2025 Messages
Praise the Lord
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
తామర పుష్పం – మంచుతో పుష్పించే
విశ్వాస జీవితం
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
హోషేయా 14:5
చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును,
నా పేద్ధ కుమార్తె Startup Company కి సంభదించిన కొన్ని సంతకాలను మెము వుండే ఇంటి ఓనర్ ఆ brother మెము అడిగినప్పుడు వెంటనే వారు పెట్టారు. నా కుమార్తె Company రిజిష్టేషన్ పూర్తి అయిన తరువాత, నా కుమార్తె Company కి ఫండ్ రావటానికి అనుమతిని యిచ్చే ఒక సంతకము అవసరము అయ్యి వాళ్లను మేము అడిగినప్పుడు, వాళ్లు సంతకము పెట్టాను అని అన్నారు. నా భర్త రేండు సార్లు ప్రయాత్నించారు, ఆ సమయంలో దేవుడు నా హృదయంలో ధైర్యమును తీసివేయలేదు, నేను ఒక్కటే దేవున్ని అడిగాను, "ఈ యింటి లోనికి రావటానికి ముందు నేను మిమ్మల్లి వెళ్లాల లేదా, అని నేను అడిగినప్పుడు "నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడెదను "అని వాగ్ధానం ఇచ్చావు కద! దేవా ఇప్పుడు నా కుమారైకు క్షేమము లేని పరిస్థితి, నేను ఇప్పుడు ఎం! చేయను, మీ వాక్యము ద్వార నాతో మాట్లాడండి, అని నేను ప్రార్థించి వాగ్ధానం తీసుకున్నాను.
వాగ్ధానం అన్నది నాకు ఇష్టమైనది నాకు అవసరమైన వాక్యం అన్నట్లు నేను ఎప్పుడు వాగ్ధానం తీసుకోను, ఎంచుకోను, బుక్ స్టాల్ నుండి తీసుకు వచ్చిన వాగ్ధానముల బండిల్ ని నేను వాటిమీద చేతులుంచి ప్రార్థిస్తు వుంటాను, అలా నేను ప్రత్యేకమైన విషయంలో మాత్రమె నేను వాటిని తీసుకుంటాను, అప్పుడు దేవుడు ఎదైతే మాట్లాడడో దానిని అవాక్యమును నేను స్వీకరిస్తాను. దేవుని దగ్గర నుంచి వాగ్దానము తీసుకునే విషయంలో ఎందుకింత జాగ్రత్త వహించాలి అని అంటే, అవాగ్ధానల విషయంలో మనకు మనమే ఈ వాగ్దానము దేవుడు నాకు ఇచ్చాడు అని మనకు మనమే ఊహించుకుంటున్నామా! లేక దేవుడే మనకి ఇచ్చాడా అన్న విషయమును మనము స్పష్టంగా గ్రహించవలసి ఉంది.
అల నేను నా కుమార్తె విషయంలో ప్రార్ధించి తీసుకున్నాప్పుడు, దేవుడు నాకు " హోషేయా 14:5
చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును," అనే ఈ వాగ్ధానమును ఇచ్చాడు, ఆసలు ఎవరు మాట్లాడుతారు అండి ! యింత సూటిగా, ఎ మానవునికైన యిది సాధ్యమా ! లేదు, ఎవ్వరు మనకు ఇటువంటి హామీని, వాగ్దానమును, ఇటువంటి పరిస్థితిని, మనం కలిగి ఉన్నప్పుడు, మనకు ఇవ్వలేరు,
నా కుమార్తె Company పరిస్థితి చూస్తె ఇక్కడ రిజిస్టర్ అయ్యింది,మరల యింకో దగ్గర దానిని రిజిస్టర్ చేయలేము, అది అభివృద్ధి అవ్యటానికి ఆటంకము, కాని దేవుడు వాగ్ధానం యిచ్చాడు,పరిస్థితులను బట్టి చూస్తే ఇది జరగదు, ఇది ముందుకు వెళ్ళదు,మనము ఏమి ఆశించలేము కూడ, కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి చూస్తే మనం విశ్వసించాలి, ఎందుకు అంటే, పాత నిబంధనలో దేవుడు తనకు ప్రతిష్టిత ప్రజలైన ఇశ్రాయేలీ యులను, "సమృద్ధి అయినా కనానుదేశం" లోనికి నడిపించేటప్పుడు మార్గమధ్యంలో ఎన్నో ఆటంకాలు అవాంతరాలు కలిగిన అవి ఏమీ కూడా వారి ప్రయాణాన్ని ఆపలేకపోయాయి,
నేను కూడా ఈ వాక్యమును విశ్వసించాను,నా కుమార్తె Startup అన్నది 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రారంభమైనది,కాబట్టి దేవుడిచ్చినది ఇది ముందుకే వెళుతుంది కానీ ఇది ఆగిపోదు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి కచ్చితంగా దీనికి పరిష్కారం అన్నది దేవుడు వేరొక మార్గంలో నైనా చూపిస్తాడు,అన్న బలమైన విశ్వాసం నాకు వచ్చేసింది, వెంటనే అవాగ్ధానం పట్టుకొని,నేను కూర్చున్నా,నిలుచున్న,ఏమి చేస్తున్న కూడా పదే పదే ఈ విషయం కొరకు నేను ప్రార్థిస్తూ వచ్చాను దేవుని వాగ్దానం నెరవేర్చమని,
ఒక పది రోజుల తర్వాత నా కుమార్తె Company లాయర్ మా కుమారైకు తెలియజేస్తు వచ్చింది.
వీళ్లు సంతకం పెట్టకపోతె వేరే లాగా కూడ వెళ్లవచ్చు అని, చూసారా!దేవుడు వాగ్దానం ఇస్తే అ వాగ్ధానములో ఉన్న వెలుగు మనకు ఎలా దారిని చూపిస్తుందో, ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు అనేకమైన ఆటంకాలు అనేక రకాలుగా మన అభివృద్ధిని ఆటంకపరుస్తూ మన మార్గాలకు అడ్డుగా వస్తూ ఉంటాయి. తామర పుష్పమునకు మంచు ఉన్నట్లు దేవుని వాక్యము మనతో ఎల్లప్పుడూ ఉన్నప్పుడు, ఆ దేవుని వాక్యాన్ని మన ప్రతి పరిస్థితులలో వాగ్దానముగా తీసుకుంటూ మనం దేవుని ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు,మనకు కలిగేది తామర పుష్పము లాంటి అభివృద్ధి.
తామర పుష్పం – మంచుతో పుష్పించే విశ్వాస జీవితం
హోషేయా 14:5
చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును,
మానవ స్వభావము సహజముగా ముందు పరిస్థితులను చూస్తుంది, వాటిని బట్టి కృంగిపోతుంది, కానీ దేవుని ఆశ్రయించినప్పుడు, ఆ పరిస్థితులను బట్టి కాదు,పరిస్థితులను తారుమారు చేసే మనము ఆశ్రయించిన బలమైన దేవుని బట్టి, ఆ దేవుని నడుపుదలను బట్టి, మనము ఎదుగుతాము, దానిని బట్టె మన అభివృద్ధి అన్నది ఉంటుంది.
దేవుడు చేసిన ఈ సృష్టిని మనం చూస్తూ ఉన్నప్పుడు, మనము గ్రహించలేని చాలా విషయాలు అద్భుతాలు మనకు కనబడుతూ ఉంటాయి, దేవుని సృష్టి ఎంత గొప్పదో కదా !
అందుకే,సృష్టి ద్వారా దేవుని మహిమ దేవుడు చేసిన చేతి పని ఎలా వెల్లడవుతోందో, ఎలా ప్రత్యక్షమవుతుందో, అంతరిక్షము, ఆకాశమండలము — ఇవి దేవుని మహిమను నిత్యం మనకు ఎల ప్రకటిస్తు వుంటాయే అన్న విషయంను దావీదు ఇల రాసాడు, " కీర్తనలు 19:1
ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది."
మానవుని సృష్టి : సాధ్యమైయ్యే పరిస్థితిలో మాత్రమె ఆది సాధ్యం అవుతుంది.
దేవుని సృష్టి : సాధ్యం కానీ పరిస్థితిలో సాధ్య పరచేదిగా మనకు ప్రత్యక్ష పరచబడుతు, మన కన్నులకు తేటాగా ఆది కనపడుతువుంది,,
తామర పుష్పము (Lotus flower) పునరుత్థానం, పరిశుద్ధత, మరియు నిర్ధిష్టమైన బలమైన అభివృద్ధికి ఆత్మీయ చిహ్నంగా సూచనగా,యిది నిలుస్తుంది, ఉపయోగించబడుతుంది, ముఖ్యంగా చీకటి వంటి బంధించబడిన, బంధకాల పరిస్థితుల నుండి విడుదల కొరకు, మరియు
అపరిశుద్ధత మధ్య పరిశుద్ధంగా జీవించే, వెలిగే, వెలుగైన జీవితం కొరకు, ఇది ఒక గాఢమైన గుర్తింపును ఇస్తుంది.
బైబిలు పరముగా తామర పుష్పానికి ఆత్మీయ సూచన:
1. పరిశుద్ధత మధ్య అపరిశుద్ధతను తట్టుకోవడం
తామర పుష్పం మట్టి, మురికి నీళ్లలో పెరిగినా… అది ఎప్పటికీ ఆ నీటి మురికిని తనకు తగలనీయదు.
ఇది పాపభరిత లోకంలో జీవిస్తున్న విశ్వాసి జీవితానికి ఒక చూచన. యోహాను 17:16-17
నేను లోకసంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు( మూలభాషలో-సత్యమువలన) వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.
2. ఆత్మీయ అభివృద్ధి
నీటి అడుగున వున్న మట్టిలో నుంచి పైకి రావడం అనేది నిగ్రహం, సహనం, మరియు ఎదుగుదలకు సూచన. ఇది మన ఆత్మ కష్టాలలో నుంచి ఎదగడం, చీకటిలోనూ దేవుని వెలుగు వైపు చూడటం, ఎదగడం, అనే భావమును కలిగిస్తుంది.
3. వెలుగులో వికసించే జీవితం
తామర పుష్పం ఉదయమైనప్పుడు మాత్రమే పూర్తిగా వికసిస్తుంది. ఇది దేవుని ఉనికిలో, సన్నిధిలో వికసించే, సంతోషించే మన ఆత్మకు సూచన. సంఖ్యాకాండము 6:25
యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక;
🌸 ఈ తామర పుష్పం మనకు సూచించేదేంటి?
1. యిది మురికి నీటిలో పెరుగుతుంది : పాపమయ మైన లోకంలో పరిశుద్ధమైన జీవితమునకు ఇది చూచన
2. యిది ఆట్టడుగు నుంచి పైకి ఎదుగుతుంది: అభివృద్ధి నోందుచున్న విశ్వాసికి యిది చూచన
3. ఇది వెలుగులో వికసిస్తుంది : దేవుని సన్నిది ఉనికిలో జీవితం వికసించటమును, ఇది తెలియజేస్తుంది.
4. యిది తేమను తట్టుకుని నిలబడుతుంది. కష్టాలు, శ్రమలు ఎదురైనా ఆశ నశించకుండా జీవించడం ను గురించి ఇది తెలియజేస్తుంది.
తామర పుష్పం మురికి నీటి మధ్య పేరుగుతున్నట్లు. దేవుని ప్రజలు కూడ చీకటి, పాపం, బంధకాలు, నిరుత్సాహం మధ్య జీవిస్తూ దేవుని ఉన్నతమైన పరిశుద్ధతను వారు అనుసరించేటప్పుడు — వారు పైకి లేపబడతారు. చీకటిలో వెలుగుగా అభివృద్ధి చెందుతారు.ఈ ఎదుగుదల ఆత్మసంబంధమైన అభివృద్ధి మాత్రమే కాదు, అది దేవుని మహిమను ప్రకాశింప జేసే జీవితం కూడా,
పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన పుష్పాలు ఉన్నప్పటికీ ఈ తామర పుష్పంతో మాత్రమే దేవుడు ఎందుకు దేవుని బిడ్డల అభివృద్ధిని పోల్చాడు అని అంటే,
తామర పుష్పం యొక్క విత్తనాలు వందల ఏళ్లపాటు జలములో మునిగిపోయినా మొలకెత్తే శక్తిని కలిగి ఉంటాయి (అరుదైన సంఘటన – 1300 ఏళ్లు పాత విత్తనం మొలకెత్తింది)
ఈ తామర పుష్పము అన్నిటిని జయించి ఎందుకు అలా అభివృద్ధి చెందుతూ వస్తుంది అని అంటే దీని విత్తనం దీర్ఘ కాలము నిలిచేది,అందుకే దేవుని వాక్యము విత్తనముతో పోల్చబడినది " లూకా 8:11
ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము.హోషేయా 10:12 నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి " నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభువు వారే వాక్యమై ఉన్న విత్తనము దేవుడు ఈ వాక్యమై ఉన్న దేవుని విత్తనముగా మన హృదయాలలో మనకు సంబంధించిన విషయాలలో నాటినప్పుడు అసాధ్యమైన పరిస్థితులు మనకు సాధ్యముగా మారతాయి తామర పుష్పం వలె మన అభివృద్ధి ఉంటుంది.
ఈ నీతి అనే వాక్యమై ఉన్న దేవుని విత్తనం మరణాన్ని జయించిన శాశ్వత కాలం జీవాన్ని ఇచ్చే విత్తనం ఇది ,ఈ వాగ్దానము ఈ వాక్యం అనే దేవుని విత్తనం ఎవరిలో ఉంటుందో, వారు కూడా శాశ్వతంగా జీవాన్ని కలిగి ఉంటారు, ఈ జీవం వాడిపోయేది కాదు , అందుకనే ఇటువంటి జీవాన్ని కలిగి తామర పుష్పం లా ఎదగాలి అని అంటే, దానికి అవసరమైనది మంచు.
"చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును":
మంచు అంటే ఆకాశం నుండి కిందకు జారి వచ్చే శీతల తేమ. ఇది భూమిని తడిపి, మొక్కలు పెరిగేందుకు సహాయపడుతుంది.
1. మంచు = దేవుని దయ / ఆశీర్వాదంనకు చిహ్నం
మంచు చెట్లను తడిపి వాటికి జీవం ఇచ్చేలా, దేవుని దయ మన ఆత్మను ఉజ్జీవంతో నింపి పునరుజ్జీవన మను కలిగిస్తుంది.
నిర్గమకాండము 16:13-14
కాగా సాయంకాలమున పూరేడులువచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచువారి పాళెముచుట్టు పడియుండెను. పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగుమంచువలె సన్నని కణములు అరణ్యపు భూమిమీద కనబడెను.
ఇది మన్నాకు సంబంధించింది. దేవుని పోషణ మంచుతో ప్రారంభమై వచ్చింది.
దేవుడు ఇచ్చే తృప్తి దయ, ఆహారము, బలము మంచుతో మొదలవుతుంది.
2. మంచు = దేవుని వాక్యం / ఉపదేశం
దేవుని వాక్యం కూడా మన హృదయాన్ని తడిపి జీవాన్ని ఇవ్వగలదు — మంచు లాగే.
ద్వితియోపదేశకాండము 32:2
నా ఉపదేశము వానవలె కురియును నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకులవలెను పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును.
దేవుని మాటలు మంచువలె కరిగి మన మీద దయగా ఆశీర్వాదాలు రూపంలో పడతాయి.
మంచు ఎలా చెట్టుకు తేమనిచ్చి జీవాన్ని ఇస్తుందో, దేవుని వాక్యం మన ఆత్మకు బలాన్ని ఇచ్చే శక్తిగా ఉంటుంది.
3. మంచు = దేవుని ఉనికి / దేవుని ఆత్మ /దేవుని సన్నిధి, దేవుని ఉనికి, దేవుని ఆత్మ సన్నిధి, ఎప్పుడూ గంభీరంగా, శాంతిని సమాధానమును నెమ్మదిని ప్రశాంతతను కలిగి ఉంటుంది — మంచులా.
న్యాయాధిపతులు 6:36–40 — గిద్యోను సూచన అడిగినప్పుడు: మంచు దేవుని అనుగ్రహం, సహకారం సూచనగా ఉంది. దేవుని సమాధానానికి ఇది సంకేతంగా ఉపయోగపడింది.
4. మంచు = పరిశుద్ధత, నమ్మకమైన శాంతి చిహ్నం
కీర్తనలు 133:3 ఇక్కడ ఉన్నటువంటి మంచు సమాధానమును,ఆశీర్వాదమును,నిత్యజీవమును సూచిస్తుంది. మంచు ఆశీర్వాదానికి చిహ్నంగా, సంఘంలో ఏకత్వానికి గుర్తుగా, దేవుని సమూహంలోని శాంతికి గుర్తుగా ఉన్నది.
మంచు అనేది:
1. మంచు దేవుని దయ, ఇది చెట్టుకు జీవాన్ని ఇచ్చేది,
2. మంచు ద్వారా మన్నా- ఇది దేవుని పోషణ
3. మంచు వలె మాటలు - ఇది దేవుని వాక్యం
4. మంచు పరీక్షకు చిహ్నం -- ఇది దేవుని సమాధానం
తామర పువ్వు మట్టికింద నీటిలో నుంచే ఎదుగుతుంది.అక్కడ లైట్ లేదు. సౌకర్యం లేదు. స్వేచ్ఛ లేదు. కానీ దాని వేర్లు బలంగా ఉంటాయి. దాని ధ్యేయం ఆకాశంవైపే ఉంటుంది. దేవుని వాక్యమనే మంచుతో తడిసిన ఆత్మ కూడా అలానే ఎదుగుతుంది. నిరాశలు నీటిలా ఉన్నా, ఆ నీళ్లను తట్టుకొని పైకి వచ్చినవారే తామర పువ్వుల్లా వెలుగుతారు. వాళ్ల ఆత్మ లోతుల్లోంచి వచ్చే,వెలిగే వెలుగు,ఎవరూ ఆర్పలేని దేవుని వెలుగు!
ఎస్తేర్ క్రైసోలైట్
23-7-2025
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
Praise the Lord
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
తామర పుష్పం – మంచుతో పుష్పించే
విశ్వాస జీవితం
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
హోషేయా 14:5
చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును,
నా పేద్ధ కుమార్తె Startup Company కి సంభదించిన కొన్ని సంతకాలను మెము వుండే ఇంటి ఓనర్ ఆ brother మెము అడిగినప్పుడు వెంటనే వారు పెట్టారు. నా కుమార్తె Company రిజిష్టేషన్ పూర్తి అయిన తరువాత, నా కుమార్తె Company కి ఫండ్ రావటానికి అనుమతిని యిచ్చే ఒక సంతకము అవసరము అయ్యి వాళ్లను మేము అడిగినప్పుడు, వాళ్లు సంతకము పెట్టాను అని అన్నారు. నా భర్త రేండు సార్లు ప్రయాత్నించారు, ఆ సమయంలో దేవుడు నా హృదయంలో ధైర్యమును తీసివేయలేదు, నేను ఒక్కటే దేవున్ని అడిగాను, "ఈ యింటి లోనికి రావటానికి ముందు నేను మిమ్మల్లి వెళ్లాల లేదా, అని నేను అడిగినప్పుడు "నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడెదను "అని వాగ్ధానం ఇచ్చావు కద! దేవా ఇప్పుడు నా కుమారైకు క్షేమము లేని పరిస్థితి, నేను ఇప్పుడు ఎం! చేయను, మీ వాక్యము ద్వార నాతో మాట్లాడండి, అని నేను ప్రార్థించి వాగ్ధానం తీసుకున్నాను.
వాగ్ధానం అన్నది నాకు ఇష్టమైనది నాకు అవసరమైన వాక్యం అన్నట్లు నేను ఎప్పుడు వాగ్ధానం తీసుకోను, ఎంచుకోను, బుక్ స్టాల్ నుండి తీసుకు వచ్చిన వాగ్ధానముల బండిల్ ని నేను వాటిమీద చేతులుంచి ప్రార్థిస్తు వుంటాను, అలా నేను ప్రత్యేకమైన విషయంలో మాత్రమె నేను వాటిని తీసుకుంటాను, అప్పుడు దేవుడు ఎదైతే మాట్లాడడో దానిని అవాక్యమును నేను స్వీకరిస్తాను. దేవుని దగ్గర నుంచి వాగ్దానము తీసుకునే విషయంలో ఎందుకింత జాగ్రత్త వహించాలి అని అంటే, అవాగ్ధానల విషయంలో మనకు మనమే ఈ వాగ్దానము దేవుడు నాకు ఇచ్చాడు అని మనకు మనమే ఊహించుకుంటున్నామా! లేక దేవుడే మనకి ఇచ్చాడా అన్న విషయమును మనము స్పష్టంగా గ్రహించవలసి ఉంది.
అల నేను నా కుమార్తె విషయంలో ప్రార్ధించి తీసుకున్నాప్పుడు, దేవుడు నాకు " హోషేయా 14:5 చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును," అనే ఈ వాగ్ధానమును ఇచ్చాడు, ఆసలు ఎవరు మాట్లాడుతారు అండి ! యింత సూటిగా, ఎ మానవునికైన యిది సాధ్యమా ! లేదు, ఎవ్వరు మనకు ఇటువంటి హామీని, వాగ్దానమును, ఇటువంటి పరిస్థితిని, మనం కలిగి ఉన్నప్పుడు, మనకు ఇవ్వలేరు,