CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

Praise The Lord

🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃

నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి.

🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃

{ ఈ లోక పద్ధతులు ప్రకారం ఈ లోకానుసారమైన కట్టడలు ప్రకారం,వెళుతున్న వ్యక్తులకు, నాకు మధ్య ఒక పోరాటం అన్నది జరుగుతూ ఉంది.ఈరోజు ఉదయమే కలవరంతో, సమాధానం లేని మనసుతో, నేను లేచాను,నా సమస్యకు పరిష్కారము ఇవ్వమని దేవుని ప్రార్థించి, దేవుని దగ్గర వాగ్దానం తీసుకున్నాను,దేవుడు కృప సమాధానము ఇస్తానన్నాడు, కానీ ఇది ఎలా ఇస్తాడో నాకు అర్థం కావడం లేదు, నాకు అర్థమైతే నా హృదయానికి నెమ్మది కలుగుతుంది, నేను వెంటనే నేను ఎప్పుడూ చూసే మా దైవజనుల ఛానల్ లోకి వెళ్లి ఈరోజు వాగ్దానాన్ని చూశాను,

అది చూస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక వర్తమానాన్నిస్తూ వచ్చాడు, వెంటనే దాన్ని వ్రాస్తూ వచ్చాను, అది వ్రాస్తు ఉన్న సమయంలోనే, నాకు ఒక నెమ్మదిని నా హృదయంలో దేవుడు ఇస్తూ వచ్చాడు.దేవుని వాక్యంలో "ఎంతో శక్తి " దాచబడి ఉంటుంది,అది వెతికే వారికే ప్రత్యక్షమవుతుంది, వారికే సమాధానాన్ని ఇస్తుంది.ఆ దేవుని శక్తి ఎంత గొప్పదో మనము భయపడకుండా ఇతరులకు ప్రత్యక్ష పరచాలి}

“నీతి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారే”, ఆయన వాక్యమే విత్తనం, ఆయననే మనం మన జీవితాలలో, మనము చేసే ప్రతి పనిలో మనము ప్రారంభించే ప్రతి దానికి ముందు మాత్రమే కాకుండా ఇతరుల హృదయాలలో కూడా దానిని మనము విత్తాలి.హోషేయా 10:12 నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి.

విత్తనమేమిటి? ఎవరి విత్తనము?

ఈ వాక్యాలలో "నీతి విత్తుడి" అనే పిలుపు, కేవలం మానవ నీతిని గురించి చెప్పటం లేదు ఎందుకంటే మానవ నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డ వలే ఉన్నది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది మరి అయితే మనం విత్తల్సిన నీతి ఏమిటి మానవ నీతి కంటే విలువైన నీతి ఇంకొకటి ఉన్నదా! అవును మానవుని నీతి కంటే గొప్ప నీతి నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి నీతి అని ఈ వాక్యము దీని గురించి మనకు తెలియ జేస్తుంది

ఆదియందు వాక్యముండెను ఆ వాక్యము దేవునియొద్ద ఉండెను ఆ దేవుని వద్ద ఉన్న వాక్యము దేవుని నీతిని నెరవేర్చడానికి మానవుల మధ్యకు క్రీస్తు యేసు ప్రభువు వారి రూపంలో ఈ లోకానికి వచ్చింది,నీతిలేని ప్రజలలో నీతి కలిగిన వెలుగై యున్న ఈ వాక్యము వచ్చినప్పుడు వారు నీతిని కలిగి బ్రతుకుతారు చీకటిలో నుంచి వెలుగులోనికి వెలుగు సంబంధులుగా నీతి మంతులుగా మారతారు, 1కోరింథీయులకు 1:31

"దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను."

ఇటువంటి జ్ఞానము నీతియు పరిశుద్ధతయు విమోచనమును కలిగించే వాక్యమును వాక్యమనే విత్తనమును ఎవరు కలిగి ఉంటారో,ఈ నీతి కలిగిన వాక్యమే విత్తనమును ఎవరు ఇతరుల జీవితాలలో హృదయాలలో విత్తుతారో వారు పరలోకంలో నిత్యత్వంలో,శాశ్వతమైన బహుమానమును దేవుని నుంచి అందుకుంటారు,సామెతలు 11:18

నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. "నీతి అనే విత్తనమును విత్తువాడు నిశ్చయముగా శాశ్వతమైన బహుమానమును పొందును."

వాక్యమై ఉన్న యేసు క్రీస్తు ప్రభువు వారే మన చేతిలో నీతి కలిగిన విత్తనముగా ఉన్నారు.మనం చేసే ప్రతి పనిలో మనం ప్రారంభించే ప్రతి విషయంలో నీతి కలిగిన క్రీస్తు యేసు ప్రభువు వారు విత్తనముగా వేయబడాలి, మన మాటలు కాదు, మన అభిప్రాయాలు కాదు, —నశించిపోయే లైయమయి పోయో ఈ లోక సంబంధమైన కట్టడాలు,మానవ పద్ధతులు కూడా అసలే కాదు,

"వాక్యమైయున్న యేసే నీతివిత్తనము. అది నశించదు. అది మనకు అద్భుతమైన ఆశ్చర్యాన్ని,

తీసివేయలేని శాశ్వతమైన లాభాన్ని ఇస్తుంది.”

మీకు సంబంధించిన ఏ విషయంలోనైనా, మీరు ప్రారంభించే ఏ పనిలోనైనా ముందు నీతి అయినా వాక్యమును,మీరు వేశారా! అయితే అది నశించిపోదు, అది మీకు విజయాన్ని తెస్తుంది, అది మీరు ఫలించేటట్లు చేస్తుంది,యోహాను 15:5

ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.

యోహాను 15:7 నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును.

‘నీతి’ అనే ఈ వాక్యపు విత్తనము, మన జీవితంలో మాత్రమే కాదు — ఇతరుల జీవితాల్లోనూ శాశ్వత లాభాన్ని తెచ్చే విత్తనము. ఇలాంటి వాక్యాన్ని వారి హృదయాల్లో విత్తడం… అదే పరలోక సంబంధమైన పరిచర్య. ఇది మన పిలుపు, మన బాధ్యత."

ఈ నీతి అనే దేవుని వాక్యపు విత్తనము,చీకటిలో ఉన్న,సాతాను బంధకాలలో ఉన్న, పాడుబడి ఉన్న మట్టి లాంటి, హృదయాలలో పడాలి,

అంటే నీతి లేని హృదయాలలో, ప్రభువును పిలవని మనుషుల మధ్యలో, ఇతరులు ఇంకా యేసును పొందని ప్రదేశాలలో — మనము మాట్లాడే దేవుని వాక్యపు మాటలు, మన నడక, మన ప్రార్థనలు ద్వారా ఆయనను నీతిమంతుడైన, వాక్యమై ఉన్న, సమస్త మానవుల కొరకు నీతిగా చేయబడిన క్రీస్తు యేసు ప్రభువారిని,మనము విత్తాలి.

ఫలించని బీడుబడిన మనకు సంబంధించిన విషయాలలో కానీ, ఇతరుల జీవితాలలో కానీ, మనము ఈ వాక్యము అనే విత్తనాన్ని ఎందుకు విత్తాలి అని అంటే,మనము విత్తనమని వాక్యాన్ని నాటినప్పుడు,ఆ వాక్యం అని విత్తనము ఫలించడానికి,అవసరమైన ఆశీర్వాదాలు అనే వర్షాన్ని, దేవుడు పంపుతాడు, విత్తనము వేయటం మన బాధ్యత, వర్షం అనేది, దేవుని ఆశీర్వాదం.

మనకు సంబంధించిన విషయాలలో కానీ ఇతరుల జీవితాలకు,సంబంధించిన విషయాలలో కానీ వాక్యం అనే నీతి విత్తనమును,మనము వేయకుండా ఈ లోక సంబంధమైన పద్ధతులను పాటిస్తూ, ఈ లోక సంబంధమైన ఈ లోకానుసారంగా నడిచే కట్టడాలను కట్టుకుంటూ,ఉంటే అక్కడ విత్తనం అన్నది లేని కారణంగా,దేవుడు వర్షాన్ని కురిపించిన,అక్కడ అభివృద్ధి అన్నది ఆశీర్వాదం అన్నది కనపడదు.

దేవుడు మంచివారి మీద చెడ్డ వారి మీద కూడా ఆశీర్వాదాలు అనే వర్షాన్ని కురిపిస్తాడు కానీ విత్తనం అన్నది ఉన్నప్పుడే శాశ్వతమైన ఆశీర్వాదాలు వారు కలిగి ఉంటారు, ఆవి అక్కడ స్థిరంగా ఉంటాయి.

మీ జీవితాలలో ఇతరుల జీవితాలలో, మీరు వేసే నీతి విత్తనము — వాక్యమైయున్న యేసు అయి వున్నాద !

ప్రభువు యేసే నీతి. ఆయన వాక్యమే శక్తి.

ఆయనను హృదయాలలో విత్తిన ప్రతి వ్యక్తికి శాశ్వతమైన ఫలితం దొరుకుతుంది. ప్రభువు చూసేది మట్టిని కాదు, విత్తిన వాక్యాన్ని చూసి,ఆ వాక్యము ద్వారా కలిగి ఉన్న విశ్వాసాన్ని చూసి, ఫలితాన్ని,ప్రభావాన్ని,ఆశీర్వాదాలను తెచ్చే వర్షమును పంపిస్తాడు. రోమీయులకు 1:3

మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగు గాక, ఆమెన్ ఆమెన్ ఆమెన్.

ఎస్తేర్ క్రైసోలైట్

1- 8-2028

🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃📖🌱💧🌾🔥