2025 Messages
Praise the Lord
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
పశ్చాత్తాపమే శిక్ష – ఆశ్రయపురంలో దేవుని ప్రేమ
సామెతలు 25:21-22
నీ పగవాడు ఆకలిగొనినయెడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనినయెడల వానికి దాహమిమ్ము
అట్లు చేయుటచేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును.
నాకు వివాహము అయిన క్రొత్తలో నాభర్త తరపు వారు ఒకరు మమ్మల్లి డిన్నర్ కు పిల్చారు, మాతో పాటు నా భర్త చిన్నమ్మ గారి కుమార్తె ఆమె నా భర్తకు చెల్లి అవుతుంది తనను,తన భర్తను, కూడ మాతో డిన్నర్ కి పిలిచారు, వాళ్లను కూడ ఎందుకు పిలిచారు అని అంటే, వాళ్ళకు కూడ మాకంటే ఒక మూడు నెలలు ముందే వివాహం అయింది కాబట్టి.
మేము మా డిన్నర్ ముగించుకొని ఇంటికి వచ్చేటప్పుడు మమ్మల్ని భోజనానికి పిలిచిన నా భర్త తరపు బంధువు ఆమె మా ఆడపడుచుకు ఒక మంచి చీర పెట్టి నాకు మాత్రం ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చింది, తర్వాత తన భర్త ఆమెను లోపలికి తీసుకెళ్లి బాగుండదు ఆని,ఏదో ఒక పిచ్చి చీరను నాకు ఇప్పించారు, ఆ సమయంలో అది నాకు ఒక అవమానంగా అనిపించింది .మమ్మల్ని వేరువేరుగా పిలిచి ఉంటే బాగుండేది కదా! అని కూడా నాకు ఆనిపించింది.
నాకు ఆ సమయంలో సామెతలు 25:21-22 లో ఉన్న ఈ వాక్యమే గుర్తుకు వచ్చింది.అప్పుడు నేను అనుకున్నాను ఈమె ఎప్పటికైనా మా ఇంటికి వస్తే ఈమెకి ఒక మంచి చీర పెట్టాలి అని, నేను అనుకున్నది చాలా సంవత్సరాల తర్వాత జరిగింది,ఆమె ఒక రెండు రోజులు మా ఇంటిలో ఉండటానికి వచ్చింది,ఆమె తిరిగి తన ఇంటికి వెళ్ళటానికి బయలుదేరినప్పుడు,అప్పుడు నేను ఒక మంచి ఖరీదైన డ్రై వాష్ మాత్రమే చేయగలిగిన ఒక మంచి చీరను ఆమెకు ఇచ్చాను,ఆ సమయంలో ఆమె మొహంలో ఒక పశ్చాత్తాపమును నేను చూడగలిగాను,
ఆమె విషయంలో నేను ఎటువంటి శిక్ష వేయాలని నేను అనుకోలేదు ఆమె నా విషయంలో చేసినది ఏమిటో తనకు తానే గ్రహించాలని అను కున్నాను, అంతే ! అది ఆమెకు ఆమె తల మీద నిప్పులు కుప్పగా పోయ బడినట్లు పశ్చాత్తాపం కలిగింది.
సృష్టి ఆరంభంలో దేవుడు కయీనుకు కూడా ఇటువంటి శిక్ష నే వేశాడేమో అని నాకు అనిపిస్తు వుంటుంది.అవును "ప్రేమ స్వరూపి అయినా, ప్రేమ స్వభావం కలిగిన దేవుడు,తప్పు చేసిన మానవుని శిక్షిస్తాడా లేదు, దేవుని కృపలోనే, దేవుడు మన పట్ల చూపే ప్రేమలోనే, కరుణలోనే, పశ్చాత్తాపమనే శిక్షను మనము అనుభవిస్తాము." ఇటువంటి శిక్షను ఎక్కువ కాలం కయీను అనుభవించడానికి,దేవుడు తనను,ఇతర మానవులెవ్వరు చంపకుండా ఉండటానికి, కయీనుకు ఒక గురుతును వేసాడేమొ అని నాకు అనిపిస్తువుంటుంది,!
కయీను విషయానికి వస్తే: దేవుడు అతన్ని తక్షణమె చంపలేదు. కానీ అతనికి ఒక గుర్తు పెట్టాడు – కయీనును ఎవరైనా చూసినప్పుడు చంపకుండా ఉండేలా.కయీను మరణమును వెతికిన అది దొరకకుండా, తాను చేసిన తప్పును, తానున్న
స్థితినే గుర్తు చేసేటట్లు చేసిన శిక్ష.
దేవుడు ఆశ్రయపురాలను ఏర్పరచిన విధానం చూస్తే,
అవి తప్పు చేసిన వారికి వెంటనే శిక్ష వేయమని చెప్పడం కాదు కాని, దానికి బదులుగా —
దేవుడు వారి హృదయాలలో పశ్చాత్తాపం కలిగించడానికి, మార్పుకు అవకాశం ఇవ్వడానికి సమయం ఇస్తున్నాడు అని మనకు అర్థం అవుతుంది.అందుకే పాత నిబంధనలో ఆశ్రయ పురములను నిర్మించాడు.క్రొత్త నిబంధనలో సర్వ మానవుల రక్షణ కొరకు తానే ఒక ఆశ్రయపురం గా మనకు ప్రత్యక్షమయ్యారు,
మానవుని స్వభావం తప్పు చేసిన వ్యక్తిని క్షమించదు,వెంటనే వారికి శిక్ష అనేది కావాలి అని కోరుకుంటు ఉంటుంది,మనుషులు ఏ తప్పైనా జరిగిందంటే, "శిక్షించాలి!" అని తొందరపడతారు.
కాని దేవుని స్వభావం అది కాదు, తన ప్రజలు శిక్షను అనుభవించాలని ఎప్పుడు కోరుకోదు,
దేవుడు వెంటనే శిక్షించకుండా,
మన ఆత్మలో కలిగే పశ్చా తాపము అనే తలంపుల ద్వారా మనల్ని ప్రశ్నించేలా చేస్తాడు: ఇది మానవుల తీర్పుకు పూర్తి భిన్నం.ఈ ఆలోచనలు,
మన మనసాక్షి ద్వారా కలిగే అంతర్గత శిక్షే,మన పశ్చాత్తాపానికి మార్గం చేస్తుంది. ఇదే నిజమైన మార్పు యొక్క మొదటి అడుగు.
ఇది సరిపోతుందా శిక్షకి?
అవును. దేవుని దృష్టిలో —
బయటి శిక్ష కన్నా, మనం మన లోపాలను అంగీకరించి తిరిగి రావడమే గొప్ప విజయం.
దేవుడు అసలు శిక్ష కోసం కాదు,
మన హృదయ మార్పు కోసం ఎదురు చూస్తాడు.
అందుకే ఆశ్రయపురం అనేది శిక్ష నుంచి తప్పించే రక్షణ కాదు, పశ్చాత్తాపమును చెందటానికి మన హృదయానికి ఇచ్చిన పవిత్రమైన సమయం.
"ఆశ్రయపురానికీ కైయీను శిక్షకీ మధ్య తేడా, దేవుని హృదయాన్ని తెలిపే ప్రేమను యిది మనకు బోధిస్తోంది. మనం పశ్చాత్తాపంతో దేవుని వద్దకు వచ్చినప్పుడే, ఆయన మన శిక్షను ఆశ్రయంగా మారుస్తాడు. మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఇదే — దేవుని ప్రేమ పశ్చాత్తాపాన్ని చూస్తుంది, ఆది తీర్పును కాదు."
ఆలోచించండి: మీరు బాధించిన వారిని శిక్షించాలనే కోరికతో కాక, దేవుని నీతిని చూపించాలనే తాపత్రయంతో ఏమైనా త్యాగం చేశారా?
ఎస్తేర్ క్రైసోలైట్
23-7-2025
🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨