2025 Messages
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
praise the Lord
🕊 పరీక్షల మధ్య నిలిచే విశ్వాసం
యోబు జీవితములో మనము గమనించవలసిన గొప్ప సత్యమేమిటంటే — అతని జీవితంలో వచ్చిన పరీక్షలు అతని తప్పిదం వలన కాదు. శత్రువు దేవుని అనుమతితో నే అతన్ని పరీక్షించడానికి వచ్చినప్పుడు, ఒక్కసారిగా అతనికున్న ప్రతిదీ నశించి పోయింది. ఆస్తులు, పిల్లలు మాత్రమే కాదు, అతని జీవితానికి ఉన్న ప్రతి ఆశ కూలిపోయినట్లే అయింది. అయినప్పటికీ యోబు ఒకే మాట అన్నాడు:
"యెహోవా ఇచ్చెను, యెహోవా తీసికొని పోయెను; యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక." (యోబు 1:21)
ఇది యోబు యొక్క స్థిరమైన విశ్వాసానికి నిదర్శనం. శత్రువు లక్ష్యం యోబు విశ్వాసమును కూలగొట్టడమే కానీ, దేవుని లక్ష్యం యోబు విశ్వాసాన్ని మరింత పరిశుద్ధపరచడం, మరింత పెంచటం. ఫలితంగా యోబు తనకు ముందు ఉన్న దానికన్నా రెండింతల ఆశీర్వాదాలను పొందాడు (యోబు 42:10).
మన జీవితములో కూడా కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే, ఎలాంటి తప్పు చేయకుండానే, పరీక్షలు వస్తాయి. దేవుడు ఎందుకు అనుమతించాడో మనకు వెంటనే అర్థం కాకపోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఆయన మన ప్రాకారాలను నిర్మించిన దేవుడు.
యెషయా 54:12
"ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచు దును". అని వాగ్దానం చేసిన దేవుడు, మన జీవిత సరిహద్దులను సాధారణమైన రాళ్లతో కాదు, విలువైన రత్నములతో నిర్మిస్తాడు.
కాబట్టి, ఏ విషయంలోనైనా ఏ సమయంలోనైన ఆ సరిహద్దులు బలహీనంగా కనిపించినా, అది దేవుని ఆలోచనలో భాగమే,అని మనము విశ్వసించాలి. ఆయన మన రక్షణకు ప్రాకారములను వేయడమే కాకుండా, ఆ ప్రాకారములను, తన మహిమతో అలంకరిస్తాడు.
కాబట్టి మనం ఎదుర్కొనే ప్రతి పరీక్షలో,
ఈ పరిస్థితిని దేవుడు అనుమతించాడని,
ఈ పరీక్ష వెనుక దేవుడు మరింత గొప్పదాన్ని, నా కొరకు సిద్ధం చేస్తున్నాడని మీరు విశ్వసించగలరా?"
యోబు లాంటి స్థిరమైన విశ్వాసం ఉన్నవారిని దేవుడు ఎన్నడూ ఎప్పటికీ మరచిపోడు. చివరికి దేవుని వాగ్దానం ప్రకారం, మీ సరిహద్దులు రత్నములతో, మీ భవిష్యత్తు రెండింతల ఆశీర్వాదములతో నిండి ఉంటుంది అని మీరు నమ్మ గలరా!
ఎస్తేర్ క్రైసోలైట్
28-8-2025
🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨