్తూ ఉంటాడు.
2 కోరింథీయులకు 4:9
తరుమబడు చున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.
" ఇక్కడ భౌతికంగా చూస్తే తాము ఎంతో అణచివేయ బడుతున్నట్టు అనిపిస్తు,కనపడుతు వున్నా, నిజమైన దేవుని,వాక్య సంరక్షణలో తాము నిలబడే ఉన్నాము, స్థిరత్వం కలిగి ఉన్నాము, నిలిచే వారము అని, పౌలు చెబుతున్నా విషయం, ఇక్కడ మనకు కనపడుతుంది."
మనము తలదించుకునే స్థితిలో ఉన్నా కూడా దేవుడు మనల్ని పూర్తిగా వదలడు, మనం తుడిచిపెట్టబడే వారము కాదు.మన జీవితంలోకి వచ్చేపరిస్థితులను బట్టి మన స్థిరతను మనం నిర్ణయించుకోకూడదు, పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్న లేకపోయినా,ఏ విషయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనకు వాగ్దానం ఇచ్చాడో, ఆ వాక్యంలో ఆ వాగ్దానంలో కచ్చితంగా మనకు స్థిరత అన్నది ఉంది,అని మనం నమ్మాలి.
2 కోరింథీయులకు 4:10-11
యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పరచబడుటకై యేసు యొక్క మరణాను భవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము. ఏలయనగా, యేసు యొక్క జీవము కూడ మా మర్త్య శరీరమునందు ప్రత్యక్ష పరచబడినట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింప బడుచున్నాము.
"జయించే జయ జీవితమును ఇచ్చే క్రైస్తవ జీవితంలో "సజీవులు" అన్న గుర్తింపు ఉన్నటువంటి, దేవుని ప్రజలు ఏ విషయంలో మరణమునకు అప్పగింపబడే పరిస్థితి గుండా వెళ్తారో, కచ్చితంగా ఆ విషయంలో యేసు పునరుత్థాన అనుభవమును రుచి చూస్తారు,అని ఈ వాక్యము మనకు తెలియజేస్తుంది."
ఈ సత్యమును దేవుని ప్రజలు,ధైర్యముగా దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి,వేరొకలికి ఈ సత్యాన్ని ప్రకటించాలి, కీర్తనలు 119:89 (లామెద్) యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది., స్థిరమైనది మనకు స్థిరత్వాన్ని ఇచ్చేది దేవుని వాక్యము కాబట్టి, ఈ వాక్యమును మనము ఆశ్రయించాలి, ఈ వాక్యం అనే వెలుగులోనే మనము నడవాలి, ఈ వాక్యము నే మనం వెంబడించాలి,
ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు, అనబడే దేవుని ప్రజలు, నిత్యజీవమును గురించిన, పరలోక రాజ్యమును గురించిన వాక్యమును, స్థిరమైన వాగ్దానముగా,పొందినవారు. మనం పరలోక రాజ్యం వెళ్లెంతా వరకు, మన ప్రయాణం దేవుని వాక్యం మీదే గురిగా ఉండాలి, ఈ లోకంలో ఏ విషయంలో కూడా మనకు స్థిరత్వం అనేది ఉండదు ఈ లోకంలో మనకు వచ్చే పరిస్థితులను బట్టి మనము మన జీవితానికి స్థిరత్వం అన్నదానని మనం వెతికకూడదు.
క్రైస్తవ జీవితం అనేది ప్రతీరోజూ యేసు మరణం మరియు జీవం మధ్య నడిచే విశ్వాస ప్రయాణం, కాబట్టి ఈ లోక సంబంధమైన భౌతిక సంబంధమైన విషయాలలో మనము స్థిరత్వాన్ని వెతకకుండా మన ఆత్మ సంబంధమైన ప్రయాణాన్ని,కొనసాగిస్తూ ఉండాలి. కాబట్టి స్థిరత్వమనేది భౌతికంగా కనిపించేది కాదు, అది మన పరిస్థితులతో మారిపోదు. స్థిరత్వం అంటే...
1. దేవుని వాక్యంపై మన స్థిరమైన విశ్వాసం.
2. ఆ వాక్యంలో ఉన్న వాగ్దానాన్ని పట్టుకుని, ఏ పరిస్థితినైనా తట్టుకునే బలాన్ని కలిగి ఉండటం.
3. ప్రతిరోజూ మారిపోతున్న లోకంలోనూ, మారని దేవుని మాటను ఆధారంగా చేసుకుని జీవించడం.
ఈ స్థిరత్వమే మన విశ్వాస ప్రయాణానికి సూత్రము. మనము పరమ కనాను చేరేవరకు , పరలోక రాజ్యంలో ప్రవేశించేవరకు, ఇదే స్థిరత,ఈ స్థిరత్వమే, మన గమ్యం వరకు మనల్ని నడిపించగలదు. ఎందుకంటే… కీర్తనలు 119:89 (లామెద్) యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది.
అత్మ పరిశీలన కొరకు:
స్థిరమైన జీవితం కోసం ఎదురుచూస్తున్నారా?
మీ చేతుల్లో ఇల్లు, ఉద్యోగము, ఆస్తులు సంపదలు... అదే మీ స్థిరత అని అనుకుంటున్నారా? ఇది ఏదీ తప్పు కాదు. కానీ మీ జీవితం ఎప్పటికీ స్థిరంగా నిలబడాలంటే, అది మారిపోతు వున్న, మీకు భద్రత ఉండాలంటే, మీ ఆత్మ స్థిరంగా ఉండాలంటే…మీ జీవితం దేవుని వాక్యంతో బంధించబడాలి.
స్థిరమైన దేవుడు, స్థిరమైన వాక్యమును ఇచ్చాడు.
స్థిరమైన వాగ్దానాలను చేశాడు. స్థిరమైన స్థలానికి — పరలోక రాజ్యానికి — తన ప్రజలను నడిపిస్తున్నాడు. మరి...
మన ప్రస్తుత పరిస్థితులు గతించి పోతాయా, లేక మనలను నిలబెడతాయా అనేది,
మనము దేనిపై మన స్థిరత్వం కొరకు ఆధారపెడుతున్నామో, అన్న దానిపై ఆది ఆధారపడి ఉంటుంది.
ప్రశ్న: మన స్థిరత్వపు ఆధారం ఏమిటి — మన సంపాదనా? మన పరిస్థితినా?
లేక దేవుని వాక్యమా?
ఎస్తేర్ క్రైసోలైట్
6-7-2025