2025 Messages
Praise The Lord
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
దేవుడు నిజంగా ఉన్నాడా?
పరీక్షించడానికి ఒక్కసారి ప్రయత్నించండి!
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
సంఖ్యా 18:20
నీ పాలు నీ స్వాస్థ్యము నేనే.
సంఖ్యాకాండము 18:20
మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు; వారి మధ్యను నీకు పాలు ఉండదు; ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే.
ఈ వాక్యంలో దేవుడు లేవీయులపై ఆయన ఉన్నతమైన పిలుపును మరియు వారి ప్రత్యేకతను స్పష్టంగా ప్రకటిస్తున్నాడు. లేవీయులకు దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినట్లు స్వాస్థ్యము అంటే భూమి లేదా ఆస్తి అటువంటిది ఏమి కూడా లేవీయులకు ఇవ్వలేదు. వారు దేశాన్ని,దేశంలోని భూభాగంలో భాగమును వారు పొందకపోయినా, వారికంటే గొప్పదైన ఒక భాగమును దేవుడు వారికి ఇచ్చాడు — తానే వారి పాలు, వారి స్వాస్థ్యముగా,దేవుడు వున్నాడు.
దేవునికి వచ్చిన అర్పణలు తీసుకుని, ప్రజల శ్రేయస్సుకోసం దేవుని సేవలో నిరంతరంగా ఉండే బాధ్యత లేవీయులకు ఉంది. అందుకే వారు భూమిని పొందకుండా, దేవుడే వారి సంపూర్ణమైన ఆధారం, వారికిచ్చిన బాగమై పోయాడు.
ఈ వాక్యం మనకీ ఒక గొప్ప గుర్తింపు ఇస్తుంది —
మనకు ఈ భూమి మీదా భాగాలు, ఈ లోకంలో కనిపించేవి ఏమీ లేకపోయినా, దేవుడు తానే మన భాగము అయినప్పుడు, మనకెలాంటి లోటు లేదు. దేవుడే మన Portion మన భాగం అయితే, అదే నిజమైన సంపద మనకు!
నా జీవితంలో నేను తీసుకున్న మొట్టమొదటి వాగ్దానము "నీ పాలు నీ స్వాస్థ్యము నేనే." ఒక నూతన సంవత్సరం రోజున నా తల్లి నన్ను మందిరానికి తీసుకుని వెళ్ళింది,ప్రార్థన అయిన తర్వాత, అక్కడ కానుకలు వేసి వాగ్దానాలు తీసుకుని రావటం దీనిని నేను చూసి నా తల్లి నడిగాను, ఇది ఏమిటి ? వాళ్లు ఏమో స్లిప్పులు తీసుకుంటున్నారు ఏమిటి ? అని అడిగినప్పుడు, నా తల్లి నాతో ఏమని అన్నదంటే,అవి వాగ్దానాలు ఈ సంవత్సరం మన జీవితంలో దేవుడు ఏమి చేయబోతున్నాడో, వాటిలో కనపడుతుంది, వాటి ద్వారా మనతో మాట్లాడతాడు, అని చెప్పినప్పుడు నాకు బాగా నవ్వు వచ్చింది, ఎందుకంటే అప్పటికి దేవుడు ఉన్నాడు అంటే నేను నమ్మేదాన్ని కాదు,
కానుక వేయటానికి నా వంతు వచ్చినప్పుడు నేను నా మనసులో అనుకున్నాను, నిజంగా నువ్వు దేవుడువైతే నీవు సజీవంగా ఉంటే, ఇప్పుడు నా మనసులో ఒక వ్యక్తిని నేను ఇష్టపడుతున్నాను, నా మనసులో ఉన్నది ఏంటో ఇప్పుడు నేను తీసుకునే ఈ స్లిప్ లో రావాలి, అప్పుడే నేను నిజంగా నువ్వు దేవుడువని నువ్వు ఉన్నావని నమ్ముతాను, అని అనుకొని కానుక వేసి అ వాగ్ధానమును తీసుకున్నాను, అప్పుడు వచ్చిందండి ఈ వాగ్దానం,
ఆ క్షణం నేను గుర్తించాను దేవుడు ఉన్నాడు, సజీవంగా మనల్ని చూస్తున్నాడు,అన్న ఒక భయం ఆ క్షణాన నాలో కలిగింది,అసలు ఇంత సూటిగా మనతో ఎవరైనా మాట్లాడుతారా, దేవుడు మాట్లాడతాడు మనతో, ఎవరు మన ప్రశ్నకు జవాబును ఇలా ఇవ్వలేరు, మన హృదయంలో ఉన్నది,మన హృదయాన్ని గుర్తించేది ఒక్క దేవుడు మాత్రమేనండి, ఆ క్షణానుంచి నేను దేవుని వదిలిపెట్టలేదు, దేనికైనా దేవుని దగ్గర నుంచి జవాబును పొందడం నాకు అలవాటయింది.
చాలాసార్లు మనము బాధపడుతూ ఉంటాము, ఈ లోకంలో అన్నీ ఉన్నా అన్ని సంబంధాలు మనం కలిగి ఉన్న ఏ సంబంధం కూడా మనకు మేలును చేయలేదు, ఈ లోకంలో ఉన్నవాళ్లు ఈ లోకంలో ఉన్న వాటి ద్వారా బాంధవ్యాల ద్వారా ప్రేమను పొందుతారు,వాళ్లకి అవసరమైన అన్నిటిని వాళ్ళు పొందుతారు, కానీ దేవునిలో ఉన్నవారికి ఇలా జరగదు, ఎందుకంటే దేవుడే వాళ్ళ పాలు వాళ్ళ భాగమై ఉన్నాడు,దేవుని ఆడిగి వారు ప్రతీది పొందాలి,ఇశ్రాయేలీయుల మధ్య లేవీయులు ప్రత్యేకమైన వారు కాబట్టే దేవుడే వారి భాగమయ్యాడు,
ఈ లోకంలో జీవించే దేవుని ప్రజలు కూడా ప్రత్యేకమైన వారు వారి భాగం వారి స్వాస్థ్యము దేవుడే,దేవుని ప్రజలు దేవుని సేవించేవారు కాబట్టి, వారికి ఈ లోకంలో అన్నీ ఉన్న వాటిని బట్టి,దేవుడు వారిని నడిపించడు, అన్ని ఉన్నప్పటికీ ప్రతి విషయంలో దేవుని ప్రార్థించి, దేవుని అడిగి, దేవునిపై ఆధారపడినప్పుడే, దేవుడు వారికి అనుగ్రహిస్తాడు.
నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అన్న వాగ్దానము నాకు వచ్చినప్పుడు అప్పుడు నాకు తెలియదు,నేను అడిగిన నా ప్రశ్నకు జవాబును దేవుడిచ్చాడు, దేవుడు ఉన్నాడు,సజీవంగా నన్ను చూస్తున్నాడు, అన్న విషయాన్ని మాత్రమె నేను గుర్తించాను, కానీ సర్వశక్తుడు అయిన దేవునిలో నాకు భాగముందని,నాకు ఎన్ని ఉన్నప్పటికీ, నా జీవితంలో నా ప్రతి అవసరానికి దేవునిపై మాత్రమే, నేను ఆధారపడి జీవించాలని,అక్షణాన నాకు అర్థం కాలేదు.
ఈ విషయాన్ని దేవుడు నాకు నెమ్మది నెమ్మదిగా ప్రత్యక్ష పరుస్తు, ఉన్నప్పుడు నాకు అర్థమైంది, ఈ లోకంలో నేను కలిగి ఉన్న సంబంధ బాంధవ్యాలకు,నేను ఎటువంటి ప్రాధాన్యత, యివ్వలో దేవునికి ఎటువంటి ప్రాధాన్యత, యివ్వాలో అన్న విషయాన్ని నేను గ్రహిస్తూ వచ్చాను,
ఈ లోకంలో మనం కలిగి ఉన్న ఏ బాధ్యత అయినా అది దేవుడు నాకు ఇచ్చాడు, పరిస్థితులు, మనుషులు,నాకు అనుకూలంగా ఉన్న లేకపోయినా నా బాధ్యతను నేను నిర్వర్తించాలి, అన్న గ్రహింపు,భక్తి ఉన్నవాళ్ళకు కాదు కానీ, ఒక దేవునికి భయపడే వారికి మాత్రమే ఉంటుంది.మిగతా ఎవరికైనా సరే నాకు ప్రాధాన్యత నివ్వాలి, అన్న తలంపును కలిగి అతి ఎటువంటిది అంటే, దేవుడి కంటే ముందు వారికి ప్రథమ స్థానం ఇవ్వాలి అన్నంతగా ఉంటుంది,
దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి అనుకున్నావారికి,నాకు ప్రథమ స్థానం కావాలి అని అనుకునే వారికి మధ్య, ఒక పోరాటం అన్నది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, దేవునికి ఎటువంటి ప్రాధాన్యత నేను ఇవ్వాలి అన్న విషయాన్ని, నేను ఎప్పుడు గ్రహించానో, అప్పుడు ప్రారంభమైంది ఒక పోరాటం నాకు,
మీరు కూడా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలని,అందరికంటే ఎక్కువగా దేవునికి ప్రాధాన్యతనివ్వాలని మీరు అనుకుంటున్నారా, అయితే మీ పాలు మీ స్వాస్థము దేవుడే,దేవుని నడిగే మీరు ప్రతిదీ పొందాలి, దేవునిలో కాకుండా వేరేగా మీకు ఏది రాదు,ఈ లోకంలో మీకు ఎన్ని భాంధవ్యాలు ఉన్నా, ఎంత పరపతి ఉన్నా, ఎంత సమృద్ధి ఉన్నా, దేవునిపై ఆధారపడందే మీకు ఏది రాదని మీ అవసరత ఏది కూడా తీర్చబడదని, మీ పాలు మీ స్వాస్థ్యము దేవుడే అని మీరు గుర్తించగలరా !
ఎస్తేర్ క్రైసోల్తెట్
29-7-2025