2025 Messages
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
praise the Lord
ముద్ర లేని స్థలాలు శత్రువుకి ఓపెన్ డోర్స్
Unsealed Areas Are Open Doors to the Enemy
కొన్ని సంఘటనలు మనకు ఆత్మ వివేచన నేర్పుతాయి—దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో, దేనికి ఇవ్వకూడదో స్పష్టంగా తెలుస్తుంది. ఈ మధ్యనే నా ప్రార్థన స్థలంపై నా పక్కవారి నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ పోరాటంలో దేవుడు నాకు ఒక బలమైన సందేశం ఇచ్చాడు:
“దేనికైనా ముద్ర అనేది చాలా ప్రాముఖ్యమైనది.”
మనము, మన కుటుంబం, మన ప్రార్థన స్థలాలు, మన దగ్గర ఉన్నది ఏదైనా – దాని మీద ముద్ర ఉందా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం. ముద్ర లేకపోతే, మన ప్రయత్నాలు నష్టానికి దారితీస్తాయి. ఆత్మ లోకంలో ఎవరు ఎవరిని కాపాడుతున్నారు, ఎవరు ఎవరి మీద అధికారంతో ప్రార్థిస్తున్నారు అన్నది చాలా ప్రాముఖ్యం.
నాకు సంబంధించిన ప్రతి దానిలో నా ప్రార్థన ముద్రగా ఉంటుంది. కాబట్టి నేను ఇతరులపై ఆధార పడకుండా నా వ్యక్తిగత ప్రార్థనను మరింత బలపరచుకోవాలని దేవుడు నాకు ఒక క్రోత్త సందేశం ఇచ్చాడు.
మనకు ఒక పోరాటం వస్తే, అది ఆత్మ లోకంలో జరిగే విషయాలతో సంబంధముందని మనము కచ్చితంగా గ్రహించాలి. ముద్ర లేని దానిని శత్రువు నష్టపరుస్తుంది. మనకు సంబంధించిన ప్రతి దానికి మనమే ముద్ర వేయాలి; బాధ్యత కూడా మనదే.
ఒక కంపెనీ ఒక వస్తువును తయారుచేసి మార్కెట్లోకి పంపేటప్పుడు దాని మీద దాని ముద్ర ఉంటుంది.
ఆ ముద్ర దాని యజమాని ఎవరో నిర్ధారిస్తుంది.
దానికి సర్వీస్, వారంటీ, గ్యారంటీ అన్ని లభిస్తాయి.
దానికి మార్కెట్లో విలువ ఉంటుంది.
అదే విధంగా ఒక గొర్రెల కాపరి తన గొర్రెల చెవిలో లేదా శరీరంలో ఒక ప్రత్యేక మైన గుర్తును వుంచుతాడు, గందరగోళం అనేది లేకుండా వాటిని గుర్తించడానికి. గొర్రెల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి గొర్రెను గుర్తించడానికి ముద్ర అవసరం. ఇది దొంగతనాన్ని నివారిస్తుంది, ప్రమాదంలో కూడా వాటికి రక్షణ కలిగిస్తుంది.
ఆత్మలో కూడా ఇదే విధానం ఉంది.
దేవుడు తన ప్రజలపై పరిశుద్ధాత్మ చేత ముద్ర వేశాడు:
ఎఫెసీయులకు 1:13
మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
2కోరింథీయులకు 1:22
ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు.
ముద్ర వల్ల మనకు వచ్చే లాభాలు:
1. మనము దేవుని సొత్తు అన్న ధైర్యం మనకు ఉంటుంది– శత్రువు మనపై హక్కు సాధించలేడు.
2. దేవుని రక్షణ – యజమాని సొత్తును కాపాడినట్టు దేవుడు తన ప్రజలను కాపాడుతాడు.
3. పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం – ముద్ర అనేది ఆత్మ మనలో ఉన్నాడనటానికి సాక్ష్యం.
4. రక్షణకు హామీ – మనకు ఇది పరలోక వారసత్వానికి టోకెన్.
5. సాక్ష్యం – ముద్ర ఉన్నవారిలో పరిశుద్ధాత్మ ఫలాలు స్పష్టంగా కనిపిస్తాయి.
ముద్ర వల్ల మనకు వచ్చే సవాళ్లు:
1. ప్రపంచం వ్యతిరేకిస్తుంది యోహాను 15:19
మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.
2. మనము పరిశుద్ధాత్మ అనే ముద్రను కలిగి ఉండటం వలన శత్రువు మరింతగా అడ్డంకులను మనకు సృష్టిస్తాడు.
3. ముద్ర ఉన్నవారికి పరిశుద్ధమైన జీవితం గడపాలి అన్న ఎక్కువ బాధ్యత ఉంటుంది,ఎందుకంటే మనము దేవుని యజమాన్యంగా ముద్ర ద్వారా చేయబడ్డాం కాబట్టి,
దీనివలన ఆత్మలోకంలో ప్రభావం ఏమిటంటే?
ముద్ర అనేది ఆత్మలోకంలో స్పష్టమైన గుర్తింపునుమనకు ఇస్తుంది. యిది భౌతికముగా మన కంటికి కనిపించకపోయినా, దేవుని దూతలు, చేడు ఆత్మలు ఈ ముద్రను స్పష్టంగా చూస్తాయి,గుర్తిస్తాయి,
ప్రకటన గ్రంథం 7:3
ఈ దూతమేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించువరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను.
ముద్ర ఉన్నవారిని శత్రువు పూర్తిగా నాశనం చేయలేడు.
యోబు కథలో ఇది చాల స్పష్టముగా మనకు కనబడుతుంది, యోబు మీద సాతాను దాడి చేయడానికి ప్రయత్నించినా, దేవుడు ఒక పరిమితిని అక్కడ ఉంచాడు పెట్టాడు.
ఈ ముద్ర మనకు ఆత్మీయ ఐడీ కార్డు లాంటిది,
రోమీయులకు 8:16
మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.
ఇది మనకు ఒక హెచ్చరిక:
ముద్ర లేని జీవితముల, స్థలాలను సులభంగా శత్రు దాడికి గురవుతాయి.
మీ జీవితంలో ప్రతి పోరాటంలో ఈ ఆత్మీయ సత్యాన్ని మీరు గుర్తిస్తున్నారా?
మీ జీవితంలోని ప్రతీ దానికి ముద్ర వేసారా, లేక శత్రువుకు ఓపెన్ డోర్స్ గా ఉంచారా?
పరిశుద్ధాత్మ ముద్ర అనేది మన రక్షణ, మన గుర్తింపు, మనము దేవుని యాజమాన్యం అని ఒక సాక్ష్యం. ఇది మనకు ఆత్మలో ధైర్యం ను ఇస్తుంది, శత్రువుపై రక్షణ కవచమవుతుంది. కానీ ముద్ర లేని స్థలాలు శత్రువుకు ఓపెన్ డోర్స్. కాబట్టి మనం మన జీవితంలోని ప్రతి విభాగాన్ని ప్రార్థనతో, విశ్వాసంతో ముద్రించాలి.
ఎస్తేర్ క్రైసోలైట్
3-9-2025
🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨