CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

Praise the lord

🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃

దేవుని సన్నిది పవిత్రమైనది

🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃

ప్రకటన గ్రంథం 4:5

ఆ సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలు దేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి; అవి దేవుని యేడు ఆత్మలు.

సింహాసనము నుండి ఎం! బయలు దేరుచున్నవి.?

ఈ ప్రశ్నకు జవాబు, "ఉరుములు,మెరుపులు,ధ్వనులు," ఇవి దేనికి సాదృశ్యం.? ఇవి దేనికి సూచనగా పరిశుద్ధగ్రంధం మనకు తెలియజేస్తున్నది !

"దేవుని సింహాసనము నుండి బయలుదేరుతున్న మెరుపులు, ధ్వనులు, ఉరుములు" అనే దృశ్యం బైబిల్లో చాలా గంభీరమైన దైవిక సంఘటనకు సూచన.

✨ ఈ దృశ్యంలో ఉన్న ముఖ్య అంశాలు:

1. సింహాసనము ఇది ఎవరి సింహాసనం?

ఇది దేవుని సింహాసనం.

ప్రకటన గ్రంథం 4:2

వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి యుండెను. సింహాసనమునందు ఒకడు ఆసీసుడైయుండెను,

దేవుడు పరలోక సింహాసనంపై కూర్చున్నారు. ఇది పరిపూర్ణమైన దేవుని అధికారానికి, దేవుని నీతి న్యాయము ధర్మానికి, మరియు దేవుని పరిశుద్ధతకు,సూచన సంకేతం.

2. మెరుపులు, ధ్వనులు, ఉరుములు అంటే ఏమిటి?

1.⚡ మెరుపులు,

2. 🔊 ధ్వనులు,

3. 🌩 ఉరుములు

ఈ మూడు సంకేతాలు బైబిల్లో చాలాసార్లు దేవుని తీర్పును, పరిశుద్ధతను, మరియు భయంకరమైన దైవిక ప్రకటనను సూచించడానికి వాడబడ్డాయి.

నిర్గమకాండము 19:16-19 – దేవుడు సీనాయి పర్వతముపై దిగివచ్చినప్పుడు:

నిర్గమకాండము 19:16-19

మూడవనాడు ఉదయమైనప్పుడు ఆ పర్వ తముమీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరు వణకిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెము లోనుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమ మయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరముచేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను.

ఈ వచనాల్లో మోషేను మరియు ఇశ్రాయేలు జనాంగాన్ని దేవునితో భేటీకి సిద్ధపరచిన తర్వాత, దేవుడు సీనాయిపర్వతంపై తన ఉనికిని ఘనంగా, భయంకరంగా ప్రకటించుకుంటాడు. ఆ సందర్భంలో:

ఇవి ఈ దృశ్యం దేవుని పవిత్రత పరిశుద్ధత,పాపమును ఎంత తట్టుకోలేనిదిగా ఉంటుందో, పాపమున్న మనుషులు ఆ దేవుని సన్నిధిని నేరుగా ఎదుర్కోలేరు అన్న విషయాన్ని యిది చాలా బలంగా చూపిస్తుంది. దేవుని పవిత్రత ముందుగా, పాపమున్న మనుషులు ఆయనను నేరుగా చూడలేరు అనే ఆత్మీయ సత్యాన్ని ఇది వెల్లడిస్తుంది.

ప్రకటన 8:5; 11:19; 16:18

ఈ వచనాలలో కూడా దైవిక తీర్పులు ప్రకటించబడినప్పుడు “మెరుపులు, ధ్వనులు, ఉరుములు” కనిపిస్తాయి.

ఇవి దేవుని కోప తీర్పుల బాహ్య లక్షణాలు.

ఇది దేనికి సూచన?

ఇది దైవికమైన తీర్పు రాబోతున్నదీ, దేవుని పవిత్రత,పరిశుద్ధత ముందు, ఎదురుగా, ఎవ్వరూ నిలబడలేరనే హెచ్చరికను తెలియజేస్తుంది.దేవుని సింహాసనం సమీపంలో ఉన్నప్పుడే ఈ శబ్దాలు వినబడతాయి — ఇది ఆ స్థల పవిత్రత, గంభీరతను తెలియజేస్తుంది.

దేవుని సింహాసనం నుండి ఈ శబ్దాలు రావడం అనేది మనకు ఒక స్పష్టమైన సందేశం:

దేవుడు న్యాయమైనవాడు,ఆయన తీర్పులు భయంకరమైనవి,దేవుని ఉనికి, ఆయన సన్నిధి, ఆయన ఉండే ప్రదేశం అత్యంత పవిత్రమైనది.

అది మానవతాపరిమితిని దాటి ఉంటుంది

కీర్తనలు 96:9 పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి సర్వ భూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి.దేవుని సన్నిధిలో వణకాల్సిన అవసరం మనకుంది.

🟢 "దేవుడు ఉన్న ఆయన సన్నిధి పవిత్రమైనది పరిశుద్ధమైనది"

🟢 "దేవుడు ఉన్నటువంటి ప్రదేశం,ఆయన ఉనికి ఆది పరిశుద్ధమైనది"

🟢 "ఆయనతో కూడ వున్న పరిచర్యా, ఆ స్థలము, ఆ దేవుని మహిమ, దేవుని చుట్టూ ప్రకాశించే పవిత్రతను ప్రకటిస్తున్నది"

మనకు ఈ దృశ్యం చెప్పే ఆత్మీయ సందేశం ఏమిటంటే?

దేవుడు ప్రేమగలవాడు మాత్రమే కాదు —

తీర్పు చెప్పువాడూ

పవిత్రతను కోరువాడూ

పాపాన్ని తట్టుకోలేనివాడూ

నేడు మనం దేవుని ప్రేమను, కృపను ఎక్కువగా మాట్లాడుతు వున్నప్పటికీ…

ఆయన తీర్పును, పవిత్రతను మనము మరవకూడదు. దేవుని సింహాసనం వద్ద నెమ్మదిగా మాట్లాడే గొంతు మనకు వినిపించదు; అక్కడ ధ్వనులు, ఉరుములు మెరుపులు మాత్రమే వస్తాయి.

అందుకే దేవుని సన్నిధికి మనము వచ్చి నప్పుడు,మనము మన హృదయాల,పవిత్రతను స్వచ్ఛతను వాక్యపు వెలుగులో పరిశీలించు కోవాల్సిన అవసరం ఉంది.దోషారోపణ చేయనటువంటి మనస్సాక్షిని మనము కలిగి ఉండాలి అని, దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది.

ఎస్తేర్ క్రైసోలైట్

15-7-2025

🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃