2025 Messages
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
ఆత్మీయ బలముతో వచ్చే ఐశ్వర్యం
praise The Lord
సామెతలు 11:16
నెనరుగల స్త్రీ ఘనతనొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు.
నేను మా యింట్లో వున్న ఒక క్యాలెండర్ లో, ఈ సెప్టెంబర్ అక్టోబర్ మంత్ కొరకు, నేను దాని పేజీని త్రిప్పినప్పుడు, సామెతలు11:16 వాక్యం నాకు కనపడ్డాది.ఈ వాక్యము నన్ను బాగా ఆకర్షించింది, ఎందుకంటే ఎక్కడి నుండి అయినా నాకు ధనము రావలసినది ఉంటే కనుక అది ఈ ఇయర్ రే వస్తుంది, అని నేను విశ్వసిస్తున్నాను, ఆది కూడ ఈ సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానాన్ని బట్టి,నా విశ్వాసం అన్నది ఉంది కాబట్టి.
అయితే ప్రతి సంవత్సరం కూడా నేను ఏ వాగ్దానం తీసుకున్న అది ముఖ్యముగా ఆత్మసంబంధంగా నెరవేరాలి అని నేను దేవుని అడుగుతుంటాను, ఎందుకు అంటే,అవాగ్ధానము ఆత్మసంబంధంగా నెరవేరినప్పుడు,నిత్యత్వంలో అంటే పరలోకంలో మనము శాశ్వతమైన బహుమానాన్ని దేవుని నుంచి అందుకుంటాము,మనము తీసుకునే ఆ వాగ్దానము,ఈ లోక సంబంధం గా నెరవేరితే, దాని ప్రభావము దాని ఫలితము ఇక్కడ వరకు మాత్రమే ఉంటుంది, అది నిత్యత్వం వరకు మనతో రాదు,
అందుకే ముఖ్యముగా మనము ఆత్మ యందు బలిస్టులముగా ఉన్నప్పుడు ఈ లోక సంబంధం గా కూడా మన వాగ్దానం అన్నది నెరవేరుతుంది,దేవుడు తన చిత్తానుసారముగా మన ప్రతి అవసరమును తీరుస్తాడు, ఒకవేళ ఆ అవసరత తీర్చబడకుండా ఉంటుంది, అని అంటే, కచ్చితంగా అలా తీర్చబడకుండా ఉండటం వలన, మనకు మేలు కలుగుతుంది, అని మనము దేవుణ్ణి విశ్వసించాలి,
“నెనరు గల స్త్రీ ఘనత నొందును”
1. నెనరు గల స్త్రీలు
“నెనరు గల స్త్రీలు” అని బైబిల్ చెప్పినప్పుడు అది కేవలం బాహ్య రూపం గురించి కాదు, కాని వారి హృదయంలో ఉన్న ఆత్మీయ నెమ్మది, దేవుని యందు వారికి వున్న భయభక్తి, ఆత్మీయ జ్ఞానం గురించి చెప్పబడుతుంది. నెనరు’ అంటే వినయంగా, జ్ఞానంతో, దేవుని భయంతో నడుచుకోవడం. అటువంటి స్త్రీలు మానవుల అధికారానికి లోబడినవారుగా కాకుండా, దేవుని అధికారంలో నడిచేవారుగా బైబిల్ చూపిస్తుంది.
1 పేతురు 3:3-4, సామెతలు 31:30, గలతీయులకు 5:22-23, ఈ వచనాల ఆధారముగా," నెనరు గల స్త్రీలు అంటే,"
దేవుని అధికారంలో, ఆయన వాక్యంలో నడిచేవారు అని అర్ధం. మానవుల యొద్ధ మెప్పు పొందే ప్రయత్నం కాకుండా, దేవుని కృపలో నిలిచే వారు అని అర్ధం. వారికి కలిగే ఈ ఘానత దేవుని కృప వలన, లభించే గౌరవం అని అర్థం.
“నెనరు” అంటే తెల్ల వెంట్రుకలు కాదు. అది “వినయం, జ్ఞానం, బుద్ధి” అని అర్థం.
తెలుగులో “నెనరు” అనే పదం ప్రధానంగా:
జ్ఞానం, వివేకములకు, అర్ధం తెలిసిన స్థితి.
వయస్సుతో వచ్చిన తెలివితేటలు.
ఆత్మీయంగా, దేవుని భయంతో నడుచుకునే పరిపక్వత.
“నెనరు” అంటే జ్ఞానం,వివేకం,వినయం,
జ్ఞానం: జీవితం, అనుభవం ద్వారా వచ్చిన పరిజ్ఞానం.
వివేకం: ఏది సరి అయినది, ఏది సరి అయినది కాదు, అనే స్పష్టమైన అర్థమును,గ్రహించే స్థితి.
వినయం: మనకు జ్ఞానం ఉన్నప్పటికీ గర్వపడకుండా, దేవుని భయంతో నడవడం.
ఇది కేవలం తెల్ల వెంట్రుకలు లేదా వయసుతో వచ్చే పరిపక్వత కాదు; అంతరంగంలో మన హృదయంలో వచ్చే పరిణతి.
దేవుని దృష్టిలో నెనరు అంటే
పరిశుద్ధ గ్రంథం దీని గురించి ఏమని చెబుతుంది,
సామెతలు 1:7
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము,యెహోవాయందు,అంటే మన దేవునియందు,మనము కలిగి ఉండే భయమే, మనకు కలిగే జ్ఞానానికి ఆరంభము అని అర్థం.
అంటే నిజమైన జ్ఞానం దేవునితో ఉన్న సంబంధం నుంచే వస్తుంది. తన జీవితంలో ఆత్మీయంగా దేవుని వాక్యాన్ని పాటించే స్త్రీనే నిజంగా “నెనరు గలది” అని పిలుస్తారు.
ఇటువంటి నెనరు గల స్త్రీ తన సౌందర్యం వల్ల కాదు, తన స్వభావం వల్ల, దేవుని కృప వల్ల ఘానత పొందుతుంది. ఈ ఘానత భౌతిక సంబంధమైన ప్రశంసలు కాదు; దేవుడు ఇస్తున్న గౌరవం, ప్రభావం.
అందుకే 1సమూయేలు 16:7లో ఇల వుంది,
అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను-అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.
మనుషులు బయట కనిపించే అందాన్ని చూసి ఆకర్షితులవుతారు, కానీ దేవుని దృష్టి హృదయ సౌందర్యం మీద ఉంది. అంతరంగంలో వినయం, పవిత్రత, దేవుని భయం ఉన్న వ్యక్తినే దేవుడు ఘానపరుస్తాడు.
బాహ్య సౌందర్యం ఆకట్టుకునేది తాత్కాలికం.
హృదయ సౌందర్యం, దేవుని జ్ఞానం మాత్రం శాశ్వత ప్రభావం చూపుతుంది.
2. “ ఘానత” అంటే ఏమిటి?
ఈ ఘానత కేవలం మనుషుల ప్రశంస కాదు; దేవుడు ఇచ్చే గౌరవం, కృప, శాంతి.ఇలాంటి స్త్రీ తన కుటుంబంలో, సంఘాంలో, సమాజంలో దేవుని వెలుగును ప్రకాశింపచేస్తుంది.
ప్రపంచం అంతా కూడా బాహ్య సౌందర్యాన్ని ఘానతగా పరిగణిస్తుంది. దేవుడు మాత్రం హృదయ సౌందర్యంను ఘానతగా చూస్తాడు.
1పేతురు 3:3 - 4
జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయా లంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము(అంతరంగపురుషుడు) మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.
దేవుడు చూస్తున్నది మన బాహ్య రూపం కాదు, మన హృదయములోని గుణాలను మన స్వభావమును.
3. “బలిష్టులు ఐశ్వర్యము పొందుదురు”
బలం అనేది కేవలం శరీర సంబంధమైన శక్తి కాదు ఇది విశ్వాసం, ప్రార్థన, ఆత్మీయ బలం కూడా.
ఇలాంటి ఆత్మ సంబంధమైన బలమును కలిగినవారు దేవుని ఆత్మీయ ఆశీర్వాదాలను, దేవుని సమాధానమాను, వారి జీవితంలో పొందుతారు.
వినయంగా నడిచే స్త్రీకి దేవుడు ప్రత్యేక గౌరవాన్ని ఇస్తాడు. ఆత్మీయ బలం ఉన్నవారు నిజమైన సంపదను అనుభవిస్తారు. ప్రపంచం అంత బాహ్య రూపాన్ని, శక్తిని చూసి ఘానతను ఇస్తుంది, కానీ దేవుడు అంతరంగ స్వభావం, విశ్వాసం చూసి ఘానతను ఇస్తాడు.
నెనరు గల స్త్రీ ఘానత పొందుతుంది” అన్న వాక్యం మనకు యిస్తున్న సందేశం ఏమిటంటే —
మనకు వచ్చే గౌరవం, ప్రభావం, ఆశీర్వాదం కేవలం బాహ్య సౌందర్యం వల్ల కాదు; అది దేవుని భయంతో నిండిన హృదయం, వినయం, జ్ఞానం, ఆత్మీయ బలం వల్ల. “బలిష్టులు ఐశ్వర్యమును పొందుతారు” అన్నదీ కేవలం ఒక్క భౌతిక సంపద గురించి కాదు కాని, దేవుని సమాధానం, ఆత్మీయ బలము, ఆత్మీయ ధనము పొందే వారిని సూచిస్తుంది.
ఈ వాక్యం మనలను బాహ్య సౌందర్యానికి కాదు, హృదయ సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వలని,ఈ వాక్యము మనకు తెలియజేస్తుంది.
ఎస్తేర్ క్రైసోలైట్
5-9-2025
🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨