2025 Messages
praise the lord
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
యేసు ప్రకటించిన హిత వత్సరము నిజమైన
స్వాతంత్ర్యం,
🇮🇳 మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఇది మనకు కలిగిన శరీర సంబంధమైన స్వేచ్ఛ, కానీ యేసు ప్రకటించిన హిత వత్సరము మన ఆత్మకు, మన జీవితానికి శాశ్వత స్వేచ్ఛను ఇస్తుంది.
హిత వత్సరము" అంటే – ఆత్మీయ అర్థం
బైబిల్‌లో "హిత వత్సరము" (Year of the Lord’s favor) అనేది యూదుల యూబిలీ సంవత్సరం (లేవియకాండము 25) నుండి వచ్చినది. లేవీయకాండము 25:10 మీరు ఆ సంవత్సరమును, అనగా ఏబదియవ సంవత్స రమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలెను; అది మీకు సునాదముగా నుండును; అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను; ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను.దీనిని ఇంగ్లీష్ లోనికి అనువదించినప్పుడు"జుబ్లీ" గా అనువదించారు.తెలుగులో ఇది సునాద సంవత్సరం ముగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది.
యూదుల యూబిలీ ( జూబ్లీ, ) ఈ సునాద సంవత్సరంలో, అప్పులు రద్దు అయ్యేవి, బానిసలు విముక్తి పొందేవారు, వారసత్వ భూములు తిరిగి యజమానులకు ఇవ్వబడేవి, కానీ ఇది కేవలం సామాజిక,ఆర్థిక పునరుద్ధరణ మాత్రమే కాదు — దేవుడు తన ప్రజలపై కనికరాన్ని ప్రకటించే కాలం.
🇮🇳 మన దేశము యొక్క స్వతంత్రతను అర్థం చేసుకున్న మనము, మన దేశముయొక్క స్వతంత్రతను, అనుభవిస్తున్న మనము ప్రభువు హిత వత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించెను...నా జీవితంలో హిత వత్సరం ప్రవేశించింది..."హిత వత్సరము మోసుకొని నడిచే వ్యక్తిగా అనేకుల జీవితాలలో విమోచనను, పునరుద్ధరణను,అందించే వ్యక్తిగా దేవుడు నన్ను నియమించినాడు...అని మనము చెప్పగలిగినప్పుడు, అదే నిజమైన స్వతంత్రత అన్నటువంటి ఈ జూబ్లీ సునాద సంవత్సరము, హితవత్సరము యొక్క అర్థమును, మీరు గ్రహించారా !
యేసు ప్రకటించిన హిత వత్సరము మన ఆత్మీయ జీవితానికి సంబంధించినది:
లూకా 4:18 - 19
ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు "హితవత్సరము ప్రకటించుటకును" ఆయన నన్ను పంపియున్నాడు. అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను.
ఈ మాట యేసు నజరేతు ప్రార్థన మందిరంలో ప్రకటించినప్పుడు, అది కేవలం ఒక సంవత్సరం గురించిన వార్త కాదు. అది నిత్య కృప కాలానికి తెరతీసిన ప్రకటన.హిత వత్సరము అంటే–క్రీస్తు యేసు ప్రభువు వారు సిలువ కార్యము ద్వారా సమస్త మానవాళికి స్వేచ్ఛ ప్రకటించిన రోజు,ఈ స్వేచ్ఛ పాపం నుంచి, సాతాను బంధకాల నుంచి,సమస్త మానవాళికి కలిగిన విడుదల ఇది.
ఈ హిత వత్సరమును,పొందినవారికి, పాపము యొక్క భారము తొలగిపోతుంది,పాప బంధకాల నుండి విముక్తి, హృదయానికి స్వస్థత, సమాధానము, దేవునితో క్రోత్త ఆరంభం,దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని సన్నిధిని కలిగి ఉండే గొప్ప భాగ్యం, ఈ సునాద సంవత్సరము,ఈ హిత వత్సరము,క్రీస్తు యేసు ప్రభు వారిని విశ్వసించిన ప్రతి ఒక్కరికి కలిగిస్తుంది.
ఈ హిత వత్సరము అనేది, యేసులో నమ్మకముంచిన ప్రతి ఒక్కరికీ ఇప్పటికీ కొనసాగుతుంది. అది ఒక రోజుతో లేదా ఒక సంవత్సరంతో ముగియదు కాని— ఆయన కృపలో మనము ప్రవేశించిన క్షణం నుండి ప్రారంభమై మనము నిత్యజీవం వెళ్లేంత వరకు ఉంటుంది.ఆయన ద్వారా మన పాపాలకు క్షమాపణ, ఆత్మీయ విముక్తి, హృదయానికి స్వస్థత, బంధకాల నుండి స్వేచ్ఛ, మనకు అందుబాటులోకి వచ్చింది.
మన దేశము యొక్క స్వతంత్రతను అర్థం చేసుకున్న మనము, మన దేశముయొక్క స్వతంత్రతను, అనుభవిస్తున్న మనము "ప్రభువు హిత వత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకించెను..."
"నా జీవితంలో హిత వత్సరం ప్రవేశించింది..."ఆది నాకు మాత్రమే కాక, "హిత వత్సరము మోసుకొని నడిచే వ్యక్తిగా అనేకుల జీవితాలలో విమోచనను, పునరుద్ధరణను,అందించే వ్యక్తిగా దేవుడు నన్ను నియమించినాడు..."అని మనము చెప్పగలిగి నప్పుడు, అదే నిజమైన స్వతంత్రత అని ఈ జూబ్లీ సునాద సంవత్సరము,హితవత్సరము యొక్క అర్థమును మీరు గ్రహించారా!
యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు హిత వత్సరం అనుగ్రహించబడింది. జూబ్లీ సంవత్సరంలో బంధించబడిన వారు విడుదల చెయ్యబడినట్లే, క్రీస్తు ద్వారా మనము పాప బంధకాల నుండి విముక్తి పొంది, దేవుని రాజ్యానికి వారసులమై కొత్త జీవితం పొందాము. ఇప్పుడు మనం క్రీస్తులో స్వేచ్ఛగా, దేవుని అనుగ్రహంలో నడవాలి. మనము పొందిన, ఈ జీవితం ద్వారా ఈ హితవత్సరాన్ని, ఈ స్వేచ్ఛను, ఈ స్వతంత్రతను, మనము, ఇతరులకు తెలియజేయాలి.
ఈ దేశం మనకు శరీర సంబంధంగా మాత్రమే మనకు స్వేచ్ఛను స్వతంత్రతను ఇచ్చింది, కానీ క్రీస్తు యేసు ప్రభువు వారు మనకు ఇచ్చిన హితవత్సరము,అది ఆత్మసంబంధమైనది మాత్రమే కాక, దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో, వాళ్ల శరీరానికి కూడా శరీర సంబంధమైన విషయాలకు కూడా ఇచ్చిన విడుదల యిది.
మీరు ఎటువంటి బంధకములో ఉన్నా, వాక్యమై యున్న,ఆత్మయు జీవమునై యున్న క్రీస్తుయేసుప్రభువారు ఆ బంధాకాన్ని విరుస్తాడు. మీ గతం ఎంత భారమై ఉన్నా, ఆయన దానిని మాఫీ చేస్తాడు. నిరాశ, దుఃఖం, ఆత్మీయ చీకటి అది ఏదైనా — యేసు ఆత్మ, పరిశుద్ధాత్మ మీ జీవితాన్ని క్రోత్తదిగా చేస్తుంది. ఆలోచించండి, నేడు మీరు నిజంగా యేసు ప్రకటించిన ఈ "హిత వత్సరము"లో జీవిస్తున్నారా?
ఎస్తేర్ క్రైసోలైట్
15-8-2025
🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨