CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

ఎంచుకునే మార్గమే భవిష్యత్తును నిర్ణయిస్తుంది

సామెతలు 1:15,16

నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు తీసికొనుము కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు.

నరహత్య చేసేవారి మార్గంలో కీడు చేసేవారి త్రోవలో పరిగెట్టకుండా వారి మార్గములలో మనము ప్రయాణించకుండా ఉండాలన్నదే దేవుని వాక్యంలో ఉన్న ఉపదేశము ఇక్కడ మనకు కనపడుచున్నది

మనము ఎలాంటి జీవిత మార్గాన్ని ఎంచు కుంటున్నామో అది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది చెడు మరియు పాపం ఉన్న మార్గాలకు దూరంగా ఉండమని పరిశుద్ధ గ్రంథము మనకు స్పష్టముగ తెలియజేస్తుంది.

ఈ వాక్యము మనకు తెలియజేసే ప్రాముఖ్యమైన సందేశం ఏమిటంటే పాపుల మార్గంలో నడవకుండా, కీడు చేసేవారి సన్నిధికి దూరంగా ఉండి పాపులు దుష్టులు ఇచ్చిన పిలుపును తిరస్కరించాలని మరియు దుర్మార్గుల మార్గంలో నడవకుండ

నీతిమంతులు గడిపే జీవితాన్ని గడపమని సూచిస్తుంది.

కీడు చేసేవారి మార్గం మరియు నరహత్య చేసేవారి త్రోవలు భయంకరమైనవి, మరియు వాటిలో నడవకూడదు. నీతి, భక్తి కలిగిన మార్గమే దేవుని ఆశీర్వాదం పొందే మార్గము దుష్టుల మార్గంలో నుండి పూర్తిగా తొలగిపోయి క్షేమాన్ని ఇచ్చే మంచి మార్గంలో నిలవమని నడువమని చెప్పే స్పష్టమైన హెచ్చరిక.

పరిశుద్ధ గ్రంథంలో దుష్టుల మార్గంలో నడిచిన వారు మరియు ఆ మార్గాన్ని తిరస్కరించిన వారు అనే రెండు విభిన్న రకాల ప్రజల జీవితాల గురించి వృత్తాంతాలు మనకు కొన్ని మంచి పాఠాలను అందిస్తాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు

1. దుష్టుల మార్గంలో నడచిన వారు

కయీను :

కయీను నడచిన దుష్టమార్గము గురించి (ఆదికాండము 4:1-16) వచనాల వరకు ఇది మనకు కనబడుతుంది కయీను తన తమ్ముడగు హేబేలు పట్ల అసూయతో నిండిపోయి, అతనిని హత్య చేసాడు.దీని నుంచి మనము నేర్చుకోవలసిన పాఠము ఏమిటంటే దేవుని మార్గమును అనుసరించకపోతే, అసూయ మరియు పాపము ఆనేవి మన జీవితాన్ని నాశనం చేస్తాయి

అహాబు :

1రాజులు 21:25

​తన భార్యయైన యెజెబెలు ప్రేరేపణచేత యెహోవా దృష్టికి కీడుచేయ తన్నుతాను అమ్ముకొనిన అహాబువంటి వాడు ఎవ్వడును లేడు.

1 రాజులు 21 వ అధ్యాయంలో అహాబు తన భార్య అయిన యెజబేలు సలహా మేరకు దుస్టుల మార్గంలో నడచి నీతి మంతుడైన నబోతు పిత్రార్జితమైన ద్రాక్ష తోటను స్వంతము చేసుకోవటానికి కీడునకు తనని తాను అప్పగించుకోని దుష్టుల మార్గంలో తాను నడిచాడు

ఇక్కడ దుష్టుల మార్గము అనేది అవినీతికి హత్యకు, మరియు విగ్రహారాధనకు దారిని కల్పించింది ఆహాబు దుష్ట మార్గంలో నడవటం వలన దేవుని శిక్ష తన మీదకు వచ్చి తన వంశం పూర్తిగా నాశనం అయిపోయింది

యూదా ఇస్కరియోతు :

యూదా ఇస్కరియోతు (మత్తయి సువార్త 26:14-16;వరకు యోహాను సూవార్త 13:21-30) వరకు యూదా ఇస్కరియోతు యొక్క మార్గము ఏమిటంటే డబ్బు కోసము యేసుక్రీస్తు ప్రభువు వారిని అమ్మివేసేటటు వంటింది పాపం చేసి ప్రాణమును తీసుకొనే కీడును మరణమును పొందాడు

2. దుష్టుల మార్గం తిరస్కరించి దేవుని మార్గం నడచిన వారు

యోసేపు (ఆదికాండము 39)

యోసేపు యొక్క మార్గం నీతి కలిగినది అక్రమమును తిరస్కరించిన మార్గము

పోతిఫారు భార్య అతన్ని పాపం చేయమని ప్రేరేపించిన యోసేపు తన నీతిని నిలబెట్టుకుని పాపానికి లొంగకుండా, దేవుని భయంతో పాపాన్ని తిరస్కరించాడు.అక్రమమైన మార్గమును పాపమును తాను తిరస్కరించి నందుకు దేవుడు అతనిని (ఈజిప్టు దేశాధికారిగా) పెద్ద స్థాయికి చేర్చాడు.

దానియేలు :

(దానియేలు 1:8; 6:10)

దానియేలు యొక్క మార్గం:

బబులోను రాజ్యములో రాజు ప్రవేశపెట్టిన విగ్రహారాధనను అనుసరించకుండా దానిని పూజించకుండా,దేవుడిచ్చిన ఆజ్ఞను దేవుడు ఏర్పరిచిన క్రమమును తప్పకుండా దేవుని చిత్తానికి లోబడి రాజు ఆజ్ఞకు వ్యతిరేకంగా దేవుని ప్రార్థనలో నిలబడ్డాడు.

పౌలు

(సౌలు) (అపొస్తలుల కార్యములు 9:1-22)వచనముల వరకు

పౌలు యొక్క మార్గం:

మొదట సౌలు గా ఉన్నప్పుడు అతను క్రైస్తవులను హింసించాడు, కానీ యేసు క్రీస్తు ప్రభువు వారు తనను ఎదుర్కొని తన మార్గాన్ని పూర్తిగా మార్చివేసినప్పుడు యేసు క్రీస్తు ప్రభువు వారి సువార్త ప్రచారకుడయ్యి అనేక మంది ప్రజలను క్రీస్తు వైపుకు తీసుకు వచ్చాడు.

దుష్టుల మార్గం నడిచినవారు: కయీను, అహాబు, యూదా ఇస్కరియోతు వీరు తమ ఆక్రమమైన మార్గములలో నడిచి తాము తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల శిక్ష పొందారు.

నీతి మార్గం నడిచినవారు: యోసేపు, దానియేలు, మరియు పౌలు వంటి వారు దేవుని చిత్తానుసారముగా జీవించి ఆశీర్వాదాలను పొందారు.

సామెతలు ఒకటవ అధ్యాయము 15వ వచనము 16వ వచనంలో ఉన్న ఈ వాక్యములు మనకు ఒక పాఠాన్ని బోధిస్తున్నాయి దుష్టుల మార్గము తాత్కాలికంగా మనలను ఆకర్షిస్తుంది గానీ, అది నాశనానికి దారి తీస్తుంది. దేవుని మార్గము శాశ్వతమైన శాంతిని ఆశీర్వాదాలను అందిస్తుంది.

ఎస్తేర్ క్రైసోలైట్

4-1-2025

Written By: Sis.Esther Chrysolyte

Written On: 4-1-25