2025 Messages
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
praise the lord
విశ్రాంతిలో దేవుని కృప
విశ్రాంతిలో దేవుని కృప ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఆత్మీయతే
మానవుని ఆత్మ ప్రాణం శరీరం,ఇవన్నీ కూడా దేవుని నుంచే మానవునికి కలిగాయి, ఆరోగ్యం అన్నది మానవునికి దేవుడు ఇచ్చిన ఒక వరము.
1 కోరింథీయులకు 6:19-20 వ వచనాల ప్రకారం పరిశుద్ధ గ్రంథము మన శరీరం దేవుని మందిరమని చెబుతుంది; అంటే ఆరోగ్యం కాపాడుకోవడం కూడా దేవుని చిత్తంలో ఒక భాగమే.
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది ఆత్మీయ జీవితాన్ని కూడా అది ప్రభావితం చేస్తుంది. కాబట్టి శరీరం, మనస్సు, ఆత్మ అన్నీ కలసి సంపూర్ణ స్వస్థతను కలిగి సంపూర్ణ ఆరోగ్యంతో దేవున్ని మహిమ పరచాలని దేవుని వాక్యం చెబుతోంది.
ఇది చదువుతున్న మీరు మీ ఆరోగ్యం పట్ల మీ శ్రద్ధ ఎలా ఉన్నది మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటున్నారా 3 యోహాను 1:2 ప్రకారం మానవుని ఆత్మ సంబంధమైన, ఆత్మ వర్ధిల్లే విషయాలలోనే కాదు,పరిశుద్ధాత్మకు నిలయమైన మన శరీరాన్ని కూడా మన శరీర ఆరోగ్యాన్ని కూడా మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మనకున్నది, అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది,
"ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను." మన ఆరోగ్యం కొరకు, మనము అన్ని విషయాలలో ప్రార్థించడం అనేది ఇది దేవుని చిత్తము.
మా చిన్న కుమార్తె తనకు అవసరమైన ఆహారమును సరిగ్గా తీసుకోదు, చాలా బక్కగా ఉంటుంది,ఎప్పుడు లంచ్ బాక్స్ లో,సగము ఆహారమును వెనక్కి ఇంటికి తీసుకు వచ్చేసేది,అందుకే నేను ఏమి ఆలోచించాను ఆని అంటే, తనకి ఇంజనీరింగ్ లో మంచి సీటు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ని,ఈ ఇయర్ తనని చదువు మాన్పించి ఇంట్లో ఉంచాను. ఎందుకు అంటే తాను మంచిగా ఆహారం తిని ఆరోగ్యంగా ఉంటే, ముందు ఆరోగ్యం తర్వాత నే,తన చదువు అని నేను ఆలోచించి, తనని ఈ సంవత్సరం బయటకు పంపించలేదు,
ఒక వస్తువు పాడైతే,దానిని రిపేర్ చేయవలసిన బాధ్యత కూడా ఆ వస్తువును కలిగిన యజమానికి ఉంటుంది,పాడైపోయిన ఆ వస్తువుకు విశ్రాంతిని ఇవ్వవలసిన బాధ్యత,ఆ విశ్రాంతి సమయంలో ఆ వస్తువును పోషించవలసిన చూడవలసిన బాధ్యత కూడా ఆ యజమానిదే ఇది నిజమే ! దీనిని ఈ వాస్తవాన్ని ఈ సత్యమును ఎవ్వరూ కాదు అని అనలేరు.
అందుకే "విశ్రాంతి"అనే పదమునకు పరిశుద్ధ గ్రంథం చాలా చాలా విలువను ఇచ్చింది,దేవుని సృష్టిలో విశ్రాంతి ఒక భాగం, దేవుడు సృష్టి తర్వాత ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడు (ఆదికాండము 2:2-3). ఇది మన జీవితంలో విశ్రాంతి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
మత్తయి 11:28
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.
సృష్టి ఆరంభంలో దేవుడు ఆరు రోజులు పనిచేసాడు, ఆ పని చేసింది దేనికోసము అని అంటే, మానవునికి అవసరమైన ప్రతిదానిని సృష్టించటం కొరకు,దేవుడు తన పని అంతటినీ ముగించిన తర్వాత విశ్రమించాడు అని, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది.
మానవుని కొరకు దేవుడు చేసిన పరిశుద్ధమైన సృష్టి అంతటినీ, ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా అది అపవిత్రపరచబడ్డది, నాశనం చేయబడే రీతిలో మరణించబడవలసిన అవసరత,సృష్టికి ఏర్పడింది,మానవుడు దేనినైతే కోల్పోతూ వచ్చాడో, దానిని తిరిగి మానవులకు ఇవ్వటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి, సిలువలో మానవుని పాపముల కొరకు మరణించి పునరుత్థాన విజయంతో తిరిగి లేచారు, మనము జయించలేని మరణమును క్రీస్తు యేసు ప్రభువు వారు జయించారు.
అందుకే పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తుంది,దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది అని, అది ఆ విశ్రాంతి మనల్ని దాటిపోలేదు.* మన సొంత ప్రయత్నాలు ద్వారా మనము ఈ దేవుడిచ్చే విశ్రాంతిని మనము పొందలేము.* ఆజ్ఞాతి క్రమం ద్వారా,మానవుడు పాపములను శాపమును రోగములను,మోస్తూ వెళ్తున్న, ప్రతి మానవునికి క్రీస్తు యేసు ప్రభువు వారిలో విశ్రాంతి నిలచి ఉంది.
హెబ్రీయులకు 4:9-10
"కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది.
ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును."
విశ్రాంతి తీసుకోవడం అనేది మనభారములను మనము మోయటం కన్నా, దేవుని కృపపై మనం ఆధారపడుతున్నామన్న నమ్మకానికి గుర్తు.
క్రీస్తు యేసు ప్రభువు వారి మానవులకు ఇచ్చిన విశ్రాంతిలోకి ఎవరు రాలేకపోతారో, ఎవరు దానిని పొందలేక పోతారో, సాతాను అక్కడ ఖచ్చితముగా,
వారిని తన ప్రజలుగా తన ముద్రతో ముద్రిస్తుంది,
అందుకే మన ఆహారం, నిద్ర, శ్రమ, విశ్రాంతి అన్నింటిలోనూ జాగ్రత్తగా ఉండటం ఆత్మీయ క్రమశిక్షణలో ని ఒక భాగమే. బైబిలు మన ఆత్మ, ప్రాణం, శరీరం అన్నీ కాపాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడని చెబుతోంది. మనం ఆరోగ్యంగా ఉండటం ద్వారా మరింత ఫలవంతమైన సాక్షులుగా, సేవకులుగా దేవుని ప్రజలముగా ఉండగలుగుతాం.
ప్రియమైన మా పరలోకపు తండ్రి నా శరీరం, మనస్సు, ఆత్మ అన్నీ మీరు ఇచ్చిన కృప ద్వారా కలిగిన వరాలు దేవా. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకొని, ఆత్మానుసారముగా, శరీరానుసారముగా, మీ కృపలో విశ్రాంతి పొందడానికి నన్ను,మమ్ములను, అందరిని, నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్.
ఏస్తేర్ క్రైసోలైట్
6-9-2025
🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨