2025 Messages
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
లోక భ్రష్టత్వం నుండి దేవస్వభావంలోకి మహిమను ప్రతిబింబించే సంఘాము
స్త్రీ పురుషుని మహిమయై యున్నది. యేసుక్రీస్తు ప్రభువు వారి గుణాతిశయములను ప్రచురపరచే సంఘామునకు ఇది చూచనగా ఇది చెప్పబడినది.”
ఈ వాక్యం ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. పురుషుడు దేవుని ప్రతిరూపముగా వునట్లే, దేవుని సంఘామునకు స్త్రీ ప్రతిరూపముగా దేవుని మహిమ గుణాతిశములను ప్రచుర పరచటానికి, స్త్రీ అనే సంఘాము దేవుని మహిమయై ఈ వాక్యంలో మనకు కనిపిస్తుంది.
2 పేతురు 1:4
ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను
దేవ స్వభావము అంటే ఏమిటి ఇది మనకు ఎందుకు అవసరం,
దురాశను అనుసరించుటవలన కలిగే ఫలితము, ఇదే లోకమందున్న భ్రష్టత్వము అంటే,
1యోహాను 2:16
లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.
అందుకే ఇక్కడ "లోకమందున్న భ్రష్టత్వము" అంటే, పాపముతో మిలిత మైన కోరికల ద్వారా వచ్చిన నాశనం, ఆపవిత్రత, అవినీతి, ఆత్మీయ నాశనం అన్నది. యివి దేవుని వలన పుట్టినవి కావు. ఈ లోకంలో ఉన్నవి అన్ని ఈ లోకమందున్న భ్రష్టత్వము అంత కూడ, పాపపు మూలాలుగా,1యోహాను 2:16 వచనంలో {పరిశుద్ధ గ్రంథంలో } వివరించ బడ్డాయి.
2 పేతురు 1:47 వ వచనంలో ఆ మూలాల వల్ల వచ్చిన ఫలితం, అదే లోకములో వున్న భ్రష్టత్వం, గురించి చెబుతోంది.
అంటే రెండు వచనాలు ఒకదానిని మరొకటి పూర్తి చేస్తున్నాయి.
1 కొరింథీయులు 11:7లో స్త్రీ పురుషుని మహిమగా చూపబడటం, అలాగే 2 పేతురు 1:4లో దేవుని స్వభావం పట్ల మన భాగస్వామ్యం—ఇవి రెండూ మానవుని ఆత్మీయ ఉద్దేశాన్ని లోతుగా తెలియజేస్తున్నాయి.
దేవుని స్వభావము అంటే ఏమిటి?
దేవుని స్వభావం అంటే ఆయన గుణాలు, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ప్రేమ, కరుణ, న్యాయం, విశ్వాసము, వినయం, క్షమ, పవిత్రత.
వీటిని మానవుడు స్వంతంగా కలిగించుకోలేదు, కానీ దేవుడు ఆత్మీయులు జీవమునై యున్న దేవుని వాక్యములు అనే తన వాగ్దానాల ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ఆ ఆత్మ ద్వారా పలికే మాటను, వాక్కును, మనము అచరించటం ద్వారా, మనకు వచ్చె గుణాలను దేవుని స్వభావం అంటారు.
దేవుని స్వభావము యొక్క మూలం ఏమిటంటే దేవుడు, ఆయన వాగ్దానములు,పరిశుద్ధాత్మ
దేవుని స్వభావము లో వున్న గుణాలు ఏవంటే,
పవిత్రత, ప్రేమ, కరుణ, వినయం,న్యాయం, విశ్వాసము,
దేవుని స్వభావము లో వున్న గుణాలనుమనము కలిగి ఉండటం వలన కలిగే ప్రయోజనం ఫలితం
ఏమిటి అంటే, దేవుని మహిమలో పాలు పంచు కోవడం,శాశ్వత జీవమును పొంద గలగటం,
దేవుని స్వభావంలో ఉన్న గుణాలను మనము కలిగి ఉండటం ద్వారా మనకు కలిగే ఫలితం ద్వారా మనము ఉండే స్థితి ఏమిటంటే,వెలుగులో నడక,అంటే మన జీవితమంతా దేవుని వాక్యము అనే వెలుగు ద్వారా వెలుగులోనే ఉంటుంది,
దీని మూలంగా మనము కలిగి ఉండే లక్ష్యం ఏమిటంటే,మనము దేవుని ప్రతిరూపముగా మారడం,దేవుని మహిమను దేవుని గుణాతిశయములను ప్రచార పరచే సంఘాముగా మనం మారటం,దేవుని పోలికగా మనము చేయబడటం,
ఇవి ఎందుకు మనకు అవసరం?
లోకంలో ఉన్న భ్రష్టత్వమునుండి తప్పించు కోవడానికి (2 పేతురు 1:4).
మనము దేవుని సంతానము అని తెలియజేయటానికి.
మనము క్రీస్తు స్వరూపంలో మలచబడటానికి (రోమా 8:29).
దేవుని సంఘాము ఒక స్త్రీ గా దేవుని మహిమను,దేవుని మహిమ గుణాతిశయములను ప్రజలకు చూపించడానికి.
మనకు నష్టమును తీసుకొని వచ్చే ఈ లోకంలో ఉన్న బ్రష్టత్వము ఏమిటి?
భ్రష్టత్వపు అంశాలు
దురాశ, పాపపు కోరికలు,
శరీరాస, నేత్రాస, జీవపు డంభము
(1 యోహాను 2:16)ఆత్మసంబంధమైన నాశనం, అవినీతి, శిక్ష
చీకటిలో, భందకంలో
స్వయాన్నే ఎత్తిపడేయడం
ఈ లోకంలో పాపానికి మూలం గా ఉన్నటువంటి, సకల భ్రష్టత్వమును మానవుడు వీటిని ఎలా జయించగలడు?
ఈ బ్రష్టత్వమును మనము జయించాలని మన కొరకు యేసు క్రీస్తు ప్రభువు వారు ఏం చేశారు? అనే విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం
ఈ లోకంలో పాపానికి మూలమైన దురాశ, పాపపు కోరికలను, సిలువ వేయాలి, చంపివేయాలి
గలతియులకు 5:24
క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసియున్నారు. పరిశుద్ధాత్మ ఫలములతో నింపబడిన వారముగా మనము నడవాలి,
మన మాటల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా, మన సమస్త నడవడిక అంతటి ద్వారా, ఎక్కడ మనం దేవుని వాక్యానికి విరోధంగా తప్పిపోతూ వచ్చామో, ఆ ప్రతి విషయాన్ని బట్టి, దేవుని రక్త ప్రోక్షన లోనికి మనం వచ్చి పరిశుద్ధ పరచబడాలి, అల మన ప్రవర్తన ఉండాలి, కనపడాలి,
క్రీస్తు యేసు ప్రభువు వారు మన పాపములన్నిటిని, తన మరణముతో సిలువ వేయడం ద్వారా, పాపపు శక్తిని నాశనం చేశాడు,పాపం లేని పరిశుద్ధమైన నూతన హృదయాన్ని కలిగి మనము జీవించుటకు మార్గమును తాను చూపారు.
రోమీయులకు 6:6
ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము( మూలభాషలో-ప్రాచీన పురుషుడు) ఆయనతో కూడ సిలువవేయబడెనని యెరుగుదుము.
2. శరీరాస, నేత్రాస, జీవపు డంభము,ఇది లోకంలో ఉన్న పాపముతో కూడిన బ్రష్టత్వము,

వీటిని మనము ఎలా జయించగలము అని అంటే,
శరీరాన్ని, మన సకల ప్రవర్తనను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. గర్వాన్ని విడిచి మనము వినయముగా నడవాలి.
మానవుడు ఈ లోకములో ఉన్న సకల భ్రష్టత్వమును జయించాలంటే పరిశుద్ధత అనేది చాలా ముఖ్యం అది అత్యవసరం కూడ. శరీరం పాపమునకు బానిస కాకుండా దేవునికి పరిశుద్ధమైన బలిగా దేవుని పరిచర్య కొరకు సమర్పించాలి మనము,
(రోమీయులకు 12:1; 1 థెస్సలొనీకయులకు 4:3-4). మన కళ్ళు మన శరీరమునకు దీపమని యేసు చెప్పారు — అవి స్వచ్ఛమైనవిగా చెడును చూడకుండా ఉంటే మన జీవితమంతా వెలుగులో ఉంటుంది (మత్తయి 6:22-23). కాబట్టి పాపమును, చెడును మన కన్నుల ముందు ఉంచ కుండ మనము ప్రయాసపడాలి, (కీర్తనలు 101:3).
అంతేకాకుండా, గర్వం అనేది మనిషిని కూలదోస్తుంది; కానీ దేవుడు వినయముగా ఉండేవారికి కృపను ఇస్తాను అని చెప్పారు, 1పేతురు 5:5 దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.కాబట్టి వినయముతో దేవునితో నడవడం మనకు రక్షణ (మీకా 6:8).
దీని ద్వారా మనకు ఇవ్వబడుతున్న సందేశం ఏమిటంటే మన శరీరం పరిశుద్ధంగా ఉంటేనే దేవుని సన్నిధిలో మనము నిలవబడగలము,మన కళ్ళు చెడును చూడకుండా ఉండగలిగితే పాపం అన్నది మనలో ప్రవేశించదు,మనకు వినయం ఉంటే దేవుని కృప మనపై నిలుస్తుంది.
3. ఈ లోకంలో ఉన్న, బ్రష్టత్వం అనేది మనలోకి దేనిని తీసుకుని వస్తుంది అంటే, ఆత్మసంబంధమైన నాశనమును, అవినీతిని, శిక్షను, మానవుడు ఈ శిక్ష నుండి ఈ నాశనము నుండి ఈ అవినీతి నుండి తప్పింపబడాలి అని అంటే మనము చేయవలసినదేమిటి, పాపమును నీతిని గూర్చి ఒప్పింపజేసే పరిశుద్ధాత్మను పొందుకొని మనము మన పాపముల విషయమై పశ్చాత్తాపంను పొంది, నూతన జన్మను పొందాలి.
అప్పుడు వాక్యమై ఉన్న,మన కొరకు నీతిగా చేయబడ్డ క్రీస్తులో,మన శాపము నుండి మనలను విడిపించటానికి మరణించితిరిగి లేచిన క్రీస్తు యేసు ప్రభువు వారి మరణ భూస్థాపన పునరుత్థానాలలో మనము బాప్తిస్మమందు పాలి భాగమును కలిగినప్పుడు, ప్రతి శాపం నుండి మనము విడిపించబడతాము, నూతన జీవాన్ని పొంది నూతనమైన వ్యక్తిగా మనము మారుతాము, ఇది క్రీస్తులో నూతనముగా స్థిరపరచబడిన ఆత్మసంబంధమైన జీవితం,
అందుకే క్రీస్తు యేసు ప్రభువు వారు తన రక్తముతో పాపపు శిక్ష నుండి మనకు విముక్తి ఇచ్చారు,
నిత్యజీవమును ప్రసాదించాడు.
రోమీయులకు 8:1
కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.
4. ఈ లోకంలో ఉన్న, బ్రష్టత్వం అనేది మన జీవితంలోనికి చీకటిని, భందకములను, తీసుకొని వస్తుంది
ఈ చీకటిలాంటి, బంధకములు లాంటి వాటిలో నుండి మనము బయట పడటానికి ఏమి చేయాలి, మనము మన పాదములకు దీపమును, మన త్రోవలకు వెలుగును ఇచ్చే,వెలుగై యున్న దేవుని వాక్యపు వెలుగులో మనము నడవాలి,
మనలో మన అంతరంగంలో పాపాన్ని దాచుకోకుండా దేవుని సన్నిధిలో దానిని ఒప్పుకోవాలి, దేవుని రక్తం చేత మనము కడగబడాలి. సత్యము అయివున్న మనలను నడిపించే సత్య వాక్యములో మాత్రమే మనము నిలబడాలి.
చీకటిలో నుండి మనలను వెలుగులోకి తీసుకురావడానికి, సత్య వాక్యములో మనలను ప్రతిష్ట చేయటానికి, క్రీస్తు యేసు ప్రభువు వారు మన కొరకు ఏమి చేశారు అని అంటే, తాను లోకమునకు వెలుగు” అయ్యారు,
యోహాను 8:12
మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు గలిగి యుండునని వారితో చెప్పెను. ఆయనలో విశ్వాస ముంచిన వారు ఇక చీకటిలో ఉండరు, చీకటిలో నడవరు.
5. ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం, "నేను అనే గర్వమును, స్వయం అనే దానిని," కూడ
మనలోకి తీసుకొని వస్తుంది,
దీనిని మన జీవితంలో నుండి ఎత్తి పడవే యటానికి, తీసివేయటానికి, మనం ఏమి చేయాలి అని అంటే,
{తన్ను తాను} మనల్ని మనము తగ్గించుకోవాలి, దేవుని కృపపై ఆధారపడాలి. యోహాను 3:30
ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది.
“నేను అన్న గర్వం” మనిషిని దేవుని నుండి మనలను దూరం చేస్తుంది. లూసిఫరు “నేను ఎక్కుదును, నేను సమానమగుదును” అన్న గర్వంతో కూలిపోయాడు (యెషయా 14:13-14). కానీ క్రీస్తుయేసు ప్రభువు వారు, దేవుని స్వరూపములో వుండినా, తనను తాను తగ్గించుకొని దాసుని రూపం ధరించాడు.
ఫిలిప్పీయులకు 2:6-11
ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,
ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
గర్వం మనిషిని కూలదోస్తుంది, వినయం మనిషిని ఎత్తుతుంది.
ఈ లోకంలో ఉన్న ఇటువంటి సకల బ్రష్టత్వమును మనలోనికి రానీయకుండా దేవుని ఆత్మ ఫలాలు అనే స్వభావమును గుణాలను మనము ధరించాలి, యిది ఎందుకు అని అంటే, దేవుని మహిమను గుణాతిశయములను ప్రచురపరచటానికి మనము ఏర్పరచబడిన వంశముగా ఉన్నాము కాబట్టి,
స్త్రీ పురుషులు ఇరువురు కలిగి ఉన్నా సమాజమును, దేవుడు తన మహిమను తన గుణాతిశయములను ,ప్రకటించే, ప్రచురపరిచే, సార్వత్రిక సంఘాముగా, తన కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు,
దీనినే దేవుడు స్త్రీకి సూచనగా వుంచుతు"స్త్రీపురుషుని మహిమయై యున్నది"అని ఈ వాక్యమును తెలియజేశాడు,
స్త్రీ పురుషుని మహిమయై యున్నదని చెప్పినట్లు, స్త్రీకి సూచనగా వున్న సంఘాము కూడా దేవుని మహిమను ప్రతిబింబించే పాత్ర. కానీ ఆ మహిమను కనపడనీయకుండా చేసెది “లోకమందున్న భ్రష్టత్వము”. అందుకే దేవుడు తన వాగ్దానముల ద్వారా మనకు మార్గమును ఇచ్చాడు—ఆయన స్వభావంలో పాలుపంచుకునే అవకాశం. ఇది కేవలం ఒక ఆత్మ సంబంధమైన బహుమానము కృపావరము మాత్రమే కాదు, ఇది ఒక పిలుపు కూడా.
“స్త్రీ పురుషుని మహిమయై యున్నది” (1కొరింథీయులకు 11:7) అనే వాక్యం, సంఘము దేవుని మహిమను ప్రతిబింబించే పాత్ర అని తెలియజేస్తుంది. అలాగే “దేవస్వభావమునందు పాలివారగునట్లు” (2పేతురు 1:4) అన్న వాగ్దానం, లోకమందున్న భ్రష్టత్వమునుండి తప్పించుకొని, దేవుని గుణాతిశయములను ప్రతిబింబించే పిలుపు.
దేవుని స్వభావం,-- పవిత్రత, ప్రేమ, కరుణ, వినయం, న్యాయం, విశ్వాసము.
లోక భ్రష్టత్వం -- దురాశ, శరీరాస, నేత్రాస, జీవపు డంభము, చీకటి, గర్వం.
యేసుక్రీస్తు ప్రభువు వారు,
మన పాప స్వభావాన్ని సిలువవేసి, (గలతీయులు 5:24),శరీరాస, నేత్రాస, గర్వాన్ని జయించటానికి మార్గమును మనకు చూపి, (1 యోహాను 2:16),
మనలను పాపశిక్ష నుండి విముక్తులుగా చేసి, (రోమా 8:1),లోకానికి వెలుగుగా ఉండి, (యోహాను 8:12),
తన్ను తాను తగ్గించుకొని వినయాన్ని చూపి, (ఫిలిప్పీ 2:6-11),
మనకు దేవుని స్వభావాన్ని ధరింపచేస్తూ, తన మహిమను ప్రతిబింబించే సంఘాముగా జీవించడానికి మార్గం కల్పించారు.
మనము ఆలోచించుకోవాల్సిన ప్రశ్న,నేను ఈ లోకమందున్న భ్రష్టత్వమును ప్రతిబింబిస్తున్నానా? లేక దేవుని స్వభావమును ప్రతిబింబించి, ఆయన మహిమను ప్రచురించే సంఘాములో భాగమై ఉన్నానా?
ఎస్తేర్ క్రైసోలైట్
23-9-2025