CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

పులియని రొట్టే పరిశుద్ధతకు సూచన,

( పరిచర్యగా ఇది ఒక పిలుపు )

నేను నా Young age లో ఉన్నప్పుడు మందిరంలో ప్రభు రాత్రి భోజనంనకు ఉపయోగించే రొట్టెను మా ఇంట్లో నేనే తయారు చేసేదాన్ని మందిరంలో వున్న కొంతమంది స్త్రీలు దీనిని చేయటానికి వారు తిరస్కరించటాన్ని భట్టి ఆ అవకాశము నాకు వచ్చింది. దేవుని సేవ కొరకు ప్రత్యేకపరచుకొని వున్న నేను దీనిని ఒక దేవుని పరిచర్యగా స్వీకరించి యిది చేయాలంటే ప్రార్థనతో ఒక ప్రత్యేకమైన పరిచర్య యిది అని దీనిని నేను భక్తిశ్రద్ధతో చేస్తు వుండేదానిని

యిందులో వేసె పదార్థముల గురించి పరిశుద్ధ గ్రంధములో నేను వెతకేటప్పుడు నాకు చాలా విషయాలు తెలుస్తూ ఉండేవి.

ఉప్పు: ఇది నిబంధనకు సూచనగా వ్రాయబడ్డది. దేవునికి అర్పించే ప్రతి నైవేద్యంలో ఉప్పు కలప బడాలి

లేవీయకాండము 2:13

నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను, నీ అర్పణములన్నిటితోను ఉప్పు అర్పింపవలెను.

నూనె : ఇది పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది

గోధుమ పిండి : ఇది సిలువలో మన కొరకు నలుగ కొట్టబడిన క్రీస్తు ప్రభువు వారి శరీరానికి సాదృశ్యంగా ఉంది గోధుమ పిండిని ప్రతిసారి నేను కలిపినప్పుడు నాకు అనిపిస్తూ ఉండేది దేవుడు నా కొరకు ఇలా విరువబడ్డాడా! ఇలా నలగ గొట్టబడ్డాడా ! ఆని నేను రొట్టెను తయారు చేసేటప్పుడే దేవుడు సిలువలో ఎంత నలుగ గొట్ట భడ్డాడో నాకు అర్థమవుతూ ఉండేది.

అసలు ప్రభు రాత్రి భోజనంలో రొట్టె ఏమిటి? యిది ఎల ప్రారంభమైనది.

ప్రభు భోజనం Lord’s Supper అనేది యేసు క్రీస్తు ప్రభువారు తన శిష్యులతో తిన్న ఆఖరి భోజనం నుండి వచ్చిన ఆచారం. ఆ సమయంలో యేసు:

1కోరింథీయులకు 11:24

దానిని విరిచి యిది మీకొరకైన(అనేక ప్రాచీనప్రతులలో-మీ కొరకు విరవబడిన అని పాఠాంతరము) నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.

పాత నిబంధనలో ఇది ఉన్నదా ! అందుకే క్రీస్తు ప్రభువు వారు కొత్త నిబంధనలో దీనిని నెరవేర్చారా?

దీనికి సంబంధం ఉన్నది ఏది?

ప్రభు రాత్రి భోజనంలో ఇచ్చే రొట్టెకు పాత నిబంధనలో ప్రత్యక్షముగా సమానత్వము కలిగిన రోట్టే పస్కా భోజనంలో వాడిన పులియని రొట్టె, (నిర్గమకాండము 12)

యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు రాత్రి భోజనాన్ని స్థాపించేటప్పుడు పస్కా పండుగ (Passover Feast) సందర్భంగా చేసిన *ఆఖరి భోజనం (Last Supper)*లో ఇది జరిగింది.

పస్కా పండుగలో ఉపయోగించే రొట్టె — పులియని రొట్టె ఈ పస్కా భోజనం మోషే కాలంలో యెహోవా ఆజ్ఞతో ఏర్పడినది .(ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు విముక్తి సందర్భంగా):నిర్గమ: 12:8

ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను,

నిర్గమకాండము 12:11

మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేత పట్టుకొని, త్వరపడుచుదాని తినవలెను; అది యెహో వాకు పస్కాబలి.

నిర్గమకాండము 12:14 - 15

కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచ రింపవలెను; తరతరములకు నిత్యమైనకట్టడగా దాని నాచ రింపవలెను. ఏడుదినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటిదినమున మీ యిండ్ల లోనుండి పొంగినది పార వేయవలెను. మొదటి దినము మొదలుకొని యేడవ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతిమనుష్యుడు ఇశ్రాయేలీ యులలోనుండి కొట్టివేయబడును.

పాత నిబంధనలో వున్న పులియని రొట్టెల పస్కా భోజన ఆచారమే క్రీస్తు యేసు ప్రభువు వారు సిలువ వేయబడటానికి ముందు చేసిన ప్రభు రాత్రి భోజనం,

గోధుమ పిండిని మనము కలిపి ఎక్కువసేపు ఉంచినప్పుడు అది పులిసిపోతుంది పులిసిన పిండిని మనము కాల్చినప్పుడు అది పొంగుతుంది ఇటువంటి పులిసిన పిండితో చేసిన రొట్టెను ఎవరైతే తింటారో వాళ్లు దేవుని ప్రజల సమూహములో నుండి కొట్టివేయ బడతారు అన్న ఆజ్ఞ ఇశ్రాయేలీయులకు నిత్య కట్టడగా ఇవ్వబడ్డది.

ఈ పులిసిన పిండి అంటే అర్థం ఏమిటి ?

కొత్త నిబంధనలో, పులిసినది "పాపానికి" సూచనగా పరిగణించబడింది.

1కోరింథీయులకు 5:7 - 8

మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము.

కాబట్టి పులియలేని రొట్టె = పాపరహిత పాపములేని జీవితం, పరిశుద్ధత అనే దానికి సూచన.

యేసు క్రీస్తు – పాపరహిత దేహం

ప్రభు రాత్రి భోజనంలో వాడిన రొట్టె పులియనిది

అది యేసు శరీరానికి చూచన— పాపములేనిదై మన కొరకు సిలువలో అర్పించబడిన శరీరం.

నిర్గమకాండము 12 అధ్యాయంలోని పస్కాభోజనము (పస్కా రాత్రి)

ఇశ్రాయేలీయులకు కలిగే తొందరగా విముక్తి, పరిశుద్ధత, పాపరహిత జీవితం గురించిన చూచన

పులియని రొట్టె – యేసు క్రీస్తు ప్రభు వారి శరీరము పాపము లేని పరిశుద్ధమైన దేహాము అని ఆనటానికి చూచన.

అనేక మంది రొట్టెను దేవుని శరీరానికి సూచనగా తీసుకుంటారు, కానీ ఆ శరీరం ఎలా ఉందో గుర్తించరు – పాపరహితమైనదని, పరిశుద్ధమైనదని గ్రహించరు.

బైబిలు దీని గురించి చాలా స్పష్టంగా చెబుతోంది:

(1 కోరింథీయులకు 11:27–29)

ఆయన శరీరమును గౌరవించకుండానే గ్రహించకుండానే భోజనముచేయు, పానము చేయు ప్రతివాడు తాను తనమీద శిక్ష తేచ్చు కొనుచున్నాడని గ్రహించాలి.

యేసు పాపము లేని వాడు — దైవమానవుడైన పరిశుద్ధుడు. ఆయన శరీరానికి గుర్తుగా తీసుకునే పులియని రొట్టె — అదే పవిత్రతను మనలో తిరిగి స్థాపించాలి.

ప్రభు భోజనంలో పులియని రొట్టెను తినే ప్రతి ఒక్కరు, అది కేవలం ఆచారం కాదు, పాపము లేని పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభువు శరీరానికి గుర్తుగా తీసుకుంటున్నాము అనే అవగాహనతో ఆ శరీరం నిండా ప్రేమ, త్యాగం, నీతి పరిశుద్ధత వుంది అని గుర్తించాలి, ఆ రొట్టెను తినడమంటే క్రీస్తు ప్రభువు వారి మన కొరకు సిలువలో తన పరిశుద్ధమైన శరీరాన్ని అర్పించారు అన్నటువంటి భావనతో తీసుకోవాలి.

రొట్టిలో పాలు పంచుకోనుట అంటే ఆ పరిశుద్ధతను స్వీకరించడం, పాపానికి మరణించడం అనే దేవునితో మనము చేసుకునే ఒక ఒప్పందం అయి ఉన్నది.

పులియని రొట్టెల పస్కాను ఇశ్రాయేలీయులు వారు ఆచరించడం ద్వారా పాపానికి శాపానికి సాదృశ్యం అయిన ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు విడిపింపబడటం అనే దానికి చూచన.

ప్రభు రాత్రి భోజనంలో పులియని రొట్టెలో పాలుపంచుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన సత్యమేమిటంటే మన కొరకు పస్కాగా బలి అయినా క్రీస్తు ప్రభువు వారు శరీరంలో మనము పాలుపంచుకుంటున్నాం పాపము లేని శాపం లేని శరీరంలో మనకు పాలు, భాగస్వామ్యం దొరికింది కాభట్టి నా ఆత్మ ప్రాణ దేహాలలో పాపం అనేది దేవుని వాక్యానికి విరోధమైనది ఇక నాలో ఉండకూడదు అన్న గ్రహింపును కలిగి పులియని రొట్టెను మనము తీసుకున్నప్పుడు మన ఆత్మకు మరణం అనేది ఉండదు మన ఆత్మ సంబంధమైన జీవితంలో ఆత్మీయ ఆశీర్వాదాలను మనము కలిగి ఉంటాము.

ఈ రోజులలో చాలా మందిరాలలో మిషన్‌లో తయారైన పలుచటి పొర లాంటి రొట్టెను యివ్వడం నేను చూస్తూ వస్తున్నాను.

ప్రభువు కోసం ప్రత్యేకింపబడినవారు స్వయంగా రొట్టెను సిద్ధం చేయడం కూడా పరిచర్యలో భాగమే అన్న గ్రహింపు అనేక మందిలో తగ్గిపోతున్నట్టు నాకు అనిపిస్తు వుంటుంది.

ప్రస్తుతం ఇది కొంతమందికి ఒక ఆచారంలా మారిపోయినప్పటికీ, దీని వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మికతను మనం మరచిపోకూడదు.

పులియని రొట్టె తయారీ కూడా ఒక పరిశుద్ధమైన పరిచర్యగా పరిగణించబడాలి — ఇది దేవుని సేవలో పాల్గొనటానికి అవకాశం ఉన్న ఒక పిలుపుగా దీనిని మనం చూడాలి.

ఎస్తేర్ క్రైసోలైట్

31-5-2025