2025 Messages
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
అబ్రాహాము బలిపీఠం – దేవుని సన్నిధి ప్రారంభమైన స్థలం
ఆదికాండము 12:7
యెహోవా అబ్రా మునకు ప్రత్యక్షమయి నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.
పాత నిబంధన ప్రకారము బలిపీఠమును కట్టి, బలులను అర్పించడం అంటే, దేవుని సన్నిధిని ఆహ్వానించడమే,
తిరిగి ఆదికాండము 17:8 లో
నీకును నీతరు వాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను అన్నటువంటి ఈ వాగ్దానము అబ్రహాము దేవుని ద్వారా విన్నప్పుడు,
ఆ కనాను దేశం తన చేతిలో లేదు.
అబ్రహాము అక్కడ “పరదేశిగా” నివసిస్తు వున్నాడు.
కానీ దేవుడు “నీకు” అని అన్నాడు
ఎందుకంటే దేవుడు ఇచ్చే వాగ్దానం వెంటనే పూర్తయ్యేది కాదు, ఆ సమయంలో అబ్రహాము కనాను దేశంలో పరదేశిగా ఉన్నాడు కాబట్టే ఆత్మసంబంధంగా విశ్వాసులకు తండ్రిగా పిలవబడ్డాడు,
అబ్రాహాము దేవుడు తనకు వాగ్దానమిచ్చిన కనాను దేశంలో తాను మొదటగా ఆలయం అన్నది కట్టలేదు,కానీ బలిపీఠం కట్టాడు.
అంటే, పరిచర్య కాకుండా, దేవుని సన్నిధి ముందు వచ్చింది. ముందుగా దేవుడు స్థలాన్ని సిద్ధపరిచాడు,
తర్వాత ఆ స్థలంలో అతని సంతానమును స్థాపించాడు.
ఆదికాండము 12:7లో అబ్రహాము కి దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానము మొదట అబ్రహాములో ప్రారంభించి తర్వాత అతని సంతానమును విస్తరింపచేసి అతని సంతానంలో ఈ వాగ్దానం నెరవేర్చాడు,
ఇశ్రాయేలీయులు ఒక దేశముగా ఇప్పుడు ఇలా ఉన్నారు అని అంటే దానికి కారణం మూల పితరుడు అబ్రహమే, అందుకే దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడినప్పుడల్లా నీ పితరుడైన అబ్రహాము దేవుడను అని ప్రారంభిస్తూ వచ్చాడు,
మన హృదయములో మన జీవితంలో దేవుని సన్నిధి ఉండాలి, మనం నివసిస్తున్న కుటుంబంలో దేవుని సన్నిధి ఉండాలి, మనం నివసిస్తున్న సమాజంలో దేవుని సన్నిధి ఉండాలి, మనలో ప్రారంభమైన ఈ దేవుని సన్నిధి ఇలా విస్తరిస్తూ రావటం మనకు,మనతో పాటు ఉన్న వారందరికీ ఈ దేవుని సన్నిధి క్షేమాన్ని కలుగజేస్తుంది,
అబ్రహాములో ప్రారంభమైన ఈ దేవుని సన్నిధి ఇశ్రాయేలు అనే ప్రజలకు ఆ దేశమునకు ప్రాకారంగా ఆశీర్వాదకరంగా ఉండటమే కాకుండా, అనేకులకు అది ఆశీర్వాదకరంగా మారుతూ వచ్చింది,
ఈ దేవుని సన్నిధి ఎక్కడ ఉండదో అక్కడ నష్టం అన్నది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, మీలో మీ కుటుంబంలో మీ సమాజంలో మీరు నివసిస్తున్న ప్రాంతంలో మీ నుంచి బయలుదేరిన దేవుని సన్నిధి ఇతరులకు వ్యాపిస్తుందా,ఆలోచించండి,
దేవుడు అబ్రాహాములో ప్రారంభించిన తన సన్నిధిని మనలో కొనసాగించాలనుకుంటున్నాడు.
మనలో దేవుని సన్నిధి ఉనప్పుడు, మనము
మన కుటుంబాలు, మన సమాజం, మన దేశం కూడా ఆ సన్నిధి వేలుగులో నడుస్తాయి.
కాబట్టి,ఇప్పుడే మీరు మీ హృదయంలో దేవునికి ఒక బలిపీఠం కట్టండి. ఎందుకంటే అక్కడనే, దేవుడు ప్రత్యక్షమవుతాడు కాబట్టి.
అక్కడి నుంచే మీ జీవితంలో ఆయన సన్నిధి విస్తరించడం మొదలవుతుంది.
ఎస్తేర్ క్రైసోలైట్
28-10-2025
🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨