2025 Messages
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
అభిషేకం ఉన్నచోట తలుపులు ఆగవు!
అభిషేకం అనేది కేవలం, తల మీద నూనె పోసే క్రియ కాదు; అది దేవుని ఆత్మ మన మీదికి దిగివచ్చినప్పుడు మనలో ఉద్భవించే పరలోక సంబంధమైన అధికారము.1సమూయేలు 16:13
సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయెను.
ఈ దేవుని ఆత్మ మన మీదకి ఎప్పుడు దిగి వస్తుంది అని అంటే,మనము దేవుని వాక్య ప్రకారము దేవుని ఆజ్ఞలు ప్రకారము మనం నడిచినప్పుడు,దేవునికి ఇష్టంగా మనము నడిచినప్పుడు,వాటిని విశ్వసించినప్పుడు మాత్రమే,
ఇది మనకు, అపో.కార్యములు 5:32 వచనములో కనపడుతుంది, మేమును, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి.
ఈ పరిశుద్ధమైన ఆత్మ మనలో ఒక శక్తిని కలగజేస్తుంది, అందుకే దేవుని వాక్యము,1యోహాను 4:4 ఇలా సెలవిస్తుంది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని,ఈ గొప్పవాడు మనలోకి వచ్చినప్పుడు,మనము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాము,దేవునికి సాక్షిగా మనము జీవిస్తాం,
అపో.కార్యములు 1:8 దీనిని మనము చూస్తాము
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.
అపో.కార్యములు దీని రచయిత లూకా అయినప్పటికీ,మొదటి అధ్యాయము ఒకటవ వచనం నుంచి,తొమ్మిదవ వచనం వరకు వ్రాయబడిన మాటలన్నీ ప్రత్యక్షముగా, క్రీస్తు యేసు ప్రభువు వారు పలికిన మాటలే, ఆయన పరలోకమునకు ఎక్కి పోవటానికి ముందు
తన శిష్యులతో చెప్పిన సందేశాలు ఇవి, కాబట్టి,
మనలో నివసించే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, లోకంలో ఉన్నశక్తి కంటే గొప్పది, అని మనము నమ్మి తీరాలి,
అందుకే దేవుని ఆత్మ ద్వారా, అభిషేకం అన్నది ఒక్కసారి మన మీదికి వచ్చినప్పుడు, బలమైన ఇత్తడి తలుపులు విరిగిపోతాయి, ఇనుప గడియలు విడిపోతాయి,ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు అంటే మనకు కనిపించని బంధకాలను,దేవుడు తన ఆత్మ ద్వారా మనలను అభిషేకించి, వాటిని పగుల గొట్టించగల శక్తిని కలిగి ఉన్నాడు.
యెషయా 45:1-2
అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడిచేతిని పట్టుకొనియున్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని యెదుట వేయబడకుండ తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చు చున్నాడు. నేను నీకు ముందుగా పోవుచు మెట్టగా నున్న స్థల ములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను.
2 కోరింథీయులకు 3:17 వ వచనములో చెప్పబడినట్లు, ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును.
చూశారా! ••• దేవుడు తన ఆత్మ ద్వారా మనలను అభిషేకించినప్పుడు, మనకి ఎట్లా విడుదల కలుగుతుందో, ఎట్లా స్వతంత్రము అనేది వస్తుందో,ఇప్పుడు మీకు అర్థమైందా! ఇదే ఇదేనండి
దేవుని వాక్యములో ఉన్న గొప్ప శక్తి,
దేవుడు మనకు ముందుగా నడిచి వాటిని తొలగిస్తాడు.మనకు ఆటంక కరంగా మన ముందు బలమైన ఇత్తడి తలుపులుగా ఉన్న సమస్యలు అనేవి, మన ప్రమేయం లేకుండానే అవి తొలగిపోతాయి, ఎందుకంటే దేవుడు మనకు ముందుగా నడిచే దేవుడు కాబట్టి,
నిర్గమకాండము 13:21
వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను.
ఐగుప్తులో ఉన్న తన ప్రజలను బలమైన తన ఆత్మ ద్వారా అద్భుతాలను చేసి ఇశ్రాయేలీయులను, ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించి, వారికి తోడుగా నడిచిన దేవుడు, ఇప్పుడు కూడా ఆత్మ రూపంలో సజీవంగా మన మధ్య ఉన్నాడు,అని మీరు నమ్మగలరా,
మనము దేవుని ప్రార్థించే ప్రతి విషయంలో దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతూ ఉంటాడో తన వాక్యము ద్వారా దానిని మనము విశ్వసించి నప్పుడు దానికి మనం విధేయత చూపినప్పుడు మనతో మాట్లాడిన ఆ వాక్యము మనకి బలమైన ఇత్తడి తలుపులు లాంటి మన సమస్యలను జయించగలిగే శక్తిని మనకు యిస్తుంది,
యెషయా 45:1 వ వచనములో వ్రాయబడినట్లు,దేవుడు కోరెషును ఎందుకు అభిషేకించాడు? ప్రజలను విడుదల చేయడానికి!
అభిషేకం ఉన్నచోట చీకటి నిలవదు. తలుపులు మూసివేయబడవు. గడియలు మన కళ్ల ముందే విడిపోతాయి. ఎందుకంటే మనము వెళ్తుంటే, వాక్యమై ఉన్న దేవుడు మనకు ముందుగా నడుస్తున్నాడు కాబట్టి.
యోహాను సువార్త 1 వ అధ్యాయము1 వ వచనములో,ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.అని వ్రాయబడి ఉంది,
14 వ వచనములో
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి,అని వ్రాయబడి ఉంది,
అభిషేకం అంటే చీకటి లాంటి సమస్యల మధ్య వెలుగు అడుగు వేయడం.
అది మన శక్తితో కాదు,దేవుని ఆత్మతో, వాక్యమై ఉన్న దేవునితో మాత్రమే సాధ్యం.
జెకర్యా 4:6
అప్పుడతడు నాతో ఇట్లనెను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేత నైనను బలముచేతనై ననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను.
అన్నిటిని జయించిన వాక్యమైన దేవునితో ఆ దేవునిచ్చిన వాగ్దానంతో మనము ముందుకు అడిగి వేసినప్పుడు అక్కడ వెలుగై యున్న దేవుడు, మన ముందున్న చీకటిలాంటి సమస్యలను అవరోధాలను పోగొట్ట గలిగే ఒక అద్భుతాన్ని చేస్తాడు,
చాలా సంవత్సరాల క్రితం అప్పటికి నేను ఇంకా దేవుని సేవ చేద్దామన్న ఆలోచన అన్నది నాలో కలగలేదు, దేవుడు నాతో మాట్లాడలేదు,అప్పుడు నేను దేవుని పరిచర్య గురించి ఏమని అనుకునేదాన్ని అని అంటే, నేను నివసించే గ్రామాలలో నేను చూస్తున్న సేవకులు అందరూ కూడా చాలా పేదవారుగా ఉండేవాళ్ళు, వారిని చూస్తూ ఉన్నప్పుడల్లా నేను అనుకునేదాన్ని, అసలు జీవితంలో నేను సేవ అన్నది చేయకూడదు, ఇటువంటి పేదరికం నాకు వద్దు అని అనుకునేదాన్ని,
దేవుని మందిరంలో పనిచేయవచ్చు, పరిచర్య కొరకు డబ్బులు ఇవ్వవచ్చు, ఇటువంటివి ఏమన్నా చేయొచ్చు, కానీ దేవుని వాక్యాన్ని బోధించే ఇటువంటి సేవకులు స్థానంలో ఉండకూడదు, అని నేను అనుకుంటూ ఉండేదాన్ని, ఆప్పటికి యింక నేను రక్షించబడి ఉన్నాను, కానీ బాప్తిస్మన్నది నేను ఇంకా తీసుకోలేదు,
ఒకరోజు నాకు ఒక కల వచ్చింది,"నేను నిలబడి ఉన్నాను,ఒక బైబిల్ నా చేతిలో ఉంది, ఆ బైబిల్ న్ని నేను, అభిషేకించిన వానిని ముట్టవద్దు,అని చెప్పుతూ ఆ బైబిల్ ని నేను కింద పడ వేస్తున్నాను, అది కింద పడ్డ వెంటనే మరలా నేను నా మనసులో అనుకుంటున్నాను, అయ్యో నేనేమిటి బైబిల్ న్ని పడ వేశాను అని, అలా అనుకున్న వెంటనే మరలా నేను బైబిల్ తీసుకొని నిలబడుతున్నాను, తర్వాత మళ్ళీ ఆ బైబిల్ ని అభిషేకించిన వానిని ముట్టవద్దు, అని కింద పడవేస్తున్నాను, ఇలా కిందపడ వేసి తీసుకోవటం అన్నది ఒక ఐదు ఆరు సార్లు జరిగిన తర్వాత నాకు మెలకువ వచ్చేసింది"
ఇక చూడండి ••• అప్పుడు నాకు మెలకువ వచ్చిన తర్వాత చాలా భయం వచ్చేసింది,ఎందుకు అంటే అప్పటివరకు నేను, ఎవరైనా బైబిల్ ని అశ్రద్ధ చేసిన,ఎవరి కాలు అయినా బైబుల్ కి తగిలిన,వారి మీద నేను చాలా కోప్పడుతూ ఉండేదాన్ని, వాళ్ళకి క్లాసు తీసుకుంటూ ఉండేదాన్ని,అటువంటిది నేను దానిని కింద పడ వేస్తున్నాను కలలో, అందుకే నాకు చాలా బాధ కలిగింది,
అప్పుడు ఆ కల భావము ఏమిటో నాకు తెలవలేదు, కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది, దేవుడు తన పరిచర్య కొరకు నన్ను పిలుస్తున్నాడు అని,
నా కలలో నేను పలికిన ‘అభిషేకించిన వానిని ముట్టవద్దు’ అనే మాట నా కోసం కాదు, నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై యున్నవి గాని,యోహాను సువార్త 6:63లో వ్రాయబడినట్లు,
ఇది దేవుని వాక్యానికి సంబంధించినది,
దేవుని వాక్యం, పరిశుద్ధాత్మతో నిండినది, పరలోక సంబంధమైన శక్తి,అధికారమును కలిగినది,ఇది రక్షించేది,ఈ కల నాకు వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రకటించే దేవుని పరిచర్య కాడిని నేను మొయ్యాలి అని దేవుడు నాకిస్తున్న పిలుపు అని నేను గ్రహించాను,
తర్వాత కొద్ది రోజులకు నేను ఒక యూత్ క్యాంప్ లో అభిషేకంతో నిండిన, దేవుని వాక్యమనే కాడిని మోయటానికి, దేవుని వాక్యాము ద్వార దేవుని పిలుపుకు నేను పట్టుబడ్డాను,నన్ను నేను దేవుని నిమిత్తము,దేవుని ద్వారా, పంపబడటానికి నన్ను నేను ప్రతిష్టించుకున్నాను,
అభిషేకం గురించి నేను ఈ వర్తమానమును రాస్తున్నప్పుడు నాకు ఆ కల గుర్తుకొచ్చింది,
చూశార ••• పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలన్నీ కూడా అభిషేకించబడినవి, అవి ఎలా అంటే, వాక్యమై ఉన్న క్రీస్తు యేసు ప్రభువు వారు పరిశుద్ధాత్మతో నిర్మించబడి, సర్వలోక మానవాళి రక్షణ కొరకు,మానవున్ని పాపం నుంచి విడుదల చేయుట కొరకు, ఏ మానవునికి సాధ్యం కానీ,మరణపు ముల్లును విరచి విజయాన్ని ఇచ్చుట కొరకు, అభిషేకించ బడ్డారు కాబట్టి,
ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని మాటలు ఆత్మయు జీవమునై,పరిశుద్ధాత్మ అభిషేకముతో కూడినవై, వున్నవి. మన పరిస్థితులలో మనకు విజయాన్ని ఇచ్చే,మన చీకటిని పారద్రోలే,మన సమస్యలను పరిష్కరించే,మనకు నూతన జీవాన్ని, పునరుత్థానపు ఆత్మ శక్తిని ఇచ్చే, ఇటువంటి వాక్యాలను,మన అవసరత కొరకు,మన హృదయాల ద్వార గ్రహించడమే కాకుండా,మన నోటి ద్వారా మన చేతుల ద్వారా, ఇతరుల వద్దకు మనము మొసు కెల్లడం అన్నది,అది ఒక గొప్ప ధన్యతగా దేవుడు మనకు ఇచ్చాడు,
మీ చేతుల్లో ఉన్న బైబిల్, పరిశుద్ధ గ్రంథం లో ఉన్న దేవుని మాటలు, దేవుని వాక్యాలు, అవి అన్ని కూడా,అవి మామూలు వాక్యాలు అని అనుకుంటున్నారా! కాదు, అవి పరిశుద్దాత్మ అభిషేకంతో నిండి ఉన్న వాక్కులు,పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఈ సంగతి మీరు గ్రహించార.
అందుకే మీ చేతిలో ఉన్న వాక్యం, మామూలు వాక్యం కాదు. అది పరిశుద్ధాత్మ అభిషేకముతో నిండిన దేవుని వాక్యం. దాన్ని విశ్వసించి నడిచినప్పుడు, ఇత్తడి తలుపులు తెరుచు కుంటాయి, ఇనుప గడియలు విడిపోతాయి, చీకటి పారిపోతుంది.
ఆత్మయు జీవమునై యున్న ఈ వాక్యం అనే శక్తి కలిగిన దేవుని వెలుగు, యెషయా 60:1వ వచనములో చెప్పబడినట్లు, మన మీద ఉదయించి నప్పుడు,మన బంధకాలు మన సమస్యలు అన్నీ కూడా విడిపోతాయి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నచోట తలుపులు ఆగవు,ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు మనతో నడుస్తున్నాడు కాబట్టి,
అందుకే దేవుని వాక్యాన్ని నమ్మి నడవండి,పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన వాక్యపు అభిషేకం, మీ కోసం మూయబడిన తలుపు లన్నింటినీ తెరుస్తుంది.
ఎస్తేర్ క్రైసోలైట్
24-9-2025
🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨