2025 Messages
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
విత్తనము దేవుని వాక్యము.
ప్రసంగి 11:6
ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము, అది ఫలించునో యిది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీ వెరుగవు.
విత్తనాలు వేసే వ్యక్తి ప్రతి గింజ ఎప్పుడు మొలుస్తుందో, ఎప్పుడు పంట తన చేతికి వస్తుందో తెలియదు. కానీ విత్తడం ఆపడు. అలాగే మనము కూడా దేవుని వాక్యాన్ని వెదజల్లే విషయంలో, మంచి పనులను చేసే విషయంలో కూడా ఎక్కడా ఆపకుండా విస్తారంగా చేస్తూ వెళ్లాలన్నది ఈ వాక్యంలోని సారాంశం. మనం వేస్తున్న విత్తనాలలో ఏది ఎప్పుడు ఫలిస్తుందో దేవునికి మాత్రమే తెలుసు, కానీ అవి ఖచ్చితంగా ఫలిస్తాయి.
రోమీయులకు 7:12
కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధ మైనది, ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమ మైనదియునైయున్నది.
లూకా 8:11 ప్రకారం
"విత్తనము దేవుని వాక్యము." అని పరిశుద్ధ గ్రంథము అయిన బైబిల్ మనకు తెలియ చేస్తుంది,
పరిశుద్ధమైన నీతి కలిగిన ఉత్తమమైన ఈ దేవుని వాక్యమును అనేకులలో దేవుని నీతిని ఫలింప చేసేటట్లు ఈ వాక్యమనే విత్తనమును మనము విత్తుతూ ఉండాలి,అందుకే హోషేయా 10:12 లో ఇలా వ్రాయబడి ఉంది, నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి,
ఈ విత్తనము నశించిపోయే ఈ లోక సంబంధమైన విత్తనము కాదు ఇది, నిత్యము జీవింప చేసే జీవమును మనకు ఇచ్చే విత్తనం ఇది,లోకమును శరీరమును సాతానును మరణమును జయించి తిరిగి లేచిన నీతి లేని మానవుని రక్షించుట కొరకు నీతిగా చేయబడిన వాక్యమై యున్న విత్తనము ఇది.
దేవుడు ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని,సిద్ధపరచి నడిపిస్తున్నాడు,దేవుడు మిమ్ములను నడిపిస్తున్న మీ ప్రయాణంలో మీకు ఎదురు వస్తున్న, ప్రతి కష్టము, శ్రమ, పరీక్ష, వ్యతిరేకత పోరాటాలలో, ప్రతి విధమైన సమస్యలలో,దేవున్ని ప్రార్థించి, దేవున్ని ఆడిగి,పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న, ఈ వాక్యమై ఉన్న నీతి విత్తనాన్ని వేయండి,విజయాన్ని చూడండి,
నీతిగా చేయబడిన వాక్యమై యున్న, క్రీస్తు యేసు ప్రభువు వారు,ఆత్మ రూపంలో వాక్య రూపంలో ఎక్కడ ఉంటారో,అక్కడ ఖచ్చితంగా విజయం అన్నది వచ్చి తీరుతుంది,దీనిని మీరు విశ్వసిస్తున్నారా !
మీకు కలిగే శ్రమ, బాధ, కష్టాలు, పోరాటాలు, వ్యతిరేకతల మధ్య వాక్యమై ఉన్న నీతి విత్తనాన్ని వేస్తున్నారా? ఆపివేసినట్లయితే, ఇప్పుడే ఈరోజు నుంచే మళ్లీ ప్రారంభించండి!
ఎస్తేర్ క్రైసో లైట్
1-10-2025
🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨