2025 Messages
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
ప్రథమ సంతతి – దేవునికి చెందవలసినది
పరిశుద్ధ గ్రంథములోని దేవుని వాక్య ప్రకారం, జ్యేష్టత్వపు హక్కు దేవునిదే, దాన్ని మనుషులు తమకు దక్కించుకోవాలనుకున్నప్పుడు దేవుడు చాల గంభీరముగా తీర్పును ఇచ్చాడు.
నిర్గమకాండము 13:2
ఇశ్రాయేలీయులలో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి, అనగా ప్రతి తొలి చూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము; అది నాదని చెప్పెను.
ఐగుప్తీయుల మొదటి, సంతానము ఎందుకు హతమార్చబడింది,
నిర్గమకాండము 12:29-30
అర్ధరాత్రివేళ జరిగినదేమనగా, సింహాసనముమీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లల నందరిని పశువుల తొలిపిల్లలనన్నిటిని యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరును ఐగుప్తీయులందరును లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైన లేకపోయి నందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను.
ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీయులు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు కానీ,ఐగుప్తీయుల సంతానమే ఎందుకు హతమార్చబడ్డది,ఐగుప్తియు లకు జరిగిన విధానమే ఇశ్రాయేలీయులకు ఎందుకు రాలేదు, ఎందుకంటే
దేవుడు "మొదటి పుట్టినది నాదే" అని చెప్పినప్పటికీ (నిర్గమ 13:2), ఐగుప్తీయులు ఆ సత్యానికి విధేయత చూపటంలో నిరాకరించారు.
ఇశ్రాయేలీయులు దేవునికి ప్రతిష్టిత జనము,భూమి మీద ఉన్న సమస్త ప్రజలందరికీ ఆశీర్వాద కారణంగా ఉండటానికి దేవుని చేత దేవుని ఏర్పాటులో ఏర్పరచబడిన పిలువబడిన దేవుని ప్రధమ సంతతి వీళ్ళు,
వీరు దేవున్ని సేవించటానికి ఐగుప్తును వదిలి దేవుడు చూపించే దేశమునకు వెళ్లాలి, కానీ ఇక్కడ ఫరో వీరిని పంపించడం లేదు, అంటే నిర్గమ 13:2 లో చెప్పబడినట్లు దేవునికి ప్రథమ సంతతి అయిన వీరు దేవుని సేవించటానికి, ఇశ్రాయేలీయులను ఇక్కడ ఫరో దేవునికి అప్పగించటం లేదు,
దీని కారణంగానే ఐగుప్తు దేశమందు ఐగుప్తీయుల మనుష్యులలోను జంతువులలోను మొదట పుట్టిన అందరు రాత్రివేళ మరణ దూతకు అప్పగించ బడ్డారు.
ఇది మనకు ఏమి గుర్తు చేస్తుంది,అని అంటే దేవునికి చెందాల్సిన మొదటి స్థానం మనం కాపాడకపోతే, మనము ఇవ్వకపోతే,దానిని మనము అమలు చెయ్యకపోతే, దేవుడు తన న్యాయాన్ని, తన తీర్పులను,కచ్చితంగా ప్రత్యక్ష పరుస్తాడు,
దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు భంధకాలలో నుండి విడిపించినప్పుడు, అది కేవలం ఒక దేశము నుండి విడిపించ బడటం కాదు,అది ఒక కొత్త జీవితానికి,దేవున్ని సేవించడానికి ప్రత్యేకించ బడిన దేవుని ప్రజలుగా వేరుచేయ బడటము నకు గుర్తు.
దేవుడు ప్రత్యేకించినా,విడిపించిన వారిని మరల ఫరో తిరిగి తన అధికారంలోనికి, వారిని తన బానిసత్వంలోనికి తీసుకోవాలని చూశాడు. కాని
దేవుడు మాత్రం ఆ ప్రయత్నాన్ని నిలిపి వేసాడు,
ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన రధములను,గొప్ప సైన్యమును, ఫరోకి లేకుండా చేశాడు,ఇది మనకు నిర్గమకాండము 14:28 వ వచనంలో కనబడుతుంది,
నిర్గమకాండము 14:28
"నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు."
దేవుడు వేరుచేసిన వారిని మనుష్యులు కలపలేరు.
ఎందుకంటే,తనను సేవించడానికి తాను ఏర్పాటు చేసుకున్న తన ప్రజలను వేరుచేయుటలో ప్రత్యేక పరచుటలో దేవునికి దైవసంబంధమైన ఒక ఉద్దేశ్యం అనేది దాగి ఉంటుంది. ఆ దేవుని ఉద్దేశ్యాన్ని మార్చాలని చూసేవారికి ఎప్పటికీ విజయం అనే దానిని దేవుడు ఇవ్వడు,
లేవీయకాండము 20:26
మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై యుండునట్లు అన్య జనులలోనుండి మిమ్మును వేరుపరచితిని.
దేవుడు తన ప్రజలను ప్రత్యేకంగా వేరుచేశాడు.
ఈ వేరుపరచబడిన స్థితిని లోకముతో కలిపే ప్రయత్నం చేయడం,దేవుని నియమాన్ని ఉల్లంఘించడమె అవుతుంది.
ఇశ్రాయేలీయులు భూమి మీద ఉన్న సమస్త ప్రజలందరికీ కంటే, దేవునికి ప్రతిష్టిత ప్రజలు, జేష్ఠులు వీరే,
వీరిని దేవునికి అప్పగించాలి,దేవుని సేవించటానికి ఫరో వీరిని పంపకపోబట్టి,ఈ భూమి మీద నిబంధన ప్రజలుగా దేవునికి చెందిన ఈ ప్రధమ సంతతిని దేవునికి అప్పగించటానికి, ఫరో నిరాకరిస్తూ వచ్చాడు,కాబట్టి ఐగుప్తీయుల ప్రధమ సంతతి అక్కడ హతమవుతు వచ్చింది,
ఈ సత్యం ద్వారా మనము నేర్చుకునే సందేశం ఏమిటంటే?,ఇది ఇశ్రాయేలీయుల వరకు మాత్రమే,కాదు కానీ మనకు కూడా ఇది వర్తిస్తుంది,
కొలస్సీయులకు 1:17-18
ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
సంఘాము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.
1కోరింథీయులకు 15:20 వ వచనములో కూడా ఇక్కడ మృతులలో నుండి లేచిన ప్రథమ ఫలముగా ఇక్కడ క్రీస్తు యేసు ప్రభువు వారు మనకు కనపడుతున్నారు, "ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడు."
రోమీయులకు 8:29 వ వచనములో కూడా మనకు కనపడుతుంది, మనము కూడా ప్రధముడు అయినా క్రీస్తు సారూప్యంలో, మార్చబడటానికి దేవుడు మనలను ముందుగానే ఎరిగియున్నాడు అని ఇక్కడ మనకు కనపడుతుంది,
"ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను."
లోకమును శరీరమును సాతానును మరణమును జయించి మహిమ శరీరంతో మృతులలో నుండి ప్రధముడుగా లేచిన క్రీస్తు యేసు ప్రభువు వారి ఆత్మను పరిశుద్ధాత్మను పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి ప్రథమ సంతతె,
ఈ లోకంలో శరీర సంబంధులు ఉన్నారు, ఆత్మ సంబంధులు ఉన్నారు, ఆత్మ సంబంధులు దేవునికి, ఆత్మ సంబంధమైన విషయాలకు ప్రథమ స్థానాన్ని ఇస్తారు,శరీర సంబంధులు శరీర సంబంధమైన విషయాల కొరకు ప్రాధాన్యతను మొదటి స్థానమును ఇస్తారు,
ఎక్కడ ఆత్మ సంబంధమైన దానికి మొదటి స్థానం ఇవ్వబడదో అక్కడ నష్టం అనేది కచ్చితంగా వస్తుంది అన్న ఒక సందేశమును ఇది మనకు తెలియజేస్తుంది,
అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దావీదు కుమారుడైన సొలొమోను మహారాజు, ఇశ్రాయేలీయులను అధికారులుగా తన రాజ్యంలో నియమిస్తూ వచ్చాడు,ఇది మనకు,1రాజులు 9 వ అధ్యాయము:22 వ వచనములో కనపడుతుంది,
"అయితే ఇశ్రాయేలీయులలో ఎవనినైనను సొలొమోను దాసునిగా చేయలేదు; వారు రాణువవారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండిరి."
ఇది ఆత్మీయులు ఉంచవలసిన దృష్టి గురించి ఇది మనకు తెలియజేస్తుంది, అంటే, దేవుని ప్రజలు పాపపు దాసత్యం నుండి విడిపించబడిన వారు, వారు దేవున్ని సేవించ నీయకుండ నశించిపోయే శరీర సంబంధమైనటు వంటి దాస్యములో, ఆటంకరంగా ఉండే శరీర సంబంధుల అధికారంలో, దేవుడు ఎప్పటికీ తన ప్రజలను ఉంచడు,
ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఆచరించిన పస్కా భోజనము ద్వారా వారు, "మేము దేవునికి చెందిన వారము,దేవుని ప్రథమ సంతతి మేము అని వారు ప్రత్యేకింపబడటమే," దీనికి ఉదాహరణ.
దేవుడు మనలో,మన సమయములో, మన హృదయములో, మన నిర్ణయములో.
మన జీవితాలలో, మొదటి స్థానాన్ని కోరుకుంటున్నాడు,
ఇశ్రాయేలీయులు లాగా మనము కూడా దేవునికి ప్రత్యేకమైనవారమై, “మేము దేవుని ప్రథమ సంతతి” అని మనము జీవించే జీవితంతో ప్రకటించే వారముగా మనం ఉండాలి.
దేవునికి చెందవలసిన దాన్ని దేవునికే అప్పగించినప్పుడు, ఆయన కృప మన జీవితాలను కాపాడుతుంది, ఆ దేవుని కృప మనలను నడిపిస్తుంది, మనలో తన మహిమను కనుపరుస్తుంది,
ఎస్తేర్ క్రైసోలైట్
14-9-2025
🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨