CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

praise the Lord

వివాహం మర్మంగా ఎందుకు వ్రాయబడింది?

హెబ్రీయులకు 13:4

వివాహము అన్ని విషయములలో(లేక, అందరిలో) ఘానమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.

ఇక్కడ ఈ వాక్యంలో

1. వివాహము అన్ని విషయము లలో ఘానమైనదిగాను,

2. పానుపు నిష్కల్మషమైనది గాను,

3. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. అనే ఈ మూడు అంశాలు మనకు కనపడుతున్నాయి,దేవుడు ఘానమైనవిగా, పవిత్రమైనవిగా ఎంచినటువంటి,వాటిని సాతాను అపవిత్రపరిచినప్పుడు, దేవుడు తీర్చిన తీర్పు ఏమిటో ఆదికాండంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది.

ఈ వాక్యం వివాహానికి దేవుడు ఇచ్చిన పవిత్రత, ఘానతను చూపిస్తుంది. దేవుని దృష్టిలో వివాహం కేవలం ఒక ఒప్పందం కాదు, పరిశుద్ధమైన కట్టుబాటు. స్నేహం, సహోదర భావం, కుటుంబ ప్రేమ ఇటువంటి గొప్ప బంధాలు ఈ లోకంలో ఎన్ని ఉన్నప్పటికీ, వివాహ బంధము అనేది ప్రత్యేకంగా దేవుడు నిర్ణయించిన పరిశుద్ధమైన ఒక ఒడంబడిక.అందుకే ఇది ఒక గొప్ప మర్మం గా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది, శరీర సంబంధమైన నేత్రాలతో దీన్ని మనం చూస్తే ఈ మర్మం మనకు అర్ధం కాదు కానీ, ఆత్మసంబంధమైన నేత్రాలతో ఈ మర్మాన్ని మనం ధ్యానం చేయాలి,

ఈ బంధం స్త్రీ పురుషుడు అనబడే,శాపగ్రస్తమైన పాపపు శరీరాన్ని కలిగిన వ్యక్తుల ఏకత్వం గురించి మాత్రమే చెప్పబడటం లేదు కానీ,పరిశుద్ధమైన మహిమ శరీరం ధరించుకున్న వధువు సంఘామునకు,క్రీస్తు యేసు ప్రభువు వారి ఏకత్వమునకు,ఇది ఒక సూచనగా భవిష్యత్తులో ప్రత్యక్ష పరచబడే దాగివున్న ఒక మర్మముగా ఇది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది.

దేవుడు వారిని ఒక్కటిగా ఏక శరీరముగా కలుపుతున్నాడు.

బైబిల్ ప్రకారం వివాహ బంధం ప్రత్యేకమైనది, పవిత్రమైనది. కాబట్టి ఈ బంధాన్ని ఎటువంటి ఇతర బంధంతోనూ, పోల్చరాదు.

ఎందుకంటే ఇది దేవుడు స్వయంగా ఏర్పరచిన మొదటి బంధం,ఆదికాండము 2:24-25

కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.ఇది ఆదాము హవ్వలు సిగ్గు ఎరగకముందు జరిగినది,అంటే పాపం అన్నది, వారిలో ప్రవేశించక ముందు పరిశుద్ధపరచబడిన బంధం ఇది, అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగం బరులుగా నుండిరి; అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి.

కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు. (ఆదికాండము 2:24)

ఈ వచనమును, ఎవరు రాశారు?

ఆదికాండము అనే గ్రంథమును మోషే రాశాడు అని బైబిల్ పండితులు చెపుతూ ఉంటారు. అంటే ఈ వాక్యాన్ని మోషే తన కాలంలో దేవుని ఆత్మ ప్రేరణతో వ్రాశాడు. ఇవి ఆదాము నోట నుండి నేరుగా వచ్చిన మాటలు కాదు, మోషే కాలానికి సంబంధించి వ్రాయబడిన వివరణ.ఆదాముకు తండ్రి తల్లి లేదు కదా! దేవుడు మాత్రమే ఉన్నాడు.

ఎందుకు “తండ్రి, తల్లిని విడిచి” అనే మాట వచ్చింది?

ఆదాము ఆ సమయానికి అతనికి తల్లి తండ్రి లేరు. కానీ ఈ వాక్యం ఆదాము జీవితం నుండి వివాహ పద్ధతి మరియు దైవప్రణాళిక అనే సూత్రాన్ని తీసుకొని భవిష్యత్తులో మానవులందరికీ వర్తించేలా ఒక సూచనగా మోషే ద్వార యిది వ్రాయబడింది.

మోషే కాలానికి వచ్చేసరికి సమాజంలో తండ్రి-తల్లి సంబంధాలు చాల స్పష్టంగా ఉన్నవి.

దేవుని ఆత్మ మోషేకు ఈ వాక్యం ఒక సూత్రంగా ప్రేరేపించింది: “పురుషుడు పెళ్లి చేసుకున్నప్పుడు తన తల్లిదండ్రులను వదిలి, భార్యను తనతో ఏకముగా చేసుకోవాలి.”

క్రీస్తు యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన రక్తము చేత కడగబడి, పరిశుద్ధాత్మ అనే ముద్రను కలిగిన ప్రతి ఒక్కరు కూడా, గొర్రె పిల్ల వివాహములో ఉండటానికి ఒక నిశ్చయతను ఒక నిబంధనను కలిగి ఉన్నారు.

మహిమ శరీరమును పొందిన తరువాతనే క్రీస్తుతో మనము ఏకత్వంను కలిగి ఉంటాము.అందుకే ఇది పూర్తిగా ఆత్మ సంబంధమైనదిగా,వివాహము అనే దానిని ఏ బంధంతో కూడా పోల్చలేనిదిగా ఇది ఉంది.

శరీర సంబంధమైన వివాహము అనేది దీనికి ఒక సూచన.

వివాహం సృష్టి ప్రారంభంలోనే దేవుడు ఏర్పాటు చేసినది.పాపం అన్నది,మానవునిలో ప్రవేశించక ముందే ఈ వివాహం అన్నది ప్రారంభించబడ్డది. కాబట్టి ఇది పరిశుద్ధమైనదిగా, ఘానమైనదిగా దేవుడు దీనిని చేశాడు,

అందుకే ఇది మానవ సంబంధాలన్నింటికంటే లోతైనది, శాశ్వతమైనది.ఎఫెసీయులకు 5:31-32

ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను.

అపోస్తుడైన పౌలు ఈ మర్మము గొప్పది, క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి నేను చెప్పుచున్నాను, అని చెప్పిన ఈ మర్మము,పరిశుద్ధ గ్రంథంలో ఘానమైనదిగా ఎందుకు వ్రాయబడింది అని అంటే,

వివాహం అన్నది క్రీస్తు మరియు సంఘం మధ్య ఉన్న బంధానికి సూచన. అందుకే దీన్ని సాధారణ బంధం, స్నేహం, సహవాసం లాంటి వాటితో పోల్చకూడదు.

పరిశుద్ధ గ్రంథంలో వివాహం అనేది ఘనమైనదిగా ఎందుకు చెప్పబడింది?

ఆదిలో, దేవుడు మానవుని సృష్టించినప్పుడు అతన్ని ఒంటరిగా ఉంచలేదు. ఆదాము పక్కెముకతో హవ్వను సృష్టించి, వారిని ఒకరికొకరు సహకారులుగా ఏర్పరిచాడు. పాపం రాకముందు, వారు దిగంబరులై సిగ్గు లేకుండా ఉన్నారు (ఆది. 2:25). వారి సంబంధం పవిత్రమైనదిగా, అపవిత్రత అనే ఆలోచన కూడా లేని స్థితిలో ఉంది. దేవుడు వారిని “ఏక శరీరముగా” చేసి, వివాహాన్ని స్వయంగా ఏర్పాటు చేశాడు (ఆది. 2:24).

కానీ పాపం అనేది ఈ లోకంలోకి ప్రవేశించడంతో ఆ పవిత్రమైన వివాహ బంధం కూడా కలుషితమైంది. పాపం కారణంగా మానవుడు దేవుని సన్నిధి నుండి దూరమైపోయాడు; దేవునితో ఉన్న ఆత్మీయ ఏకత్వం విచ్ఛిన్నమైంది. అయినప్పటికీ, దేవుడు తన ఆలోచనను విడిచిపెట్టలేదు. ఆయన క్రీస్తు యేసు రక్తంతో మానవుని కడిగి, పవిత్రపరచి, సార్వత్రిక సంఘంగా సిద్ధ పరుస్తున్నాడు.

ఎఫెసీయులకు 5:25-27

పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,

అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,

నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.

ఈ సార్వత్రిక సంఘమే వధువు, క్రీస్తే వరుడు. ఈ ఆత్మీయ వివాహం ఒక మర్మం; ఇది దేవుని ప్రేమ, కృప, రక్షణ యొక్క అత్యున్నతమైన ప్రత్యక్షత.ఆత్మసంబంధంగా,పవిత్రముగా, పరిశుద్ధమైన రీతిలో ఒక రోజు పరలోకంలో ఈ వివాహం సంపూర్ణంగా ప్రత్యక్ష పరచబడుతుంది.

ప్రకటన గ్రంథం 19:7 -8

ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది,ఆయన భార్య తన్నుతాను సిద్ధ పరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మల ములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.

ఇది కేవలం ఒక బంధం కాదు; ఇది శాశ్వతమైన నిబంధన. నూతన యెరూషలేములో వధువు సంఘం తన వరుడైన క్రీస్తుతో శాశ్వతంగా యుగ యూగాలు నివసిస్తుంది.

ప్రకటన గ్రంథం 21:2-3

మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.

అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.

ఈ పునరుద్ధరించబడిన ఈ మహిమ శరీరంతో క్రీస్తు యేసు ప్రభువు వారితో మనకు ఉన్న ఈ సంబంధం మనకు నిత్యజీవం, నిత్య సౌభాగ్యం, దేవునితో విడదీయలేని ఏకత్వాన్ని ఇస్తుంది.

అందుకే “వివాహం ఘనమైనది” అని హెబ్రీయులకు 13:4లో చెప్పబడింది. ఇది కేవలం మానవ వివాహం గురించి మాత్రమే చెప్పబడలేదు కానీ, దేవునితో మన ఆత్మీయ సంబంధం ఎంత శాశ్వతమైనదో, ఎన్ని ఆశీర్వాదాలు తీసుకొని వస్తుందో,ఎంత విలువైనదో,ఇది మనకు గుర్తు చేస్తుంది. మానవ వివాహం కూడా ఈ ఆత్మీయ మర్మాన్ని చూపిస్తుంది,సూచనగా కూడా ఉంది,

దేవుడు పాపం వల్ల విచ్ఛిన్నమైన సంబంధాన్ని తిరిగి నిర్మించాడు. క్రీస్తులో క్రీస్తు పరిశుద్ధమైన రక్తము ద్వారా మనం శుద్ధులమై, ఈ పవిత్రమైన వివాహానికి సిద్ధమయ్యే సార్వత్రిక సంఘాముగా మారుతున్నాం. ఈ ఒడంబడిక అన్ని నిబంధనలకంటే గొప్పది,ఘనమైనది ఎందుకంటే ఇది నశించని నిత్యజీవంతో, ఆత్మ పునరుద్ధరించబడిన శరీరంతో, దేవునితో విడదీయలేని సంబంధంతో మనల్ని ఉంచుతుంది, ఆశీర్వదిస్తుంది కాబట్టి.

ఆదిలో ఆదాము-హవ్వతో మొదలైన పవిత్రమైన వివాహ బంధం పాపం కారణంగా విచ్ఛిన్నమైంది.

క్రీస్తు రక్తంతో మానవుని కడిగి, పవిత్రపరచి, సంఘాన్ని తన వధువుగా సిద్ధం చేశాడు.

నూతన యెరూషలేములో ఈ బంధం శాశ్వతంగా స్థాపించబడుతుంది.

అందుకే వివాహం దేవుని దృష్టిలో ఘనమైనదిగా, పవిత్రమైనదిగా ప్రకటించబడింది.

ఎస్తేర్ క్రైసోలైట్

8-9-2025

🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿

✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨