CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

పాత నిబంధనలో ఉపవాసం – ఆత్మీయ అర్థం మరియు నేటి విశ్వాసికి పాఠం

మత్తయి 9:14 -17
అప్పుడు యోహాను శిష్యులు ఆయనయొద్దకు వచ్చి పరిసయ్యులును, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు; దీనికి హేతువేమని ఆయనను అడుగగా, యేసుపెండ్లి కుమారుడు తమతో కూడ నుండు కాలమున పెండ్లియింటి వారు దుఃఖపడగలరా? పెండ్లికుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు.

ఎవడును పాత బట్టకు క్రొత్తబట్ట మాసిక వేయడు; వేసినయెడల ఆ మాసిక బట్టను వెలితిపరచును చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు; పోసినయెడల తిత్తులు పిగిలి, ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక యుండునని చెప్పెను.

మత్తయి 9:14-17 వరకు ఉన్న వచనాలు మొత్తం కూడా ఒకే ఆత్మీయ వరుస క్రమంలో సమకూర్చినట్లు ఉన్నవి. యేసు క్రీస్తు ప్రభువు వారుని, యోహాను శిష్యులు ఉపవాసం గురించి అడిగినప్పుడు, ఆయన వెంటనే కొత్త బట్ట, పాత బట్ట, కొత్త ద్రాక్షారసం, పాత తొట్లు అనే ఉదాహరణలు ఇచ్చారు.

అది అనుకోకుండా జరిగినది కాదు, ఉపవాసం యొక్క నిజమైన అర్థాన్ని తెలియజేయటానికి ఇచ్చిన ఆత్మీయమైన బోధ! యిది యేసు చెప్పిన “ఉపవాసము” గురించి ఆత్మీయమైన లోతైన సత్యాన్ని తెలియజేస్తున్న భాగం.

  1. పరిసయ్యుల ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఎలా ఉంది?

పరిసయ్యులు మరియు యోహాను శిష్యులు పాత పద్ధతుల ప్రకారం ఉపవాసం చేస్తున్నారు,
ఇది దుఃఖం, నియమం, ఆచారం అన్నింటితో నిండిన ఉపవాసం. పాతనిబంధనలో ధర్మశాస్త్రం ప్రకారం ఆచరించే ఉపవాసము, బాహ్య నియమాల మీద ఆధారపడి ఉంది.

పాత నిబంధనలో “ఉపవాసం” అనేది కేవలం ఆహారం మానివేయడం కాదు, అది దుఃఖం, పశ్చాత్తాపం, దేవుని సన్నిధిలో నమ్రతతో వినయ విధేయతలతో ఉండటం, మరియు దేవుని కృపను కనికరమును కోరుకోవటం అనే ఒక ఆత్మీయ అభ్యాసముగా దీనిని మనము చెప్పవచ్చు.

ఇది ఎక్కువగా విషాద సంఘటనలకు, పాపమునకు పశ్చాత్తాపం, మరియు దేవుని మార్గదర్శకత్వం కోసం వేడుకోవడంలో ఉపవాసం అనేది చేయబడేది.

పాత నిబంధనలో ఉపవాసం ఎలా చేయబడిందో,
వేటి కొరకు చేయబడిందో ఇప్పుడు మనం చూద్దాం,మొదటిగా,

  1. ఉపవాసం,-- పాపము విషయంలో పశ్చాత్తాపం కొరకు,

ఇది మనకు యోవేలు 2:12 -13 వచనములో కనపడుతుంది, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు,

మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును,శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.

యోవేలు 2:12 -13 వరకు ఉన్న వచనాలలో ఇక్కడ ఉపవాసం అనేది కేవలం ఆహారం మానివేయడం కాదు, కాని వారి హృదయాలు మారాలి, వారి హృదయము మారి దేవుని తట్టు తిరగా టానికి, ఇక్కడ ఉపవాసం అనే దానికి ప్రాధాన్యత ఇవ్వబడినట్లు, ఇక్కడ మనము చూస్తాం,

ఇది హృదయ మార్పుతో కూడిన పశ్చాత్తాపంగా ఇది మనకు కనబడుతుంది.

2. ఉపవాసం – దేవుని సన్నిధిలో నమ్రతను, వినయమును, చూపుటమును మనకు చూపుతుంది,

ఎజ్రా 8:21---23
అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని, మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నదిదగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని.

మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండునుగాని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరిమీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గ మందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులును రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను.

మేము ఉపవాస ముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను,

ఎజ్రా 8:21---23 లో ఉన్న ఈ ఉపవాసము ఎజ్రా మరియు ప్రజలు తమ ప్రయాణం సురక్షితంగా సాగాలని, దేవుని కృప కోరుతూ ఉపవాసమును చేశారు. ఇది దేవునిపై ఆధారపడటానికి చేసే ఉపవాసమని ఇది మనకు ఒక గుర్తుగా కనపడు తుంది.

3. ఉపవాసం – దుఃఖకరమైన పరిస్థితి లేదా ప్రమాద సమయములో,

ఎస్తేరు 4:16
నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరిని సమాజమందిరమునకు సమకూర్చి, నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్న పానములు చేయకుండుడి; నేనును నా పని కత్తెలును కూడ ఉపవాసముందుము; ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును; నేను నశించిన నశించెదను.

ఎస్తేరు రాణి యూదుల రక్షణ కొరకు ప్రార్థన మరియు ఉపవాసముతో దేవుని దయను కోరింది.
ఈ ఉపవాసం యూదా జాతి ప్రాణ రక్షణ కొరకు,
సామెతలు 21:1 వ వచనము,
యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది. ఆయన తన చిత్తవృత్తిచొప్పున దాని త్రిప్పును. అని వ్రాయబడి,ఉన్నట్లు,

నీటి కాలువలా తనకు ఆనుకులముగా త్రిప్పగల దేవుని చేతిలో ఉన్న రాజుల హృదయం,మార్పు కొరకు, దేవుని కృపను, కనికరమును కోరుతూ చేసిన ఉపవాసముల ఈ ఎస్తేరు 4:16 లో వున్న వచనాలను బట్టి మనకు కనబడుతుంది,

4. ఉపవాసం – ఒక దేశం కోసం లేదా ఒక పట్టణం పశ్చాత్తాపం కోసం,

యోనా 3:5 - 10
నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనెవె రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీదనుండి దిగి,తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుండెను.

మరియు రాజైన తానును ఆయన మంత్రులును ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయముకాకుండ తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు గాని యెద్దులుగాని గొఱ్ఱెలుగాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు,

మనుష్యులందరు తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను, మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవె పట్టణములో చాటించి ప్రకటన చేసిరి.

ఈ నీనెవెవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను.

ఇక్కడ ఒక జాతి మొత్తము పశ్చాత్తాపముతో ఉపవాసము చేసినప్పుడు దేవుడు కృపతో తీర్పును వెనక్కి తీసుకున్నాడు. అంటే సమూహముగా అంటే ఒక జాతి గాని ఒక దేశము గానీ ఒక పట్టణము గాని ఒక సమాజం కానీ ఒక ఇల్లు కానీ, దానికి కలిగిన కీడు నాశనము అన్నది పోయి దానికి అభివృద్ధి కలగాలి అని అంటే దానికి సంబంధించిన వారందరూ సమూహముగా ఉపవాసం ఉండి ప్రార్థించాల్సిన నియమము ఇక్కడ మనకు కనబడుతుంది,

5. ఉపవాసం – కృప పొందడానికి,

2సమూయేలు 12:16-17
యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను.

దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి యుండి బిడ్డకొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నిక యైనవారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరిగాని అతడు సమ్మతింపక వారితోకూడ భోజనము చేయకయుండెను.

దావీదు తాను చేసిన పాపము ఫలితంగా జబ్బు పడ్డ బిడ్డ కొరకు ఉపవాసము చేశాడు. పాపము వలన వచ్చు జీతము మరణము, అని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది కాబట్టి ,దేవుని వాక్యానికి విరుద్ధమైన దానిలో నుండి,మరణానికి అప్పగించబడే దాని నుండి మృతమయ్యే దాని నుండి, మనము జీవాన్ని
పొందటానికి మనము ఉపవాసం చేయకూడదు,
మనకు కృప క్రీస్తు యేసు ప్రభువు వారి పునరుత్థానంలోనే నూతన జీవము,శాశ్వతమైన ఆశీర్వాదంమనకు దొరుకుతుందని మనము ఉపవాసం చేయాలి అన్న సందేశంలో ఇది మనకు ఇస్తుంది

6. దేవుడు కోరుకునే నిజమైన ఉపవాసం

యెషయా 58:6-7
దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా?

నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు

దేవుడు సేలవిచ్చేది ఏమిటి అని అంటే,
నిజమైన ఉపవాసం ఆహారం మానేయడం కాదు,
ఇతరుల పట్ల ప్రేమతో, దయతో, నీతిగా నడుచుకోవడం.అన్నిటికంటే ముఖ్యముగా దేవునిపై మనము ఆధారపడటం,అంటే దేవుని వాక్యాలను దేవుని ఆజ్ఞలను మనము పాటించటం అని ఇక్కడ అర్థం

పాత నిబంధనలో ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే?

  1. యోవేలు 2:12–13,మన పాపాలను గురించి మనం పశ్చాత్తాపం పడాలి అని ఈ ఉపవాసం మనకు తెలియజేస్తే,

  1. ఎజ్రా 8:21–23 లోని ఈ ఉపవాసం,మనము చేసే ప్రతి పనిలో దేవునిపై ఆధారపడటంను గూర్చి ఈ ఉపవాసము మనకు తెలియజేస్తుంది,

  1. ఎస్తేరు 4:16 లోఉన్న ఈ ఉపవాసం అపాయం,ప్రమాదము వచ్చినప్పుడు మనము చేయాల్సిన ఉపవాసము యొక్క విధానమునుగూర్చి ఇది మనకు తెలియజేస్తుంది,

  1. యోనా 3:5–10 ఇక్కడ మనకు కనబడుతున్న ఉపవాసం, సమూహంగా మనం చేయాల్సిన బాధ్యతను, ఇది మనకు తెలియజేస్తుంది,

  1. 2 సమూయేలు 12:16 ఇక్కడ ఉన్న ఈ ఉపవాసం మనము దేని నిమిత్తం ఉపవాసం చేయాలో అన్నదాన్ని గురించి మనకు తెలియజేస్తుంది,

  1. యెషయా 58:6–7ఇక్కడ ఉన్న ఉపవాసము దయతో,ఇతరుల పట్ల మనము ఎలా నడవాలో దేవుని వాక్యాములో ఉన్నట్లు,దేవుని వాక్యము మనకు తెలియజేసినట్లు, మనము నడిచినప్పుడు అది కూడా ఉపవాసమే అని ఈ వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి,

చూశారా ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఉపవాసానికి దేవుడు ఇచ్చిన నిర్వచనాలు

పాత నిబంధనలో ఉపవాసం కేవలం ఆహారం వదిలివేసే శారీర సంబంధమైన పనులు మాత్రమే కాదు; అది మన హృదయాన్ని, ఆత్మను దేవునికి ప్రతిష్టించి దేవుని ఆత్మతో మన ఆత్మ ఏకమై ప్రార్థన ద్వారా సాధన చేసేదిగా ఆ ఉపవాస సమయం ఉంది. దేవుని ముందు నిత్యమూ వినయంతో, మన పాపాలను వదిలివేసి, ప్రార్థనలో నిమగ్నమై ఉండటం అనేది ఇది ఉపవాసములో ప్రధానమైనది.

ఎస్తేర్ క్రైసోలైట్
11-10-2025

🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨