CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

Praise The Lord

🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃

కృప అనేది దాచబడిన ఒక విలువైన ధనం

🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃

ఇది నిజమా ! ఆవును ఆవుననే చెప్పాలి, పరలోక రాజ్యము దాచబడిన ఒక ధనము అని పరిశుద్ధ గ్రంధం మనకు తెలియజేస్తుంది,ఈ దాచబడిన ధనమనే పరలోక రాజ్యంలో నుండి మనకు ఇవ్వబడే ఒక ధనమే కృప, దీనిని అనుభవం ద్వారా మాత్రమే మనము పొందగలము,

కృప అంటే మనము పొందలేని దానిని పొందగలిగే అర్హతను పొందటమె కృప,

ఈ దేవుని కృప అనేది ఎవరికి యివ్వబడుతుంది ఆని అంటే, భలహినతల గుండా ప్రయానించిన అనుభవము కలిగిన వ్యక్తి మాత్రమే ఈ కృపను పొందుతాడు, అందుకనే దేవుడు పౌలుతో,

2 కోరింథీయులకు 12:9

అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము(లేక,నన్ను కప్పునిమిత్తము) , విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.

పౌలుకి కలిగిన బలహినతలు ఎమిటి ?

ఒక చోట కళ్ల జబ్బు అని, వ్రాయబడి వుంది,

పౌలు కల్ల జబ్బుతో బాధపడుతున్నాడని నేరుగా బైబిల్లో ఎక్కడా స్పష్టంగా చెప్పబడలేదు. కానీ కొంతమంది బైబిల్ పండితులు మరియు వ్యాఖ్యాతలు గలతియులకు 4:13-15 మరియు గలతియులకు 6:11 వాక్యాల ఆధారంగా అతనికి గోచరము కానీ, రహస్యమైన,అదృశ్యమైన, అంతర్గతమైన, సమస్య ఉండవచ్చని భావిస్తున్నారు.

గలతియులకు 4:13 - 15

మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానినిబట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతనువలెను, క్రీస్తుయేసును వలెను నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసి యుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను.

ఇక్కడ “మీరు వీలైతే మీ కన్నులను కూడా తీసివేసి నాకు ఇచ్చెదరనుకొంటిని” అన్న మాట ద్వారా, పౌలుకు కళ్ల సమస్య ఉండవచ్చునని అర్థం చేసుకుంటారు.

గలతియులకు 6:11

నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి.

ఈ వాక్యం ప్రకారము, పౌలు “బొద్దుగా అక్షరాలు” వ్రాసాడని చెబుతున్నాడు. కొందరు వ్యాఖ్యాతలు దీన్ని అతని చూపు బలహీనతకు సంకేతంగా భావిస్తారు. శాస్త్రీయంగా చెప్పాలంటే:

ఈ వచనాలు పౌలుకు నిజంగా కళ్లు సంబంధించిన వ్యాధి ఉందని నిర్ధారించవు, కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో భాగంగా చూపు సమస్య ఉండవచ్చునని సూచనగా పరిగణిస్తారు. అలాగే ఆయన "శరీరబలహీనత" గురించి పలుమార్లు ప్రస్తావించాడు

2 కోరింథీయులకు 12:7-10

నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని.

అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము(లేక,నన్ను కప్పునిమిత్తము) , విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను.

* అంటే పౌలుకు ఉన్నది ఒక "రోగం మాత్రమే" అనడం వాక్యాన్ని పరిమితం చేయడమే అవుతుంది.*

1. “నా శరీరములో పాపమైయున్న మరో శక్తి”

రోమీయులకు 7:22 - 25

అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో నున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవనియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనైయున్నాను.

తన శరీరంలో ఉన్న పాపపు శక్తితో పోరాటాన్ని పౌలు అనుభవించగలిగాడు, అందుకే రాయ గలిగాడు. తన శరీరంలో మరొక శక్తి పనిచేస్తోందని.

తన మనస్సు ధర్మశాస్త్రాన్ని ప్రేమించినా,

తన శరీరం పాపపు శక్తికి లొంగుతున్నదని.

ఇది తత్వవాదం కాదు — అనుభవం. తన శరీరంలో పాపం పనితీరు తాను రుచి చూచాడు. అందుకే

రోమీయులకు 7:24 అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?

పాపము ఎంత శక్తి కలిగినదో దానిని అనుభవించేవారికే తెలుస్తుంది, బయట కనిపించే పాపమే కాదు, లోపల పనిచేస్తున్న పాపశక్తి పౌలుని బాధించింది. శోధించబడ్డాడు.శోధనలో పోరాడాడు.

చాల మంది ఈ శరీరం పరిశుద్ధమైనది అని అతిశయిస్తూ ఉంటారు,అసలు ఈ శరీరం పాపానికి లోను కానిది లోబడనిది పరిశుద్ధమైన శరీరమైతే, మనకు మన శరీరానికి ఆదాములోనే ఎందుకు మరణం వచ్చింది,క్రీస్తు యేసు ప్రభువు వారి పునరుత్థానం ద్వారా మహిమ శరీరాన్ని ఎందుకు మనము ధరించవలసిన అవసరం వచ్చింది, బలవంతులకు పరిశుద్ధులకు కృప అవసరమా? లేక బలహీనులకు పాపులకు దేవుని కృప అవసరమా ?

పాప మన్నది ఎందులో వున్న దాని శక్తి ఎంతో, దాని ప్రభావం ఎలాంటిదో, దాని నుండి భయట పడుట కొరకు తనకు సహాయం చేసే కృప విలువ

ఎటువంటి గొప్పదో,బలహీనులకు పాపులకు మాత్రమే ఆర్ధం అవుతుంది. ఆందుకనే మానవుని భలహీనతలలోనే దేవుని శక్తి పరిపూర్ణం అవుతుంది.

భలహీనతలలోనే దేవుని శక్తి పరిపూర్ణం ఎందుకు అవ్వాలి? ఎందుకంటే ఆదాము నుండి వచ్చిన మానవుని శరీరం మరణంనకు లోనయినది దీనికి జయించే శక్తి లేదు, కాబట్టి బలహిన మైన ఈ శరీరంలో బలమైన దేవుని ఆత్మ శక్తి కృప ద్వారా పనిచేస్తు మనలను బలవంతులుగా చేస్తు వుంది.

2. ఆత్మ శక్తి – మనలో పాపాన్ని జయించే శక్తి:

శోధించబడటం అనేది పాపం కాదు. శోధనలో పడిపోవడం మనిషి స్వభావమే — అది ఆదాము నుంచే వచ్చిందే. ఆదాము శోధించబడి దానిని జయించలేదు, కాబట్టి మరణానికి లోనయ్యాడు.

ఈ శరీరం ఆపవిత్రమైనది, దానిలో పాపం యొక్క శక్తి ఉంది. ఈ పాప నియమం వలన ఆ మరణము లోంచి మనల్ని లేపింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు.

ఆయన పునరుత్థానం ద్వారా మనకు కొత్త జీవితం ఇచ్చారు, మన పాత శరీరపు స్వభావం,పాపం పై మనకు జయము దయచేశారు, పరిశుద్ధాత్మను మనలో ఉంచారు,గలతియులకు 4:6

మరియు మీరు కుమారులై యున్నందున,నాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను.

మన శరీరంలో పాపశక్తి ఉన్నా, పరిశుద్ధాత్మ దానిని ఎదిరించే జయశక్తిని యిచ్చి మనలను నడిపిస్తుంది. ఈ శక్తి లేకుండా మనిషి పాపంపై జయించలేడు.

పౌలుకి బలహీనత ఉంది, అది పాపపు శక్తి మీద అనుభవం. అది రోగం మాత్రమే కాదు,

అది శరీరపు అనుభవం మాత్రమే కాదు, అది లోపల పనిచేసే పాప నియమాన్ని అర్థం చేసుకునే స్థాయి,

బలహీనతలు ఉన్నవారే దేవుని కృపను అర్థం చేసుకోగలరు. పౌలు కూడా శోధించబడ్డాడు

అతని శరీరంలో పాప నియమం ఉంది – పాప శరీరములో పుట్టిన మనిషి – ఎంత పరిశుద్ధుడైనా – శోధనల నుండి పూర్తిగా విముక్తుడు కాదు. పౌలు కూడా.

3. . పౌలు శోధించబడలేదా? బలహీనతలు రాలేదా?

స్పష్టంగా పౌలు తన బలహీనతలు ఉన్నాయని ప్రకటించాడు. మరి ఇవి ఏవీ లేవు అనడం వాక్యానికి విరుద్ధం. (2 కొరింథీ 12:7–10)

'ఇవి పాపపు శోధనలు, శరీరపు అణచివేతలు, లేదా రోగము కూడా కావచ్చును. కానీ అతను తనకు వచ్చిన బలహీనతను “అహంకారం రాకుండా ఉంచే”దిగా చెప్పాడు — ఇది పాపం వైపుగా ఆకర్షించే శక్తిని అంగీకరించే ప్రకటన.

4. పౌలు "పాప నియమము" అనడం దేనిని సూచిస్తుంది?

రోమీయులకు 7:23- 25

వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవము లలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమము నకును, శరీర విషయములో పాప నియమము నకును దాసుడనైయున్నాను.

పౌలు ఇక్కడ ఏదో బాహ్య శత్రువు గురించి మాట్లాడడం లేదు. తన లోపల పనిచేసే పాపపు శక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఇది పూర్తిగా శోధించబడిన వ్యక్తి వ్రాసే ప్రకటన.

నేను దేవుని లోకి వచ్చిన ప్రారంభ సమయంలో, నాకు చెడు తలంపులు అనేవి నా హృదయంలోకి వచ్చేవి కావు, దేవుని పట్ల ఒక భయ భక్తిని నేను కలిగి ఉండటాన్ని బట్టి ఇటువంటి స్థితిని,పరిశుద్ధాత్మ దేవుడు ఒక కాపుదలను, నా హృదయానికి ఇవ్వటం నేను గ్రహించాను, చాలామంది అంటూ ఉండేవాళ్ళు, యవ్వనస్తులు చేడు తలంపులు కలిగి ఉంటారు అని,ఆ మాట విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది, ఎందుకంటే నా హృదయంలో ఆటువంటి ఆలోచనలు వచ్చేవి కావు, నేను గ్రహించాను దేవుడు నా హృదయానికి కాపుదలను ఇచ్చాడు అని,

నా యవ్వన దశలో నేను చాలా గర్విస్తూ ఉండే దాన్ని, నాలాగా దేవునిలో యింత పరిశుద్ధంగా ఎవ్వరు బ్రతకరు అని, ప్రతి సంవత్సరం నన్ను సేవకు పంపించు దేవా అని, వాగ్దానం తీసుకునే నాకు, ఒక సంవత్సరం దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, లేవీయకాండము 26:11

​నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ఈ వాగ్దానము చూసిన క్షణం నుంచి నేను దేవుని అడుగుతు వచ్చాను,మీకు అసహ్యమైనది,నేను ఏమి చేయకూడదు, నాకు కాపుదల ఇవ్వండి అని,దేవుని పదే పదే నించున్న, కూర్చున్న, నా మనసులో ఈ ప్రార్థనే ఉండేది, కానీ ఒక సమయం వచ్చింది, మంచి విషయంలో నుంచే నేను దేవునికి ఇష్టం లేని ఒక పరిస్థితికి,నా హృదయం దేవుని కాపుదలను పోగొట్టుకున్న పరిస్థితికి, నేను వెళ్ళిపోయాను,

యిర్మియా 17:9

హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు? దీనిని ఎవరు గ్రహింప లేరు ఒక్కరు మాత్రమే దీని స్థితి ఎటువంటిదో గ్రహించగలరు, పరిశుద్ధాత్మ మన హృదయంలో నివసించే పరిశుద్ధాత్మ మాత్రమే దీనిని మన హృదయ స్థితిని,గమనించగలదు.

అప్పుడు నేను గ్రహించాను,దేవుని ఆజ్ఞలను అతిక్రమించాలి, అన్న తలంపు ఒకవైపు, అది వచ్చిన వెంటనే అతిక్రమించకూడదు, అన్న తలంపు మరొకవైపు, నా హృదయములో ఒక కలవరమైన సమాధానము లేని ఒక క్షోభను కలిగిన ఒక ఆలజడి,ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా శరీరం ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతున్నాట్లు నా శరీరంలో రెండు నియమాలు వున్నట్లు, అపోస్తులుడైన పౌలు లాగా నేను నా శరీరంలో జరుగుతున్న స్పందనను,ఒక పోరాటాన్ని నేను గమనించాను, అప్పుడు నాకు అర్థమైంది పౌలు గారు ఈ వాక్యాన్ని ఎందుకు వ్రాశాడో, అది నా అనుభవం ద్వారా నేను గ్రహించాను ఈ శరీరం ఎటువంటిదో, నేను అందరికంటే మంచిదాన్ని,అన్న గర్వాములో ఉన్న నేను పడిపోయాను,

ఆ స్థితిలో నుండి నేను బయటపడటానికి మరల దేవుని వాగ్దానం అడుగుతు వచ్చాను,ఆ తర్వాత సంవత్సరమే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, సంఖ్యాకాండము 6:26 యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక.ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చి అద్భుతంగా ఆశోధనలో నుండి నన్ను బయటకు తీసుకొని వచ్చాడు, నా హృదయానికి ఒక కలవరం లేని నెమ్మదిని,సమాధానమును దేవుడు నాకు ఇచ్చాడు.

నేను పడిన స్థితి ఏమిటో నాకు అర్థం అయినప్పుడు,ఈ శరీరంలో ఎటువంటి నియమం ఉన్నదో, అన్న సత్యము మాత్రమే కాదు కానీ,ఆ పరిస్థితిలో నుండి నన్ను పైకి లేపిన, ఆ దేవుని కృప ఎంత విలువైనదో, ఆ దేవుని శక్తి ఎంత బలమైనదో, నేను గ్రహించాను,

"ఏ విషయంలోనైనా,పరిశుద్ధులైన దేవుని బిడ్డలకు దేవుని కృప అన్నది, దేవుడిచ్చే కృప యొక్క విలువ అన్నది, ఎప్పుడు తెలుస్తుంది అని అంటే,శోధన అన్నది మనలను touch చేసినప్పుడు,"

మన శరీరంలో ఏ నియమాలు ఉన్నాయి అన్నది మనము గ్రహించకపోతే 1కోరింథీయులకు 10:12

తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను,అన్న ఈ వాక్యము మనకు అర్థం కాదు, దేవునిలో మనలను మనము ఎలా కట్టుకోవాలో మనకు తెలియదు, దేవుని కృప,దేవుడిచ్చే కృప అనేది ఎంత విలువైనదో,అనుభవ పూర్వకంగా దానిని పొందిన వాళ్లకు మాత్రమే, అది ఎంత విలువైన సంపదో అర్థమవుతుంది.కృప అనేది కేవలం వ్యాఖ్యసత్య జ్ఞానంతో కాకుండా అది అనుభవంతోటే అర్థం కావాలి,

"మన శరీరంలో ఉన్న పాపపు శక్తిని మనము గ్రహించకపోతే మనము గర్వాన్ని వదలలేము.

5. . “పవిత్రుడు అయితే శోధన ఉండదు” అని చెప్పటం బైబిల్ సత్యమా?

కాదు. యేసు ప్రభువు తానూ శోధించబడ్డాడు. హెబ్రీయులకు 4:15

మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.యేసు ప్రభువువారి శరీరము పరిశుద్ధాత్మతో నిర్మించబడింది కాబట్టి అన్నిటిని జయించే శక్తి ఆ శరీరానికి ఉంది.

పౌలు గారు కూడా ఈ స్థితిలో ఉన్నారు. శోధించబడ్డారు — కానీ దానిపై దేవుని శక్తి వల్ల గెలిచారు, అంటే శోధించబడటం, తెలియకుండా అనుకోని పరిస్థితులలో గొర్రె బురదలో పడినట్లు,పాపపు తలంపుల్లోకి వెళ్లిపోవడం పరిశుద్ధమైన తలంపులను,తీసుకుని వచ్చే దేవుని సన్నిధిలో నుండి మన ఆత్మ మన మనస్సు, బయటకు రావడం పడిపోవటం,అనేది పాపము కాదు, కాని ఆ స్థితిని జయించకుండా,మనము అందులోనే కొనసాగటము పాపము.

6. పౌలుకి కలిగిన బలహీనత అనేది “శరీర బలహీనత” కావచ్చు కదా?

అవును, పౌలు గారి బలహీనత రోగం కావచ్చు, కానీ అది మాత్రమే కాదు. ఆయన "బలహీనతలు" (బహువచనం) అన్నాడు — ఇది శరీర బలహీనతలు, అనుభవాలు, శోధనలు, అపహాస్యం, అవసరాలు, అణచివేతలు, అవమానాలు అన్నిటిని కలగలుపుగా వాడిన మాట. 2 కొరింథీయులు 12:10

“పాపానికి శక్తి ఉందని గ్రహించేది — శోధనలో పడినపుడే!” దీనిని బైబిలు ఇలా చెబుతోంది.

రోమీయులకు 7:15 ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను.

ఇది పాపాన్ని అంగీకరించిన వ్యక్తి మాటలు కాదు —

దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవారు, శరీరంలోని పాప శక్తిని అర్థం చేసుకున్నవారు మాట్లాడే మాటలు.

7. మన శరీరమునకు రోగాలు ఎందుకు వస్తాయి?

రోమీయులకు 8:20-23

ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థ పరచ బడెను.సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వముకొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము.

ఈ శరీరం పాపమునకు లోబడినది కనుక రోగాలు, బలహీనతలు, శోధనలు — ఇవన్నీ బలహీన శరీరపు లక్షణాలు.

ఎస్తేర్ క్రైసోలైట్

19-7-2025