2025 Messages
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
మన శ్రద్ధ ఎక్కడ నిలుస్తోంది?
మనం సాధారణంగా ధ్యాసపెట్టి చదువు, చదువు మీదే దృష్టి ఉంచు,నీవు చేసే పనిలో నీ మనసు కేంద్రీకరించు, అనే అర్థాలతో మనము మన పిల్లలతో మాట్లాడుతూ ఉంటాము,
అసలు“శ్రద్ధ” అనే మాట,పరిశుద్ధ గ్రంథంలో చాలా లోతైన ఆత్మీయ అర్థం కలిగి ఉంది. దేవుని వాక్యంపై మన హృదయాన్ని నిలిపే ఆత్మీయ స్థితిగా ఇది మనకు చూపిస్తుంది.
శ్రద్ధ అంటే ఏమిటి?
బైబిల్ ప్రకారం శ్రద్ధ అంటే మన మనసు,మన హృదయం,మన ఆలోచనలు,మన సమయము ఇవి అన్నీ కూడా, దేవుని వాక్యానికి దేవుని ఇష్టానికి అనుకూలంగా ఉంచటం,
ఇది కేవలం వినడం మాత్రమే కాదండి, మనము విన్న వాక్యాన్ని, వాక్యమనే దేవుని స్వరంలో నుంచి ఏదైతే మనము వింటామొ, దానిని బట్టి మనం ఆనందిస్తూ ఉండాలి.
ఆ దేవుని జవాబును దేవుడు మనకు ఇచ్చిన సమాధానం, దేవుడు మనకు ఇచ్చిన నడిపింపును, మన హృదయంలో భద్రంగా భద్రపరుచుకోవాలి,ఆ వాక్యాన్ని బట్టి మనము ప్రవర్తించాలి అంటే దానిని మనము ఆచరణలో పెట్టాలి అని అర్థం,
అంటే, దేవుని వాక్యమును విని,దాన్ని వదిలిపెట్టే వారు కాకుండా, దానిని జాగ్రత్తగా ఆచరించే వారే శ్రద్ధగలవారు.
అందుకే, సామెతలు 4:20 - 23 వ వచనములో ఉన్న మాటలు, దేవుని వాక్యము గురించి ఇలా సాక్ష్యమిస్తున్నాయి,
"నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్య కుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము.
దొరికినవారికి అవి జీవమును వారి సర్వ శరీరము నకు ఆరోగ్యమును ఇచ్చును.నీ హృదయములో నుండి జీవధారలు బయలు దేరును కాబట్టి అన్నిటి కంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము,"
మనకు క్షేమాన్ని కలుగచేసే దేవుని వాక్యాన్ని,శ్రద్ధగా మన హృదయంలో కాపాడుకోవాలి,
ఇక్కడ శ్రద్ధపెట్టటం అని అంటే,మన దృష్టి, మన హృదయమంతా దేవుని వాక్యంపై ఉండాలి.
దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఏమి మాట్లాడాడు, తన వాక్యం ద్వారా దేవుడు మనకు ఎటువంటి భద్రతను ఇచ్చాడు, తన వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఎలా నడిపించాడు, వాక్యం ద్వారా మనల్ని ఎలా బలపరిచాడు, మన అవసరతలను ఆ వాక్యం ద్వారా ఎలా తీర్చాడు, అన్నటువంటి ఇటువంటి విషయాలలో మనము ఆనందించే వారముగా, మన దృష్టి, మన శ్రద్ధ, అన్నది దేవుని వాక్యము మీద ఉండాలి, అని ఇక్కడ దేవుని వాక్యము మనము ఉంచవలసిన శ్రద్ధను గురించి మనకు తెలియజేస్తుంది,
2. దేవుడు శ్రద్ధ గల వారిని ఎలా చూస్తాడు?
తన వాక్యానికి, తన ఆజ్ఞలను శ్రద్ధగా వినే వారిని దేవుడు ప్రేమిస్తాడు, వారికి ఆశీర్వాదం ఇస్తాడు.
యాకోబు 1:25
అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.
3. మనం దేనిమీద శ్రద్ధ పెట్టాలి?
దేవుని వాక్యంపై, ఎందుకంటే అది మన ఆత్మకు ఆహారం,
మత్తయి 4:4
అందుకాయన మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను.
శరీర సంబంధంగా మనము తీసుకుని ఆహారము అది ఈ శరీరానికి జీవింప చేయటానికి పనికి వస్తుంది కానీ మనకు ఆత్మ సంబంధమైన జీవిత మనేది ఒకటి ఉంది,అది బ్రతికించబడాలి అని అన్న,అది ఎల్లప్పుడూ జీవంతో జీవిస్తూ ఉండాలి అన్న, ఈ వాక్యం అనే ఆహారం మన ఆత్మకు ఆత్మసంబంధమైన జీవితానికి ఎంతో అవసరం,
నశించిపోయే ఈ లోక సంబంధమైన జీవితం కోరకే మనము ఈ ఆహారాన్ని తీసుకుంటున్నాము, కానీ ఎల్లప్పుడూ జీవించే నాశనం లేని నిత్యజీవమును కలిగిన, ఆత్మ సంబంధమైన జీవితం కొరకు మనము ఎలా శ్రద్ధను కలిగి ఉన్నాము అన్నది మనల్ని మనము పరిశీలించుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది,
దేవుడు తన వాక్యము మీద శ్రద్ధ నిలిపి ఉంచే హృదయాలను వెతుకుతున్నాడు.
వాక్యాన్ని విని వదిలిపెట్టే వారిని కాదు,దేవుని వాక్యాలు జీవం కలిగినవని,వాటిని నమ్మి,ఆ వాక్యాలను భద్రంగా హృదయంలో దాచుకొని, వాటి ప్రకారము జీవించే జీవం కలిగిన వారినే దేవుడు విలువైన వారిగా చూస్తాడు,
కాబట్టి ఈరోజు మనము మన హృదయాలను పరిశీలించుకుందాం! మన శ్రద్ధ ఎక్కడ ఉంది? లోకపు మాటల పైనా? లేక దేవుని వాక్య స్వరము పైననా?
ఎందుకంటే శ్రద్ధ ఉన్న చోట మన జీవం ఉంటుంది, ఆ శ్రద్ధ మనల్ని జీవింప చేస్తుంది, ఆ శ్రద్ధే మనల్ని నిజమైన జీవితం వైపు నడిపిస్తుంది కాబట్టి.
ఎస్తేర్ క్రైసోలైట్
12-10-2025
🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨