2025 Messages
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
" ఆత్మీయ జీవితం లో దేవుని సన్నిధి ప్రభావం"
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
దేవుని సన్నిధిని స్పర్శించే గ్రహింపు అంటే, దేవుని ఉనికిని మన జీవితములో అనుభూతి చెందడం, దేవుని పరిశుద్ధతను శక్తిని ప్రేమను అనుభవించడం. ఇది వ్యక్తిగతముగా మన హృదయాలలో, మన ఆత్మలో దేవుని ఆత్మను స్పష్టంగా గుర్తించడమును ప్రాముఖ్యముగా ఇది మనకు తెలియజేస్తుంది.
దేవుని ప్రజల జీవితాలలో, దేవుని సన్నిధిని గమనించ వలసిన, పొందవలసిన, గుర్తించ వలసినంత, ప్రాముఖ్యత మనకు ఎందుకు ఉంది అని అంటే, దేవుని సన్నిధిని స్పృశించడం, దేవుని సన్నిధి అనే స్పర్శను మనము కలిగి ఉండటం అనేది, మన ఆత్మ యొక్క అవసరాన్ని తీర్చే అత్యున్నత మైన అనుభూతి అని చెప్పాలి . ఇది ప్రార్థన, ధ్యానం, లేదా వాక్యపఠన ద్వారానే కాకుండా, ఆత్మీయంగా ఆయనతో మన ఆత్మ దేవుని ఆత్మతో కలిసినప్పుడు కలుగుతుంది. ఇది మనం దేవునితో కలిసున్నామన్న గాఢమైన నమ్మకాన్ని పెంచుతుంది. ఇది మనలో ఒక ధైర్యమును కలిగిస్తుంది.
దేవుని సన్నిధిలో మనము గుర్తించ వలసి యున్న కొన్ని అంశాలు::
1. ఆత్మలో బలమైన అనుభూతి:
దేవుని సన్నిధి మనలో ఉన్నప్పుడు, హృదయం నిండుగా ప్రశాంతతతో ఆనందముగ ఆత్మ సంబంధమైన చైతన్యంతో కూడిన ఉజ్జీవముతో నిండి వుంటుంది. మనకు వ్యతిరేకమైన ఎటువంటి పరిస్థితి ఏవిషయము అన్న మన జీవితంలోకి వచ్చినప్పటికి, మన హృదయం ఒక ప్రశాంతతను, ఒక నెమ్మదిని కలిగి ఉండటం, మనము గమనిస్తాం. ఎటువంటి వ్యతిరేకమైన పరిస్థితి మన ముందుకు వచ్చిన, మనలో చెప్పలేనంత ధైర్యం ఉంటుంది.
సర్వసాధారణముగా మనము దేని గురించి అయినా, దేవుని ప్రార్థించే టప్పుడు మనకు కలిగి ఉన్న, ఆ అవసరతను బట్టి మనము చాలా భారముగా కనపడతాము, కానీ దేవుని సన్నిధి మనతో ఉండి, మనము ప్రార్థించేటప్పుడు ఈ లోక సంబంధమైన సమస్తాన్ని మరిచిపోయి, మన ఆత్మ, దేవుని ఆత్మతో, ఏకాత్మను కలిగి ప్రార్ధించే, ఆ సమయం ద్వారా, ఆ ప్రార్ధన ద్వారా మనకు చెప్ప లేనంత, ఆనందము సంతోషము, మన హృదయాన్ని ఏలుతూ ఉండటాన్ని మనము గమనిస్తాము.
2. పరిశుద్ధతను తెలుసుకోవడం:
దేవుని పరిశుద్ధత అంటే ఏమిటో మనం గ్రహించినప్పుడు, మన తప్పులను తెలుసుకుని నడుస్తాము పరిశుద్ధత అనేది మనము కలిగి ఉన్నప్పుడు, మాత్రమే దేవుని సన్నిధిని మనము గుర్తించ గలుగుతాము. మన మాట తలంపు క్రియా చూపు సమస్త ప్రవర్తనలో మనము ఎక్కడైనా తప్పిపోయామా, అన్న జ్ఞానాన్ని దేవుని సన్నిధి మనకు తెలియజేస్తుంది, మనలను సరిచేస్తుంది.
3. దేవుని మార్గమును గ్రహించటం పొందడం:
దేవుని సన్నిధిని మనము స్పృశించినప్పుడు, మన జీవితానికి ఒక స్పష్టమైన దారి లభిస్తుంది. దేవుడు మనలను నడిపించే మార్గము ఏది అన్న, ఒక స్పష్టమైన దేవుని జ్ఞానాన్ని మనము కలిగి ఉంటాము.
4. దేవునితో సన్నిహిత సంబంధం:
దేవుని సన్నిధిని మనం గ్రహించినప్పుడు, ఇది కేవలం బాహ్యమైన అనుభవం కాకుండా, దేవునితో గాఢమైన ఆత్మీయ సంబంధానికి దారి తీస్తుంది. ఒక పాట ద్వారా కానీ ఒక వాక్యం ద్వారా కానీ దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, దైవ సంబంధమైన పనులను మనం చేస్తున్నప్పుడు, మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకమై ఏకాత్మ ఆయి మనతో ఉన్న ఈ దేవుని సన్నిధి, మన చుట్టూ ఎవరిలో ఎక్కడ ఏ ఆత్మ సన్నిధి ఉంది అన్న విషయమును కూడ చాలా స్పష్టంగా మనకు గ్రహింప చేస్తుంది. వేటి ద్వారా దేవుని సన్నిధిని మనము పొంద గలుగు తున్నాము, వేటి ద్వారా దేవుని సన్నిధిని పోగొట్టు కుంటున్నాము, అన్న విషయమును కూడ మనము గ్రహిస్తాము.
పరిశుద్ధ గ్రంథంలో దేవుని సన్నిధిని గమనించిన వారిలో కొన్ని ఉదా :
మోషేకు మంటలలో యెహోవా దేవుడు తన సన్నిధిని చూపించినప్పుడు (నిర్గమకాండం 3:2-6).
ఏలీయాకు చిరుగాలి రూపంలో దేవుడు తన సన్నిధిని చూపించినప్పుడు (1 రాజులు 19:11-13).
భక్తి, ప్రార్థనలో శిష్యులు పరిశుద్ధాత్మను అనుభవించినప్పుడు (అపో.కార్యములు 2:1-4).
ఎస్తేర్ క్రైసోల్తెట్
13-2-2025
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃 🌟

మోషేకు మంటలలో యెహోవా దేవుడు తన సన్నిధిని చూపించినప్పుడు
(నిర్గమకాండం 3:2-6).
ఏలీయాకు చిరుగాలి రూపంలో దేవుడు తన సన్నిధిని చూపించినప్పుడు
(1 రాజులు 19:11-13).
భక్తి, ప్రార్థనలో శిష్యులు పరిశుద్ధాత్మను అనుభవించినప్పుడు
(అపో.కార్యములు 2:1-4).
ఎస్తేర్ క్రైసోల్తెట్
13-2-2025
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃 🌟