CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

Praise The Lord

సత్యం వెనుక ఉన్న ఆత్మను పరీక్షించండి

అపో.కార్యములు 16:16-17

మేము ప్రార్థనాస్థలమునకు వెళ్లుచుండగా (పుతోను అను) దయ్యముపట్టినదై, సోదె చెప్పుటచేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక చిన్నది మాకు ఎదురుగావచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు; వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై యున్నారని కేకలువేసి చెప్పెను.

ఇక్కడ సోదె చెప్పే చిన్నది అంటే — ఒక servant girl, ఆమె ఒక దుష్టాత్మను (భవిష్యత్తు చెప్పే ఆత్మ) కలిగి ఉంది. ఆమె చెప్పిన మాటలు నిజమే — పౌలు వారు దేవుని ప్రజలే, రక్షణ మార్గాన్ని ప్రకటించే వారు.

కానీ ఆమెలో ఉన్న ఆత్మ పరిశుద్ధమైనది కాదు. అది దుష్టాత్మ.

అపో.కార్యములు 16:18

ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి,

పౌలు మొదట ఆమెను అడ్డుకోలేదు, పౌలు దీనిని అనేక రోజులు భరించాడు, ఎందుకంటే ఆమె మాటలు తప్పు కాదే అని అనిపించవచ్చు. కానీ పౌలు ఆత్మలో విచారణ చేసి, ఆమె చెప్తున్నది దేవుని ఆత్మ కాకుండా దుష్టాత్మ వలన అని గుర్తించి ఆ ఆత్మను తిరస్కరించాడు, ఆమె నుండి వదిలి పొమ్మని దుష్టాత్మకు ఆజ్ఞాపించాడు.

"ఎవరైనా ఏదైనా ఒక సత్యాన్ని బోధిస్తున్నప్పుడు అది ఏ ఆత్మ వలన, ఏ ఆత్మాధీనంలో ఉండి వారు దాన్ని ప్రకటిస్తున్నారు అన్న విషయాన్ని మనము గ్రహించాలి."

అపోస్తలుడైన పౌలు ఈమెలో ఉన్నది దుష్టాత్మ అని ఎలా గ్రహించాడు?

పౌలు దేవుని దాసుడు, దేవుని రక్షణ సువార్తను వీళ్ళు ప్రకటిస్తున్నారు. ఇది సత్యము, ఈ సత్యాన్ని ఆ సోదె చెప్పే చిన్నది కూడా చెప్పగలిగింది.

అపో.కార్యములు 16:17 లో సోదె చెప్పే చిన్నది పౌలు మరియు అతని బృందం గురించి ఏమంటుంది? "ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీరు రక్షణ మార్గము తెలియజెప్పుచున్నారు" అని ఆమె అరుస్తూ ఉండేది.

ఆత్మీయంగా దీనిని మనము పరిశీలిస్తే: ఆమె సత్యం చెబుతోంది, కానీ ఆమె దుష్టాత్మ చేత ప్రేరేపించబడి, నింపబడి ఉంది. అంటే దెయ్యాలు కూడా దేవుని ప్రజలని గుర్తించగలవు.

1. దెయ్యాలు సత్యాన్ని తెలుసుకుంటాయి

యాకోబు 2:19

దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగు నమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి. అంటే నమ్మకాన్ని ప్రకటించడమే రక్షణ కాదు.

2. దెయ్యాలు దేవుని సేవకులను గుర్తించగలవు

మత్తయి 8:29 వారు — "ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా?" అని కేకలువేసిరి.

దేవుని ఆత్మ ఎప్పుడూ దుష్టాత్మతో కలిసి పనిచేయదు.

1 యోహాను 4:1

ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అలాగే, పౌలు తన ఆత్మలో విచారించి — ఆమె కేకలను, మాటలను కాకుండా, ఆమె ఆత్మను తిరస్కరించాడు.

"ఎవరైనా సత్యమే చెబుతున్నారు కాబట్టి వాళ్లను మనము అనుసరించాలి అని అనుకోకూడదు. ఆ మాట, ఆ సత్యము తెలియజేసిన వ్యక్తిలో ఉన్న ఆత్మ ఏమిటో మనము పరిశీలించాలి."

అదే పౌలు చేసిన పని. దెయ్యాలకూ దేవుని ప్రజల గురించీ తెలుసు — కానీ వారికీ రక్షణ లేదు. అలాగే, వాళ్లు సత్యం చెప్పగలరే గాని, ఆ సత్యం పరిశుద్ధతతో నింపబడినది కాదు, నడిపించేదీ కాదు.

3. ఈమె దుష్టాత్మను కలిగి ఉందని పౌలు ఎలా గ్రహించాడు?

పాత నిబంధనలో సోదె చెప్పడం మొదలైన వాటిని దేవుడు ఖండించాడు. ఇవి దుష్టాత్మల ఆచారాలుగా పరిగణింపబడ్డాయి. ఇవి ఇశ్రాయేలు జనులు అనుసరించకూడదని స్పష్టంగా దేవుడు ఆజ్ఞాపించాడు.

ద్వితియోపదేశకాండము 18:10-12

తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకు నముచెప్పు సోదెగానినైనను, మేఘా శకునములనుగాని, సర్ప శకునములను గాని, చెప్పు వానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను

కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వాని నైనను మీ మధ్య ఉండనియ్యకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయము లైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు.

ఇది ప్రధాన నిషేధాత్మక ఆజ్ఞ. సోదెలు, మంత్రాలు, మాంత్రిక విద్యలు, శకునాలు, భవిష్యత్తు చెప్పడం — ఇవన్నీ దేవునికి హేయమైనవని బైబిల్ మనకు చెబుతుంది. ఈ ఆజ్ఞలను బట్టి ఆమెలో ఉన్నది దుష్టాత్మ అని పౌలు గ్రహించాడు.

మత్తయి 7:20

"కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు." పౌలు — వారి పరివారము వారు ఏమై ఉన్నారో అన్న సత్యమును సూచనను ఈ సోదె చెప్పే వ్యక్తి తెలియజేస్తుంది. దైవాత్మ లేనివారు ఎటువంటి సూచనలు తెలియజేసిన వాటిని మనము తిరస్కరించాలి. ఎందుకంటే దేవుని వాక్యమే మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగునై యున్నది కాబట్టి,

మనకు వెలుగునిచ్చే, మనలను నడిపించే, మనలను గూర్చి సాక్ష్యం ఇచ్చే — దేవుని వాక్యమే మనకు సూచన. దేవుని వాక్యాన్ని సూచనగా ఉంచి ముందుకు ప్రయాణించిన వాళ్ళు ఎవరు కూడా అపజయాన్ని పొందలేదు, వారు విజయాన్ని మాత్రమే పొందారు. ఎందుకంటే వాక్యమై యున్న దేవుడు సమస్తాన్ని జయించిన దేవుడు కాబట్టి,

"ఈ లోకంలో మానవులు ఇచ్చే సూచనల కంటే, ఈ సృష్టిలో మనము ఏర్పరచుకున్న సూచనల కంటే గొప్ప సూచనగా దేవుని ప్రజలకు ఉంది ఈ వాక్యమే. మనలను నడిపించే ఈ దేవుని వాక్యమే మనకు సూచనగా ఉండాలి."

దేవుడు ఉన్నాడు అని అనటానికి సూచన ఈ సృష్టి. ఈ సృష్టిని మనం చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఉన్నాడు అని అనటానికి, ఈ సృష్టి మనకు ఒక సూచనగా కనబడుతుంది. అలా అని మనము ఈ సృష్టిని వెంబడిస్తామా? కాదు! మనము వెంబడించకూడదు.

ఈ సృష్టిని కలుగజేసిన, నిర్మించిన, సర్వాన్ని సృష్టించిన దేవుడు — వాక్యమై యున్న దేవుడు, వాక్యరూపంలో మనతో మాట్లాడే దేవుడు, వెలుగుగా మనలను నడిపించే దేవుడు — అటువంటి ఈ దేవుడు, మత్తయి 7:7-8

"అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును." అని వాగ్దానం ఇచ్చిన ఇటువంటి దేవుణ్ణి, ఈ వాక్యములను మనం వెంబడించే వారముగా ఉండాలి.

దేవుని ఎరగని వారిలోనే కాదు, దేవుని ఎరిగిన క్రైస్తవ సమాజంలో కూడా కొంతమందిని నేను చూస్తూ ఉంటాను — ఏ విషయంలోనైనా, ఏ పరిస్థితి కొరకైనా ముందుకు వెళ్లాలి అంటే వారు వెంబడించేది దేవుని వాక్యాన్ని కాదు. ఎవరైనా చనిపోయిన రోజులను బట్టి, ఎవరికైనా కలిగిన జన్మదినములను బట్టి, లేకపోతే ఎవరికైనా జరిగిన వివాహ దినములను బట్టి, తీసుకునే ఆహారమును బట్టి, మనము ఉపయోగించుకునే వస్తుసముదాయాలను బట్టి — ఇలా రకరకాలుగా సృష్టిలో జరుగుతున్న ఈ సూచనలు బట్టి వారి జీవితంలో ముందుకు ప్రయాణిస్తూ ఉంటారు.

ఈ దినాలలో, దేవుని వాక్యమును ఎరగని అన్యజనాంగము వలే, దేవుని ప్రజలమైన మనము కూడా ఇటువంటి సూచనలు మీదే మన జీవన ప్రయాణము ఉంటుందా? ఏది ప్రారంభించాలన్న, ఏ స్థానంలో నిలబడాలి అన్న, ఎటు వెళ్లాలి అన్న — సూచనలు మీదే మనము ఆధారపడుతున్నామా? లేక మనకు జయాన్నిచ్చే, మనకు వెలుగునిచ్చే దేవుని వాక్యము మీద, దేవుని మాట అయిన దేవుని వాగ్దానాల మీద మనము ఆధారపడు తున్నామా? బాహ్య సంబంధమైన సూచనలు బట్టి మన జీవితంలో మనం ముందుకు వెళ్తున్నామా? లేక దేవుని వాక్యము మనకు సూచించిన దానిని బట్టి, దేవుడు మనతో మాట్లాడిన దాన్నిబట్టి మన జీవితంలో ముందుకు వెళ్తున్నామా?

ఈ వర్తమానంలో మనము గుర్తించవలసిన అంశాలు — సారాంశం (Highlights):

సత్యం చెప్పేవారు అందరూ దేవుని ఆత్మతో నిండివారు కావు — దుష్టాత్మలు కూడా సత్యం చెప్పగలవు.

పౌలు ఉదాహరణ (అపో.కార్యములు 16:16-18): సోదె చెప్పే చిన్నది నిజం చెప్పినా, పౌలు ఆత్మను పరిశీలించి దుష్టాత్మ అని గుర్తించాడు.

బైబిల్ ఆజ్ఞ: సోదె చెప్పడం, శకునాలు, మంత్రాలు దేవుని దృష్టిలో హేయమైనవి (ద్వితీయోపదేశకాండము 18:10-12).

పరీక్షించండి: ప్రతి ఆత్మను నమ్మకండి; దేవుని సంబంధమైనదేనా అని 1 యోహాను 4:1 ప్రకారం పరీక్షించాలి.

దేవుని వాక్యమే నిజమైన సూచన — బాహ్య సూచనలు, శకునాలు, దినాలు, వస్తువులు ఆధారంగా నిర్ణయాలు తీసుకోకూడదు.

విజయానికి మార్గం: దేవుని వాక్యాన్ని అనుసరించేవారు ఎప్పుడూ జయిస్తారు.

ఎస్తేర్ క్రైసోలైట్

31-7-2025

🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿

✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨