2025 Messages
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
Praise the Lord
🌿
ఒలీవ తేజస్సు🌿
{ పశ్చాత్తాపం మన జీవితాన్ని పచ్చదనంతో, దేవుని కృపతో నింపుతుంది.కృపతో నిండిన జీవితం, ఎండలోనూ పచ్చగా నిలిచే ఒలీవ చెట్టు వంటిది.}
హోషేయా 14:6
అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవచెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును.
హోషేయా గ్రంథం మొత్తం ఇశ్రాయేలు చేసిన, విగ్రహారాధన, వారి అవిశ్వాసం గురించి చెబుతుంది. కానీ చివరలో (14వ అధ్యాయం) దేవుడు వారిని పశ్చాత్తాపపడి తనవైపు తిరిగితే, ఆయన వారిని మళ్లీ స్వీకరించి సౌందర్యంతో అలంకరిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఇది వారు పాపం నుండి క్షమ పన వైపునకు తిరిగినప్పుడు, పాపానికి బదులు కృపను,కలిగివుండే అందమైన ఆత్మీయ దృశ్యం యిది.
ముందు ఇశ్రాయేలు ప్రజలు వాడిపోయిన, బలహీనమైన వృక్షంలా ఉన్నారు. కానీ ఈ వచనంలో దేవుడు మళ్లీ వారిని పచ్చదనం, ఫలించే, సువాసన కలిగినవారిగా చేయబోతున్నాడు. ఈ మార్పు దేవుని కృప వల్లే వస్తుంది. కృపలోనే నిజమైన సౌందర్యం ఉంది.
ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో,వారికి దేవుని కృప దొరుకుతుంది, వారి జీవితం వృధాగా వుండదు. దేవుడు వారిని మళ్లీ పచ్చదనం, తేజస్సు, సువాసన కలిగినవారిగా మార్చుతాడు.ఈ వచనములో ఉన్న 6 ఆశీర్వాదాలను,ఇప్పుడు మనము చూద్దాం,
1. అతని కొమ్మలు విశాలముగా పెరుగును,
"కొమ్మలు విస్తరించును"
అన్న వాగ్దానం మన జీవితం కేవలం మనకోసమే కాకుండా ఇతరులకు నీడనిచ్చే, ఆశీర్వాదం పంచే జీవితముగా మన జీవితం మారుతుందని ఈ వాక్యం చెబుతుంది.
2. ఒలీవచెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును,
"ఒలీవ చెట్టుతేజస్సు" అంటే మనలో దేవుని అభిషేకం, శాంతి, స్థిరత్వం ప్రత్యక్షం అవటం.
"లెబనాను సువాసన" అంటే దేవుని సన్నిధిలో ఉండటం వలన మన ఆత్మీయ వాసన ఇతరులను ప్రభావితం చేయడం.
ఈ వాక్యము యొక్క అర్థం ఏమిటంటే — మన పశ్చాత్తాపం, దేవుని కృపను విడుదల చేస్తుంది; ఆ కృప మనల్ని సౌందర్యముగా, ఆశీర్వాదముగా మారుస్తుంది. ఇది ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇస్తున్న, ప్రాముఖ్యమైన సందేశము.
3. 🌿 ఒలీవ చెట్టు తేజస్సు 🌿
దేవుని వాక్యము ఒలీవ చెట్టును తరచుగా ఆశీర్వాదమునకు, అభిషేకమునకు, శాంతికీ సంకేతంగా చూపిస్తుంది. కీర్తనల గ్రంధకర్త దావీదు తనను "పరలోక మందిరములో నాటబడియున్న పచ్చని ఒలీవ చెట్టు" అని పేర్కొన్నాడు.
కీర్తనలు 52:8
నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక యుంచు చున్నాను, ఇది దేవునిపై నమ్మకం ఉంచిన విశ్వాసికి ఉండే ఒక ప్రత్యేక స్థితిని వివరిస్తుంది.
4. . దేవుని సన్నిధిని ప్రత్యక్షపరిచే తేజస్సు,
పచ్చని ఒలీవ చెట్టు తేజస్సు అంటే – మనలో దేవుని అభిషేకం, దేవుని ఆత్మ సన్నిది, ప్రతిబింబించే మన జీవనశైలిని,పచ్చని ఒలీవ చెట్టు తేజస్సు, అని అంటారు . పాత నిబంధనలో,ఒలీవ చెట్టు నుండి వచ్చే నూనె, అభిషేకము చేసే నూనెగా ఉపయోగించబడింది. అంటే దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తులు, ఎక్కడ ఉన్నా అక్కడ దేవుని కృప, శాంతి, మరియు విశ్వాసములో స్థిరత్వమును,
దేవుని సన్నిధి యొక్క తేజస్సు అక్కడ ప్రత్యక్ష పరచబడుతుంది.
ఒలీవ చెట్టు ఇది ఎండలోను,కూడా పచ్చదనమును కోల్పోని చెట్టు. ఇది స్థిరత్వానికి, మనలను జీవింప చేసే శక్తికి సూచన. ఎండకాలములోనూ పచ్చగా ఉండే ఒలీవ చెట్టు, దేవుని వాక్యముతో నాటబడిన జీవమును,జీవితమును సూచిస్తుంది.
మన ఆత్మీయ జీవితం కూడా అట్లే ఉండాలి. బయటి పరిస్థితులు ఎలా ఉన్నా, కష్టకాలలోను,దేవుని సన్నిధి అనే తేజస్సును,పచ్చదనాన్ని కోల్పోకుండా, దేవుని వాక్యంలో వేరు పారిన జీవితము లా ఎల్లప్పుడూ,దేవుని సన్నిధిని కలిగిన పచ్చని తేజస్సుతో నిలబడాలి.
5. ఆత్మ సంబంధమైన కృపావరాలు కలిగిన సౌందర్యం తేజస్సు
"అందము" అంటే ఇక్కడ బాహ్య సౌందర్యం కాదు; అది ఆత్మీయ అందము. వినయము, విశ్వాసము,పవిత్రత, కృప, దేవుని ప్రేమ – ఇవన్నీ కలిసినప్పుడే నిజమైన ఆత్మీయ అందం,మనలో ఉత్పన్నమవుతుంది. ఈ ఆత్మీయ కృపా వరాలు మనలో,తేజస్సును ధరించు కున్నప్పుడు దేవుని సన్నిధి ద్వారా మనము వెలిగించ బడినప్పుడు, ఒలీవ చెట్టు వలె మన ఆత్మీయ సౌందర్యము మన జీవితం నిజమైన తేజస్సుతో ప్రకాశిస్తుంది.
6. కాబట్టి "ఒలీవ చెట్టు తేజస్సు" అంటే:
అభిషేకం అంటే – యిది పరిశుద్ధాత్మతో దేవుని వాక్యముతో,నింపబడిన జీవితం.
శాంతి అంటే– హృదయంలో దేవుని సమాధానం నిలిచే స్థితి.
స్థిరత్వం అంటే– ఈ జీవితంలో వచ్చే కష్టాలు అనే ఎలాంటి తుఫానులలో నైన, దేవునిపై కదలని మన విశ్వాసము నమ్మకం.
ఆత్మీయ అందం అంటే – కృప, పవిత్రత, దేవుని పట్ల మనము కలిగి ఉన్న వినయ విధేయతలతో,విశ్వాసంతో,నింపబడిన, మన అంతరంగం.
ఇటువంటి తేజస్సు, మనలో కనబడినప్పుడు, మన చుట్టూ ఉన్నవారు, దేవుని సన్నిధిని అనుభవిస్తారు.
ఆలోచించండి,మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి.
మీ జీవితంలో ఒలీవ చెట్టు తేజస్సు – అంటే అభిషేకం, శాంతి, స్థిరత్వం, ఆత్మీయ సౌందర్యం – స్పష్టంగా కనబడుతున్నాయా? లేక పరిస్థితుల వలన ఆ పచ్చదనం కనపడకుండా పోతుందా?
ఎస్తేర్ క్రైసోలైట్
23-8-2025
🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨