2025 Messages
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
🌿 నీ నీతిని జనులు కనుగొనునట్లు
యెషయా 62:2
జనములు నీ నీతిని కనుగొనును రాజులందరు నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబోవు క్రొత్తపేరు నీకు పెట్ట బడును.
మొదటగా ఈ వాక్యము యెరూషలేము (సీయోను) గురించి చెప్పబడింది, దేవుడు తన ప్రజలను తిరిగి కాపాడి, వారి నీతి అన్యజనుల మధ్య ప్రకాశించేలా చేస్తాడన్న ప్రవచనం ఇది.
అయితే ఈ వాక్యం యేసు క్రీస్తు ప్రభువు వారిలో పరిపూర్ణమైంది. ఆయనే మన నీతిగా నిలిచాడు.
1కోరింథీయులకు 1:30-31
అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.
కాబట్టి ఇది నేరుగా యేసుక్రీస్తు ప్రభువు వారిని, ఉద్దేశించి చెప్పబడిన వాక్యం కాదు; కాని ఆయన ద్వారానే ఈ వాగ్దానం నెరవేరింది.
మనలో వెలుగుగా ప్రకాశించే శక్తి వాక్యమై ఉన్న దేవుడు. ఆయన యేసు క్రీస్తు ద్వారా నీతిమంతుడై, మనలో నివసించుచున్నాడు.
అందువల్ల మన జీవితం ఇక మనది కాదు, అది క్రీస్తు వెలుగును కనపరచే దీపము.
మత్తయి 5:14-16
మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు.
మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు.
మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.
దేవుడు మనలను ఈ లోకంలో అనుకోకుండ ఉంచలేదు; ఆయన ఆలోచన ప్రకారమే తనకు రాయబారులుగా మనలను ఏర్పరచుకున్నాడు.
మనమంతా ఆయన ఆత్మను ధరించిన వారముగా, ఆయన నీతి, ఆయన దయ, ఆయన కృప, ఆయన గుణాతిశయాలను ప్రకటించటానికి,పిలవ బడుతున్నాము, నియమించ పడుతున్నాము.
2కోరింథీయులకు 5:20
కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము.
ఒక దీపము తన కాంతిని మరుగు చేయక, తనలో ఉన్న ప్రకాశాన్ని ఇతరులకు పంచినట్లుగా,
మనమూ కూడ మన చుట్టూ ఉన్న వారికి, దేవుని మహిమను, దేవుని ప్రకాశాన్ని, తెలియజేయవలసిన బాధ్యత కలిగి ఉన్నాము.
దేవుని ప్రకాశాన్ని మనం ఇతరులకు ఎలా తెలియజేస్తాం?
దేవుని స్వభావాన్ని, ఆయన గుణాలను మనం ధరించుట ద్వారా,
1పేతురు 2:9
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.
ఏర్పరచబడిన వంశమును,
దేవుని కొరకు ఏర్పరచబడిన వంశము” అంటే, దేవుడు తన కొరకు ప్రత్యేకంగా తన ఆత్మ ద్వారా తన ఆత్మ ముద్రించి,ఏర్పరచుకున్న ప్రజలను, దేవుని ఆత్మీయ సంతతిగా పరిశుద్ధ గ్రంథము మనకు సూచిస్తుంది.
దేవుని కొరకు ఏర్పరచబడిన వంశము యొక్క పని,
పరిశుద్ధ గ్రంథము ప్రకారం,ఈ వంశము చేయవలసిన పని చాలా ఘానమైనది.
దీనిని నాలుగు ముఖ్యమైన కోణాలలో చూడవచ్చు
దేవుని మహిమను ప్రకటించడం,
యాజకులుగా సేవ చేయడం,
నీతి, సత్యం, న్యాయం నిలబెట్టడం,
తరతరాలకు విశ్వాసాన్ని బోధించడం,
దేవుని మహిమను ప్రకటించడం:
1 పేతురు 2:9 ప్రకారం,
దేవుడు మనల్ని తన కొరకు ఏర్పరచిన వంశముగా చేసుకున్న కారణం, ఆయన మహిమను ప్రపంచానికి చూపించడం. మన మాటలలో, మన పనులలో, మన సమస్త ప్రవర్తన, జీవిత విధానం ద్వారా, దేవుని గుణ లక్షణములను,మనము కనపరచాలి,
ఇదే ఈ లోకంలో మనం చేయవలసిన,మన ప్రధాన కర్తవ్యం.
2. యాజకులుగా సేవ చేయడం,
యాజకత్వ సేవ చేయడం అంటే,
ఈ వంశము కేవలం పిలవబడినవారు కాదు, సేవకు సిద్ధమైనవారు,దేవుని సేవా బాధ్యతను స్వీకరించిన వారు, చేసేవారు, అని అర్థం.
వీరు యాజకులవంటి స్థితిలో ఉంటారు, ప్రజల కోసం దేవుని ఎదుట నిలబడి ప్రార్థించేవారుగా, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలను, ప్రజలకు తెలియజేసే వారుగా ఉంటారు.
అందుకే, నిర్గమకాండము 19 వ అధ్యాయము ఆరవ వచనములో,దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న ప్రజల నిమిత్తము, తెలియజేసిన మాట ఏమిటి అని అంటే,
సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనము గాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా,
చూశారా!••• దేవుడు ఎంత స్పష్టంగా తన వాక్యం ద్వారా తన ఉద్దేశాన్ని బయలుపరిచాడో.
ఈ వాక్యము మోషే కాలంలో ఇశ్రాయేలు కొరకు చెప్పబడింది, కానీ ఇప్పటి కాలంలో ఇది క్రీస్తునందు ఉన్న మనకు కూడా, ఇది వర్తిస్తుంది.
ఇశ్రాయేలీయులు శరీర సంబంధమైన సున్నతి ద్వారా వారు దేవుని ప్రజలుగా గుర్తించబడ్డారు, కానీ మనము ఆత్మను బట్టి దేవుని ప్రజలముగా గుర్తించబడిన సమూహము, దేవుని రాజ్యములోని పౌరులము,
దేవుడు యితురుల కొరకు మనము చేసే ప్రార్థనల ద్వారా,దేవుని వాక్యమును మనము ఇతరులకు, ప్రకటించే విధానం ద్వారా, దేవుని స్వభావము దేవుని గుణాలను,మన ప్రవర్తన ద్వారా ఇతరులకు కనపరచుట వలన,దేవుడు తన ఉద్దేశమును,తన పనిని,తన మహిమను,మన ద్వారా ఈ లోకమునకు
తెలియజేయాలని,కొనసాగించాలను కుంటున్నాడు.
3. నీతి, సత్యం, న్యాయం నిలబెట్టడం,
దేవుడు ఏర్పరచుకున్న దేవుని వంశము, దేవుని ప్రజలు, ఈ లోకంలో దేవుని నీతిని, దైవ సత్యమును, దేవుని న్యాయమును, ప్రతిష్టించ వలసిన పిలుపును కలిగి ఉంది, అంధకారంతో నిండి ఉన్న ఈ లోకంలో ప్రజల హృదయాలలో, చీకటి మధ్య వెలుగుగా,వెలుగును యిచ్చే దీపముల నిలబడ వలసిన అవసరత ఉంది,
యెషయా 61:9
జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధినొందును వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచినవారందరు ఒప్పుకొందురు,
అంటే ఈ వంశము దేవుని స్వభావాన్ని తమ జీవితాల్లో చూపుతుంది,
సత్యము, నీతి, ప్రేమ, కరుణ వంటి గుణాల ద్వారా దేవుని రాజ్యమును ప్రతిబింబిస్తుంది.
4. తరతరాలకు విశ్వాసాన్ని బోధించడం,
దేవుని కొరకు ఏర్పరచబడిన వంశము,
తమ తరువాతి తరాలకు, దేవుని జ్ఞానమును, ఆజ్ఞలను, విశ్వాసమును బోధించాలి.
ద్వితియోపదేశకాండము 6:6-7
నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.
నీవు నీ కుమా రులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను.
దేవుని కొరకు ఏర్పరచబడిన వంశము, వారి పని కేవలం ఈ తరమునకు మాత్రమే కాదు,
తరతరాలకు దేవుని జ్ఞానాన్ని అందించడం,దేవుని కట్టడాలను వారికి బోధించడం, ఆ విశ్వాసములో వారిని నిలపడం.
దేవుడు మనలో తన నీతిని ప్రకాశింపజేస్తూ, మన ద్వారా, జనములు ఆయన మహిమను కనుగొనునట్లు తన ఆలోచనను నెరవేరుస్తున్నాడు.
మన జీవితము క్రీస్తు వెలుగును పొంది, ఆయన నామమును ఘానపరచే సాధనముగా నిలవాలి.
✨ మీరు ఈ లోకంలో దేవుని వెలుగును చూపించే వ్యక్తిగా ఉండగలరా?
✨ మీ ద్వారా దేవుని నీతి జనులు కనుగొనునట్లు జీవించగలరా?
ఎస్తేర్ క్రైసోలైట్
8-10-2025
🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨