2025 Messages
Praise The Lord
🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
అడ్డంకులను మూసే తాళం దేవుని వాక్యం 🔑 📖
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
మన జీవితంలో కొన్ని సంఘటనలు అవరోధాల్లా ఎదురవుతాయి. అవి వచ్చినప్పుడు నేను వాటిని కేవలం సమస్యలుగా కాకుండా, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో వినే అవకాశంగా చూస్తాను. నేను వెంటనే దేవుని సన్నిధిలోకి వెళ్లి, ఆ పరిస్థితికి సంబంధించిన వాక్యాన్ని, వర్తమానాన్ని రాసుకుంటాను. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాక్యం అనేది కేవలం ఓదార్పు మాట కాదు — అది ఆ సమస్య తలుపుపై వేసే తాళం. నేను దాన్ని వెలుపలికి, బయటకు, విడుదల చేసినప్పుడు, ఆ వాక్యములో వున్న శక్తి ఆ పరిస్థితిని మూసివేస్తుంది బంధిస్తుంది. నా విశ్వాసం ఏమిటంటే, దేవుడు మాట్లాడిన తర్వాత ఆ అవరోధం ఆ ఆటంకము యిక నిలవదు అని.
నా జీవితంలో ఈ సూత్రం ఖచ్చితముగా అమలు జరుగుతు వుంటుంది. అందుకే ప్రతి దానికి దేవుడు ఎం! మాట్లాడుతాడ అని ఎదురుచూస్తు దేవుడు తన వాక్యం ద్వార మాట్లాడినప్పుడు, వెంటనే ఒక సందేశమును ఒక వర్తమానమును రాసేస్తా, అలా వ్రాసినప్పుడే, దేవుడు నాకు ఫలితాన్ని యిస్తాడు.
దానియేలు చేసే ప్రార్థన ఆపాలని చూసి, చివరికి సింహాల బోనులో పడిన వారి ఉదాంతము దానియేలు గ్రంథం 6:24 లో ఉంది.
దానియేలు 6:24
రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహ ముల గుహలో పడద్రోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి, సింహములు వారి యెముకలను సహితము పగులగొరికి పొడిచేసెను.
ఇది దానియేలు ప్రార్థన ఆపకపోవడంతో, అతన్ని సింహాల గుహలో వేసిన తర్వాత దేవుడు అతన్ని రక్షించిన సంఘటన తర్వాత ఇది జరుగుతుంది. ఆ కుట్రచేసిన వారినే రాజు ఆజ్ఞ ప్రకారం సింహాల గుహలో వేసాడు. దానియేలు 6వ అధ్యాయంలో మనము దీనిని చూడవచ్చు,
భక్తిపరుడు దేవునియందు భయభక్తులు కలిగిన ఇటువంటి పరిస్థితి శాసనము వచ్చినప్పటికీ తాను నమ్మిన దేవుణ్ణి ప్రార్థించడం, ఆ దేవుని సన్నిధిని వదలకుండా ఉంటున్న దానియేలు మీద, అపనిందలు వేసి ఆ రాజ్యంలోని కొంతమంది ప్రజలు కుట్ర దారులు రాజు ద్వార తనని సింహాల బోనులో వేస్తారు,
అసలు దానియేలు చేసిన తప్పు ఏమిటి? ఏమి లేదు సర్వసృష్టికర్త అయిన, తాను గ్రహించిన నిజమైన దేవుణ్ణి తాను నివసిస్తున్న తన గృహములో ఉండి ప్రార్థించటం, ఆ దేవున్ని సేవించటం ఇది దురదగొండి, స్వభావం కలిగిన కొంతమందికి నచ్చలేదు,
బబులోను రాజ్యం దార్యావేషు కాలంలోనే ఈ "సింహాల బోను" సంఘటన జరిగింది.దేవుని ప్రజల పైన అన్యజనుల అధికారం రాజ్య పరిపాలన ఆనాడే కాదు ఈనాడు కూడా జరుగుతూ ఉంది, మన యింటిలో మనము దేవున్ని సేవిస్తు వుంటే, వాళ్ల లో వున్న వ్యతిరేఖా అత్మ అటంకాలను కలుగజేస్తు వుంటుంది.
దానియేలు ప్రార్థన ఆపకుండ వున్నందుకు అతని మీద కుట్ర చేసినవారు చివరికి తామే సింహాల గుహలో పడ్డారు (దానియేలు 6:24). మనం దేవుని సన్నిధిలో ఉండటానికి ప్రయత్నిస్తే, కొంతమంది మనలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ దానియేలు లాగా మనం ప్రార్థనను ఆపకుండా, దేవుని మీద విశ్వాసముతో నిలబడి ఉంటే, దేవుడు మన కోసం యుద్ధం చేస్తాడు. మనం నిశ్శబ్దంగా విశ్వాసంలో నిలబడితే, మనకు ఏర్పడిన అడ్డంకులు, కుట్రలు, దేవుని న్యాయం, తీర్పుతోనే కుప్ప కూలిపోతాయి.
దేవుని పట్ల విశ్వాసంలో ప్రార్థనలో స్థిరంగా ఉన్నవారిని, ఏ రాజ్యమూ, ఏ శక్తులూ కూడ నాశనం చేయలేవు. ఎందుకంటే కాపాడే దేవుని శక్తి దేవుని ప్రజల చూట్టు ఎప్పుడు వుంటునే వుంటుంది.
సింహం సింహాల గుహ, దేనికి చిహ్నంగా దేనికి గుర్తుగా ఇక్కడ తెలియ పరచ బడుతుంది అని అంటే, శ్రమ కష్టాలు పరీక్షలు మరణము వంటి విషయాలకు ఇది గుర్తుగా ఇక్కడ మనకు కనబడుతుంది,దేవుని ప్రజలు అన్యజనుల ద్వారా కానీ మరి ఎవరి ద్వారా అయినా సింహాల గుహ ఆనే ఇటువంటి పరిస్థితులలో పడిపోయినప్పుడు, అందులో నుంచి వాటిని జయించి వారిని బయటకు తీసుకు రాగలిగే శక్తి వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి ఉంది, కాబట్టి దేవుని ప్రజలు ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు వారు జయిస్తారు,జయించే దేవుని ప్రజలుగా గుర్తింపును పొందుతారు,
సింహాల గుహ లాంటి ఇటువంటి పరిస్థితుల గూండ దేవుని ప్రజలు ప్రయాణించిన,అవి వారిని ఏమి చేయలేవు, కానీ దేవున్ని సేవించని ప్రార్ధించని ప్రజలు ఇటువంటి పరిస్థితులకు గుండా వెళ్లినప్పుడు వారు ఖచ్చితంగా అపరిస్థితి అనే సింహాల నోటికి చిక్కబడి మరణానికి గురి అవుతారు అన్న ప్రాముఖ్యమైన, సందేశమును, బలముగా దానియేలును గురించిన ఈ సందర్భము మనకు తెలియజేస్తుంది,
మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులను సమస్యలను చూసి వెనక్కి తగ్గుతున్నారా? లేక దానియేలు లాగా ప్రార్థనలో స్థిరంగా నిలబడి ఉన్నారా?
ఎస్తేర్ క్రైసోలైట్
9-8-2025