CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

పోరాటాల మధ్య పుట్టిన దేవుని ప్రణాళిక

మానవుని జీవితం అనేది,
పోరాటాల మధ్య పుట్టిన దేవుని ప్రణాళిక.

తల్లిగర్భములోనే మన జీవితం ఒక పోరాటంతో మొదలైంది, వేలాది కణాల మధ్య ఒక్క కణం మాత్రమే విజయం సాధించింది. అదే మనం.
ఇది మనకు ఒక స్పష్టమైన సందేశమును ఇస్తుంది, దేవుడు మనలను సులభంగా పుట్టనివ్వలేదు,అంటే మన జన్మ అన్నది అంత సులభమైనది కాదు,దానిని ఒక పోరాటం ద్వారా ఏర్పరచాడు.

తల్లిగర్భములోనే మన జీవితం ఒక పోరాటంతో ప్రారంభమైంది, వేలాది కణాల మధ్య ఒక్క కణం మాత్రమే విజయవంతమైంది. అదే మనం. ఇది అనుకోకుండా జరిగినది కాదు, ఆది దేవుని ఆలోచన.

తల్లి గర్భంలో మనము, రూపింపబడక ముందే, మనకు కలిగిన ఆ మొదటి పోరాటమే మనకు ఒక స్పష్టమైన ఆత్మీయమైన సందేశమును తెలియ జేస్తుంది,

“మానవుని జీవితం అనేది, పోరాటాల మధ్య పుట్టిన దేవుని ప్రణాళిక” అని.

నేను దేవుని సేవ చేయాలని తీర్మానించుకున్న తర్వాత, నా తల్లిగారు నాకు చెప్పిన ఒక విషయం ఏమిటంటే, నేను నా తల్లిగారి గర్భంలో ఉన్నప్పుడే, ఇంకొక బిడ్డ తన గర్భంలో అప్పుడే పుట్టకూడదు అని, నా తల్లి గారు రెండుసార్లు ప్రయత్నించారు అంట. ఆ సమయంలో నా తల్లి గారు ఇంకా దేవునిలోకి రాలేదు, అయినా క్షేమంగా, ఏమి లోపం లేకుండానే నేను పుట్టాను.

చూశారా! •••
ఈ భూమిపై కూడా మన జీవితం అదే విధంగా ఉంటుంది. ప్రతీ దశలో మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. మానవుడు భూమిపై అడుగుపెట్టిన మొదటి క్షణం నుండి ప్రతి దశలో కూడా పరీక్షలు, వ్యతిరేకతలు, నిరాకరణలు ఉంటాయి.

కానీ దేవుడు ఏమని చెప్పాడు అంటే, “పరీక్షలలో సంతోషించండి” అని. ఎందుకంటే, మనకు కలిగే ప్రతి పరీక్ష వెనుక ఒక ఆత్మసంబంధమైన దేవుని ప్రణాళిక ఉంటుంది. ఇవన్నీ మనలను దెబ్బ తీయటానికి కాదు, మనలను దృఢమైన విశ్వాసులుగా, దేవునిలో కదలని స్థిరులుగా చేయటానికే.

తల్లిగర్భంలోని చీకటిలో ఏర్పడిన మనలను వెలుగులోకి తెచ్చినట్లే, ఆత్మీయ చీకటిలో జరిగే పోరాటాల మధ్యనుండి దేవుడు మనలో ఒక కొత్త వెలుగును తెస్తాడు.

ప్రతి పోరాటం వెనుక దేవుడు ఒక శిక్షణను మనకు ఇస్తున్నాడు. మనలో ఓర్పు, క్రమశిక్షణ, విశ్వాసం అనేవి నూతనముగా ఏర్పడతాయి.
విజయం మాత్రమే కాదు, విశ్వాసం కూడా పోరాటాల ద్వారానే వస్తుంది.

మనము ఎదురుచూస్తున్నది ఫలితాన్ని కాదు, మార్పును.ఆ మార్పు మనలో దేవుని స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది.

యాకోబు 1:2-4
నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, "అది మహానందమని "యెంచుకొనుడి.

మీరు సంపూర్ణులును, అనూనాంగులును,ఏ విషయములో నైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప నీయుడి.

అందుకే మనకు పరీక్షలు, శోధనలు వచ్చినప్పుడు, అది మహానందమని అనుకోవాలి అని, దేవుని వాక్యం మనకు సందేశాన్ని ఇస్తుంది.
ఎందుకంటే ఈ శోధనలు మనలో ఓర్పును, సహనాన్ని పుట్టిస్తాయి. ఈ ఓర్పు మన విశ్వాసాన్ని సంపూర్ణం చేస్తుంది.

పరీక్షలు వచ్చినప్పుడు దేవుని ప్రార్థిస్తూ, ఆయన మనలను అందులోంచి విడిపిస్తాడన్న ఒక నిరీక్షణ మన హృదయంలో పుడుతుంది.
అదే నిరీక్షణ మన విశ్వాసాన్ని బలపరుస్తుంది.
అందుకే ఈ పరీక్షలు, శోధనలు మన జీవితంలో ఓర్పు మరియు సహనముతో నిండిన ఆత్మీయ వ్యక్తులుగా మనలను తీర్చిదిద్దుతాయి.

దేవుడు మనలను తల్లిగర్భంలోనే ఒక పోరాటాన్ని గెలిచిన వారిగా నిర్మించాడు.
భౌతిక జీవితంలోనూ, ఆత్మీయ జీవితంలోనూ అదే విజయాన్ని మనము కొనసాగించలన్నదే దేవుని కోరిక.

" పోరాటం అనేది మన ఓటమికి గుర్తు కాదు, దేవుని చేతిలో ఎంపికైన స్థితికి ఆది బలమైన సాక్ష్యం."

అందుకే మీరు ఏ పరీక్ష గుండా వెళ్తున్నా, దేవుడు ఆ పరీక్ష ద్వారానే మిమ్ములను గుర్తిస్తున్నాడు,అని విశ్వసించండి, మీ జీవితంలోకి వచ్చే ప్రతి శోధనలో ఆనందించండి,

మీరు ఈ మధ్య ఎదుర్కొంటున్న పోరాటం ద్వారా దేవుడు మీలో ఏ గుణాన్ని నిర్మిస్తున్నాడని మీరు గుర్తించారు?

ఎస్తేర్ క్రైసోలైట్
5-10-2025

🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨