2025 Messages
Praise The Lord
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
"విశ్వాసం ఒక భావన కాదు - ఇది మన అవగాహనలపై దేవుని వాగ్ధానాలను విశ్వసించే నిర్ణయం"
ఈ వాక్యాన్ని సులభంగా మనము అర్థం చేసుకుంటే:
"విశ్వాసం ఒక భావన కాదు" – అంటే విశ్వాసం అనేది మన మనసులో కలిగే తాత్కాలికముగా వచ్చే భావోద్వేగం కాదు. ఉదాహరణకు, ఆనందం, భయం, ఉత్సాహం వంటి భావాలు పరిస్థితుల ప్రకారం మన హృదయంలో మారిపోతు ఉంటాయి. కానీ విశ్వాసం ఆలా మారిపోదు.
"ఇది మన అవగాహనలపై దేవుని వాగ్ధానాలను విశ్వసించే నిర్ణయం" – అంటే మనకు అర్థం అయ్యే విషయాలకే కాదు, కొన్నిసార్లు మనకు అర్థం కాని సందర్భాల్లో కూడా దేవుడు చెప్పిన వాగ్దానాలను పట్టుకొని నమ్మే స్పష్టమైన, ఉద్దేశపూర్వకమైన నిర్ణయం. ఇది "నేను నమ్మాలనుకుంటున్నాను" అని ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవడం, అనుభూతుల మీద ఆధారపడకపోవడం.
ఉదా: అబ్రాహాము కలిగి ఉన్న పరిస్థితులు సంతానము కలుగదని చెబుతున్న, ఆది దేవుని వాగ్దానానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ (తాను వృద్ధుడు, సారా వృద్ధురాలు), "దేవుడు చెప్పాడు కాబట్టి జరుగుతుంది" అనే నిర్ణయంతో దేవుని పట్ల విశ్వాస మును కనుపరిచాడు (రోమా 4:20-21).
అంటే :
విశ్వాసం = భావం కాదు అది ఒక స్థిర నిర్ణయం దేవుడు చెప్పినదే నిజం, అది ఇప్పటికీ కనిపించకపోయినా, నా అర్థానికి విరుద్ధమైనా.
విశ్వాసం అనేది మన హృదయంలో ఒకసారి మెలిగే భావోద్వేగం కాదు. అది పరిస్థితులపై ఆధారపడదు, అనుభూతులపై నిలబడదు. అది దేవుని వాగ్దానం నెరవేరుతుందనే స్థిరమైన నిర్ణయం.
మన అవగాహన చెబుతున్నదానికి విరుద్ధంగా ఉన్నా, కళ్లకు కనిపించకపోయినా, "దేవుడు చెప్పినదే జరుగుతుంది" అని పట్టుకొని ముందుకు వెళ్లడం విశ్వాసం. అబ్రాహాము మాదిరిగా, మనం పరిస్థితులపై కన్నా వాగ్దానమిచ్చిన దేవునిపై దృష్టి పెట్టినప్పుడు, ఆ విశ్వాసం ఫలితాన్ని తప్పక చూస్తాము.
రోమీయులకు 4:21
దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.
ఉదా: 2 రాజులు 5 – నయమానుకు “యోర్దాను లోపల ఏడుసార్లు మునుగు” అని ఎలీషా చెప్పాడు. అది వైద్యపరంగా అర్థం కాకపోయినా, ఆజ్ఞ పాటించగా స్వస్థత పొందాడు.
అంటే విశ్వాసం = "నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను కాబట్టి నమ్ముతున్నాను" కాదు,
"నేను అర్థం చేసుకున్నా లేకపోయినా, దేవుడు చెప్పాడు కాబట్టి నమ్ముతున్నాను" అన్న స్థిర నిర్ణయం.
సాధారణ "విశ్వాసం" మరియు దేవుడు మాట్లాడి ఇచ్చిన వాగ్దానంపై విశ్వాసం ఈ రెండిటి మధ్య తేడాను ఇప్పుడు మనము చూద్దాం,
దేవుని పట్ల సాధారణ విశ్వాసం,
ఇది ఆయన సృష్టికర్త, రక్షకుడు, పరలోకపు తండ్రి అని మనం నమ్మడం. ఇది మన జీవితము మొత్తనికి పునాది.
ఒక ప్రత్యేక విషయంపై విశ్వాసం,
ఇది అలా సాధారణ విశ్వాసం లా,
గుడ్డిగా ఉండకూడదు. ఏ విషయంలో దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడితే, ఆ వాగ్దానం మన హృదయంలో స్థిరపడితేనే, ఆ విషయంపై మనం విశ్వాసంతో నిలబడగలం.
దావీదు: ప్రతి యుద్ధానికి ముందు దేవుని చిత్తం అడిగేవాడు (1 సమూయేలు 23:2, 30:8). దేవుడు "వెళ్ళు, నేను నీకు విజయం ఇస్తాను" అన్నప్పుడు మాత్రమే వెళ్లేవాడు.
పౌలు: కొన్ని ప్రాంతాలకు వెళ్లాలని అనుకున్నా, పరిశుద్ధాత్మ అడ్డుకున్నప్పుడు ఆ దిశలో ముందుకు పోలేదు (అపో. కార్యములు 16:6-7).
అబ్రాహాము ఇస్సాకు గురించి విశ్వాసం కలిగింది, ఎందుకంటే దేవుడు స్పష్టంగా చెప్పాడు,
( ఆదికాండము 21:12) ఇస్సాకువలన అయినదియే నీ సంతానమనబడును.
( హెబ్రీయులకు 11:18 )ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో,ఇస్సాకువలననైనది నీ సంతానమనబడును అని యెవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై,
దేవుడు ఒక విషయంలో స్పష్టంగా మాట్లాడినప్పుడు, ఆ వాగ్దానం మనకు అర్థమైనప్పుడు, ఆ వాగ్దానంపై నిలబడటమే నిజమైన విశ్వాసం. దావీదు, పౌలు, అబ్రాహాము వారు తమ భావోద్వేగాలపై కాకుండా, దేవుడు చెప్పిన మాటపైనే నిలబడ్డారు.
అంటే — దేవుని వాగ్దానం స్పష్టంగా మనకు చేరినప్పుడు, అవాగ్ధానం అనే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు, అది మనకు "అర్థమయినప్పుడు", ఆ విషయంపై మన విశ్వాసం గట్టి పునాది మీద నిలుస్తుంది. ఆ వాగ్దానం లేకపోతే, మనం మన మనసులో కల్పించుకున్న అంచనాలను, "విశ్వాసం" అని పిలవడం సరికాదు."
సంఖ్యాకాండము 9:23
యెహోవా మాటచొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి; యెహోవా మాటచొప్పున వారు ప్రయాణముచేసిరి; మోషేద్వారా యెహోవా చెప్పినమాటనుబట్టి యెహోవా ఆజ్ఞ ననుసరించి నడిచిరి.
విశ్వాసం కేవలం ఒక భావన కాదు — అది దేవుడు మాట్లాడిన వాగ్దానంపై నిలిచే నిర్ణయం.
దేవుని పట్ల మన సాధారణ విశ్వాసం ఎప్పుడూ ఉండాలి; ఆయన సృష్టికర్త, రక్షకుడు, మన పరలోక తండ్రి అని మనం నమ్ముతాము.
కానీ ఒక ప్రత్యేక విషయంపై విశ్వాసం కలగాలంటే, ఆ విషయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడిన వాగ్దానం మనకు చేరాలి. అది మన హృదయంలో పునాదిలా నిలిచినప్పుడు మాత్రమే, మనం ఆ వాగ్దానం నెరవేరుతుందని ధైర్యంగా నమ్మగలం.
వాగ్దానం లేకుండా, అర్థం లేకుండా గుడ్డిగా నమ్మడం విశ్వాసం కాదు; అది కేవలం మనసులో ఊహించిన ఉహ,ఆశ మాత్రమే.
విశ్వాసం అనేది తాత్కాలికమైన భావోద్వేగముతో కూడినది కాదు. అది మన హృదయంలో దేవుని వాగ్దానం ద్వార స్థిరంగా నిలిచే ఒక మంచి నిశ్చలమైన ఒక నిర్ణయం. మనం ఎప్పుడూ చూడగలిగే పరిస్థితులు, అనుభూతులు మారిపోవచ్చు, కానీ దేవుడు నేడు చెప్పిన వాగ్దానం నిన్న, రేపు, నిరంతరము, ఎప్పటికీ నిజముగా,సత్యముగా స్థిరముగా అవి నిలబడతాయి. నిజమైన విశ్వాసం అంటే, మనం అర్థం చేసుకున్నా లేదా అర్థం చేసుకోలేకపోయినా, “దేవుడు చెప్పాడు కాబట్టి జరుగుతుంది” అని పట్టుదలగా ముందుకు సాగటం.
అందుకే, మనం సాధారణంగా దేవుణ్ణి సృష్టికర్త, రక్షకుడిగా నమ్మడమే కాదు, ఒక్కో విషయంలో ఆయన స్పష్టంగా ఇచ్చిన వాగ్దానాలను మన హృదయంలో స్థిర పునాదిలా ఉంచుకొని వాటిని నిజంగా నమ్మగలగడం నిజమైన విశ్వాసం.
ఈ విశ్వాసమే మన జీవిత ప్రయాణానికి బలమైన పునాది, దేవుని వాగ్దానాలను మనలో నిజముగా ఫలించేటట్లు, నెరవేరేటట్లు, చేసే మార్గం.
ఎస్తేర్ క్రైసో లైట్
13-8-2025
🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨