2025 Messages
దేవుడు మన హృదయానికి కళ్లెం వేయటానికి ఉపయోగించే ఐదు మార్గాలు
కీర్తనలు 32:9
బుద్ధి జ్ఞానములు లేని గుఱ్ఱము వలె నైనను కంచర గాడిద వలె నైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోను కళ్లెముతోను బిగింపవలెను.
ఈ వాక్యమును చదువుతున్నప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది ! గుఱ్ఱము గాడిద నోటికీ వారుతోను కళ్లెముతోను బిగిస్తే మరి మనుషులకి దేవుడు ఎలా కళ్లెం పెడతాడు అని ! మీకు కూడ అదే ప్రశ్న వచ్చిందా !
అత్యద్భుతమైన ప్రశ్న ఇది: “మనుషులకు దేవుడు ఎలా కళ్లెం పెడతాడు?” అనే ప్రశ్న కీర్తనలు 32:9 లో
వున్న వాక్యమును భట్టి మనకు ఈ ప్రశ్న వస్తుంది.
ఈ వాక్యం లో దేవుడు మనలను గుఱ్ఱం లేదా గాడిదతో పోలుస్తున్నాడు — అంటే మనం ఆత్మీయ జీవితంలో దేవుని మార్గాన్ని వదిలి, స్వేచ్ఛగా స్వతంత్రంగా, వెళ్లిపోతే, దేవుని వాక్యమును దేవుని ఆజ్ఞలను దేవుడిచ్చిన శాసనాలను మనము అనుసరించకుండా జీవిస్తూ ఉంటే దేవుడు మనలను మరలా దారిలోకి తేవడానికి కొన్ని క్రమశిక్షణ చర్యలను దైవ నియమాలను ఉపయోగిస్తాడు.
దేవుడు మనుషులకు “కళ్లెం” ఎలా పెడతాడు?
ఇక్కడ “కళ్లెం” అనేది నియంత్రణ, దారి చూపించటం, అనే అర్థాలను సూచిస్తుంది. దేవుడు మనల్ని ఎలా నియంత్రిస్తాడు అంటే.?
1. పరిశుద్ధాత్మ ద్వారా
2. దైవవాక్యం ద్వారా
3. పరిస్థితుల ద్వార
4. శిక్ష లేదా కరుణతో కూడిన శాసనం ద్వార
5. ప్రవక్తలు, ఆత్మీయ నాయకులు, మాటల ద్వారా
1. పరిశుద్ధాత్మ ద్వారా
దేవుని ఆత్మ మనలో ఉన్న పరిశుద్ధాత్మ మన హృదయాన్ని మన హృదయంలో ఉన్న దోషాన్ని గుర్తించేట్టుగా చేస్తుంది (యోహాను 16:8
ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.)
మనం దేవుని వాక్యానికి వ్యతిరేకమైన తప్పు ఏదైనా చేస్తే అది మన మనసులో అసౌకర్యంగా మనకు అనిపిస్తుంది మన హృదయంలో నెమ్మది లేని స్థితిని కలిగి ఉంటాము ధైర్యం లేని స్థితి భయం అనేది మనలను వెంటాడుతూ ఉంటుంది ( నీతి కలిగిన స్థితి మనకు ధైర్యాన్ని కలగ జేస్తే నీతిలేని స్థితి మనలో ధైర్యాన్ని తీసివేస్తుంది )
2. దైవవాక్యం ద్వారా
దేవుని వాక్యం మనకు మార్గదర్శిగా దేవుని మార్గమును చూపేదిగా ఉంటుంది.
కీర్తనలు 32:8
నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గ మును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను
అది మనకు “తప్పు చేస్తున్నావ్” అనే ఆత్మీయ హెచ్చరికగా పనిచేస్తుంది.
యెషయా 30:21
మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.
మన జీవిత ప్రయాణంలో ఎన్నో దారులు మనకు కనిపించవచ్చు – కొన్ని ఆకర్షణీయంగా, మరికొన్ని అయోమయంగా, మరికొన్ని ఆందోళన కలిగించేలా అనిపించవచ్చు కనిపించవచ్చు. కానీ దేవుడు మన పక్కన నడిచే తండ్రి. మనం కుడివైపు తిరిగినా, ఎడమవైపు మళ్లినా, ఆయన మనకు ఓ మృదువైన స్వరం ద్వారా తెలియజేస్తారు – "ఇదే త్రోవ, దీనిలోనే నడవండి" అని.
ఈ స్వరం మన మనస్సులో వినపడే పరిశుద్ధాత్మ స్వరం. ఆ స్వరం – ఆ బోధ – మనకు భద్రతను, ఆశను, స్పష్టతను ఇస్తుంది. దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, ప్రార్థనలో ఉండడం ద్వారా, మనకు ఆయన స్వరం స్పష్టంగా వినిపిస్తుంది.
మనమే నిర్ణయాలు తీసుకుంటున్నామని అనుకున్నా, మన హృదయం లో దేవుని పరిశుద్ధాత్మ నడిపిస్తున్న తీరునే మనం అనుసరిస్తున్నాం. ఆయన పిలుపు శాంతిని కలిగించేదిగా ఉంటుంది, మన మార్గాన్ని సరిదిద్దేదిగా ఉంటుంది. మనం ఆ స్వరాన్ని వినగలిగితే, నడవవలసిన మార్గాన్ని తప్పకుండా తెలుసుకుంటాం.
ఈ రోజు మనం మన ప్రయాణాన్ని దేవునికి అప్పగిద్దాం. ఆయన చెప్పినదానిలో నడుద్దాం. ఎందుకంటే – ఇదే త్రోవ, దీనిలోనే నడవండి అన్న స్వరం మన జీవితానికే ఆశీర్వాద మార్గం.
3. పరిస్థితుల ద్వార
కొన్నిసార్లు మన మార్గం తప్పిపోయినప్పుడు దేవుడు కొన్ని అవకాశాలను నిలిపేస్తాడు, లేదా అడుగు వేసే దారిని మూసి వేస్తాడు కత్తిరిస్తాడు.
ఈ పరిస్థితులు అన్ని మనల్ని ఆలోచనకు మరియు మార్పుకు దారి చూపుతాయి.
మనకు అనుకూలంగా అనిపించే దారిలో మనము దూసుకెళ్తున్నప్పుడూ, మన ఆలోచనల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడూ — అకస్మాత్తుగా కొన్ని తలుపులు మూయబడతాయి. కొన్ని అవకాశాలు రావు. మనం ముందుకు వెళ్లాలనుకున్న దిశలో మార్గములో కొన్ని ఆటంకాలు అవరోధాలు ఎదురవుతాయి. అప్పుడు మనం కొంచెం కూడా ఆలస్యం చేయకుండా గుర్తించవలసింది ఏమిటంటే: ఇవి అనుకోకుండా జరిగినవి కావు. పరిశుద్ధాత్మ దేవుడు పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అని.
దేవుడు మనం తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించటం లేదు అని అంటే, మనం ఎంత ప్రయత్నించినా అది జరిగేలా ఉండదు. ఇది నిరాకరించటం కాదు, ఇది ఒక రక్షణ. కొన్ని మార్గాలు మన జీవితానికి హాని చేయవచ్చు, కాబట్టి దేవుడు స్వయంగా మూసివేస్తాడు. మన ఆశల దిశ మన నిర్ణయాల మార్గమును మార్చుతాడు. కొన్ని తలుపులు మూసివేస్తాడు, మరికొన్ని మన కోసం తెరుస్తాడు.
ఉదాహరణలు:
అపో.కార్యములు 16:6 -7
ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని
యేసుయొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు.
అపొస్తలులు మంచి పని చేయడానికి సిద్ధంగా ఉన్నా, పరిశుద్ధాత్మ వారిని ఆ దిశలో వెళ్ళనీయకుండా ఆపాడు. ఇది దేవుని ప్రణాళికలో భాగం.
యోనా 1:3 - 4
అయితే యెహోవా సన్నిధిలోనుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి, ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను.
యోనా తన్ను తాను తప్పు మార్గంలో నడిపించుకున్నప్పుడు, దేవుడు ఆ మార్గాన్ని సముద్రంలో పెనుగాలితో నిలిపేశాడు.
పౌలు తన శరీరంలో ఉన్న ఒక బలహీనతను గురించి దేవునికి మూడు సార్లు ప్రార్థించాడు దీనిని తీసెయ్యి ప్రభూ! అని. కానీ దేవుడు దాన్ని తీయలేదు. ఎందుకంటే పౌలు దాని వలన అహంకారంలో పడిపోవచ్చు. అందుకే దేవుడు ఇలా సమాధానమిచ్చాడు:
2కోరింథీయులకు 12:9
అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. .
దీని అర్థం ఏమిటంటే:
దేవుడు ప్రతిసారి మనం కోరుకున్నదానినే ఇవ్వడు. కొన్నిసార్లు: మన బలహీనతలు మనల్ని ఆయన మీద ఆధారపడేలా చేయాలని ఉద్దేశిస్తాడు.
మన ప్రార్థనలకు ఆయన ప్రత్యక్ష సమాధానం ఇవ్వకపోవచ్చు — కానీ “ఇది నీకు మంచిది” అనే విధంగా మన మార్గాన్ని మార్చుతాడు.
అందుకే, ఇది కూడా "పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడటం" అనే అంశానికి ఒక ఉదాహరణ. పౌలు చేయకూడదనే పని కాదు — కానీ అతనికి దేవుడు "ఇది నీ శక్తికి కాకుండా నా శక్తికి ఆధారపడేలా ఉండాలి" అని సూచించాడు.
ప్రతి మూసిన తలుపు ఒక నిరాకరణ కాదు – అది దేవుడు మనకు చూపించే ఒక సూచన.
ప్రతి ఆటంకం ఒక శాపం కాదు అది మనకు దేవుని కాపుదలతో కూడిన ఒక మార్గం
ప్రతి ఆలస్యం దేవుని సమయానికి నమ్మకంగా మనం ఎదురు చూసే శిక్షణ లాంటిది.
ఈ రోజు మన జీవితంలో ఏ ఆటంకం, ఏ మార్గము మార్పు చెందిన — పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంతో మాట్లాడుతున్నాడు అనే నమ్మకంతో మనమూ ప్రార్థనలో నిలుద్దాం. ఆయనే మనకు మార్గదర్శకుడు. ఆయనే మనలను రక్షించే రక్షకుడు.
మనకు కావలసినది ఏదో దేవునికే తెలుసు. కాబట్టే ఆయన కొన్ని తలుపులను మూసివేస్తాడు. ఎందుకంటే మన క్షేమం కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే సూచనలలోనే గొప్ప నడిపింపు నిజమైన దారి దాగి ఉంటుంది.
4. శిక్ష లేదా కరుణతో కూడిన శాసనం ద్వార
దేవుడు తన పిల్లలను ప్రేమతో శిక్షిస్తాడు
హెబ్రీయులకు 12:6
ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును
అది శారీరకంగా కాదు గాని, ఆత్మసంబంధముగా మనల్ని సరైన దిశలో దేవుడు నడిపించడానికి వచ్చే అనుభవాలు.

దేవుడు మన జీవితాల్లో దైవ సేవకుల ద్వారా, ఆత్మీయ నాయకుల ద్వారా హెచ్చరికలు పంపుతాడు. వారు చెప్పిన మాటలు వాక్యం ద్వార మన మార్గాన్ని కళ్లెంతో పట్టే దేవుని ప్రయత్నం కూడ ఆవ్వచ్చు.
దేవుడు మన హృదయాన్ని మార్చే విధంగా పని చేస్తాడు.
మానవుడు గుఱ్ఱంలా బుద్ధిలేని విధంగా కాకుండా, బుద్ధిగా ఆత్మను అనుసరించి నడవాలని దేవుని కోరిక. మన జీవితం గుఱ్ఱపు కళ్లెం చేత నడిపించబడేలా కాకుండా, దేవుని ఆత్మ, వాక్యం, చేత నడిపించబడేలా ఉండాలి. అప్పుడే మనకు, దేవుని మార్గం మధురంగా ఉంటుంది
దేవా బుద్ధి జ్ఞానం లేని గుఱ్ఱముల వలె, కంచరగాడిదల వలె మేము ఉండకుండునట్లు, మా ఆలోచనలకు, మాటలకు, చేతలకు, చూపులకు, ప్రవర్తనకే కాక, మా హృదయానికి కూడా మీ వాక్యము చేత, మీ పరిశుద్ధాత్మ చేత కళ్లెం వేయమని అడుగుచున్నాము యేసు నామములో ఆమెన్.
ఎస్తేర్ క్రైసోలైట్
5-6-2025