CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

praise the Lord

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃

యోవల్ & జూబ్లీ & సునాద సంవత్సరము

{ part - 3 }

"హిత వత్సరం" అంటే ఏమిటి?

"హిత వత్సరం" (Year of the Lord’s Favor) అంటే దేవుని అనుగ్రహం ఉచితంగా ప్రసాదించబడే సంవత్సరం అని అర్థం. ఇది ముఖ్యంగా "జూబ్లీ సంవత్సరం" (Jubilee Year) కి సంకేతం.

జూబ్లీ సంవత్సరం మరియు హిత వత్సరం సంబంధం

లేవీయకాండం 25:8-13 ప్రకారం, ఇశ్రాయేలీయులు ప్రతి యాభై సంవత్సరాలకు ఒకసారి జూబ్లీ సంవత్సరాన్ని పాటించాల్సి ఉండేది.

ఆ సంవత్సరంలో బందీలను విడుదల చేస్తారు.అంటే బంధకాలలో ఉన్న వాళ్ళకి విడుదల కలుగుతుంది

రుణాలు రద్దు చేయబడతాయి.

భూములను తిరిగి యజమానులకు అప్పగిస్తారు.

ప్రజలు దేవుని ఆశీర్వాదమును పొంది నెమ్మది విశ్రాంతిని కలిగి జీవిస్తారు

ఈ జూబ్లీ సంవత్సరం ఒక పునరుద్ధరణ (Restoration), విమోచన (Redemption), విశ్రాంతి (Rest) ని సూచిస్తుంది.

యేసుక్రీస్తు ప్రభువు & హిత వత్సరం

యేసు క్రీస్తు ప్రభువు వారు నజరేతు సమాజ మందిరంలో యెషయా గ్రంథాన్ని తెరిచి ఈ వాక్యాలను చదివాడు:లూకా 4:18,19

ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును

ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను.

ఆ తర్వాత యేసు "ఈ వాక్యం మీ ముందు నేడు నెరవేరినది" అని అన్నాడు.లూకా 4:20,21

ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో నున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయననేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను.

దీనర్థం ఏమిటి?

యేసు క్రీస్తు ప్రభువు వారు పాపాల ద్వార బందీలుగా ఉన్న మనుష్యులను సాతాను పాతాళము అధీనంలో ఉన్న ఆత్మలను విమోచించడానికి వచ్చాడు.

యేసు క్రీస్తు ప్రభువు వారి ద్వారా ప్రజలు దేవుని రాజ్యాములో ప్రవేశించడానికి ఇది ఒక దేవుని అనుగ్రహకాలం (Grace Period) అని మనం చెప్పుకోవచ్చు, ఇది శారీరక విమోచన మాత్రమే కాదు, కాని ఆత్మీయ విమోచన కూడా.అయి ఉన్నది

ప్రజలు పాపం, దురాత్మల బంధకాల నుండి విడుదల అవ్వాలి.

హిత వత్సరం" అనగా దేవుని అనుగ్రహకాలం, విమోచన & పునరుద్ధరణకు సమయం. ఇది పాత నిబంధనలో జూబ్లీ సంవత్సరంతో పోల్చబడుతుంది, కానీ ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అని ఈ వాక్యం మీ ముందు నేడు నెరవేరినది" అని చేప్పిన

యేసు క్రీస్తు ప్రభువు వారి ద్వారా సమస్త మానవాళికి శాశ్వతమైన విమోచన వచ్చింది.

మన జీవితానికి అర్థం?

యేసు క్రీస్తుప్రభువారిని అంగీకరించిన ప్రతి ఒక్కరి జీవితంలో "హిత వత్సరం" అన్నది ప్రారంభమవుతుంది.నూతన సృష్టిగా చేయబడతారు శాశ్వతమైన నూతనజీవాన్ని పొందుతారు, పాప బంధాలు తెగిపోవాలి, మనం దేవుని సంతానంగా స్వేచ్ఛగా జీవించాలి.

దేవుడు మన జీవితాల్లో పునరుద్ధరణ, నూతనతను ఇస్తారు.మనం ఈ హిత వత్సరాన్ని ఇతరులతో పంచుకోవాలి!

యేసులో విశ్వాసం ఉంచినవారికి నూతన జీవితం.

4. అబ్రాహాము కుమార్తెకు యేసు ఇచ్చిన విముక్తి జూబ్లీ సంవత్సరం యొక్క లోతైన అర్థం ఎమిటంటే

జూబ్లీ సంవత్సరం అంటే బంధితులను విముక్తి చేయడం. అబ్రాహాము కుమార్తె నిజమైన బాధితురాలు – 18 సంవత్సరాలుగా శారీరసంబంధమైన & ఆత్మ సంబంధమైన బంధకాలలో తాను ఉంది. యేసు క్రీస్తుప్రభువారు ఆమెను విడుదల చేశాడు – ఆమెకు నిజమైన జూబ్లీ సునాధము అన్నది జరిగింది! యేసుక్రీస్తు ప్రభువు వారిలో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికీ విముక్తి, స్వేచ్ఛ లభిస్తుంది.

5. సునాద సంవత్సరం యేసు క్రీస్తు ప్రభువు వారిలో మనకు ఏమి బోధిస్తుంది అని అంటే,

యేసు నామంలో మనం శారీరక, ఆత్మీయ బంధకాలనుండి విముక్తి పొందవచ్చు.

సునాద సంవత్సరం కేవలం ఒక పండుగ కాదు – అది యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా నిజంగా నెరవేరినది.ఏసుక్రీస్తు ప్రభువు వారి మరణ భూస్థాపన పునరుద్దానాల ద్వారా పాపంలో బంధించబడిన పాపపు స్వభావము కలిగిన మానవుడికి పాపికి సాతాను దాస్యం నుంచి విడుదల కలిగింది.

కష్టాలలో శ్రమలలో ఉన్న ప్రతి ఒక్కరికి – యేసులో యేసు సీలువ ద్వార విముక్తి ఉంది!

సునాద సంవత్సరం = బంధితులకు విముక్తి, స్వేచ్ఛ

అబ్రాహాము కుమార్తె = 18 ఏళ్ల బందకానికి గురైన మహిళ, యేసు ఆమెను విడుదల చేయడం = జూబ్లీ సునాద సంవత్సరము అన్నది నెరవేరడం,

యేసుక్రీస్తు ప్రభువు వారిలో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికీ విముక్తి, స్వేచ్ఛ లభిస్తుంది క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడతారు నూతన ఆశీర్వాదాలను పొందుతారు.

యేసు తన రాకతో సునాద సంవత్సరం లో స్వయంగా వచ్చి తనను విశ్వసించే మానవులందరికీ విముక్తిని ఇచ్చాడు! ఆమె శరీరికంగా ఏ వంకర లేకుండా నేరుగా నిలిచినట్లే, మనం కూడా ఆత్మీయంగా దేవునిలో నేరుగా నిలబడాలి!

యేసు నామంలో సకల బంధకాల నుండి మనము విముక్తి పొంది, యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించిన రక్షణను మనము పొందాలి,అన్న ప్రాముఖ్యమైన సత్యమును ఈ సునాద సంవత్సరం మనకు తెలియజేస్తుంది.

"ప్రభువు హిత వత్సరాన్ని ప్రకటించుటకు" అనే మాటకు గాఢమైన ఆత్మీయ అర్థం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనం విమోచించబడినవారము,నూతన సృష్టిగా చేయబడిన వారము నూతన జీవాన్ని పొందిన వారము పరలోక రాజ్యానికి వారసులం మనము పొందిన జీవాన్ని క్రీస్తు యేసు ప్రభు వారిలో మనము స్వతంత్రించుకున్న పరలోక రాజ్యానికి సంబంధించిన వార్తను దేవుని అనుగ్రహ కాలంలో అనేకులకు తెలియజేద్దాం పాప బంధకాలలో వున్న అనేకుల యొద్దకు హిత వత్సరము అనె దేవుని అనుగ్రహ కాలమును వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా అందిద్ధాం !

ఎస్తేర్ క్రైసోలైట్

12-3-2025

🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿

✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨