CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

నీతి ఫలం

🌿సామెతలు 11:30
నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు

"నీతి” గురించి పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా బలంగా చెబుతుంది, అది మన జీవితానికి ఆశీర్వాదాలను, శాంతిని, రక్షణను, జ్ఞానమును, జీవమును, తీసుకుని వస్తుంది ఆని.

రోమా 7:12 లో చెప్పబడినట్లు, ధర్మశాస్త్రము పరిశుద్ధ మైనదిగా, ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదిగా నీతిగలదిగా ఉత్తమ మైనదిగా వున్నది.

ఏ మానవుడు కూడా పాటించ లేకపోయినా, ధర్మశాస్త్రమును, ఆజ్ఞలను,క్రీస్తు యేసు ప్రభు వారు పాటించి మన కొరకు నీతిగా చేయబడ్డారు.

మన ఆత్మలో నీతిగా, చేయబడిన క్రీస్తు యేసు ప్రభువు వారు ఉంటే, దాని ప్రభావము మన బాహ్య సంబంధమైన జీవితం మీద పడి,మన మాటలు మన ఆలోచనలు మన సమస్త ప్రవర్తన అంతా కూడా నీతిగా చేయబడుతుంది,

దీని ఫలితం ఏమిటని అనుకుంటున్నారా!•••• మనలో ఉన్న నీతి ఆది జ్ఞానంగా బయటకు వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండి, ఇతరులు దేవుని రక్షణలోనికి రాగలిగేటట్లు మనము ఉంటాము,

మన ఆత్మలో నీతి ఉంటే, దాని ఫలితం జ్ఞానంగా అది బయటకు వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మనం ఇతరులను రక్షించగలము,అన్నదే ఈ వాక్యంలోని సారాంశం.

మీ జీవితం నీతిగా ఉందా? ఆ నీతి ఫలం ఇతరుల జీవితం మీద ప్రభావం చూపుతున్నదా ఆలోచించుకోండి.మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి,

ఎస్తేర్ క్రైసోలైట్
6-10-2025

🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨