2025 Messages
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
గోధుమలు – గురుగులు
{నీతికి మరియు అవినీతికి మధ్య తేడా}
మానవుల ఆత్మ సంబంధమైన స్థితిని తెలియజేసే శక్తివంతమైన ఒక ఉపమానముగా క్రీస్తు యేసు ప్రభువు వారు పరిశుద్ధ గ్రంథంలో “గోధుమలు, గురుగులు” అనే ఉపమానాన్ని ఇచ్చారు (మత్తయి 13:24-30, 36-43).
“గురుగులు” అంటే చెడ్డ గడ్డి, కలుపు మొక్కలు, ప్రయోజనం లేని, ఉపయోగం లేని, చివరకు శత్రువుల చేతుల్లోనే దహనం చేయబడే మొక్కలు. ఇవి మనిషికి ఉపయోగకరమైన ఆహారపు ధాన్యమును ఇవ్వవు. కానీ గోధుమలు మాత్రం మానవునికి ఆహారాన్ని, జీవనానికి అవసరమైన పోషణను ఇస్తాయి. అందువల్ల గోధుమలు జీవనాన్ని సూచిస్తే, గురుగులు వ్యర్థ మైన దాన్ని సూచిస్తాయి.
ఈ ఉపమానంలోని మూడు దశలు
🌱 మొదటి దశ – మొలక దశ
రైతు మంచి విత్తనం వేశాడు. కానీ శత్రువు రాత్రి వచ్చి, గోధుమల మధ్య గురుగులు కూడా వేసాడు. రెండు మొలకలు మొదట్లో ఒకేలా కనిపించాయి. ఈ దశలో రెండింటికి మధ్య తేడా కనిపించదు.
2. 🌿 రెండవ దశ – ఆకులు వచ్చిన దశ
ఇప్పుడు రెండు మొక్కలు పెద్దవవుతాయి. ఆకులు వస్తాయి. రైతు వెంటనే గురుగులను, పెళ్ల గించడానికి ప్రయత్నిస్తే, గోధుమలు కూడా,పెళ్ల గింపబడే ప్రమాదం ఉంది,గోధుమలు ఫలాన్ని కోల్పోతాయి. కాబట్టి యజమాని కోతకాలం వరకు రెండింటినీ అలాగే పెరగనిస్తాడు.
3. 🌾 మూడవ దశ – గింజ పట్టే దశ
ఇదే అసలు తేడా ఏది గోధుమనో ఏది గురు గో,బయటపడే సమయం. గోధుమలు ధాన్యాన్ని, గింజలను ఇస్తాయి. కానీ గురుగులు మాత్రం ఖాళీ గడ్డితో మాత్రమే ఉంటుంది. దానిలో గింజ ఉండదు. కాబట్టి ఇక్కడ తేడా చూపించేది గింజ. ఫలము ఇచ్చేది ఏది? ఫలము లేనిది ఏది? అనేది అప్పుడు మాత్రమే మనకు స్పష్టమవుతుంది.
3. దీని ఆత్మీయ అర్థం
ఇది మన ఆత్మీయ జీవితానికి చాలా లోతైన సందేశమును ఇస్తుంది.
మనము దేవుని రాజ్యంలో మొలకెత్తినట్లే ఉన్నప్పటికీ – చివరిలో,ఆఖరులో, మనము దేవుని ప్రజలముగా గుర్తించబడేది, ఫలము ద్వారా మాత్రమే. ప్రారంభంలో మనం ఎలా ఉంటామో, ఆకులు పచ్చగా ఉంటాయో, అన్న విషయము ఇక్కడ ప్రాముఖ్యమైనది కాదు, కానీ, చివరికి అంతిమంగా మన ఫలముల ద్వారా మాత్రమే దేవుని ప్రజలుగా మనము గుర్తించబడతాము అన్నదే ఇక్కడ ప్రాముఖ్యమైనది,
ఇక్కడముఖ్యమైనది,
మన జీవితములో నీతి అనే ఫలము కనబడాలి, మనం అనేకులకు ఆత్మీయ ఆహారం ఇవ్వగల నిజమైన గోధుమలుగా కావాలి.
4. పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాల ఆధారంగా
రోమీయులకు 3:23 - 24
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.
అంటే – ఎవ్వరూ తమతమ నీతి వల్ల నిలబడలేరు. మనమందరం పాపము చేసాము. కానీ మన కోసం నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఉత్తరవాదిగా నిలిచారు.
1యోహాను 2:1
ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది(ఆదరణకర్త) తండ్రియొద్ద మనకున్నాడు.
ఇక్కడ గోధుమలు అంటే క్రీస్తునందలి నీతి గలవారు. గురుగులు అంటే నీతి ఫలము లేని వారు.
5. నీతి అనే గింజ
గోధుమలకు విలువ తెచ్చేది ధాన్యపు గింజలు. మానవునికి విలువ తెచ్చేది నీతి అనే ఫలము.
క్రీస్తు ప్రభువు మనలో “నీతి” అనే విత్తనాన్ని వేస్తే, మన జీవితము గోధుమ వలె, అనేకులకు ఆత్మీయ ఆహారం అవుతుంది, వారి ఆత్మీయ జీవనమును నిలుపుతూ పంచేలా మారుతుంది.
లేకపోతే, గురుగుల వలె వ్యర్థమైన గడ్డిగా, చివరికి అగ్నిలో కాల్చబడతాము,
హోషేయా 10:12
నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి.
6. చివరగా మనము ఫలమిచ్చేవారమా? లేక ఫలము లేని గురుగులమా? అనే ప్రశ్న చివరికి మన ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రశ్నిస్తుంది.
గోధుమలు – గురుగులు మొదట్లో ఒకేలా కనిపిస్తాయి. కానీ వాటి మధ్య తేడాను,కనుపరిచేది, చూపించేది, గింజ – ఫలము మాత్రమే.
అలాగే మన ఆత్మీయ జీవితం ప్రారంభంలో ఎలా ఉన్నది ఆన్నది కాదు, చివరికి మనం కలిగి ఉన్న ఫలముల వలనే మనము ఎవరమో తెలిసిపోతుంది.
మత్తయి 7:20
మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.
ఇప్పుడు చెప్పండి… మీ జీవితం గోధుమ వలే, నీతి ఫలములను పంచుతూ, ఇతరులకు ఆత్మీయ ఆహారముగా ఉంటు వున్నాదా! లేక గురుగులా, వ్యర్థమై చివరికి అగ్నిలో కాల్చబడేలా ఉందా?
ఎస్తేర్ క్రైసోలైట్
1-10-2025
🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨