CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

Praise The Lord

🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃

ఏలుబడి అనేది గౌరవం కాదు అది ఒక బాధ్యత

🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃

ఏలుబడి అనేది ఒక గౌరవం కాదు — అది బాధ్యత. అది అధికారానికి కాదు, సేవ చేయటానికి పిలుపు. దేవుని హృదయాన్ని కలిగి, సేవా ధర్మాన్ని పాటించే వారు మాత్రమే నిజమైన ఏలుబడికి అర్హులు. వారు మాత్రమే దేవుని రాజ్యంలో దేవునితో కలిసి ఏలగలరు (ప్రకటన 20:6).

దేవునితో ఏలుబడి చేసే వారికి పరలోక ధ్యాస వున్న కారణంగా వారు చేసే ఏలుబడి పరసంబంధమైన వాటి కొరకు కాబట్టి, వారు ఏలుబడి చేయుట కొరకు వారిని దేవుడు అంగికరిస్తాడు, కొలస్సీయులకు 3:1-2 మీరు క్రీస్తుతో కూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి యున్నాడు. పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైన వాటిమీద మనస్సు పెట్టుకొనకుడి;

ఈ లోకము ఏలుబడి చేయటానికి ఎవరని గుర్తిస్తుంది అని అంటే, ఈ లోకంలో జ్ఞానులైన వారిని,ధన సంపదలు ఉన్న వారిని, స్త్రీ, పురుషుడు,అన్న విషయంలోకి వస్తే పురుషులకు,ఇలా ఏలుబడి చేసి అధికారాలను మన సమాజం ఇస్తూ ఉంటుంది, వారు చూసే దృష్టి ఈ లోక సంబంధమైనది మాత్రమే, కానీ దేవుని ఆత్మ దేనిని చూస్తుంది ఆని అంటే, " తనకు లోబడే వారిని తన చిత్తాన్ని చేసే వారిని,తన ఉద్దేశాలను సఫలపరిచే వారిని," ఈ రోజులలో ఈ సత్యాన్ని గ్రహించే, దేవుని ప్రజలు చాలా తక్కువ మంది,నామకార్థ క్రైస్తవులుగా దేవుని శక్తిని గ్రహించని వారుగా ఉంటున్నారు,

1కోరింథీయులకు 1:27-29

ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింప కుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచు కొని యున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచు కొని యున్నాడు.

మేము నివాసం ఉండేది Second Floor,

ఈ Second Floor లో మేము, వెరోక Family వుంటుంది. వాళ్లు క్రిస్టియన్స్ కాదు,నేను మార్నింగ్ ప్రేయర్ లో ఉన్నప్పుడు వాళ్లు వాళ్ల దేవుడికి సంబంధించిన సుప్రభాతం శ్లోకాలు లాగా ఉండే దానిని పెద్దగా నాకు డిస్టబెన్స్ గా ఉండేటట్లు పెడతారు, అయినా నేను వారి మీద మా Owners కి Report చేయ్యను,

నేను ప్రేయర్ లో ఉన్నప్పుడు నా గొంతు విప్పి నేను పెద్దగా పాడితేనే నాకు మనస్ఫూర్తిగా ఆనందం అనిపిస్తుంది,ఆ సౌండ్ విని అప్పుడు వాళ్ళు దానిని పెడుతూ ఉంటారు,నేను ప్రేయర్ లో లేని రోజు అసలు పెట్టరు, నిజంగా వారికి భక్తి ఉంటే ప్రతిరోజు పెట్టాలి కదా,

ఇది మనకు నేర్పే సత్యమేమిటంటే భక్తిని, దేవుని వెంబడించటం అనే దానిని, మన ఆత్మీయ క్షేమం కొరకు మనము అభ్యాసం చేసుకోవాలి కానీ,ఇతరుల కొరకు నశించిపోయే ఈ లోక సంబంధమైన విషయాల కొరకు దేవున్ని,భక్తి అనే దానిని మనం వెంబడించకూడదు.

నేను ఇంట్లో ఎప్పుడు పాటలు పాడుకుంటూ ఉంటాను,ఈ మధ్యన ఒక క్రోత్త Tune న్ని నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, మా Owner అన్నారు,"పాటలు ప్రార్థనల స్వరం కొంచెం తక్కువ చేయండి,మీ ప్రక్క వాళ్లకు డిస్టర్బ్ అవుతుంది అంట నాకు చెప్పారు అని,"

చాలామంది దేవుని ప్రజలు ఇలానే ఉంటారు,దైవభక్తిని గురించి దేవుని స్తుతించుటను గురించి, ప్రార్థించుటను గురించి తేలికగా తీసుకుంటారు, భక్తి లేని వారి కంటే,దైవభక్తిని కలిగిన వారు మా ఇంటిలో ఉండటం, శ్రేష్టము అన్న సత్యము వారికి అర్థం కాదు, కొంతమంది ఈ లోక సంపద పోతుందని భయపడతారు, కొంతమంది వాళ్లు దేవుని బిడ్డలు కాకపోయినా, ఈ లోక సంబంధమైన ఘానత సంపద ఉందని వాటికి విలువను ఇస్తారు,మరి కొంతమంది వారి సంతానము కుమారులని,ఇటువంటి విషయాలలో గుర్తింపును ఇస్తూ ఉంటారు,

విశేషమేమిటంటే మా Owners క్రిస్టియన్స్,

మాకు ఆమె ఇంటి విషయంలో మాత్రమే మాకు

Owner కాదు,ఆత్మ సంబంధమైన విషయాలలో కూడా మాకు అధికారి అన్నట్లుగా తాను ఉంటుంది,వాక్య సత్యమన్నది తనకి మనము బోధించకూడదు, తనకు తెలిసిన సత్యాన్ని మనకు బోధిస్తాది దానిని మెము వినాలి, ఎందుకంటే ఆమె మాకు Owner, చాలామంది ఇలానే ఉంటున్నారు,వారికి దేవుడు ఏస్తానమిచ్చాడో,ఆ బాధ్యతను వారు గమనించరు, కాని దేవుడు ఇవ్వని బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు.

గృహానికి సంబంధించిన కాపరత్వం వేరు, ఇంటికి సంబంధించిన కాపరత్వం వేరు,బంధుత్వానికి సంబంధించిన కాపరత్వం వేరు,ఆత్మీయ జీవితానికి సంబంధించిన కాపరత్వం వేరే,ఎవరికిఏ స్థానమును దేవుడు ఇచ్చాడో ఆ స్థానమును బట్టి ఆ బాధ్యతను వారు గుర్తించకుండా,ఉండటాన్ని బట్టి ఈ దినాలలో కుటుంబాలలో బంధుత్వాలలో సంఘాల మందిరాలలో,కలవరములు గందరగోళాలు జరుగుతున్నాయి.

భూ సంబంధమైన వాటిని బట్టి దేవుడు చేసిన ఈ సృష్టిని బట్టి వీటిని ఆధారం చేసుకుని ఆత్మసంబంధమైన ప్రజల మీద ఆత్మ సంబంధమైన విషయాల మీద పరిపాలించాలని ఎవరు ప్రయత్నించిన దేవుడు వారి ప్రయత్నాన్ని అడ్డుకొని తీరుతాడు, ఎందుకంటే దేవుని ఘానపరిచే ప్రజలకు ఒక వాగ్దానం ఉన్నది " మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించును " (1యోహాను 5:14)

ఇటువంటి ఒత్తిడి నామీద వస్తున్నప్పుడు నేనొక్కటే దేవున్ని అడిగాను,ఈ గృహంలోనికి నేను రావడానికి ముందు దేవుని దగ్గర వాగ్దానం తీసుకున్నాను,"నీవు పోవు ప్రతి స్థలమందును నిన్ను కాపాడేదను"అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి ఇది దేవుడు నన్ను నడిపించే మార్గము అని నాకు అర్థమైన తర్వాతేనే నేను ఈ గృహంలోనికి వచ్చాను,ఇక్కడ నాకు నా ఆత్మీయ జీవితానికి అనుకూలమైన వాతావరణం లేదు కాబట్టి నేను వెళ్ళిపోవాలని అనుకోలేదు,ఇది నేను నివసించడానికి నాకు దేవుడు ఇచ్చిన స్థలం,కాబట్టి నా ఆత్మీయ జీవితం క్షేమం కొరకు మీరు నాకు ఇచ్చిన ఈ స్థలాన్ని విశాల పరచండి

ఈ Second Floor మొత్తానికి మేము Rent కట్టుకునే స్థోమత సామర్థ్యం మాకు దయ చేయండి,అని ప్రార్థించడం మొదలుపెట్టాను,

ఎప్పుడైనా దేవుని ప్రజలు గుర్తించవలసిన సత్యం ఏమిటంటే, దేవుడు ఏదైనా ఏ విషయం కొరకైనా మనకు వాగ్దానం అందిస్తే, ఆ వాగ్దానానికి రివర్స్ జరుగుతూ ఉంటుంది,అది వెంటనే మనకు వచ్చేయదు,దేవుడు వాగ్దానము చేయని దాని కొరకు ఎటువంటి యుద్ధాలు జరగవు, కానీ దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తాడో, దాని విషయంలోనే శత్రువు మనతో యుద్ధం చేస్తూ ఉంటుంది, దేవుని వాగ్దాన ప్రజలైన ఇశ్రాయేలీయులు ఈరోజుకి కూడా వారి దేశం పక్షాన, వారి పోరుగు దేశాలతో వారు యుద్ధం చేస్తూనే ఉన్నారు.

మీకు కూడా ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయా! దేవుడు ఏదైనా తన వాగ్దానం ద్వారా మీకు ఇస్తే ఆ స్థానంలో ఆ ప్రదేశంలో దేవుడు మీకు ఇచ్చిన వాటిని మీరు సద్వినియోగం చేసుకోనివ్వకుండ ఈ భూ సంబంధమైన వాటికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ శత్రువు అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటు ఉన్నాద. ఆ సమయంలో మన మానవ ప్రయత్నం ఎలా ఉంటుంది అని అంటే, వాటిని తట్టుకోలేక అక్కడ నుంచి పారిపోయేటట్లు ఆలోచిస్తుంది, కానీ దేవుని ఆత్మ ఏమని సెలవిస్తుంది అని అంటే, "మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు ఆని" మనకు తెలియజేస్తుంది,దేవుడు ఇచ్చింది ఏదైనా అది మనకు ఉపయోగకరంగా ఉండేటట్లు చేసేవాడని,దానిని విశాల పరచే అంతా సామర్థ్యం కలిగిన వాడు అని మీరు దీనిని నమ్మగలరా.!

ఎస్తేర్ క్రైసోలైట్

25-7-2025