2025 Messages
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
☁ మేఘస్తంభములో దాగిన దేవుడు ☁
నిర్గమకాండము 14:19
అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవ దూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను
నిర్గమకాండము 14:19లో ఉన్న “దేవదూత” ఎప్పుడు బయలుదేరిందో తెలుసుకోవడం ద్వారా, దేవుని సాన్నిధ్యం ఎలా ఇశ్రాయేలీయుల మధ్య ప్రదర్శించబడిందో మనకు స్పష్టమవుతుంది.
ఈ దేవదూత ఎవరు?
ఈ వచనంలో చెప్పబడిన “దేవుని దూత” అంటే సాధారణ దూత కాదు — ఇది యెహోవా స్వయంగా తన సన్నిధిని వ్యక్తపరిచిన రూపం.
ఇది ఇంతకుముందు నిర్గమకాండము 13:21లో ప్రస్తావించబడింది,
నిర్గమకాండము 13:21-22
వారు పగలు రాత్రియుప్రయాణము చేయునట్లుగా యెహోవాత్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను.
ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజలయెదుటనుండి తొలగింపలేదు.
అంటే దేవుడు మేఘస్తంభము మరియు అగ్నిస్తంభము ద్వారా తన సన్నిధిని ప్రత్యక్షపరిచాడు, అదే సన్నిధిని ఇక్కడ “దేవుని దూతగా” పేర్కొన్నాడు.
దూత మొదటగా ఎప్పుడు బయలుదేరాడు,?
నిర్గమకాండము 13:21–22 — దేవుడు మొదట మేఘస్తంభములో ప్రత్యక్షమై వారిని నడిపించటం మొదలుపెట్టాడు, ఇది ఇజ్రాయేలీయులు ఐగుప్తును విడిచి బయలుదేరిన వెంటనే జరిగినది.
కాబట్టి దేవదూత (అంటే దేవుని సన్నిధి ) ఎర్ర సముద్రము దాకా నిరంతరం వారితో ఉన్నది.
2. నిర్గమకాండము 23:20–23
దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేశాడు:
"ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను."
ఇది కూడా అదే దూతకు సంబంధించింది, దేవుని ఆత్మసన్నిధి, అంటే యెహోవా దూత.
3. యెషయా 63:9
వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను.
ఈ వచనం నిర్గమకాండంలోని దూతను నేరుగా సూచిస్తుంది, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వారిని రక్షించిన అదే సన్నిధి.
దేవుడు మేఘస్తంభము రూపంలో తన దూతను ఐగుప్తు విడిచిన రోజు నుండే పంపాడు.
ఎర్ర సముద్రం దగ్గర (నిర్గమకాండము 14:19) ఆ దూత ముందు నుంచి వెనుకకు కదిలి, దేవుని ప్రజలను శత్రువులనుండి రక్షించే స్థానంలో నిలిచాడు.
అంటే, ఇది కొత్తగా బయలుదేరిన దూత కాదు, కానీ మొదటి నుండే వారిని నడిపించిన యెహోవా సన్నిధిని కలిగిన దూత తన స్థానాన్ని ముందు నుంచి వెనుకకు మార్చుకుంది.
దేవుడు మన ముందు నడుస్తాడు, మార్గం చూపించడానికి,
ఇశ్రాయేలీయులు ఐగుప్తు విడిచినప్పుడు, వాళ్లకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు.
దేవుడు మేఘస్తంభము రూపంలో ముందుగా నడిచాడు, అంటే, నేనే నీ దారిని చూపించే వాడను అని అర్థం.
ఇది మన జీవితాల్లో కూడా మొదటి దశ,
దేవుడు మనకు మార్గం చూపుతాడు, నిర్ణయాలలో దారి చూపుతాడు, మన ముందుకు వెలుగుగా నిలుస్తాడు.కీర్తనలు 119:105
(నూన్) నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.
2. దేవుడు వెనుకకు వస్తాడు రక్షించడానికి
ఎర్ర సముద్రం దగ్గరకి రాగానే, పరిస్థితి మారింది:
ముందు సముద్రం, వెనుక ఫరో సైన్యం.
అప్పుడు దేవుడు ముందునుండి వెనుకకు వచ్చాడు.
దేవుని దూత... వారి వెనుకకు వచ్చెను.(నిర్గమ 14:19) దీని అర్థం ఏమిటి?
ఇప్పుడు వారికి దారి చూపడం కంటే,వారిని రక్షించడం అవసరం. దేవుడు ఎప్పుడైనా తన స్థానాన్ని మార్చుకుంటాడు, కానీ తన ప్రజల రక్షణ కోసం మాత్రమే.
మన జీవితాల్లో కూడా,
కొన్నిసార్లు దేవుడు “ముందుగా నడుస్తున్నట్టు” అనిపించడు, కనిపించడు.
కానీ అది ఆయన వెనుకనుంచి మనలను రక్షిస్తున్న సమయం.
3. మేఘాం ఒకవైపు చీకటి, మరోవైపు వెలుగు
ఆ మేఘాము ఐగుప్తీయుల పక్షమున చీకటి కలిగించెను, ఇశ్రాయేలీయుల పక్షమున వెలుగు కలిగించెను. (నిర్గమ 14:20)
దేవుని సన్నిధి ఒకే సమయంలో,
శత్రువులకు చీకటి, తన ప్రజలకు వెలుగు.
దేవుడు మారలేదు, కానీ ఆయనతో ఉన్న మన సంబంధం ఆధారంగా ఫలితం మారింది.
అదే సన్నిధి ఒకరిని కాపాడుతుంది, మరొకరిని ఆపేస్తుంది.
దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు.
కాని కొన్ని సందర్భాల్లో ముందుగా నడుస్తూ మార్గం చూపిస్తాడు, మరికొన్ని సందర్భాల్లో వెనుకనుండి కాపాడుతూ మనకు కవచమై నిలుస్తాడు.
అందుకే మనం దేవున్ని చూడలేనప్పుడు కూడా విశ్వసించాలి, దేవుడు కేవలం మన ముందే కాదు, మన వెనుక ఉండి కూడా మనలను కాపాడే దేవుడు.
ఇప్పుడా దేవుడు మీ జీవితంలో ఎక్కడ ఉన్నాడు?
మార్గం చూపించడానికి మీ ముందు వున్నాడ ?
లేక మీ వెనుకా శత్రువుల నుండి కాపాడటానికి మీ వెనుకా వున్నాడ? ఎక్కడ ఉన్నా, ఆయన మీతోనే ఉన్నాడు.
ఎస్తేర్ క్రైసోలైట్
28-10-2025
🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨