CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

praise the Lord

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

యోవల్ & జూబ్లీ & సునాద సంవత్సరము

{ part - 1}

యోవల్ జూబ్లీ సునాద సంవత్సరము & యేసుక్రీస్తు ప్రభువు వారు అబ్రాహాము కుమార్తెను విముక్తి చేయటం

ఈ వాక్యము ఒకటి పాత నిబంధన లోనిది ఇంకొకటి క్రొత్త నిబంధనలోనిది అసలు ఈ రెండిటికీ ఏమైనా సంబంధము ఉన్నదా ! లేనే లేదు, లేదు కావచ్చు, అని మనకు అనిపిస్తూ ఉంటుంది, ఈ రెండు విషయాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏమైనా తెలియజేయాలని అనుకుంటున్నాడా, ఈ అంశం గురించి ఇప్పుడు మనము ధ్యానం చేద్దాం.

యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన ప్రతి పని కూడా అది ఒక లోతైన అర్థంతో నిండి ఉంటుంది. అబ్రాహాము కుమార్తెను స్వస్థపరిచిన సంఘటన కేవలం ఒక స్వస్థత సంఘటన మాత్రమే కాదు; కాని దాస్యము పాపము అనే బంధకాల నుంచి విడిపించే విముక్తి పరచే సునాధ సంవత్సరము యొక్క ప్రాముఖ్యతను గురించి ఇది మనకు తెలియజేస్తుంది

నేను రక్షించబడిన క్రొత్తలో పరిశుద్ధ గ్రంథాన్ని

చదువుతున్నప్పుడు ఈ సునాద సంవత్సరము అంటే ఏమిటో నాకు అసలు అర్థం అయ్యేది కాదు దీని గురించి తెలుసుకోవాలని చాలాసార్లు చదివి ప్రయత్నం చేస్తు పక్కన పడేస్తూ ఉండేదాన్ని ఈ అంశాన్ని కొద్ది రోజుల క్రితం నుంచి ఈ అంశాన్ని గురించి నేను ధ్యానిస్తూ వస్తున్నప్పుడు నాకు అనిపించింది,

అప్పుడు ఇది ఎందుకు నాకు అర్థం కాలేదు అని ఏ విషయమైనా ఏపని అయిన అంతేనండి మనకు అర్థం కాకపోతే అది చాలా కష్టంగా ఉంటుంది, అర్థమైతే దానిని చాలా సులువుగా మనం చేసేస్తాము దేవుని వెంబడించడం వాక్యానుసారంగా నడవడం అనేది కూడా మనకు అర్థం కాకపోతే భక్తి చేయటం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ దాని వల్ల లాభం ఏంటో మనకు అర్థం అయినప్పుడు దానిని ఇష్టంగా చేస్తాము.

లూకా 13:11,12,13,14,

పదునెనిమిది ఏండ్లనుండి బలహీనపరచు దయ్యము(మూలభాషలో-ఆత్మ) పట్టిన యొక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యెంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను.

యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి అమ్మా, నీ బలహీనతనుండి విడుదల పొంది యున్నావని ఆమెతో చెప్పి ఆమెమీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను.

యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచినందున ఆ సమాజమందిరపు అధికారి కోపముతో మండిపడి, జనసమూహమును చూచి పని చేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థతపొందుడి; విశ్రాంతిదినమందు రావద్దని చెప్పెను.

నడుము వంగిపోయి వున్న ఆస్త్రీని యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచి నందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి,

ఆసమాజ మందిరపు అధికారికి కోపము ఎందుకు వచ్చింది. అని అంటే దేవుడిచ్చిన పది ఆజ్ఞాలలో నాలుగువ ఆజ్ఞా విశ్రాంతి దినమును గూర్చినది,

నిర్గమకాండము 20:8,-11,

విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము. ఆరు దినములు నీవు కష్ట పడి నీ పని అంతయు చేయవలెను ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయ కూడదు. ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.

ద్వితీయోపదేశకాండము 5 : 12 -- 15 వరకు

నిర్గమకాండము 35:3

విశ్రాంతి దినమున మీరు మీ యిండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్ట కూడదని వారితో చెప్పెను.

విశ్రాంతి దినమున ఏ పనియు చేయకూడదు అన్న ఆజ్ఞ నియమము ఉన్న కారణమున నడుము వంగిపోయిన స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థ పరచే పనిని చేయటము అన్నది అక్కడ వారికి అభ్యంతర కారణముగా ఉన్నది అందుకే ఆ సమాజపు అధికారికి కోపం అన్నది వచ్చింది.

లేవీయకాండము 25:2,3,4,

నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము నేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమికూడ యెహోవా పేరట విశ్రాంతి కాలమును, ఆచరింపవలెను.

ఆరు సంవత్సరములు నీ చేను విత్తవలెను. ఆరు సంవత్సరములు నీ ఫలవృక్ష ములతోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును.

ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సర ముగా ఉండవలెను. అందులో నీ చేను విత్త కూడదు; నీ ఫలవృక్షములతోటను శుద్ధిపరచకూడదు.

దేవుడు నియమించిన విశ్రాంతి దినమును మానవులు పశువులు పనివాళ్ళు యే కాకుండా భూమి కూడా దానిని పాటించాలి అన్న ఆజ్ఞ ఇవ్వబడ్డది ప్రతి ఏడవ సంవత్సరం భూమికి విశ్రాంతిని ఇవ్వాలి అన్న అజ్ఞను ఇశ్రాయేలీయులు పాటించేవారు.

లేవీయకాండము 25:20

​ఏడవ యేట మేము ఏమి తిందుము? ఇదిగో మేము చల్లను పంటకూర్చను వల్లగాదే అనుకొందురేమో.

లేవీయకాండము 25:21

అయితే నేను ఆరవయేట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను; అది మూడేండ్ల పంటను మీకు కలుగజేయును.

ఏడవ సంవత్సరం (మహా విశ్రాంతి దినము) – పొలాలకు విశ్రాంతిని ఇవ్వాలి & అప్పులన్నియు మాఫీ చేయ బడాలి.

సునాద సంవత్సరం & ఏడవ సంవత్సరం

సునాద సంవత్సరం మరియు ఏడవ సంవత్సరం

ఈ రెండూ విడివిడిగా ఉన్నా, ఈ రెండు ఒకటే రకముగా ఉన్నవి అనే భావనను మనకు కలిగిస్తాయి సునాద సంవత్సరము– విముక్తిని కలిగిస్తే & ఏడవ సంవత్సరము విశ్రాంతి న్ని ఇస్తుంది. అయితే, ఇవి రెండు భిన్నమైన నియమాలు.

ఈ భిన్నమైన నియమాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1. ఏడవ సంవత్సరం (మహా విశ్రాంతి దినము) – పొలాలకు విశ్రాంతిని ఇవ్వాలి & అప్పులన్నియు మాఫీ చేయ బడాలి.

లేవీయకాండము 25:3

లేవీయకాండము 25:4

​ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సర ముగా ఉండవలెను. అందులో నీ చేను విత్త కూడదు; నీ ఫలవృక్షములతోటను శుద్ధిపరచకూడదు.

ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు.

పొలాలను దున్నకూడదు –పంటను వేయకూడదు భూమికి విశ్రాంతి ఇవ్వాలి.. ఎవరైనా అప్పు తీసుకుని ఉంటే, దానిని మాఫీ చేయాలి.

ఇది ఆర్థిక, వ్యవసాయ విశ్రాంతి – ఇది ప్రజలకూ, భూమికీ నెమ్మదిని ఇస్తుంది.

2. సునాద సంవత్సరం – అసలయిన యజమానులకు భూములు తిరిగి ఇవ్వడం & దాసుల విముక్తి.

లేవీయకాండము 25:10

మీరు ఆ సంవత్సరమును, అనగా ఏబదియవ సంవత్స రమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలెను; అది మీకు సునాదముగా నుండును; అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను; ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను.

ఈ జూబ్లీ పండుగను ఇశ్రాయేలీయులు ప్రతి 50వ సంవత్సరం జరుపుకుంటారు. (7 x 7 = 49 సంవత్సరాల తర్వాత, 50వ సంవత్సరం సునాద సంవత్సరం) ఈ సునాద సంవత్సరం విముక్తిని విమోచనను ఇచ్చే సంవత్సరము కాబట్టి

దాసులను విడుదల చేయాలి – ఇకపై ఎవరూ బానిసలుగా ఉండకూడదు. భూములు అసలయిన యజమానులకు తిరిగి వెళ్లాలి. ఇది ఒక మహా విముక్తి సంవత్సరం! ఆని దీని గురించి మనం చెప్పవచ్చు.

ఇది పూర్తిస్థాయి విముక్తి – భూమి, ప్రజలు, కుటుంబాలు తిరిగి ఒకటవుతాయి.

3. ఏడవ సంవత్సరమునకు సునాద సంవత్సరమునకు తేడా ఏమిటి?

ఏడవ సంవత్సరం చిన్న విడిపింపు, కానీ సునాద సంవత్సరమే అసలైన విముక్తి!

యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చిసిలువలో తన ప్రాణమును పెట్టి తిరిగి లేచి సర్వ మానవులను పాపము నుంచి శాపం నుంచి మరణం నుంచి విడిపించుట కొరకు ఈ సునాద సంవత్సరమును ఆత్మసంబంధంగా నేరవేర్చారు.

ఏడవ సంవత్సరం = భూమికి విశ్రాంతి & అప్పుల మాఫీ.

సునాద సంవత్సరం = దాసుల విముక్తి & భూములు తిరిగి పొందడం.

యేసు సునాద సంవత్సరాన్ని ఆత్మసంబంధముగా నెరవేర్చాడు – పాపం నుంచి శాపం నుంచి మరణం నుంచి సాతాను నుంచి మనకు నిజమైన విమోచనను విముక్తిని ఇచ్చాడు!

ఎస్తేర్ క్రైసోలైట్

12-3-2025

🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿

✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨