2025 Messages
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
విన్నది – చూచినది – తాకినది:
జీవవాక్యమునకు మా సాక్ష్యం”
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
1యోహాను 1:1
జీవవాక్యమును గూర్చినది,
ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో ,మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.
ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నే నుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము - ఆత్మీయ రూపుండా "ప్రియయేసు నిర్మించితివి - ప్రియ మార నా హృదయం"
ఈ పాటను నేను పాడుతున్నప్పుడేల్లా నాకు ఈ వాక్యమే గుర్తు వస్తుంటుంది. 1యోహాను 1:1 లో ఉన్నటువంటి ఈ వాక్యమును నేను ఎప్పుడు చదివినా నాకు ఈ పాట గుర్తుకొస్తూ ఉంటుంది.
నిజమే •••• దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలిసి అర్థమయ్యి ఆ దేవుని ప్రేమను కృపను దయను కరుణను, దేవుని మంచితనము అంతటిని, మన పరిస్థితులల్లో మనము అనుభవించినప్పుడు, దేవుని సాక్షిగా ఇతరులకు దేవుని మంచి తనమును, తెలియజేయకుండా అస్సలు ఉండలేము. అందుకే శిష్యులు ఇలా తెలియ జేస్తున్నారు.
ఈ వాక్యాన్ని యోహాను తన పత్రిక ప్రారంభంలోనే వ్రాసినప్పుడు, అతను జీవమై ఉన్న, జీవింపజేసే జీవవాక్యమైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఒక స్పష్టతను ఇవ్వటాన్ని, ఇక్కడ మనము గమనిస్తాము. కీర్తనలు 90:2 పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు.
1.ఆదినుండి ఏది యుండెనో,: ఆదినుండి ఉన్న దానిని" యేసు క్రీస్తు ప్రభువారు అనాది కాలము నుండే ఆది నుండే ఉన్న దేవుడు. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారి దైవత్వమును మరియు సృష్టికి ముందు, ఆయన కలిగి ఉన్నటువంటి సర్వాధికారిగా, సమస్తము పైన ఆధిపత్యము కలిగి, ఆది అంతము ప్రారంభం ముగింపు లేని, నిత్యత్వాన్ని కలిగి ఉన్న స్థితిని చూపిస్తుంది.
యోహాను 3:16
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా( లేక, జనిత్తెక కుమరుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
2. మేమేది వింటిమో, : మేము విన్నదానిని" +
శరీర దారిగా యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో జీవించినప్పుడు, యోహాను మరియు ఇతర అపొస్తలులు యేసుక్రీస్తు ప్రభువు వారి ఉపదేశాలను ఆయన బోధనలను అయినా సందేశాలను ప్రత్యక్షంగా వారు విన్నరు. ఆయన మాటలు వారికి ఆత్మ సంబంధమైన జీవితానికి, నిత్యత్వంలో దేవునితో కలిసి ఉండటానికి, ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకటానికి, అవసరమైన శక్తిని ఇవ్వగలిగే అవసరమైన సత్యాలను, వారికి ప్రత్యక్షపరిచాయి.
3. కన్నులార ఏది చూచితిమో, : "మా కన్నులతో చూచినదానిని"
ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు భౌతిక రీతిలో శరీరధారిగా ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు కలిగి ఉన్న ఉన్నత స్థితిని యిది ధృవీకరిస్తుంది. శరీర దారిగా ఈ లోకంలో ఆయన జీవించి ఉన్నప్పుడు శిష్యులు ఆయనను ప్రత్యక్షంగా చూశారు. (శరీర దారిగా ఈ లోకంలో జన్మించిన యేసు క్రీస్తు ప్రభువు వారి స్వరూపంలో అవతారంలో దేవుని వ్యక్తిత్వాన్ని చూడడం).
4. ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో, : "మా చేతులతో స్పృశించినదానిని"
యేసు క్రీస్తు ప్రభువు వారు వాస్తవముగా మానవ శరీరంలో ఉన్నాడని భౌతిక పరమైన ధృవీకరణతో ఆయన శిష్యులు చెప్తున్న మాట ఇది. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా యోహాను వంటి శిష్యులు ఆయనను స్పర్శించారు.
లూకా 24:39
నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పట్టి చూడుడి, నా కున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమున కుండవని చెప్పి
లూకా 24:40 తన చేతులను పాదములను వారికి చూపెను.
5. "జీవ వాక్యము" : ఇది యేసు క్రీస్తు ప్రభువారిని సూచిస్తుంది.ప్రకటన గ్రంథం 19:13
మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.
యేసుక్రీస్తు ప్రభువారు జీవమై ఉన్నారు, మనలను జీవింపజేసే జీవాన్ని కలుగజేసే వాక్యాహారమై యున్నారు నిత్యజీవానికి యేసుక్రీస్తు ప్రభువారే మార్గం. నిత్యజీవానికి యేసుక్రీస్తు ప్రభువారే మార్గం.
యోహాను 14:6
యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు. యేసుక్రీస్తు ప్రభువారు భౌతికముగా వచ్చిన దేవుడు మాత్రమే కాకుండా, మనకు నిజమైన నిత్యజీవమును ఇచ్చే దేవుడిగా మన ఆత్మకు బలాన్ని ఇచ్చే ఆహారముగా ఈ లోకమునకు ప్రత్యక్ష పరచబడ్డారు.
జీవవాక్యమును గూర్చినది,
ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో ,మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.
దేవుడు ఏమై ఉన్నాడో అన్న విషయమును తెలియజేసే సత్యము ఇది.
మన కష్టాలలో, మన శ్రమలలో, మనబాధలలో, మన ఒంటరితనములో, ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా, మనము కలిగి ఉన్న మనలేమిలో, మన ఆర్థిక ఇబ్బందులలో, వాక్యము అనే నామము కలిగిన యేసు క్రీస్తు ప్రభువు వారిని గూర్చి, మనము ఎది విన్నామొ, ఏది మన కన్నులారా చూశామొ, ఏది నిదానించి మనము కనుగొన్నామొ, ఏది దేనిని మన చేతులు తాకి స్పర్శించి చూసాయో, మనము పొందిన మన హృదయాలను తాకిన ఆ అను భవాలన్నీటిని, యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలిసినది విని, నమ్మి, అనుభవించిన సమస్తమును కూడా, దానిని మనము ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలని, సాక్ష్యమిచ్చే కర్తవ్యాన్ని, ఇది ఈ వాక్యము మనకు గుర్తు చేస్తుంది.
ఎస్తేర్ క్రైసోలైట్
9-1-2025
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
విన్నది – చూచినది – తాకినది:
జీవవాక్యమునకు మా సాక్ష్యం”
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
1యోహాను 1:1
జీవవాక్యమును గూర్చినది,
ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో ,మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.
ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నే నుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము - ఆత్మీయ రూపుండా "ప్రియయేసు నిర్మించితివి - ప్రియ మార నా హృదయం" ఈ పాటను నేను పాడుతున్నప్పుడేల్లా నాకు ఈ వాక్యమే గుర్తు వస్తుంటుంది. 1యోహాను 1:1 లో ఉన్నటువంటి ఈ వాక్యమును నేను ఎప్పుడు చదివినా నాకు ఈ పాట గుర్తుకొస్తూ ఉంటుంది.
నిజమే •••• దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలిసి అర్థమయ్యి ఆ దేవుని ప్రేమను కృపను దయను కరుణను, దేవుని మంచితనము అంతటిని, మన పరిస్థితులల్లో మనము అనుభవించినప్పుడు, దేవుని సాక్షిగా ఇతరులకు దేవుని మంచి తనమును, తెలియజేయకుండా అస్సలు ఉండలేము. అందుకే శిష్యులు ఇలా తెలియ జేస్తున్నారు.
ఈ వాక్యాన్ని యోహాను తన పత్రిక ప్రారంభంలోనే వ్రాసినప్పుడు, అతను జీవమై ఉన్న, జీవింపజేసే జీవవాక్యమైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఒక స్పష్టతను ఇవ్వటాన్ని, ఇక్కడ మనము గమనిస్తాము. కీర్తనలు 90:2 పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు.
1.ఆదినుండి ఏది యుండెనో,: ఆదినుండి ఉన్న దానిని" యేసు క్రీస్తు ప్రభువారు అనాది కాలము నుండే ఆది నుండే ఉన్న దేవుడు. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారి దైవత్వమును మరియు సృష్టికి ముందు, ఆయన కలిగి ఉన్నటువంటి సర్వాధికారిగా, సమస్తము పైన ఆధిపత్యము కలిగి, ఆది అంతము ప్రారంభం ముగింపు లేని, నిత్యత్వాన్ని కలిగి ఉన్న స్థితిని చూపిస్తుంది.
యోహాను 3:16
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా( లేక, జనిత్తెక కుమరుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
2. మేమేది వింటిమో, : మేము విన్నదానిని"
శరీర దారిగా యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో జీవించినప్పుడు, యోహాను మరియు ఇతర అపొస్తలులు యేసుక్రీస్తు ప్రభువు వారి ఉపదేశాలను ఆయన బోధనలను అయినా సందేశాలను ప్రత్యక్షంగా వారు విన్నరు. ఆయన మాటలు వారికి ఆత్మ సంబంధమైన జీవితానికి, నిత్యత్వంలో దేవునితో కలిసి ఉండటానికి, ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకటానికి, అవసరమైన శక్తిని ఇవ్వగలిగే అవసరమైన సత్యాలను, వారికి ప్రత్యక్షపరిచాయి.
3. కన్నులార ఏది చూచితిమో, : "మా కన్నులతో చూచినదానిని" ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు భౌతిక రీతిలో శరీరధారిగా ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు కలిగి ఉన్న ఉన్నత స్థితిని యిది ధృవీకరిస్తుంది. శరీర దారిగా ఈ లోకంలో ఆయన జీవించి ఉన్నప్పుడు శిష్యులు ఆయనను ప్రత్యక్షంగా చూశారు. (శరీర దారిగా ఈ లోకంలో జన్మించిన యేసు క్రీస్తు ప్రభువు వారి స్వరూపంలో అవతారంలో దేవుని వ్యక్తిత్వాన్ని చూడడం).